Jawa 350 Full Review జావా 350 బైక్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా మోటార్స్(Jawa Motors) ఇటీవల సరికొత్త జావా 350ని గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సాహసయాత్రలో భాగంగా గుజరాత్‌కు చేరుకున్న ఈ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు ఆహ్వానం లభించింది. జావా 350 డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ పూర్తి రివ్యూ ఈ కథనంలో..
జావా 350 క్లాసిక్ మోటార్‌సైకిల్ తాజా వెర్షన్‌తో లాంచ్ అయింది. రానా ఆఫ్ కచ్ మీదుగా ప్రకృతి అందాలను దాటుకుంటూ ఈ బైక్ టెస్ట్ రైడ్ మాకు విస్మయం కలిగించింది. డిజైన్ విషయానికొస్తే తాజా వెర్షన్ జావా 350 క్లాసిక్ మోటార్‌సైకిల్‌కి కొత్త జీవితాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు. హెడ్‌లైట్, ఎగ్జాస్ట్ పైపులు మరియు ఇంజిన్ కేసింగ్ వంటి టాప్ క్రోమ్ ఎలిమెంట్‌లు రెట్రో లుక్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

అయితే డ్యూయల్-టోన్ టియర్‌డ్రాప్ ట్యాంక్ దాని ఎంబోస్డ్ "1929" చిహ్నాన్ని ఫ్యూయల్ క్యాప్‌పై ఉండటం దాని వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. సర్క్యులర్ ఇండికేటర్లు, రీడిజైన్ చేయబడిన సోలో సీటు రెట్రో రూపాన్ని మరింత పెంచుతుంది. అయితే పొడవైన మడ్‌గార్డ్‌తో పాటు విస్తృత టైర్లు.. స్థిరత్వంతో పాటు సౌకర్యాన్ని అందిస్తుంది. కొత్త ఛాసిస్, పెద్ద ఇంజిన్, రివైజ్డ్ సస్పెన్షన్ లాంటి అప్‌గ్రేడ్‌లను జావా 350 కలిగి ఉంది.

దీని ద్వారా మరింత శక్తివంతమైన మరియు సామర్థ్యం గల రైడ్‌ను అందిస్తుందని జావా మోటార్స్ తెలిపింది. పొడవాటి సస్పెన్షన్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన టైర్ల ద్వారా కఠినమైన రోడ్లపై కూడా సులువుగా ప్రయాణించవచ్చు. రీడిజైన్ చేయబడిన సీటుతో పాటు అసిస్ట్ మరియు స్లిప్ క్లచ్ ద్వారా రైడర్‌కు అదనపు సౌకర్యం లభిస్తుంది. తద్వారా లాంగ్ జర్నీల్లో కూడా అనువుగా ఉంటుంది. చిన్న రేడియేటర్ ద్వారా టెంపరేచర్ లెవెల్స్‌ను మెయింటైన్ చేస్తుంది.

ఇక కొత్త జావా 350(Jawa 350 Motorcycle)లో 334సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను సరిగ్గా పునర్నిర్మించారు. 22.1 bhp మరియు 28.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్ & అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది. ఇక పొడిగించిన వీల్‌బేస్ (1,449 మిమీ) ద్వారా రైడర్‌కు మరింత సౌకర్యాన్ని ఇస్తుంది.
జావా 350(Jawa 350 Review) లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు టర్నింగుల్లో సరిగ్గా పనిచేస్తున్నాయి. ముందు మరియు వెనుక ఉన్న స్పోక్ వీల్స్‌తో కూడిన హై-ప్రొఫైల్ టైర్లు ఉన్నాయి. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ 178 mm మరియు 802 mm సీటు ఎత్తు ద్వారా గరుకు రోడ్లు, ఇసుక ఉన్న రోడ్లపై సైతం సులభంగా రైడింగ్ చేయవచ్చు.

ఇక వీల్స్, సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే.. జావా 350 ముందు భాగంలో 35mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో 100/90-18 సెటప్‌తో ఉంది. వెనుకవైపు 130/80-17 వీల్స్ ట్విన్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అయితే రైడింగ్ చేసేటప్పుడు ముందు 135 మిమీ మరియు వెనుక 100 మిమీ సస్పెన్షన్‌ను కలిగి ఉండటాన్ని గుర్తించాం.

బ్రేకింగ్ విషయానికొస్తే ముందు భాగంలో 280mm డిస్క్‌లు మరియు వెనుక భాగంలో 240mm డిస్క్‌లను కలిగి ఉంటుంది. ఇక రెండు బ్రేక్‌లు కాంటినెంటల్ ద్వారా ట్యూన్ చేయబడిన ABSను కలిగి ఉండటం ద్వారా రైడర్‌కు మెరుగైన భద్రతను ఇస్తుంది. విశాలమైన రోడ్లపైనే కాకుండా గరుకు రోడ్లపై కూడా బంప్‌లు, లోపాలను తట్టుకుని ఎటువంటి అసౌకర్యం లేకుండా గంటల తరబడి ఈజీగా రైడ్ చేసేలా సహకరిస్తుంది.
ఇక కొత్త జావా 350 లో రైడింగ్ స్టైల్‌ను సర్దుబాటు చేసిన తర్వాత కూడా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు కూడా బాగా పనిచేశాయి. మొదట్లో దూకుడుగా కనిపించినా తర్వాత సరదాగా అనిపిస్తుంది. 280mm ఫ్రంట్ డిస్క్‌లు మంచి స్టాపింగ్ ఫోర్స్‌ను కలిగి ఉన్నాయి. వెనుక 240mm డిస్క్ బ్రేక్‌లు తగిన పట్టుతో పనిచేస్తున్నాయి. బైక్‌పై కూర్చున్నప్పుడు రైడర్‌కు ఇబ్బంది కలగకుండా ఫుట్‌పెగ్‌లు కాళ్ల కింద అనుకూలంగా ఉన్నాయి.

ఇక స్పీడ్ విషయానికొస్తే.. ఇది హైవేపై అప్రయత్నంగానే ఒత్తిడి లేకుండా 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే 80 నుంచి 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు హ్యాండిల్‌బార్, ఫుట్‌పెగ్‌లపై కొన్ని ప్రకంపనలను చూడవచ్చు. కానీ గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు ప్రకంపనలు తగ్గడాన్ని గమనించవచ్చు.
అయితే జావా 350 సామర్థ్యాల విషయంలో అంచనాలకు మించి ఉన్నాయి. పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా గుజరాత్ వీధుల్లో మంచి రైడింగ్ అనుభూతిని అందించింది. క్లాసిక్ రోడ్‌స్టర్‌లో సాహస యాత్రను చేసిన అనుభూతిని పొందవచ్చు. అయితే క్లచ్ ఆఫ్ రానాలో ఇసుకలో ప్రయాణిస్తున్నప్పుడు బైక్ టైర్లు ఇరుక్కుపోతాయని భావించాం. కానీ ఆసక్తికరంగా అలాంటి పరిస్థితి ఏర్పడలేదు.

చివరిగా జావా 350 అంచనాలను మించిన మోటార్‌సైకిల్ అని చెప్పవచ్చు. అద్భుతమైన రెట్రో లుక్‌లో హెడ్-టర్నర్‌తో పాటు, ఉపరితలం క్రింద ఒక ఆధునిక మెషీన్‌ను చూడవచ్చు. నీట్ లుక్‌తో పాటు మంచి రైడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. క్లాసిక్ రెట్రో మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బైక్ బాగా సరిపోతుంది.


Click it and Unblock the Notifications








