డియో, మ్యాస్ట్రో, రే జెడ్ స్కూటర్లలో ఏది బెస్ట్..?

By Ravi

ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్ల విభాగం అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు వివిధ తయారీ సంస్థల నుంచి సరికొత్త మోడళ్లు వస్తుండటంతో ఈ సెగ్మెంట్లో పోటీ బాగా పెరిగింది. అంతేకాకుండా, కొనుగోలుదారులు (ఎక్కువగా నగర ప్రజలు, యువత) మోటార్‌సైకిళ్ల కన్నా స్కూటర్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో దేశంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఫలితంగా స్కూటర్ సెగ్మెంట్ కూడా భారీగా విస్తరించింది.

అయితే, ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్కూటర్లు అందుబాటులో ఉండటంతో, కొనుగోలుదారులు కూడా ఏ స్కూటర్ కొనాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రస్తుతం పురుషుల కోసం అందుబాటులో ఉన్న పవర్‌పుల్ హోండా డియో, హెవీ డ్యూటీ హీరో మ్యాస్ట్రో, స్టయిలిష్ యమహా రే స్కూటర్లలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరిన్ని వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్కూటర్ రేస్

స్కూటర్ రేస్

ఒకప్పుడు స్కూటర్ అంటే బజాజ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. స్కూటర్ సెగ్మెంట్లో చరిత్ర సృష్టించి బజాజ్ ఆటో ఇప్పుడు అదే చరిత్రలో కలిసిపోయింది. ప్రస్తుతం భారత్‌లో ఈ సెగ్మెంట్లో జోరుమీదున్న కంపెనీల్లో హోండా, సుజుకి, టీవీఎస్, హీరో కంపెనీలు ముందుండగా, తాజాగా ఈ విభాగంలోకి యమహా వచ్చి చేరింది. మరి ఇందులో మీకు సూట్ అయ్యే స్కూటర్ ఏదో తెలుసుకోవాలంటే తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

హోండా డియో - సమీక్ష

హోండా డియో - సమీక్ష

కొత్త డియో స్కూటర్ ట్రెండీగా కనిపిస్తూ, స్టయిలిష్ లుక్‌తో పాటుగా మంచి పెర్ఫామెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. మునపటి వెర్షన్ డియో కన్నా మరింత సౌకర్యంగా, మెరుగ్గా ఉండేలా కొత్త డియో స్కూటర్‌ను తయారు చేశారు.

* హోండా డియో ఎక్స్-షోరూమ్ ధర రూ.44,768/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా డియో - మైలేజ్

హోండా డియో - మైలేజ్

కొత్త హోండా డియోలో హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ)తో కూడిన 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఈ ఇంజన్ వలన ఇది గరిష్టంగా లీటరుకు 60 కి.మీ. మైలేజీనిస్తుంది. అయితే, వాస్తవానికి ఇది సగటున లీటరుకు 45-50 కి.మీ. మైలేజీని మాత్రేమ ఇస్తుంది.

* ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం - 5.3 లీటర్లు

హోండా డియో - పెర్ఫామెన్స్

హోండా డియో - పెర్ఫామెన్స్

హోండా డియో స్కూటర్‌లో అమర్చిన 109సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది బరువు తక్కుగా ఉండటంతో మంచి పికప్‌ను కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్‌ను హోండా యాక్టివా, ఏవియేటర్ మోడళ్లలోను ఉపయోగిస్తున్నారు.

* పవర్: 8bhp @ 7500rpm

హోండా డియో - డిజైన్ అండ్ స్టైల్

హోండా డియో - డిజైన్ అండ్ స్టైల్

వెడల్పాటి హెడ్‌ల్యాంప్స్, క్లియరెన్స్ ఇండికేటర్స్, కొత్త 3డి లోగో, ఆకర్షనీయమైన బాడీ డిజైన్‌తో కొత్త డియో మంచి స్టయిలిష్ లుక్‌ను కలిగి ఉంటుంది. బాడీ కలర్ గ్రాబ్ రెయిల్స్, కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఇందులో మరో ఆకర్షణ. ఓవరాల్‌గా ఇది యూత్‌ఫుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

హోండా డియో - ధరకు తగిన విలువ

హోండా డియో - ధరకు తగిన విలువ

హోండా డియో స్కూటర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు సుమారు రూ.50,000 మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. కాకపోతే, యాక్టివా మాదిరిగానే దీని వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల ఇది 3 నెలల వరకు ఉంటోంది.

హీరో మ్యాస్ట్రో - సమీక్ష

హీరో మ్యాస్ట్రో - సమీక్ష

హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) నుంచి లభిస్తున్న పవర్‌ఫుల్ స్కూటర్ హీరో మ్యాస్ట్రో. ప్రత్యేకించి పురుషులను టార్గెట్ చేసుకొని విక్రయిస్తున్న స్కూటర్ ఇది. దీనిని హోండా అందిస్తున్న ఏవియో ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. ఇందులోని ఇంజన్ కూడా హోండా నుంచి గ్రహించినదే. అయితే, ఇందులో హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ) మాత్రం లేదు.

* దేశీయ విపణిలో హీరో మ్యాస్ట్రో ధర రూ.46,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

హీరో మ్యాస్ట్రో - మైలేజ్

హీరో మ్యాస్ట్రో - మైలేజ్

పేరులో హీరోను తగిలించుకున్న మ్యాస్ట్రో మైలేజ్ విషయంలో మాత్రం జీరో అనే చెప్పాలి. ఇది సిటీ రోడ్లపై సగటున లీటరు పెట్రోలుకు 35 కి.మీ. హైవేలపై సగటున 40 కి.మీ. మైలేజీనిస్తుంది.

* ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం - 5.3 లీటర్లు

హీరో మ్యాస్ట్రో - పెర్ఫామెన్స్

హీరో మ్యాస్ట్రో - పెర్ఫామెన్స్

స్కూటర్ల కోసం హోండా అందిస్తున్న లేటెస్ట్ జనరేషన్ ఇంజన్‌నే ఈ హీరో మ్యాస్ట్రో స్కూటర్‌లో ఉపయోగించారు. అయితే, ఇది అధిక బరువను కలిగి ఉండటం వలన పెద్దగా మైలేజ్ రాదు. అయినప్పటికీ ఇది పెర్ఫామెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడదు.

* పవర్: 8bhp @ 7500rpm

హీరో మ్యాస్ట్రో - డిజైన్ అండ్ స్టైల్

హీరో మ్యాస్ట్రో - డిజైన్ అండ్ స్టైల్

డియో, రే జెడ్ స్కూటర్లతో పోల్చుకుంటే మ్యాస్ట్రో డిజైన్ అంత ఆకర్షనీయంగా ఉండదు. దీన్ని హోండా యాక్టివా, సుజుకి యాక్సిస్‌లను కలిపి రూపొందించినట్లుగా అనిపిస్తుంది. లుక్ విషయాన్ని పక్కన పెడితే, హీరో మ్యాస్ట్రో ఓ విశాలమైన స్కూటర్. పొడవుగా ఉండే వారు సౌకర్యవంతంగా దీనిని రైడ్ చేయవచ్చు.

హీరో మ్యాస్ట్రో - ధరకు తగిన విలువ

హీరో మ్యాస్ట్రో - ధరకు తగిన విలువ

మీరు అర్బన్ కమ్యూటర్ కోసం చూస్తుంటే, మ్యాస్ట్రో మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే, దీని ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది. ఈ స్కూటర్ కోసం ఇంత ధర ఛార్జ్ చేస్తున్న హీరో మోటోకార్ప్, లింక్ సస్పెన్షన్‌కు బదులుగా టెలిస్కోపిక్ ఫోర్క్ ఆఫర్ చేసి ఉంటే బాగుండేది. రీసేల్ వ్యాల్యూ పరంగా చూసుకుంటే మాత్రం, ఇది ధరకు తగిన విలువను కలిగి ఉండదనే చెప్పాలి.

యమహా రే జెడ్ - సమీక్ష

యమహా రే జెడ్ - సమీక్ష

యమహా తొలుత భారతీయ మహిళల కోసం రే అనే స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రే స్కూటర్‌లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రే జెడ్ పేరిట పురుషుల కోసం ఓ స్కూటర్‌ను విడుదల చేసింది. మరి దీనిని యునిసెక్స్ స్కూటర్ అనొచ్చా.. తెలుసుకుందాం రండి.

* దేశీయ విపణిలో యమహా రే జెడ్ స్కూటర్ ధర రూ.49,105/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

యమహా రే జెడ్ - డిజైన్ అండ్ స్టైల్

యమహా రే జెడ్ - డిజైన్ అండ్ స్టైల్

యమహా తొలుత స్త్రీల కోసం రే స్కూటర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇదే స్కూటర్‌ను పురుషుల కోసం విడుదల చేసింది. అంటే, దీని స్త్రీ పురుషులిద్దరూ ఎంచుకోవచ్చన్నమాట. డిజైన్ విషయానికి వస్తే, ఇది ఇంచుమించు డియో మాదిరిగానే స్టయిలిష్‌గా ఉంటుంది.

యమహా రే జెడ్ - మైలేజ్

యమహా రే జెడ్ - మైలేజ్

రే జెడ్ విషయంలో యమహా పేర్కొన్న మైలేజ్ 53 కెఎమ్‌పిఎల్. అయితే, వాస్తవిక పరిస్థితుల్లో ఇది సగటున 40-50 కెఎమ్‌పిఎల్ మైలేజీని అందిస్తుంది.

* ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం - 5 లీటర్లు

యమహా రే జెడ్ - పెర్ఫామెన్స్

యమహా రే జెడ్ - పెర్ఫామెన్స్

యమహా రే జెడ్ స్కూటర్‌లో 113సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, పెర్ఫామెన్స్ విషయంలో హోండా డియో కన్నా కాస్తంత తక్కువగానే ఉంటుందని చెప్పాలి.

* పవర్: 7bhp @ 7000rpm

యమహా రే జెడ్ - ధరకు తగిన విలువ

యమహా రే జెడ్ - ధరకు తగిన విలువ

ఫన్ టూ రైడ్ ఆటోమేటిక్ స్కూటర్ కావాలనుకునే వారికి యమహా రే జెడ్ స్కూటర్ చక్కగా సూట్ అవుతుంది. ప్రత్యేకించి నేటి యువతకు ఇదొక మంచి స్టయిలిష్ స్కూటర్. ఈ స్కూటర్ రూ.50,000 ఖర్చు చేయటంలో నష్టమేమీ లేదు. ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

మరి ఈ మూడింటిలో 'రారాజు' ఎవరు

మరి ఈ మూడింటిలో 'రారాజు' ఎవరు

ఈ మూడు స్కూటర్లలో ఏది బెస్ట్ అని అడిగితే మా సమాధానం ఒక్కటే 'హోండా డియో'. విశ్వసనీయమైన హోండా ఇంజన్, మెరుగైన మైలేజ్, తిరుగులేని పెర్ఫామెన్స్, స్టయిలిష్ డిజైన్, ఈజీ హ్యాండ్లింగ్, వ్యాల్యూ ఫర్ మనీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, హీరో మ్యాస్ట్రో, యమహా రే స్కూటర్లతో పోల్చుకుంటే, హోండా డియో స్కూటరే ది బెస్ట్ అనిపిస్తుంది. మరి మీరేమంటారు..?

Article Published On: Tuesday, September 17, 2013, 12:37 [IST]
English summary
Drivespark does a quick comparison to learn who is the ultimate winner in this war ~ Honda Dio vs Hero Maestro vs Yamaha Ray Z.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+