KTM 390 Adventure SW & X Full Review KTM 390 అడ్వెంచర్ SW & X ఇంజిన్ ఫర్మామెన్స్, ఫీచర్లు పుల్ రివ్యూ
కరోనా అనంతరం ఆస్ట్రియన్ ఆల్ప్స్‌లోని అధికారులు భారత్‌లో అత్యుత్తమ బైక్‌లను విక్రయించాలని నిర్ణయించారు. పూణే వెలుపల KTM 390 అడ్వెంచర్‌ను రైడ్ చేయమని వారి వద్ద నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. పూణేకు దూరంలో ఉన్న ఘాట్‌లలో KTM 390 అడ్వెంచర్ బైక్ రైడ్ చేశాం, ఈ బైక్ లాంగ్ ఘాట్ రైట్‌లకు అత్యత్తమమైనది. KTM 390 అడ్వెంచర్ SW మరియు X పూర్తి వివరాలు మీకోసం.
KTM 390 అడ్వెంచర్ SW ప్రధానంగా రెండు ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది. అవి సస్పెన్షన్ మరియు వీల్స్. ఈ బైక్ సస్పెన్షన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. గతంలో పోల్చితే సస్పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా KTM 390 అడ్వెంచర్ SW బైక్ ముందు, వెనుక అడ్జస్టబుల్ సస్పన్షన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఫ్రంట్ ఫోర్క్ వద్ద కూడా మార్పులు చేశారు.

KTM 390 అడ్వెంచర్ స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ బైక్‌ను మంచి లుక్ సొంతం చేసుకుంది. అయితే సాధారణ మెటిరియల్‌తో కాకుండా అల్యూమినియంతో తయారుచేయబడ్డాయి. వీటిపై ఫిర్యాదు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ మరియు ట్యూబ్ టైర్లను కలిగి ఉంటుంది.

KTM 390 అడ్వెంచర్ X అనేక ఫీచర్లతో కూడిన TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ యూనిట్ పిస్టన్ ఫోర్క్ మరియి వీల్ ట్రావెల్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. 170mm కలిగి ఉంది. లివర్‌లు కూడా అడ్జస్టబుల్ రకానికి చెందినవి కావు, మరియు క్విక్‌షిఫ్టర్ కూడా లేదు. మరియు టైర్లులో కూడా మార్పులు చేశారు. మెట్జలర్ టైర్లకు బదులుగా MRF మెటోర్ ఎంవో గ్రిప్ F2 టైర్లను కలిగి ఉంటాయి.

ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. 373cc సింగిల్ సిలిండర్ 8000 rpm వద్ద 42.9 bhp మరియు 7000 rpm వద్ద 37Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఇంజిన్ గేర్ బాక్స్‌లోను పెద్ద మార్పులు చేయలేదు. ఈ బైక్ 6- స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది.

KTM 390 అడ్వంచర్ SW బైక్ రైడ్ చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కఠినమైన భూబాగాలపై ప్రయాణానికి ఉపయోగించాం. అయితే ఈ బైక్ మరో అద్భుతమైన ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ రైడర్లు తన అవసరాలకు అనుగుణంగా సస్సెన్షన్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. KTM బైక్ ట్యాంక్ అనేక సెట్టింగ్ సెటప్ ఆప్షన్లతో ఓ స్టిక్కర్ అతికించి ఉంటుంది. దానిని యాక్సెస్ చేసేందుకు రైడర్ సీట్‌ను స్పానర్‌లు ఉపయోగించి తీసివేయాల్సి ఉంటుంది.

KTM 390 అడ్వంచర్ SW ఎంతో నమ్మకంగా ఏటవాలుగా ఉన్న శిఖరాలపైకి రైడ్ చేసేందుకు మరియు చిన్న చిన్న నీటి ప్రవాహాలను దాటేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇది వ్యక్తిగత రిస్క్‌తో చేయాల్సి ఉంటుంది. ఇది వరకే చెప్పినట్లుగా ఈ బైక్ అల్యూమినియమ్ స్పోక్ వీల్స్ ను కలిగి ఉంటుంది. అయితే బైక్ జంప్ చేస్తున్న సమయంలో స్పోక్ వీల్ గురించి భయపడకుండా ధైర్యంగా డ్రైవింగ్ చేయవచ్చు.

సస్పెన్షన్ సెటప్‌లో సరైన మార్పులు చేయడం ద్వారా ఈ బైక్‌తో మంచి డ్రైవింగ్ అనుభవం పొందవచ్చు. రోడ్లు నిటారుగా ఉన్నప్పుడు ఘాట్‌పై చక్కని వ్యూస్‌ని ఎంజాయ్ చేయవచ్చు. పూణే సరిహద్దుల్లోని ఘాట్ రోడ్లపై రైట్ మరింత చక్కని అనుభూతిని ఇస్తుంది. KTM 390 అడ్వంచర్ SW రైడ్ పూర్తి చేసేందుకు సుమారుగా రోజంతా సమయం పట్టింది. మరియు తర్వాత రోజు KTM 390 అడ్వంచర్ X రైడ్ చేసే అవకాశం లభించింది.

KTM 390 అడ్వంచర్ X మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. పిస్టన్ ఫోర్క్‌లు మరియు రోడ్ బయాస్ట్ ఎంఆర్‌ఎఫ్ టైర్ల మార్పులు నిజంగా గమనించలేదు. KTM 390 అడ్వెంచర్ 2020లో భారత్‌లో లాంచ్ అయింది. అయితే కొత్త అడ్వంచర్ SW (స్పోక్ వీల్స్), మరియు X బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. అడ్వంచర్ రైడర్‌లకు ఈ బైక్‌లు మంచి అనుభూతిని తప్పకుండా ఇస్తాయి.

మేము ప్రయాణించిన రైండు బైక్‌లు (KTM 390 అడ్వంచర్ SW మరియు X)లో అడ్వంచర్ X మంచి అనుభూతిని ఇచ్చింది. ఎంతో సౌకర్యంగా మరియు సరదాగా రైడ్ చేసేందుకు ఉపయోగపడింది. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేయాలనుకున్న వారికి KTM 390 అడ్వంచర్ SW, X తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తాయి.


Click it and Unblock the Notifications








