సరికొత్త టీవీఎస్ విక్టర్ - టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి 14 ఏళ్ల క్రిందట 2002లో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల టీవీఎస్ విక్టర్ బైకును విడుదల చేసింది, అయితే రాను రాను పోటి తీవ్రతరమై కొన్నేళ్లకు వీటి ఉత్పత్తిని నిలిపివేసింది.
మైలేజ్‌కు మారుపేరుగా నిలిచిన విక్టర్ బ్రాండ్ మధ్యంతరంగా ఆగిపోకుండా పాత కాలం నాటి విక్టర్‌కు ప్రాణం పోసి టీవీఎస్ సరికొత్త 2016 విక్టర్ బైకును విడుదల చేసింది. మరో చరిత్రను లిఖించనున్న విక్టర్ బైకు గురించి పూర్తి టెస్ట్ డ్రైవ్ వివరాలు మరియు ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిజైన్
టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఇంజనీర్లు ఈ సరికొత్త విక్టర్‌కు మరియు 2002 నాటి మధ్య విక్టర్‌కు మధ్య చాలా వరకు డిజైన్ పరంగా మార్పులు చేశారు. మనల్ని ఇది ముందుగా ఆకట్టుకునే అంశం డిజైన్, ప్రారంభంలో ఉన్న బాక్సీ డిజైన్‌కు పూర్తి భిన్నంగా స్పోర్టివ్ మరియు సొగసైన్ డిజైన్‌ను కల్పించారు.

ముందు వైపు వెడల్పాటి హెడ్‌లైట్ ఇది మీకు ఇస్తుంది మరింత కాంతిని అధేవిధంగా ప్రక్కవైపుల ఉన్న ప్యానల్స్‌ను వివిధ రకాల కలర్ థీమ్‌లతో కూడిన నలుపు రంగు సమ్మేళనంతో డిజైన్ చేశారు.

నలుపు రంగుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు, ఇలాంటి నలుపు రంగును బైకులలో సరైన పరికరాలకు వినియోగించుకుంటే అత్భుతమైన డిజైన్ బయటపడుతుంది. అయితే టీవీఎస్ నలుపు రంగును విక్టర్‌లో ఉన్న ప్లాస్టిక్ పరికరాలకు, అల్లాయ్ వీల్స్‌కు మరియు మోడుగా ఉన్న ఎగ్జాస్ట్ సైలెన్సర్‌కు అందించారు. వీటి వలన నలుపు మరియు నీలం రంగులో విక్టర్ ఎంతో ఆకర్షణీయంగా కలదు.

టీవీఎస్ తమ విక్టర్‌కు ముందు వైపు మాత్రమే కాదు, వెనుక వైపున కొంత మేర ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో టెయిల్ ల్యాంప్ పైన ఉన్నటువంటి టివీఎస్ లోగోను నూతన విక్టర్‌లో టెయిల్ ల్యాంప్ క్రింది వైపు ఇచ్చారు. అలాగే బాక్స్ ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్ సరికొత్తగా రూపుదిద్దారు. ప్రక్కన గల ఫోటో ద్వారా గమనించవచ్చు.

టీవీఎస్ ఈ నయా విక్టర్ బైకులో స్టార్ సిటి ప్లస్ బైకులోని ఇంజన్‌ను వినియోగించారు. అయితే ఈ ఇంజన్‌కు కొత్తగా మూడు వాల్వులను అమర్చారు.

ఇంజన్ సామర్థ్యం, పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు
ఇందులో 109సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 9.5 బిహెచ్‌పి పవర్ మరియు 9.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. వెనుక వైపుకు వేయగలిగే 4-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు.

శబ్దం
టీవీఎస్ వారి విక్టర్ బైకు శబ్ధం పరంగా అంతగా ఇబ్బంది పెట్టదు. కాని మొదటి తరం విక్టర్ బైకు దీని కన్నా అధిక శబ్ధాన్ని ఇస్తుంది. ఎక్కువ టార్క్ ఇవ్వగల ఇందులోని ఇంజన్ స్మూత్ రైడింగ్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా 4,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు చక్కటి పవర్ మరియు టార్క్ డెలివరీ అవుతుంది.

మైలేజ్
టీవీఎస్ విక్టర్ దాదాపుగా లీటర్‌కువ 76 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని ప్రకటించింది. కాని అసలైన ప్రపంచంలో మూడు వాల్వ్‌లు గల ఎకో థ్రస్ట్ ఇంజన్ అన్ని రకాల రోడ్డు కండీషన్ల మీద లీటర్‌కు 50 కిలోమీటర్లు వరకు మైలేజ్ ఇవ్వగలదు.

మరో గేరు ఉంటే బాగుండేది
విక్టర్ ఇంజన్ సిటి రైడింగ్‌కు ఎంతో బాగుంటుంది. అదే మీరు హైవేలలో దీనిని రైడింగ్ చేసినట్లయితే గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని దాటిని తరువాత మీకు ఐదవ గేరు ఖచ్చితంగా అవసరం అవుతుంది. టీవీఎస్ ఇందులో మరో గేరు అందించి ఉంటే బాగుండేది అని మా అభిప్రాయం.

టాకో మీటర్ ఫీచర్లు
విక్టర్ బైకులోని ఇంస్ట్రుమెంట్ కన్సోల్‌లో ఎకానమీ మరియు పవర్ వంటి డ్రైవింగ్ మోడ్ ఇండికేటర్లు కలవు. ఇందులోని ఇంజన్ నాలుగవ గేర్‌లో ఉన్నప్పుడు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద పవర్ ఇండికేటర్ ఎరుపు రంగు లైటును సూచిస్తుంది.

రైడింగ్ మరియు హ్యాండ్లింగ్
దీనిని గంటకు 65 కిలోమీటర్లు వేగం వరకు చక్కగా రైడ్ చేయవచ్చు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సిరీస్ స్ప్రింగ్స్ గల సస్పెన్షన్‌ను అందించారు. ఒక విధంగా చెప్పాలంటే కమ్యూటర్ బైకులకు ఇటువంటి సస్పెన్షన్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వీటి ద్వారా స్పీడ్ బ్రేకర్లను మరియు రోడ్డు మీద గల గుంతలను సులభంగా అధిగమించవచ్చు.

బ్రేకింగ్ సిస్టమ్
దీనిని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఒత్తిడికి గురికావాల్సిన పనిలేదు. ఎందుకంటే విక్టర్‌ను ముందు వైపు పెటల్ డిస్క్ బ్రేకును అదేవిధంగా వెనుక వైపున డిస్క్‌బ్రేక్‌లను అందించారు. తద్వారా సిటి మరియు సాధారణ రోడ్ల మీద ఎటువంటి పరిస్థితులలో అయినా సరే బ్రేక్ వినియోగించిన అతి తక్కువ సమయంలోనే బైకు ఆగిపోతుంది.

నాణ్యమైన నిర్మాణం
టీవీఎస్ ఈ విక్టర్ నాణ్యమైన నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎటువంటి వేగం వద్ద అయినా సరే ఏవిధమైన వైబ్రేషన్స్ ( కుదుపులు)లేకుండా డిజైన్ చేశారు. దీనికి ముఖ్య కారణం ఛాసిస్ నిర్మాణం.

ప్లాస్టిక్ సొబగులు
ఇందులో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. వేగంలో వచ్చే అకస్మాత్తు తేడాల వలన చిన్న చిన్న లోహపు భాగాలు కుదుపులు, అదుర్లకు గురై అధిక శబ్దాన్ని ఇస్తాయి దీనిని అధిగమించడానికి చాలా వరకు ప్లాస్టిక్‌ని వినియోగించారు. మరియు ప్లాస్టిక్ కంట్రోలింగ్ బటన్‌లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

సౌకర్యాలు
ఇందులో సౌకర్య గురించి మాట్లాడాల్సిన విషయం ఏముంది అనుకుంటున్నారా ? రైడర్ మరియు సహ వ్యక్తి కలిసి ఇద్దరూ సౌకర్యవంతంగా ప్రయాణించే వీలును కల్పించింది టీవీఎస్. ఇంత వరకు మేము చాలా వరకు బైకులకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించాము అయితే ఇంతటి సౌకర్యవంతమైన సీటును ఇంత వరకు ఎందులోను చూడలేదు.

ఎలక్ట్రికల్స్
ఇందులో స్టాప్ మరియు స్టార్ట్ పరిస్థితులలో ఉపయోగపడే ఎలక్ట్రిక్ స్టార్ట్, పాస్ స్విచ్, వార్నింగ్ లైటు (ఇంజన్ యొక్క కండీషన్) కలవు. టీవీఎస్ ఇందులో వెల్పాటి ఎక్కువ కాంతిని ఇవ్వగల హెడ్ లైటును కల్పించింది.

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
ఇందులో టీవీఎస్ అపాచేలో ఉన్నటువంటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను డిజైన్ చేశారు. తెలుపు రంగులో ఉన్నటువంటి డయల్ ట్యాకో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, స్పీడ్, ఓడో మరియు ట్రిప్ మీటర్లును గమనించడానికి వీలున్నటువంటి డిజిటల్ మీటర్ కలదు. అలాగే వార్నింగ్ లైట్లను డిస్ల్పేలో భాగం చేయకుండా డ్రైవింగ్ మోడ్ ఇండికేషన్లు ప్రత్యేకంగా ఒక వరుస క్రమంలో డిజైన్ చేశారు.

లభించు రంగులు
టీవీఎస్ వారి విక్టర్ బైకు ఆరు విభిన్న రంగుల్లో లభించును.
- బ్లిస్ఫుల్ బ్లూ
- జెనరస్ గ్రే
- బీట్‌ఫిక్ బ్లాక్ సిల్వర్
- సెరెనా సిల్వర్
- రెస్ట్‌ఫుల్ రెడ్
- బ్యాలెన్స్‌డ్ బ్లాక్ రెడ్
- టీవీఎస్ విక్టర్ కొలతలు
- పొడవు: 1980 ఎమ్ఎమ్
- వెడల్పు: 750 ఎమ్ఎమ్
- ఎత్తు: 1090 ఎమ్ఎమ్
- గ్రౌండ్ క్లియరెన్స్: 175 ఎమ్ఎమ్
- వీల్ బేస్: 1260 ఎమ్ఎమ్
- ఉత్తమైన నిర్మాణ నాణ్యత
- సౌకర్యవంతమైనది
- కొత్తగా రూపొందించిన ఇంజన్ చాలా స్మూత్
- ఉత్తమ బ్రేకులు (డిస్క్ బ్రేకు వేరియంట్)
- మైలేజ్
- అత్బుతమైన కాంతిని ఇవ్వగల హెడ్ లైట్
- చదవడానికి సులంభంగా గల ఇంస్ట్రుమెంట్ కన్సోల్
- ఎంచుకోదగిన ఆరు రంగులు
- హైవే మీద స్థిరంగా (ఐడిల్)గా ఉండదు.
- పెయింట్ పనితీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- కన్వేయర్ బెల్ట్ వంటి సౌండ్ ఇచ్చే గేర్‌బాక్స్

పోటీదారులు
సరికొత్త టీవీఎస్ విక్టర్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కమ్యూటర్ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న హీరో స్ల్పెండర్, హోండా లివో, డ్రీమ్ సిరీస్, బజాజ్ ప్లాటినా, సుజుకి హయాతే మరియు మహీంద్రా వారి సెంచ్యురో వంటి వాటికి గట్టి పోటిని ఇవ్వనుంది.

స్పెసిఫికేషన్ల వివరాలు
ఇంజన్ సామర్థ్యం: 109.7 సీసీ
పవర్: 9.5 బిహెచ్‌పి
టార్క్: 9.4 ఎన్ఎమ్
గేర్లు: నాలుగు

స్పెసిఫికేషన్ల వివరాలు
మైలేజ్: 76 కిలోమీటర్లు (క్లైమ్‌డ్), 56 కిలోమీటర్లు (అచీవ్డ్)
ఇంధన ట్యాంక్ సామర్థ్యం: రిజర్వ్‌తో సహా 8 లీటర్లు
రిజర్వ్ సామర్థ్యం: 2 లీటర్లు
బరువు: డ్రమ్ బ్రేక్ వేరియంట్ 112 కిలోలు మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ 113 కిలోలు

కొలతలు

బ్రేకులు, టైర్లు మరియు సస్పెన్షన్
బ్రేకులు:
ముందు: 130 ఎమ్ఎమ్ డ్రమ్, 240 ఎమ్ఎమ్ డిస్క్
వెనుక వైపున: 110 ఎమ్ఎమ్ డ్రమ్
టైర్లు :
ముందు: 2.75X17-అంగుళాలు
వెనుక: 3.00X17-అంగుళాలు
సస్పెన్షన్
ముందు: టెలిస్కోపిక్
వెనుక వైపున: 5-స్టెప్ అడ్జెస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్

టీవీఎస్ విక్టర్‌లోని ప్రయోజనాలు

అప్రయోజనాలు

టీవీఎస్ విక్టర్ అన్ రోడ్ ధరలు
హైదరాబాద్:
టీవీఎస్ విక్టర్ డిస్క్ ధర రూ. 61,659 లు
టీవీఎస్ విక్టర్ డ్రమ్ ధర రూ. 63,947 లు
విజయవాడ :
టీవీఎస్ విక్టర్ డిస్క్ ధర రూ. 61,659 లు
టీవీఎస్ విక్టర్ డ్రమ్ ధర రూ. 63,947 లు
తిరుపతి:
టీవీఎస్ విక్టర్ డిస్క్ ధర రూ. 61,659 లు
టీవీఎస్ విక్టర్ డ్రమ్ ధర రూ. 63,947 లు

తీర్పు
టీవీఎస్ వారి విక్టర్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శక్తివంతమైన ఇంజన్, మంచి సస్పెన్షన్, ఉత్తమమైన సౌకర్యం అధేవిదంగా బ్రేకింగ్ వ్యవస్థ కలదు అలాగే ఎంచుకోదగ్గ మంచి రంగులు ఇందులో కలవు. ఈ కమ్యూటర్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ స్కూటర్ అని మా అభిప్రాయం. మరి అభిప్రాయం....?

2016 టీవీఎస్ విక్టర్ మీద కూర్చున్నపుడు మనకు కనిపించే ప్రంట్ వ్యూవ్

2002 నాటి విక్టర్ మరియు 2016 టీవీఎస్ విక్టర్ బైకులను ప్రక్కవైపుల నుండి సగం మాత్రం పోల్చి చూస్తే కనిపించే చిత్రం.

ఇంధన ట్యాంకు మీద ఫ్యూయల్ క్యాపును మూసిన తరువాత 2016 టీవీఎస్ విక్టర్ ఇలాగే ఉంటుంది

2016 టీవీఎస్ విక్టర్ వెనుక వైపున గల టెయిల్ ల్యాంప్ మరియు ఇండికేటింగ్ లైట్లు.

2016 టీవీఎస్ విక్టర్ బైకులోని ఇంజన్ డిజైన్ మరియు సిలిండర్ పొజిషన్‌ను ఈ ఫోటో ద్వారా గమనించగలరు.

2016 టీవీఎస్ విక్టర్‌కు చెందిన మరిన్ని ఫోటోలు వివరంగా

2016 టీవీఎస్ విక్టర్ బైకులో బ్రేక్ లీవర్ మరియు గేర్ లీవర్లను ఇక్కడ గల ఫోటోలో గుర్తించగలరు.

2016 టీవీఎస్ విక్టర్ వెనుక వైపు నుండి, రియర్ అల్లాయ్ వీల్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ వెనుక భాగాన్ని చూడగలరు.

2016 టీవీఎస్ విక్టర్ హ్యాండిల్ కుడి వైపు: ఇందులో ఇంజన్ పవర్ బటన్ మరియు ఇతర నియంత్రికలు చూడవచ్చు.

2016 టీవీఎస్ విక్టర్ హ్యాండిల్ ఎడమ వైపు చిత్రం : ఇందులో హారన్, ఇండికేటర్ మరియు ఇతర నియంత్రికలను గమనించవచ్చు.

టీవీఎస్ విక్టర్ లో గేర్ బాక్స్‌కు ప్రక్క వైపుల ఉన్నటువంటి గేర్ లీవర్

టీవీఎస్ విక్టర్ సైలెన్సర్ డిజన్

2002 నాటి విక్టర్ మరియు 2016 టీవీఎస్ విక్టర్ బైకుల సీటును పోల్చి చూస్తే కనిపించే చిత్రం.

2016 టీవీఎస్ విక్టర్‌లో వినియోగించిన కార్బోరేటర్

2016 టీవీఎస్ విక్టర్ లో వెనుక వైపున ఉన్నటువంటి డ్రమ్ బ్రేకు వ్యూవ్

2016 టీవీఎస్ విక్టర్ లో ఇంధన ట్యాంక్ నుండి కార్బోరేటర్‌కు పెట్రోల్ సరఫరా చేసే విభాగం

చీకటిలో 2016 టీవీఎస్ విక్టర్లోని స్పీడో మీటర్ వివిధ రకాల రంగుల్లో చూపిస్తున్న సంకేతాలు

2016 టీవీఎస్ విక్టర్‌కు చెందిన ముందు వైపు ప్రొఫైల్

2016 టీవీఎస్ విక్టర్ మీద సీటును తొలగించి వేస్తే ఇలాగే ఉంటుంది.

2016 టీవీఎస్ విక్టర్‌లో ముందు మరియు వెనుక వైపున వినియోగించిన టైర్లు

తెలంగాణ ప్రజలకు శుభవార్త: లైసెన్స్ లేకున్నా పర్వాలేదు
ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా విడుదల కానున్న టాటా టియాగో

భారత దేశపు అత్యంత వేగవంతమైన రైలు
విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు

యాంకర్ అనసూయ అకౌంట్లో ఖరీదైన ఆడి కారు
దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి నువోస్పోర్ట్ విడుదల: మరిన్ని వివరాలకు


Click it and Unblock the Notifications








