కెటిఎమ్ ఆర్‌సి 200 వర్సెస్ హోండా సిబిఆర్250ఆర్
మీకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టమా? రూ.1.50 లక్ష నుంచి రూ.1.60 లక్షల రేంజ్‌లో (ఎక్స్-షోరూమ్) స్టయిలిష్ డిజైన్, మోడ్రన్ టెక్నాలజీ, బెటర్ పెర్ఫార్మెన్స్‌తో కూడిన బెస్ట్ 200-250సీసీ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, రెండు బెస్ట్ ఆప్షన్స్ మీ ముందున్నాయి. అందులో మొదటిది జపనీస్ బైక్ హోండా సిబిఆర్250ఆర్, రెండవది ఆస్ట్రియన్ బైక్ కెటిఎమ్ ఆర్‌సి 200.
హోండా ఎప్పటి నుంచో 250సీసీ బైక్ సెగ్మెంట్లో తమ బెస్ట్ సెల్లింగ్ సిబిఆర్250ఆర్‌ను మోడల్ విక్రయిస్తోంది. కాగా.. ఈ సెగ్మెంట్లోకి లేటెస్ట్‌గా వచ్చిన ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ నేక్డ్ బైక్ డ్యూక్ 200కు స్పోర్ట్స్ వెర్షన్‌గా కొత్త ఆర్‌సి 200ను ఇటీవలే విడుదల చేసింది. ఇంజన్ సామర్థ్యం పరంగా ఇది 200సీసీనే అయినప్పటికీ, పవర్‌లో మాత్రం ఇది సిబిఆర్250ఆర్ కన్నా మెరుగ్గా ఉంటుంది.
ఈనాటి మన కంపారిజన్ శీర్షికలో హోండా సిబిఆర్250ఆర్ మరియు కెటిఎమ్ ఆర్‌సి 200 మోడళ్లలోని ఫీచర్లను, వాటి మధ్య వ్యత్యాసాలను పోల్చి చూద్దాం రండి.

తర్వాతి స్లైడ్‌లలో హోండా సిబిఆర్250ఆర్ మరియు కెటిఎమ్ ఆర్‌సి 200 కంపారిజన్‌ను చూడండి.

ఆర్‌సి 200 vs సిబిఆర్250ఆర్ - డిజైన్
హోండా సిబిఆర్150ఆర్, కెటిఎమ్ ఆర్‌సి 200ను సైడ్ నుంచి చూస్తే, రెండూ కూడా ఇంచు మించు ఒకే రకమైన డిజైన్ స్టయిలింగ్‌ను కలిగి ఉంటాయి. సిబిఆర్250ఆర్ సీట్ హైట్ (780 మి.మీ) ఆర్‌సి 200 సీట్ హైట్ (820 మి.మీ) ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్రంట్ డిజైన్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. సిబిఆర్250ఆర్ సింగిల్ హెడ్‌లైట్‌తో లభిస్తే, ఆర్‌సి 200 డ్యూయెల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్‌తో లభిస్తుంది. ఆర్‌సి 200 సైలెన్సర్ ఇంజన్ క్రింది భాగంలోనే అమర్చబడి ఉంటుంది. సిబిఆర్250ఆర్ డిజిటల్, అనలాగ్ కాంబినేషన్ మీటర్‍తో లభిస్తుంది, ఆర్‌సి 200 ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్‌తో లభిస్తుంది.

కెటిఎమ్ ఆర్‌సి 200 - ఇంజన్
కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్‌లో 199.5సీసీ, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 1-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 25 హెచ్‌పిల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 23 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

హోండా సిబిఆర్250ఆర్ - ఇంజన్
హోండా సిబిఆర్250ఆర్ బైక్‌లో 249.6సీసీ, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 26 హెచ్‌పిల శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 23 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

ఆర్‌సి 200 vs సిబిఆర్250ఆర్ - ఇంజన్
ఇంజన్ పరంగా చూసుకుంటే, ఈ రెండు మోటార్‌సైకిళ్ల సామర్థ్యం (సీసీ) వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఈ రెండు ఇంజన్లు ఉత్పత్తి చేసే శక్తి మాత్రం దాదాపు సమానంగానే ఉంటుంది. కాబట్టి, ఇక్కడ ఇంజన్ క్యూబిక్ కెపాసిటీ (సీసీ)కి ప్రాధాన్యత ఇవ్వకుండా, పవర్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఇవి రెండూ ఒకేలా ఉంటాయి.

ఆర్‌సి 200 vs సిబిఆర్250ఆర్ - కొలతలు
సీట్ హైట్ - 820 మి.మీ. vs 780 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్ - 178 మి.మీ. vs 145 మి.మీ.
వీల్‌బేస్ - 1340 మి.మీ. vs 1367 మి.మీ.
బరువు - 154 కేజీలు vs 161 కేజీలు
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు vs 13 లీటర్లు

ఆర్‌సి 200 vs సిబిఆర్250ఆర్ - బ్రేక్స్ అండ్ సస్పెన్షన్
ఫ్రంట్ బ్రేక్ - 300 మి.మీ డిస్క్ బ్రేక్ vs 296 మి.మీ. డిస్క్ బ్రేక్
రియర్ బ్రేక్ - 230 మి.మీ డిస్క్ బ్రేక్ vs 220 మి.మీ. డిస్క్ బ్రేక్
ఫ్రంట్ సస్పెన్షన్ - డబ్ల్యూపి సస్పెన్షన్ 4357 vs టెలిస్కోపిక్ ఫోర్క్
రియర్ సస్పెన్షన్ - డబ్ల్యూపి సస్పెన్షన్ 4618 vs ప్రో లింక్
(గమనిక: హోండా సిబిఆర్250ఆర్‌లో ఆప్షనల్ ఏబిఎస్ ఆప్షన్ ఉంది, కానీ కెటిఎమ్ ఆర్‌సి 200లో ఏబిఎస్ ఆప్షన్ లేదు)

ఆర్‌సి 200 vs సిబిఆర్250ఆర్ - ధరలు
కెటిఎమ్ ఆర్‌సి 200 ధర - రూ.1.60 లక్షలు
హోండా సిబిఆర్250ఆర్ ధర - రూ.1.52 లక్షలు (నాన్-ఏబిఎస్)
(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చివరిమాట
ఇంజన్ పెర్ఫార్మెన్స్, ధరల పరంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లలో పెద్దగా తేడాలేమీ లేవు. హోండా సిబిఆర్250ఆర్ ఎప్పటి నుండో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ బోర్ కొట్టిన వారు, కొత్తదనం కోరుకునే వారు కొత్తగా వచ్చిన కెటిఎమ్ ఆర్‌సి 200ను ట్రై చేయొచ్చు. సర్వీస్ నెట్‌వర్క్ యాక్ససబిలిటీ, పెద్ద ఇంజన్ కెపాసిటీ కోరుకునే వారు హోండా సిబిఆర్250ఆర్‌ను రైడ్ చేయొచ్చు.


Click it and Unblock the Notifications








