నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ప్రస్తుతం మనం 21 వ శతాబ్దంలో ఉన్నాము. ఈ శతాబ్దంలో భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో దేశీయ మార్కెట్లో చాలా వరకు అప్డేటెడ్ కార్స్, బైక్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు ఎక్కువగా సైకిల్స్ ఉపయోగించడాన్ని ఆసక్తి చూపుతున్నారు.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇప్పటికే దాదాపు 1 బిలియన్ కంటే ఎక్కువ సైకిల్స్ వినియోగంలో ఉన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. అయితే 19 శతాబ్దం మరియు అంతకు ముందు కూడా సైకిల్స్ ఉపయోగంలో ఉండేవి. అప్పుడు వీటిని దూర ప్రయాణాలకు మరియు వ్యవసాయ విధుల్లో ఉపయోగించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సైకిల్స్ యొక్క పాత్ర సమాజంలో ఏ మాత్రం తగ్గలేదు.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఆరోగ్యం కోసం సైకిల్స్ ఉపయోగిస్తారు. అంతే కాకూండా ఫిట్‌నెస్ కోసం, రేసింగ్ కోసం మరియు చిన్న దూరాలను చేరుకోవడానికి సైకిల్ వినియోగిస్తున్నారు. చిన్నపిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వీటిని వాడుతున్నారు. ఒకప్పటినుంచి ఇప్పటి వరకు కూడా సైకిల్స్ యొక్క డిజైన్ పెద్దగా ఏ మాత్రం మారలేదు. కానీ సాధారణ సైకిల్స్ స్థానంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ పుట్టుకొచ్చాయి.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన యుగంలో దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఈ విభాగంలో చాలా ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఒకటి నెక్జు. ఇటీవల మేము 'నెక్జు రోంపస్ ప్లస్' ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి రైడ్ చేసాము. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

డిజైన్ అండ్ స్టైల్:

మేము రైడ్ చేసిన ఈ నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ బ్లూ కలర్ (బ్లూ షేడ్)లో ఉంది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. అంతే కాకుండా ఈ సైకిల్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో బాడీ కలర్ మడ్‌గార్డ్‌లను చూడవచ్చు.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

హ్యాండిల్ బార్ దృఢంగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్ కోసం కంట్రోల్ పానెల్ కూడా అదే హ్యాండిల్‌బార్‌లో అమర్చబడి ఉంటుంది. నెక్జు రోంపస్ ప్లస్ హైబ్రిడ్ ఫ్రేమ్ మీద ఆధారపడి ఉంటుంది. కావున ఇది సులభమైన రహదారులపై ఉపయోగించడానికి మరియు కఠినమైన ఆఫ్-రోడ్ భూభాగాలలో ఉపయోగించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ ఇన్-ఫ్రేమ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫ్రేమ్ లోపల వైర్లు కూడా ఉంటాయి. ఇందులో ఉన్న సీటు హైట్ అడ్జస్టబుల్ గా ఉంటుంది. ఈ సైకిల్ యొక్క వెనుక మడ్‌గార్డ్‌లో రిఫ్లెక్టర్ అమర్చబడి ఉంటుంది. కావున వెనుక కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

నెక్జు రోంపస్ ప్లస్ సైకిల్ 26 ఇంచెస్ చక్రాలపై నడుస్తుంది. ఇది ఆఫ్-రోడ్ నాబ్లి టైర్లను కలిగి ఉంటుంది. సైకిల్ చక్రాలకున్న ఫోక్సులు బ్లాక్ కలర్ లో ఉంటాయి. దీనికి అల్యూమినియం రిమ్ అందుబాటులో ఉంటుంది. ఫోక్సులకు అల్యూమినియం ఫినిషింగ్ ఉండటం వల్ల ఈ సైకిల్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ సైకిల్ యొక్క ముందు భాగంలో మరియు వెనుక వైపున పెటల్ డిస్క్ కలిగి ఉంటుంది. వెనుక వైపు వీల్ హబ్ వద్ద ఎలక్ట్రిక్ మోటారు ఉంది. కానీ ఇది మిగిలిన సైకిల్ లాగా కనిపిస్తుంది. అయితే మంచి సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్:

నెక్జు రోంపస్ ప్లస్ ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉండనప్పటికీ, ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌ను కొనసాగించడానికి కావలసిన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో

 • వాక్ అసిస్ట్
 • టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
 • రైడింగ్ మోడ్‌లు
 • త్రీ రైడ్ స్పీడ్స్
 • డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు
 • నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  ఈ సైకిల్ హ్యాండిల్ బార్-మౌంటెడ్ కంట్రోల్ పానెల్ ను పొందుతుంది, ఇది రైడర్ రైడ్ మోడ్లను మరియు రైడింగ్ వేగాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. హెడ్‌ల్యాంప్‌ను ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి స్విచ్ కూడా ఉంది. అదే కంట్రోల్ ప్యానెల్ ద్వారా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆన్ చేయబడినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ సైకిల్ లో చిన్న హార్న్ కూడా ఉంటుంది. ఇది రద్దీగా ఉండే సమయంలో ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడవుతుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  పవర్ట్రెయిన్, పర్ఫామెన్స్ మరియు మెయింటెనెన్స్:

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ 250 వాట్ హబ్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 5.2Ah బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2.5 గంటల నుండి 3 గంటల మధ్య సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఎలక్ట్రిక్ మోడ్‌లో 22 కిలోమీటర్ల పరిధిని మరియు పెడెలెక్ మోడ్‌లో 32 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  నెక్జు రోంపస్ ప్లస్ ని రైడింగ్ చేయడం చాలా సులభంగా మరియు చాలా సరళంగా ఉంటుంది. ఇంతకు ముందు సైకిల్ నడిపిన ఎవరికైనా దీనిని రైడింగ్ చాలా సులభం. ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సాధారణ సైకిల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ మోటారు ఉనికిని కలిగి ఉండటం వల్ల సాధారణ సైకిల్ కి భిన్నంగా ఉంటుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కంట్రోల్ పానెల్‌లోని ఆన్ మరియు ఆఫ్ బటన్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఆన్ చేసినప్పుడు ఆటోమాటిక్ గా పెడెలెక్ మోడ్‌లో ఉంటుంది. ఈ మోడ్‌ హైబ్రిడ్ లాగా పనిచేస్తుంది మరియు రైడర్ పెడల్స్ చేసేటప్పుడు పవర్ అసిస్ట్‌ను అందిస్తుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  మీరు మొదట పెడలింగ్ ప్రారంభించినప్పుడు, టార్క్ లో అకస్మాత్తుగా పెడెలెక్ మోడ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పెడెలెక్ మోడ్ ముందు స్ప్రాకెట్ దగ్గర ఉన్న సెన్సార్‌పై ఆధారపడుతుంది. ఫ్రంట్ స్ప్రాకెట్ తిరుగుతున్నట్లు గుర్తించినప్పుడు, రైడర్ పెడలింగ్ చేస్తున్నట్లు అర్థం చేసుకుంటుంది కావున, పవర్ అసిస్ట్ అందిస్తుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌కు 'లో, మీడియం మరియు హై' అనే మూడు స్పీడ్ సెట్టింగులు ఉన్నాయి. పెడెలెక్ మోడ్‌లో కూడా స్పీడ్ సెట్టింగ్‌లలో తేడా కనిపిస్తుంది. హై-స్పీడ్ లో సైక్లింగ్ చాలా ఉత్తమంగా ఉంటుంది. కానీ రద్దీగా ఉండే ప్రాంతాల్లో 'లో' మోడ్ లో వెళ్లడం చాలా మంచిది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  త్రాటల్ తేలికగా అనిపిస్తుంది. 250వాట్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేయబడిన టార్క్ వెంటనే మంచి రైడింగ్ అనుభూతి కలిగిస్తుంది. తక్కువ వేగంలో కూడా త్రాటల్ ఇన్‌పుట్‌లకు మోటార్ రెస్పాండ్ అవుతుంది. ఈ రెస్పాండ్ వల్ల గంటకు ఇది 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే ఇది గంటకు 25 కి.మీ వేగాన్ని తాకుతుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ నిర్వహణ చాలా సులభం. ఇందులో ఉన్న టైర్లు రోడ్డుపై వెళ్ళేటప్పుడు మంచి గ్రిప్ అందిస్తుంది. ఇందులో ఉన్న సీటు చాలా మృదువైనదిగా ఉండటమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. మొత్తం మీద నెక్జు రోంపస్ ప్లస్ మంచి రైడింగ్ అనుభాన్ని అందించింది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  ప్రైస్, వారంటీ మరియు ప్రత్యర్థులు:

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ ధర 32,925 రూపాయలు. ఇది హీరో లెక్ట్రో సి3 మరియు బాట్రే ఎలక్ట్రిక్ న్యూట్రాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క వివిధ భాగాలకు, వివిధ రకాల వారంటీ టైమ్ కలిగి ఉంటుంది. కంట్రోలర్ మరియు ఛార్జర్ కి 6 నెలల వారంటీ, ఫ్రేమ్ మరియు ఫోర్క్ వంటి వాటికి ఒక సంవత్సరం వారంటీ కలిగి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు మరియు బ్యాటరీకి మాత్రం 18 నెలల వారంటీ లభిస్తుంది.

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  నెక్జు రోంపస్ ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ కేవలం సైకిల్ మాత్రమే కాదు, సాధారణ సైకిల్ కంటే కూడా మంచి పనితీరుని కలిగి ఉంటుంది. ఈ సైకిల్ రైడింగ్ ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈ సైకిల్ ప్రస్తుతం కాలంలో ఆరోగ్యపరమైన ఫిట్‌నెస్ కోసం, చిన్న దూరాలకు వెళ్లి రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ సైకిల్ ప్రస్తుత తరానికి ఖచ్చితంగా తగిన విధంగా ఉంటుందని మాత్రమే చెప్పగలము.

Most Read Articles

English summary
Nexzu Rompus+ Electric Cycle Review. Read in Telugu.
Story first published: Friday, July 23, 2021, 14:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X