Oben Rorr Electric Bike Full Review ఒబెన్‌ రోర్‌ బైక్‌ ఫీచర్లు, డిజైన్‌, బ్యాటరీ రేంజ్‌ ఫుల్‌ రివ్యూ

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒబెన్ EV ఇటీవల అధికారికంగా తన రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది. ఈ ప్రొడక్షన్‌ స్పెక్‌ బైక్‌ పూర్తి రివ్యూను ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.

ఒబెన్‌ రోర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ డిజైన్‌ విషయానికొస్తే.. సర్క్యులర్‌ హెడ్‌లైట్, మాస్ ఫార్వర్డ్ డిజైన్, మస్క్యులర్ 'ఫ్యూయల్' ట్యాంక్, దాని ముందు సిల్వర్ హుడ్, ఎత్తైన టెయిల్ సెక్షన్ అన్నీ ఫ్యూయెల్‌తో నడిచే బైక్‌లా కనిపిస్తాయి. మొత్తంమీద వృత్తాకార LED హెడ్‌లైట్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది.

Oben-Rorr-Electric-Bike

బైక్‌పై స్థిరమైన 15A ఛార్జింగ్ కేబుల్‌ను చూడవచ్చు. ఇది కేవలం రెండు గంటల్లో బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్, టెయిల్‌లైట్‌లు, రేర్‌ ఇండికేటర్లతో కూడిన పొడవైన టెయిల్‌గేట్ స్టెప్డ్ సీట్ ట్యాంక్‌తో మంచి లుక్‌తో ఉంటుంది. అయితే ఇందులో టచ్‌స్క్రీన్ లేదా TFT డిస్‌ప్లే ఉండదు. దీని బదులుగా, రోర్ ఆటో-బ్రైట్‌నెస్‌తో LCD యూనిట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎల్‌సీడీ ద్వారా రైడర్‌కు అవసరమైన మొత్తం డేటాను పొందుపరుస్తుంది. ఇ-సిమ్, బ్లూటూత్ ద్వారా యాప్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఇందులో యాంటీ థెఫ్ట్ సిస్టమ్ కూడా మరో ప్రత్యేకత. మిగతా బైక్‌లతో పోలిస్తే ఒబెన్ రోర్ అన్నింటికంటే సాంప్రదాయ మోటార్‌సైకిల్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.

Oben-Rorr-Electric-Bike

ఇందులో లైటింగ్ సెటప్‌ను పరిశీలిస్తే LED, ఫుట్‌ పెగ్‌లు, స్విచ్‌ గేర్‌ను TVS అపాచీ నుంచి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. మిగతావన్నీ కొత్తగా రూపొందించినవాటిలాగా కనిపిస్తాయి. బ్రైట్‌నెస్‌ లెవెల్స్‌ను మార్చినప్పుడు LCD ఆటో బ్రైట్‌నెస్ క్లస్టర్ సెటప్ ఆటోమేటిగా మారుతుంది. కాబట్టి మీరు డ్రైవ్‌ చేసేటప్పుడు లైటింగ్‌తో కొంచెం సమస్య ఏర్పడవ్చచు. ఇక మిగిలిన ఫీచర్ల విషయానికొస్తే, క్లస్టర్‌తో రైడర్‌కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు.

ఒబెన్ రోర్ బైక్‌లో 4.4kW LFP బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌పై 187 km రేంజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మీరు ఈ బైక్‌ రైడ్‌ చేసుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్‌ ప్రకారం రేంజ్‌ ఉంటుందని గమనించాలి. ఈ బైక్‌లో ఎకో, సిటీ మరియు హవోక్ మోడ్‌లు ఉన్నాయి.

Oben-Rorr-Electric-Bike

ఎకో మోడ్‌లో, రోర్ 150 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. కాగా దీని గరిష్ఠ వేగం గంటకు 50 కి.మీకి మాత్రమే పరిమితం చేశారు. ఇక సిటీ మోడ్ గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ. హావోక్ మోడ్‌లో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కానీ ఈ మోడ్‌లో ఇది కేవలం 100 కి.మీల రేంజ్‌ను మాత్రమే ఇస్తుంది.

కొత్త ఒబెన్ రోర్ బైక్‌లో అమర్చిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ద్వారా మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తి సరఫరా అవుతుంది. ఇది గరిష్ఠంగా 10.72 bhp పవర్, 330 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బెల్ట్- డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి శక్తి సరఫరా అవుతుంది.

Oben-Rorr-Electric-Bike

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్‌ బైక్‌ 1,423 మి.మీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది 200 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. సీటు 810 మి.మీ హైట్‌లో ఉంటుంది. కాగా ఈ బైక్ బరువు 130 కిలోగ్రాములు మాత్రమే అని సంస్థ తెలిపింది. ఇందులో 37 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్, సీట్ టైర్‌లతో కూడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి.

ఇక రైడింగ్‌ విషయానికొస్తే మీరు హవోక్ మోడ్‌లో ఉన్నట్లయితే ఒబెన్ రోర్ స్పీడ్‌గా వెళ్తుంది. ఎకో మరియు సిటీ మోడ్‌లలో స్థిరమైన వేగంతో వెళ్తాయి. కాగా కంపెనీ క్లెయిమ్ చేసిన హై స్పీడ్‌ను హవోక్ మోడ్‌లో మాత్రమే చేరుకోవచ్చు. అయితే మీరు గంటకు 90 కి.మీ దాటిన తర్వాత బైక్‌ కొంచెం మందగిస్తుంది.

Oben-Rorr-Electric-Bike

ముఖ్యంగా ఇందులో రైడ్ క్వాలిటీ అంత గొప్పగా లేదు. ఈ బైక్‌ వెనుక భాగం గట్టిగా ఉంటుంది. టర్నింగులు, లేన్‌ ఛేంజ్‌లలో బైక్‌ షార్ప్‌గా పనిచేస్తుంది. అయితే గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు బైక్‌ సస్పెన్షన్‌ సెటప్‌ మృదువుగా పనిచేయాలి. కానీ రోర్ సిటీ బైక్ అయినందున, గట్టి సస్పెన్షన్‌తో అంత మంచి ఫలితాలు కనిపించవు.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్‌ బైక్‌లో బ్రేక్‌ల విషయానికొస్తే.. అంతగా సంతృప్తి చెందకపోవచ్చు. అయితే ఒబెన్ రోర్‌తో బ్యాటరీ ఛార్జింగ్‌ టైమింగ్‌, రేంజ్‌ను తనిఖీ చేయడానికి మాకు తగినంత సమయం దొరకలేదు. అయినప్పటికీ ఒబెన్ EV క్లెయిమ్‌ చేసినట్లుగా రేంజ్‌.. వాస్తవ రేంజ్‌కు దగ్గరగా ఉన్నాయని టెస్ట్‌ డ్రైవ్‌లో గుర్తించాము. టెస్ట్‌ డ్రైవ్‌లో మా రైడింగ్ చాలా వరకు హవోక్ మోడ్‌లోనే జరిగింది.

Oben-Rorr-Electric-Bike

చివరగా ఒబెన్ రోర్‌ ఎలక్ట్రిక్ బైక్‌లో చాలా మంచి ఫీచర్లు ఉండటంతో పాటు ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కఠినమైన రైడింగ్ మరియు బ్రేకింగ్ సమస్యలను సంస్థ పరిశీలించాల్సి ఉంది. మొత్తంగా సిటీ రోడ్లపై ప్రయాణించడానికి ఒబెన్‌ రోర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ మంచి ఆప్షన్‌.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2023, 11:30 [IST]
English summary
Oben rorr electric bike battery range features design performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+