2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 2016 లో హిమాలయన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఈ మోటారుసైకిల్ అనేక సార్లు అప్డేట్స్ పొందింది. అదేవిధంగా 2020 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ అప్డేట్ చేయబడింది. ఇది గత ఏడాది ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది.

ఇదే క్రమంలో ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ మరో సారి అప్డేట్స్ అందుకుంది. ఇప్పుడు ఈ కొత్త (2021) రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తో పాటు అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. 2021 అప్‌డేట్‌ తర్వాత ఇది రూ. 10,000 ధరల పెరుగుదల కూడా అమలులోకి వచ్చింది. ధరల పెరుగుదల తర్వాత కొత్త హిమాలయన్ ధర రూ. 2.01 లక్షలు.

2021 లో అప్డేట్స్ పొందిన హిమాలయ యొక్క ఖచ్చితమైన మార్పులు తెలుసుకోవడానికి ఇటీవల ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ని మేము బెంగళూరు నగరంలో డ్రైవ్ చేసాము. కొత్త హిమాలయన్ బైక్ గురించి మరింత సమాచారం ఈ రివ్వూ ద్వారా తెలుసుకుందాం..

డిజైన్ మరియు స్టైల్ :

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మునుపటి మాదిరిగానే మొత్తం డిజైన్ మరియు స్టైలింగ్‌తో ముందుకు వెళుతుంది. అయితే ఇందులో కొత్త ఫీచర్లకు సరిపోయేలా కొన్ని సూక్ష్మ మార్పులు చేయబడ్డాయి.

కొత్త హిమాలయన్ బైక్ లో గమనించదగిన మార్పు దాని కలర్ అప్సన్. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మూడు కొత్త కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పైన్ గ్రీన్, గ్రానైట్ బ్లాక్ మరియు మిరాజ్ సిల్వర్ ఉన్నాయి.

2021 హిమాలయన్ అదే హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. మోటారుసైకిల్ విండ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. ఏదేమైనా, రాయల్ ఎన్‌ఫీల్డ్ విజర్‌ను కొద్దిగా పునః రూపకల్పన చేసింది, ఇది మునుపటి కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. ఇది హైవేపై రైడర్ కి గాలి నుంచి రక్షణను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇతర కాస్మొటిక్స్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో లో ట్యాంక్ గార్డ్ పునః రూపకల్పన చేయబడింది. తగినంత క్నీ రూమ్ లేదని ఫిర్యాదు చేసిన పొడవైన రైడర్స్ సమస్యలను ఇప్పుడు పరిష్కరిస్తుంది. వెనుక భాగంలో టెయిల్ రాక్ ఉంది.

ర్యాక్ మెటల్ ప్లేట్ తో వస్తుంది, ఇది మునుపు 5 కిలోగ్రాముల లోడ్ మోసే సామర్థ్యం నుంచి 7 కిలోలు మోసే సామర్థ్యం వరకు పెంచడానికి అనుమతించింది. టైల్ రాక్ ఇప్పుడు లగేజ్ క్యారియర్‌లను సులభంగా అమర్చడానికి కూడా అనుమతిస్తుంది. ఈ మార్పులు కాకుండా, 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ లో ఇతర మార్పులు లేదు.

ఫీచర్స్ మరియు ఎక్విప్మెంట్స్:

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మునుపటి బిఎస్ 4 మోడల్ మాదిరిగానే బిఎస్ 6 మోడల్ కూడా అదే ఫీచర్లతో నిండి ఉంది. మోటారుసైకిల్‌లో ఉన్న ఏకైక పెద్ద మార్పు ట్రిప్పర్ నావిగేషన్‌ను చేర్చడం.

ఈ ఫీచర్ మొదట, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క సరికొత్త మీటియార్ 350 క్రూయిజర్‌లో ప్రారంభమైంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫంక్షన్ సపరేట్, మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అమర్చబడి ఉంటుంది.

ఇది గూగుల్ మరియు బ్లూటూత్ వంటివాటికి ప్రత్యేకమైన యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు ఒకసారి కనెక్ట్ చేయబడిన తర్వాత రైడర్‌కు టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందిస్తుంది. అయితే మెసేజ్ మరియు కాల్ అలెర్ట్ వంటి వాటిని కోల్పోతుంది. ట్రిప్పర్ నావిగేషన్ కోసం అదనపు పాడ్ కాకుండా, 2021 హిమాలయన్ బిఎస్ 6 మోడల్‌లో ఉన్న అదే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు అప్‌డేట్ చేసిన సీట్లతో వస్తుంది, ఇవి మెరుగైన కుషనింగ్‌ను అందిస్తాయి మరియు కొంచెం కాంటౌర్డ్ చేయబడ్డాయి. ఇవిరైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మెరుగైన కుషనింగ్‌తో కూడా, సీటు ఎత్తు 800 మిమీ వద్ద ఉంటుంది.

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ పూర్తిగా మారదు. ఇది మునుపటిలాగే అదే ఫ్రేమ్, సస్పెన్షన్ సెటప్, బ్రేక్‌లు మరియు టైర్లను కలిగి ఉంటుంది. ఇందులో సస్పెన్షన్ సెటప్ యొక్క ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు 180 మిమీ మోనోషాక్ సెటప్ కలిగి ఉంటుంది. ముందు మరియు వెనుక వైపున వరుసగా 300 మిమీ మరియు 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌ల ద్వారా బ్రేకింగ్ నిర్వహించబడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 బిఎస్ 6 హిమాలియన్‌ను స్విచ్ చేయగల ఎబిఎస్‌తో పరిచయం చేయబడింది.

మోటారుసైకిల్ ముందు భాగంలో 21 ఇంచెస్ టైర్లు మరియు వెనుక భాగంలో 17 ఇంచెస్ టైర్లను కలిగి ఉంటుంది. ఇది 90/90 మరియు 120/90 టైర్ ప్రొఫైల్‌లతో వస్తుంది. హిమాలయన్ ట్యూబ్ టైర్లను స్పోక్డ్ రిమ్స్ తో కలిగి ఉంది. ఇవి దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు సహాయపడుతుంది.

హిమాలయ బైక్ లో ఇప్పుడు 220 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇప్పుడు మోటారుసైకిల్ బరువు కేవలం 199 కేజీలు. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మోటారుసైకిల్ 15-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు హ్యాండ్లింగ్ :

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అదే బిఎస్ 6 కంప్లైంట్ 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఎస్‌ఓహెచ్‌సి ఇంజిన్‌తో కొనసాగుతోంది. పవర్ మరియు టార్క్ గణాంకాలు కూడా మునుపటిలాగే ఉంటాయి, ఇవి 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి మరియు 4000 - 4500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇది స్టాండర్డ్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఈ మోటారుసైకిల్ గత సంవత్సరం మేము ప్రయాణించిన బిఎస్ 6 వెర్షన్ వలె అదే పనితీరుని అందిస్తుంది. ఇంజిన్ మృదువైనది. కావున లాంగ్ డ్రైవింగ్ కూడా చాలా రిలాక్స గా సాగుతుంది.

దీని ప్రారంభంలో కొంచెం లాగ్ ఉన్నప్పటికీ, మిడ్ రేంజ్‌లో పవర్ బాగా పెరుగుతుంది. ఈ మోటారుసైకిల్ గంటకు 120 కి.మీ వరకు వేగవంతం చేయగలదు. అయినప్పటికీ గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణించడం మంచిది. హిమాలయన్‌లోని 5 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా మృదువైనది మరియు స్లాట్లు కూడా సులభంగా అమల్లోకి వస్తాయి.

హైవే మీద ఈ బైక్ రైడింగ్ చాలా మెరుగైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ ప్రత్యేకించి మంచి ఆఫ్ రోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కావున రైడర్ ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

హిమాలయన్ బైక్ యొక్క రెండు చివర్లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మరియు 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, దాని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. మోటారుసైకిల్ యొక్క బరువు రైడింగ్ కి కొంచెం ఆటంకం కలిగిస్తుంది. ఇక ఈ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో బ్రేకులు కొంత డల్ గా ఉన్నట్లు అనిపిస్తాయి. అయితే వెంటనే నిలిపివేయడానికి రైడర్ మీటను గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. మొత్తానికి బ్రేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మునుపటి మోడల్‌ కంటే ఇప్పుడు అనేక సూక్ష్మ నవీకరణలతో వస్తుంది. అయితే ఇందులో ప్రధాన మార్పు కొత్త కలర్ ఆప్సన్ మరియు ట్రిప్పర్ నావిగేషన్.

ఈ కొత్త మోటారుసైకిల్ కూడా అదే లెవెల్ పర్ఫామెన్స్ మరియు మునుపటి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అందిస్తుంది. అయితే 2021 బైక్ ధర ఇప్పుడు దాదాపు రూ. 10,000 వరకు పెరిగింది. ఇది అమ్మకాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందో గమనించాలి. అయితే ఏది ఏమైనా కానీ టార్మాక్‌ మరియు దాని సామర్థ్యాలను చూస్తే, ఇది ఇప్పటికీ దాని వర్గంలో ఉత్తమమైన అడ్వెంచర్ టూరర్ బైక్ గా నిలిచి ఉంటుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
2021 Royal Enfield Himalayan Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X