హ్యోసంగ్ ఆక్విలా జివి250 రివ్యూ: ఇది నిజమైన క్రూజర్ బైకా?

ఆక్విలా అనే పేరు వినగానే మనకు కైనటిక్ ఆక్విలా క్రూజర్ గుర్తుకు వస్తుంది. గతంలో కైనెటిక్ ఈ ఆక్విలా బ్రాండ్ మోటార్‌సైకిల్‌ను దక్షిణ కొరియాకు చెందిన హ్యోసంగ్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయించేంది. అప్పట్లో ఇది అతి సరసమైన ధరకే అందుబాటులో ఉండే విదేజీ క్రూజర్ బైక్‌లలో ఒకటిగా ఉండేది. కానీ అప్పట్లో ఇది సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలువలేకపోయింది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రివ్యూ

అయితే, ఇప్పుడు కొరియన్ బైక్ హ్యోసంగ్ ఇప్పుడు నేరుగా ఇండియాలో స్వతహాగా (పూనేకు చెందిన డిఎస్‌కే మోటోవీల్స్‌తో కలిసి) కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ ఆక్విలా బైక్‌ను సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో దేశీయ విపణిలోకి ప్రవేపెట్టింది. హ్యోసంగ్ ఆక్విలా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 650సీసీ మరొకటి 250సీసీ. కాగా.. మా డ్రైవ్‌స్పార్క్ బృందం తాజాగా ఈ 250సీసీ ఆక్విలా క్రూజర్ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసింది. మరి ఈ బైక్ నిజమైన క్రూజర్‌గా నిలుస్తుందో లేదో తెలుసుకుందాం రండి.

హ్యోసంగ్ ఆక్విలా క్రూజర్ బైక్‌ను తొలిసారిగా ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌‌పోలో కంపెనీ విడుదల చేసింది. హ్యోసంగ్ గతంలో విడుదల చేసిన ఆక్విలా ప్రో 650 బైక్‌కు దిగువన అదే సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యంతో వచ్చిన ఎంట్రీ లెవల్ క్రూజర్ బైకే ఈ హ్యోసంగ్ ఆక్విలా 250. హ్యోసంగ్ ఆక్విలా జివి250 బైక్‌ స్పెసిఫికేషన్లు, పెర్ఫామెన్స్, ధర మొదలైన మరిన్ని వివరాలను ఈ రివ్యూలో చదవండి..!

పరిచయం

పరిచయం

టెస్ట్ చేసిన మోడల్: 2014 హ్యోసంగ్ ఆక్విలా జివి250

విడుదలైన తేది: ఫిబ్రవరి 6, 2014

ధర: రూ.2,82,500 (ఎక్స్-షోరూమ్)

టెస్ట్ చేసిన దూరం: 200 కి.మీ., లూనావాలా, పూనే

టెస్ట్ చేసిన వారు: అజింక్యా పారాలికర్

వెయిటింగ్ పీరియడ్: లభ్యత పెద్ద సమస్య కాదు

డిజైన్

డిజైన్

హ్యోసంగ్ ఆక్విలా జివి250 ఒక క్రూజర్ స్టయిల్ బైక్. ఇది పొడవుగా ఉండి, ముందు మరియు వెనుక ఫెండర్ల వద్ద ఫ్లోయింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆక్విలా జివి250 మజిక్యులర్ లుక్‌తో మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, అల్లాయ్ వీల్స్ ఈ క్రూజర్‍‌కు మరింత స్టయిల్‌ను చేకూర్చుతాయి. ఇందులో అత్యధికంగా ఉపయోగించిన క్రోమ్ డిజైన్ మరింత ప్రీమియం అప్పీల్‌ను తెచ్చిపెడుతుంది.

హ్యోసంగ్ ఆక్విలా జివి250 రివ్యూ

పెయింట్ వర్క్ ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. మేము రైడ్ చేసింది వైట్ కలర్ ఆక్విలా 250. క్రోమ్ ప్లేటెడ్ ఇండన్, ఈఎఫ్ఐ లోగోతో కూడిన ఎయిర్ స్కూప్స్ , ఫ్రంట్ షాక్ అబ్జార్వర్స్, ఎగ్జాస్ట్ పైప్స్, గ్రాబ్ రెయిల్స్ ఇవన్నీ కూడా క్రోమ్ ఫినిషింగ్‌ను కలిగి ఉండి, బైక్‌‌కు ప్రీమియం టచ్‌నిస్తాయి.

ఇంజన్, మైలేజ్

ఇంజన్, మైలేజ్

హ్యోసంగ్ జివి250లో 249సీసీ, 4-స్ట్రోక్, డిఓహెచ్‌సి, 8-వాల్వ్, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 26.21 బిహెచ్‌పిల శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 21.37 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 30 కి.మీ. మైలేజీనిస్తుంది. కానీ మేము టెస్ట్ రైడ్ చేసినప్పుడు సిటీ, హైవేపై కలిపి ఇది సగటున 28 కిలోమీటర్ల మైలేజీనిచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది డీసెంట్ మైలేజ్.

రైడ్, హ్యాండ్లింగ్, కంఫర్ట్

రైడ్, హ్యాండ్లింగ్, కంఫర్ట్

లాంగ్ అండ్ స్మూర్ రైడ్స్ కోసం ఇదొక గొప్ప మోటార్‌సైకిల్ అని చెప్పవచ్చు. దీని హ్యాండిల్ బార్స్ మరియు సీటింగ్‍‌లు చక్కటి రైడింగ్ పొజిషన్‌‌ను ఆఫర్ చేస్తాయి కాబట్టి, దీనిపై దూర ప్రయాణాల్లో సైతం అలసట అనిపించదు. అయితే, చిన్నపాటి దూరాల కోసం ఇందులో కొన్ని చికాకులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ముందు వైపు ఫుట్ కంట్రోల్స్‌ను దూరంగా ఉంచడం లాంటివి.

ఆక్విలా 250 క్లచ్ మరియు గేర్‌‌బాక్స్‌లు స్మూత్‌గా ఉంటాయి. దీనిని కొత్తగా నడిపేవారికి ఇవి అలావాటు కావటానికి కొంత సమయం పడుతుంది. ఇందులో పిలియన్ రైడర్ సీట్ కూడా సౌకర్యం ఉంటుంది. కాకపోతే, పిలియన్ రైడర్ కోసం బ్యాక్ రెస్ట్ ఆఫర్ చేసి ఉంటే, ఇంకా చక్కగా ఉండేది.

బ్రేకింగ్ అండ్ బ్యాలెన్సింగ్

బ్రేకింగ్ అండ్ బ్యాలెన్సింగ్

హ్యోసంగ్ ఆక్విలా జివి250 మొత్తం 167 కేజీల బరువును కలిగి ఉండి భారీగా అనిపిస్తుంది కానీ, దీని హ్యాండ్లింగ్ మాత్రం సులువుగానే ఉంటుంది. రోడ్డు మలుపుల్లో దీని హ్యాండ్లింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ గతుకులు రోడ్లపై దీని సస్పెన్షన్ కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఇందులో విండ్ డిఫ్లెక్టర్లు లేకపోవటం వలన దీనిపై ఎక్కువ సమయం హైస్పీడ్ మెయింటైన్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది మేము ఆశించినంత షార్ప్‌గా లేకపోయినప్పటికీ ఫర్వాలేదనే చెప్పాలి. బ్రేకింగ్ కోసం ముందు వైపు రెండు కాలిపర్లు ఉంటాయి. ముందు వైపు బ్రేక్ పెడల్‌ను చాలా దూరంగా ఉంచడం వలన అత్యవసర సమయాల్లో వెనుక బ్రేక్‌ను అప్లయ్ చేయటంలో జాప్యం జరగటం లేదా ఇందుకు కొంచెం సమయం పట్టడం జరుగుతుంది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఈ బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పాతకాలపు మోటార్‌సైకిళ్లలోని గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఒక స్పీడోమీటర్, ఒక ఆర్‍‌పిఎమ్ మీటర్‌లు ఉంటాయి. ఇవి రెండూ కూడా అనాల్ మీటర్లే. ఈ రెండు మీటర్లకు మధ్యలో గుండ్రంగా ఉండే ఒక చిన్న డిజిటల్ మీటర్ ఉంటుంది. ఇది ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ అండ్ టైమ్ గేజ్‌గా పనిచేస్తుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై కూడా ఎక్కువ క్రోమ్ ఫినిషింగ్‌ను చూడొచ్చు.

స్విచ్‌గేర్

స్విచ్‌గేర్

హ్యోసంగ్ ఆక్విలా జివి250 స్విచ్‌గేర్ (హ్యాండిల్‌బార్‌పై స్విచ్ కంట్రోల్స్) అత్యంత అద్భుతంగా ఉందని చెప్పలేం కానీ, వీటిని నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేయటం బాగుంది. ఇందులో శాశ్వతంగా వెలుగుతూ ఉండే ఇన్‌‌స్ట్రుమెంటేషన్ ఓ మంచి సేఫ్టీ ఫీచర్. ఇంకా ఇందులో హాజర్డ్ లైట్స్ (నాలుగు ఇండికేటర్లు వెలుగుతూ ఆరుతూ ఉండే) ఫీచర్ కూడా లభిస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

హ్యోసంగ్ ఆక్విలా జివి250 మొత్తం మూడు విభిన్న రంగులలో లభిస్తుంది. అవి..

1. బ్లాక్ విత్ గ్రే డెకాల్స్

2. వైట్ విత్ రెడ్డిష్-బ్రౌన్ డెకాల్స్

3. బ్లాక్ విత్ రెడ్డిష్-బ్రౌన్ డెకాల్స్

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి, చెడు, ఎక్స్-ఫ్యాక్టర్

మంచి:

* పాతకాలపు డిజైన్

* మంచి ఫిట్ అండ్ ఫినిష్

* పవర్ మరియు యాక్సిలరేషన్

* రైడ్ కంఫర్ట్

చెడు:

* స్పీడ్ 100 కెఎమ్‌పిహెచ్ దాటిన తర్వాత వైబ్రేషన్

* గట్టిగా ఉండే వెనుక సస్పెన్షన్

* దూరంగా ఉండే ఫ్రంట్ ఫుట్ రెస్ట్స్

* బ్యాక్‌రెస్ట్, విండ్‌షీల్డ్ లేకపోవటం

* వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్, ఏబిఎస్ లేకపోవటం

ఎక్స్-ఫ్యాక్టర్:

మోడ్రన్ టచ్, పాత కాలపు డిజైన్‌తో బెస్ట్ బడ్జెట్ క్రూజర్ బైక్.

ధరకు తగిన విలువ:

2.5 / 5

(ధర: రూ.2,82,500 ఎక్స్-షోరూమ్)

హ్యోసంగ్ కంపెనీ గురించి

హ్యోసంగ్ కంపెనీ గురించి

హ్యోసంగ్‌ను 1978లో స్థాపించారు. ఇది హ్యాసంగ్ గ్రూప్, హ్యోసంగ్ మోటార్స్ అండ్ మెషనరీ ఇన్‌కార్పోరేషన్‌కు చెందిన సబ్-డివిజన్. ఈ సంస్థ 1979లో దక్షిణ కొరియాలో మోటార్‌సైకిళ్లను తయారు చేయటం ప్రారంభించింది.

ఆ తర్వాత 1986లో జపాన్ దేశంలో ఓ ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను స్థాపించి, ఆ తర్వాతి సంవత్సరంలో స్వయంగా డిజైన్ చేసిన మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. 1988లో జరిగిన సియోల్ సమ్మర్ ఒలంపింక్స్‌లో మోటార్‌సైకిళ్లను సరఫరా చేసిన అఫీషియల్ సప్లయర్ కూడా హ్యోసంగ్ కావటం విశేషం.

గడచిన 20 ఏళ్లలో హ్యోసంగ్ అనేక సవాళ్లను అధిగమించి ఇప్పుడు ఓ సక్సెస్‌ఫుల్ బైక్ మేకర్‌గా నిలిచింది. మనదేశంలో కూడా హ్యోసంగ్ మంచి సక్సెస్‌ను సాధించాలని మా డ్రైవ్‌స్పార్క్ బృందం కోరుకుంటోంది.

Most Read Articles

English summary
Hyosung Aquila GV250 test ride review by DriveSpark Team. Our Hyosung Aquila GV250 review reveals the truth about the new Korean cruiser. Is the Hyosung Aquila GV250 worth the price of INR 2.82L? Read the review here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X