Honda QC1 Review: షాపింగ్ వెళ్ళడానికి సింపుల్ & స్టైలిష్.. కొత్త క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ అదరగొట్టిందా?

గత నవంబర్‌లో, హోండా కొత్త Activa eను ప్రదర్శించింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తన నేమ్‌ప్లేట్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అది మాత్రమే కాకుండా ఆ రోజు వేదికపై మరో ఆశ్చర్యకరమైన హోండా క్యూసీ1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ప్రదర్శించింది. ఇది కొత్త ఎలక్ట్రిక్ యాక్టివాకు చిన్న వెర్షన్. ఇది ఫిక్స్డ్ బ్యాటరీని కలిగి ఉంది. రెండు నెలల తర్వాత ఆటో ఎక్స్‌పోలో ధరను వెల్లడించారు హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 90,000గా నిర్ణియించింది. హోండా కొత్త QC1‌ను టెస్ట్ డ్రైవ్ చేయమని కోరింది. దీంతో తాజాగా మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ బెంగుళూరులో ఈ ఇస్కూటర్‌ను టెస్ట్ డ్రైవ్ చేసింది. దాని గురించి మా ఫీడ్ బ్యాక్ క్రింద ఇవ్వడం జరిగింది.

డిజైన్ అండ్ ఫీచర్లు: హోండా క్యూసీ1 డిజైన్ యాక్టివా e ముందు భాగాన్ని పోలి ఉంది. అయితే, ఖర్చు తగ్గించడానికి కొన్ని ఫీచర్లను తొలగించారు. హెడ్‌లైట్ యాక్టివా ఇ లాగానే ఉన్నా, హ్యాండిల్‌బార్‌పై డీఆర్ఎల్ లేదు. కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌కు బదులుగా నెగటివ్ ఎల్‏సీడీ స్క్రీన్ ఉంది. ఒకే స్టోరేజ్ పాకెట్ ఉంది. ఇది యాక్టివా ఇ కంటే పెద్దదిగా కనిపిస్తుంది.

Honda QC1 Review Riding Impression 01

లగేజ్ హుక్, USB-C ఛార్జింగ్ పాయింట్ అలాగే ఉన్నాయి. రైడర్ సీటు కింద మరొక ఛార్జింగ్ పాయింట్ ఉంది. యాక్టివా ఇ లోని స్మార్ట్ కీకి బదులుగా సాధారణ అనలాగ్ యూనిట్ ఉంది. సీటు కింద 26 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది హెల్మెట్, నిత్యావసర వస్తువులను పెట్టుకోవడానికి సరిపోతుంది.

క్యూసీ1 డిజైన్ హోండా క్లిక్‌ను గుర్తు చేస్తుంది. వెనుక సస్పెన్షన్, టెయిల్ లైట్, బ్యాక్ ఇండికేటర్స్, పిలియన్ రైడర్ కోసం సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ క్లిక్‎ను తలపిస్తాయి. ఫ్రంట్ బ్లాక్ అల్లాయ్ వీల్, బ్యాక్ మోటార్ యూనిట్ ఉన్న అల్లాయ్ వీల్ కొత్తగా కనిపిస్తాయి.

Honda QC1 Review Riding

మోటార్-మెకానికల్ స్పెసిఫికేషన్స్: హోండా క్యూసీ1 1.5kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. 330W ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 0-80శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు, పూర్తి ఛార్జ్ చేయడానికి 6 గంటల 50 నిమిషాలు పడుతుంది.

బ్యాటరీ హబ్-మౌంటెడ్ బ్రష్‌లెస్ DC మోటార్‌ను పవర్ ఫుల్ చేస్తుంది, ఇది 1.8kW (2.4bhp), 77Nm టార్క్ అందిస్తుంది. క్యూసీ1 0 నుంచి 40కిమీ. వేగాన్ని 9.1 సెకన్లలో చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50కి.మీ అని హోండా పేర్కొంది. హోండా క్యూసీ1 టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, 5-స్టెప్ అడ్జస్టబుల్, హైడ్రాలిక్ ట్విన్ షాక్‌లను వెనుకవైపు కలిగి ఉంది.

Honda QC1 Review

12-ఇంచుల ఫ్రంట్ వీల్ 90/100 టైర్‌తో, 10-ఇంచుల బ్యాక్ వీల్ 90/100 టైర్‌తో వస్తుంది. 130ఎంఎం (ముందు) , 110ఎంఎం(వెనుక) డ్రమ్ బ్రేక్‌లు బ్రేకులతో వస్తుంటాయి. హోండా క్యూసీ1 పొడవు 1,826ఎంఎం, వెడల్పు 701ఎంఎం, ఎత్తు 1,129ఎంఎం. దీని వీల్‌బేస్ 1,275ఎంఎం. క్యూసీ1 బరువు 89.5 కిలోలు, 169ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 704ఎంఎం పొడవైన సీటును కలిగి ఉంది.

రైడింగ్ ఇంప్రెషన్: హోండా క్యూసీ1 రోడ్డుపై చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఇది నిశ్శబ్దంగా వెళ్లడం వల్ల స్పీడ్ ఎక్కువగా ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. ఎనర్జీ లేకపోవడం వల్ల ఓవర్ టెక్ చేయడం కష్టంగా ఉంటుంది. 0నుంచి 50 గరిష్ట వేగాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం.

Honda QC1 Review

సస్పెన్షన్ సెటప్ కొంచెం దృఢంగా ఉంటుంది. కానీ వెడల్పుగా, మెత్తగా ఉండే సీటు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. ఫ్లోర్‌బోర్డ్ సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలుపు తిరిగేటప్పుడు హ్యాండిల్‌బార్ మోకాళ్లకు తగులుతుంది. పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

చివరగా: హోండా క్యూసీ1 ఒక పరిమిత ప్రయోజనాల కోసం రూపొందించబడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది షాపులకు వెళ్లి తిరిగి రావడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. దీని తక్కువ రేంజ్, స్పీడ్ కారణంగా ప్రత్యేకంగా కేవలం షాపింగ్‌కి వెళ్లే వాళ్ల కోసం లేదా స్నేహితుల్ని కలవడానికి మాత్రమే ఉపయోగపడేలా తయారైంది. పాయింట్ A నుండి పాయింట్ Bకి వెళ్లడానికి, మళ్లీ తిరిగి రావడానికి మాత్రమే డిజైన్ చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2025, 14:00 [IST]
English summary
Honda qc1 review riding impressions specifications and all features in telugu
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+