హోండా చీప్ అండ్ బెస్ట్ బైక్ 'డ్రీమ్ నియో': బైక్ రివ్యూ
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ అత్యంత చవక మోటార్‌సైకిల్ 'డ్రీమ్ నియో' తక్కువ ధరను కలిగి ఉండి, విశిష్టమైన ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న 'హీరో స్ప్లెండర్'కు గట్టి పోటీ ఇవ్వనుంది. దేశీయ విపణిలో హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.43,150 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో భారీ మార్కెట్ వాటాను చేజిక్కుంచుకోవాలనే ఉద్దేశ్యం, బడ్జెట్ బైక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండే మాస్ మార్కెట్లోను లక్ష్యంగా చేసుకొని హోండా తమ డ్రీమ్ సిరీస్‌లో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌లో అమర్చిన 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
మాస్ మార్కెట్లలో ద్విచక్ర వాహనాలు సక్సెస్ సాధించాలంటే మైలేజ్ మరియు ధర ఈ రెండు అంశాలే కీలకం. డ్రీమ్ నియో ఈ రెండు అంశాలను సంతృప్తిపరస్తూ మార్కెట్లోకి రావటంతో ఈ బైక్ విజయంపై కంపెనీ భారీ ఆశలు పెట్టుకొంది. హోండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అయిన 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ని ఈ ఇంజన్‌లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో మెరుగైన కంబస్టియన్, నికెల్ ప్లేటెడ్ స్పార్క్ ప్లగ్ వలన ఉత్పన్నమయ్యే క్లీన్ స్పార్క్ మరియు ఆప్టిమైజ్డ్ ఇన్‌లెట్ పోర్ట్‌లు ఉంటాయి.
కార్బురేటర్ ద్వారా ఇంధన సరఫరా జరిగే ఈ ఇంజన్ గరిష్ట మైలేజీనివ్వటంలో సహకరిస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఈ సెగ్మెంట్లో లభిస్తున్న హీరో స్ప్లెండర్ ప్రారంభ ధర రూ.42,950 లుగా ఉంది. అంటే, స్ప్లెండర్‌తో పోల్చుకుంటే డ్రీమ్ నియో ధర కేవలం రూ.200లు మాత్రమే అధికంగా ఉంది. అంతేకాకుండా, స్ప్లెండర్‌తో పోల్చుకుంటే డ్రీమ్ నియో పవర్, మైలేజ్, పెర్ఫామెన్స్‌లు కూడా అధికంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది స్ప్లెండర్ కన్నా ది బెస్ట్ అనొచ్చు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
మాస్ మార్కెట్లలో ద్విచక్ర వాహనాలు సక్సెస్ సాధించాలంటే మైలేజ్ మరియు ధర ఈ రెండు అంశాలే కీలకం. డ్రీమ్ నియో ఈ రెండు అంశాలను సంతృప్తిపరస్తూ మార్కెట్లోకి రావటంతో ఈ బైక్ విజయంపై కంపెనీ భారీ ఆశలు పెట్టుకొంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్
రెండు రంగుల కలయుక (డ్యూయెల్ టోన్)తో ఉండే బాడీ గ్రాఫిక్స్ హోండా డ్రీమ్ నియో బైక్‌కు ఓ విశిష్టమైన లుక్‌నిస్తాయి.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
సాటిలేని మైలేజ్
హోండా డ్రీమ్ నియో సాటిలేని మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
బ్లాక్ అల్లాయ్ వీల్స్
నలుపు రంగు సిక్స్-స్పోక్ అల్లాయ్ వీల్స్ హోండా డ్రీమ్ నియో బైక్‌కు ఓ మంచి లుక్ అండ్ ఫీల్‌ను అందిస్తాయి.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
విశాలమైన పొడవాటి సీట్
హోండా డ్రీమ్ నియో బైక్‌కు ఏర్పాటు చేసిన పొడవాటి, విశాలమైన సీట్ రైడర్‌కే కాకుండా వెనుక కూర్చుని ప్రయాణించే పిలియన్ రైడర్‌కు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. దూర ప్రయాణాలకు సైతం ఇది అనువుగా ఉంటుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
స్మార్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్
హోండా డ్రీమ్ నియోలో అమర్చిన స్మార్ట్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఈ బైక్‌కు ఓ విశిష్టమైన లుక్‌ని అందిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
సుపీరియర్ ఇంజన్
హోండా డ్రీమ్ నియో బైక్‌లో అమర్చిన 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ధరలు
హోండా డ్రీమ్ నియో మూడు వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / స్పోక్ వీల్స్) - రూ.43,150
* హోండా డ్రీమ్ నియో (కిక్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.44,150
* హోండా డ్రీమ్ నియో (సెల్ఫ్ స్టార్ట్ / డ్రమ్ బ్రేక్స్ / అల్లాయ్ వీల్స్) - రూ.47,240
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

హోండా డ్రీమ్ నియో - రివ్యూ
హోండా డ్రీమ్ నియో ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.



Click it and Unblock the Notifications








