River Indie ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, డిజైన్, పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్‌ కంపెనీ రివర్‌ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇండీ(River Indie Electric Scooter)ని ఆరు నెలల క్రితం మార్కెట్లోకి పరిచయం చేసింది. దాని ప్రత్యేకమైన డిజైన్‌తో 'SUV ఆఫ్‌ స్కూటర్స్‌' గా ట్యాగ్‌లైన్‌తో ప్రవేశపెట్టింది.

రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు దేశంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 1.25 లక్షలు (ఎక్స్‌ షో రూమ్‌) ధర వద్ద దీనిని విడుదల చేసింది. అయితే ఈ రివర్‌ ఇండీని స్కూటర్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మమ్మల్ని ఆహ్వానించింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ మీకు అందిస్తున్నాం.

River-Indie-Electric-Scooter

డిజైన్‌: రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు బాక్సీ లైటింగ్‌ సెటప్‌తో ఇతర ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ముందు వైపున, డ్యూయల్ స్క్వేర్ LED హెడ్‌లైట్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫ్రంట్‌ ఫెండర్‌ బ్లాక్‌ కలర్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. దీనిని 14 అంగుళాలు అల్లాయ్‌ వీల్స్‌తో రూపొందించారు.

రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విశాలమైన సీటును కలిగి ఉంది. స్కూటర్‌పై కూర్చోగానే మీకు 6-అంగుళాల డిస్‌ప్లే కనిపిస్తుంది. రైడింగ్ మోడ్‌ల నుంచి స్పీడ్‌, ఛార్జింగ్‌ స్థాయి వరకు ఈ డిస్‌ప్లే ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్‌ మాన్‌సూన్‌ బ్లూ, సమ్మర్‌ రెడ్‌, స్ప్రింగ్‌ యెల్లో కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

River-Indie-Electric-Scooter

సీటు ఎత్తు 770mm, స్టోరేజ్‌ స్పేస్‌ కోసం ఫ్లాట్‌ ఫోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది. 12-లీటర్ క్లోజ్డ్ స్టోరేజ్ బాక్స్‌తో వస్తుంది. సీటు కింద పెద్ద హెల్మెట్‌ల కోసం 43-లీటర్ స్టోరేజ్ ఏరియా ఉంది. ఈ స్కూటర్‌ వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార ఫ్రాస్టెడ్ గ్లాస్ LED బ్రేక్ లైట్ ఉంది. అది రివర్‌ లోగో కింద ఉంటుంది. దాని కింద కొంచెం టర్నింగ్‌ ఇండికేటర్లు, రిఫ్లెక్టర్ ఉంటాయి.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 1,365 mm పొడవాటి వీల్‌బేస్‌తో వస్తుంది. 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 300mm లోతు వరకు నీటిలోకి వెళ్లగల సామర్థ్యాన్ని అందిస్తుంది. రైడర్ సీటు 770 మిమీ ఎత్తులో ఉంటుంది మరియు ఫ్లోర్‌బోర్డ్ 20 అంగుళాలు ఉంటుంది.

River-Indie-Electric-Scooter

రివర్ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో 32 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ షాక్ అబ్జార్బర్స్ మరియు వెనుక వైపున అల్యూమినియం డ్యూయల్ సైడెడ్ స్వింగార్మ్‌తో సస్పెండ్ చేయబడిన డ్యూయల్ క్రెడిల్ ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్ సెటప్‌ను కలిగి ఉంది.

పైన చెప్పినట్లుగా, ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఇవి చంకీ 120-సెక్షన్ టైర్‌లతో చుట్టబడి ఉంటాయి. ఇండీకి బ్రేకింగ్ శక్తిని అందించేందుకు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ సహాయంతో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఫ్రంట్‌ డిస్క్ 3 పిస్టన్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన 240 మిమీ యూనిట్ అయితే రియర్‌ డెస్క్‌ 200 మీ యూనిట్‌గా ఒకే కాలిపర్‌తో కంట్రోల్‌ అవుతుంది..

River-Indie-Electric-Scooter

ఎలక్ట్రిక్ మోటార్: కొత్త రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌ను పరిశీలించినట్లయితే ఇందులో 9bhp వద్ద 26Nm గరిష్ఠ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బెల్ట్ డ్రైవ్ సెటప్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని అందిస్తుంది. ఇక ఇందులో బ్యాటరీని కూడా ఎక్కువ రేంజ్‌ ఇచ్చేలా రూపొందించారు.

బ్యాటరీ: NMC కెమిస్ట్రీ సెల్‌లను ఉపయోగిస్తూ రూపొందించిన IP67 రేటెడ్ 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీని ద్వారా మోటారు శక్తిని పొందుతుంది. రివర్ EV ఒకే ఛార్జ్‌పై 120 కిమీ రేంజ్‌ ఇస్తుంది. ఇంకా 5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.

River-Indie-Electric-Scooter

అయితే రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు అయితే ప్రస్తుతం అందుబాటులో లేవు. బ్యాటరీతో పాటు ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రెండూ కూడా 5 సంవత్సరాలు, 50,000 కిమీ వారంటీతో కంపెనీ కస్టమర్లకు అందిస్తుంది. ఇది కస్టమర్లకు మంచి ఆప్షన్‌.

ఇంకా రివర్ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మూడు రైడింగ్ మోడ్‌లతో అందించబడుతుంది. ఎకో, రైడ్ మరియు రష్. ఎకో మోడ్‌లో, గరిష్ఠ వేగం గంటకు 55 కి.మీలకు పరిమితం చేయబడింది. రైడ్ మోడ్‌కు మారడం అంటే యాక్సిలరేషన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇందులో గరిష్ఠంగా గంటకు 90కి.మీగా వేగంతో ప్రయాణిస్తుంది.

River-Indie-Electric-Scooter

ఇంకా రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అత్యంత క్రేజీ మోడ్ రష్‌లో గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 40కి.మీ వేగం అందుకుంటుంది. ఇంట్రస్టింగ్‌ రైడ్‌ కోరుకునే వారికి రష్ మోడ్ మంచి ఆప్షన్‌. కానీ మన దేశంలో రైడ్‌ అనేది రైడింగ్‌ పరిస్థితులకు ఉపయోగించాల్సిన మోడ్‌.

ఇంకా మేము రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రైడ్‌ చేసినప్పుడు.. దాని పెద్ద వీల్స్‌ (చంకీ టైర్‌లతో) మరియు మృదువైన సస్పెన్షన్ సెటప్‌తో బంప్‌లు మరియు రట్స్‌పై సులభంగా గ్లైడ్ చేయడాన్ని పరిశీలించాం. అయితే, కొంచెం పొడవైన వీల్‌బేస్ అంటే ఇది వంపుల చుట్టూ కూడా చాలా స్థిరంగా ఉంటుంది. డిస్క్‌లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరగా స్టాప్‌ చేస్తాయి.

River-Indie-Electric-Scooter

ఇక రివర్ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. పెద్ద స్టోరేజ్ ఆప్షన్‌లతో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్టోరేజ్‌ ఆప్షన్‌ మీరు ఎక్కువ లగేజీని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్‌ మరియు కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ను కొద్దిగా సర్దుబాటు చేసినట్లయితే కస్టమర్లకు ఇంకా సంతృప్తిగా ఉండేది. స్పోర్టీ ఫీచర్‌తో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను వెతుకుతున్న వారికి రివర్‌ ఇండీ మంచి ఆప్షన్‌.

More from DriveSpark

Article Published On: Tuesday, September 12, 2023, 11:00 [IST]
English summary
River indie electric scooter design features specs battery performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+