Royal Enfield Goan Classic 350 Full Review రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ని కొనుగోలు చేయవచ్చా, లేదా?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోటోవర్స్ 2024 (Motoverse 2024) ఈవెంట్‌కు హోస్ట్‌గా ఉంది. గోవాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆ సంస్థ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌ని లాంచ్‌ చేసింది. ఈ మోటార్‌సైకిల్‌ని మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఈ బైక్‌ ఎలా ఉంది? దీని ఫర్ఫామెన్స్, డిజైన్‌, ఇంజిన్‌ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి రివ్యూపై ఓ లుక్కేయండి..

డిజైన్ & ఫీచర్లు: ఈ బైక్‌ డిజైన్‌ పరంగా భారీ మార్పులు చేసింది. ఈ బైక్‌ పాత క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించబడింది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350కి ప్రత్యేకమైన బాబర్ రూపాన్ని అందించడం ద్వారా కొన్ని మార్పులు జరిగాయి. కొత్త గోవాన్ క్లాసిక్ 350లో ట్యూబ్‌లెస్ టైర్‌తో 19-అంగుళాల స్పోక్డ్ ఫ్రంట్ వీల్, ఫ్రంట్ ఫెండర్ వంటివి ఉన్నాయి.

Royal Enfield Goan Classic 350 Review

ఇందులో 650 ట్విన్స్ లైనప్ వలె మెటల్ స్విచ్ క్యూబ్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ట్రిప్పర్ నావిగేషన్ డిస్‌ప్లే అలాగే టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లతో కూడిన కొత్త మినీ ఏప్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్స్‌ కలవు. దీంతో పాటు వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, LED బ్లింకర్స్‌ ఉన్నాయి. ఈ కొత్త గోవాన్ క్లాసిక్ 350 వెనుక స్వింగ్ ఆర్మ్‌ని అందించారు.

అలాగే వెనుక LED లైటింగ్ సెటప్, రౌండ్ టైల్‌లైట్, బ్లింకర్స్‌ మరింత అందాన్ని ఇస్తాయి. ఈ గోవాన్ క్లాసిక్ 350 4 కలర్ ఆప్షన్స్‌తో అందించబడుతుంది. ఈ బైక్‌ ట్యాంక్‌కు శక్తివంతమైన హెవీ మెటాలిక్ రెడ్‌ కలర్‌ని అందిచారు. ఇది రేవ్ రెడ్ కలర్‌వే సిల్వర్‌ బ్యాడ్జింగ్‌తో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కోసం కాంట్రాస్ట్ ఆరెంజ్‌తో కూడిన బేస్ టీల్ పెయింట్‌ కూడా ఉంది.

Royal Enfield Goan Classic 350 Launch

స్పెసిఫికేషన్స్‌ & డైమెన్షన్స్: ఇది ఇతర 350 వెహికిల్స్‌ వలె ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 349cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ కలదు. ఈ బైక్‌లోని ఎయిర్-కూల్డ్, 349cc SOHC ఇంజిన్ 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త బైక్‌ 36.2 మైలేజీ అందిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది.

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 వెనక సంప్రదాయ 41 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్‌తో పాటు ట్విన్‌షాక్‌ 6 స్టెప్స్‌ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తుంది. ఇందులో ఫ్రంట్ ఫోర్క్ 130 mm తో, అయితే వెనుక షాక్స్‌ 105.3mm తో వస్తాయి. సాధారణ క్లాసిక్ 350 కంటే ఇది 15.3mm ఎక్కువ.

Royal Enfield Goan Classic 350 Features

గోవాన్ క్లాసిక్ 350లో బ్రేకింగ్ డ్యూటీలు ట్విన్-పిస్టన్ కాలిపర్‌లతో ముందు 300 mm డిస్క్, వెనుకవైపు 270 mm డిస్క్ ద్వారా సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో బిగించబడి ఉంటాయి. బ్రేక్‌లు డ్యూయల్-ఛానల్ ABS ద్వారా సహాయపడతాయి. ముందు వీల్‌ 19 ఇంచెస్‌ డయామీటర్‌తో, గోవాన్ క్లాసిక్ యొక్క వెనుక చక్రం 16-ఇంచెస్‌తో వస్తుంది. అలాగే స్పోక్డ్ వీల్స్ సీట్ - 100/90-19(ముందు), 130/90-16 (వెనుక) ట్యూబ్‌లెస్ టైర్‌లతో ఉంటాయి.

ఇక దీని కొలతల విషయానికి వస్తే గోవాన్ క్లాసిక్ 2,130mm పొడవు, 825mm వెడల్పు మరియు 1,200mm పొడవు, 1,400mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కొత్త గోవాన్ మోటార్‌సైకిల్‌ పాత క్లాసిక్ 350తో పోల్చితే 15mm పొట్టిగా, 40mm వెడల్పుగా, 110mm పొడవుగా ఉంటుంది. ఇది క్లాసిక్ 350తో పోలిస్తే 10mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

Royal Enfield Goan Classic 350 Price

ఇక ఈ రెండింటి గ్రౌండ్ క్లియరెన్స్ 170mm ఒకే విధంగా ఉంటాయి. అయితే గోవాన్ క్లాసిక్ సీట్ ఎత్తు క్లాసిక్ 350 కంటే 750mm పోల్చితే 55mm తక్కువగా ఉంటుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 197 కిలోల బరువుతో వస్తుంది. ఈ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఓవరాల్‌గా లుక్స్‌, కొలతల పరంగా పొడవైన వారికి సరిపోయేలా ఉంటుంది.

రైడింగ్ ఇంప్రెషన్స్: రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 సాధారణ క్లాసిక్ 350తో పోలిస్తే కొన్ని అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది. దీని కొత్త స్టైల్ హ్యాండిల్‌బార్స్ దిగువ సీటు, ఫ్రంట్-సీట్ ఫుట్‌పెగ్‌లతో కలిపి రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తాయి. ఈ బైక్‌ సిటీ, దూర ప్రయాణాలకు సరిపోతుంది. అయితే దీని బరువు, హ్యాండిల్ బార్స్‌ పొట్టి రైడర్లకు ఇబ్బందులకు గురిచేస్తుంది.

Royal Enfield Goan Classic 350 Telugu Review

అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి తక్కువ వేరియంట్‌ని ఎంచుకోవచ్చు. ఇది కాస్త ఇబ్బందులుక ఎదుర్కొనే వారి సమస్యలను తొలగిస్తుంది. రహదారిపై, గోవాన్ క్లాసిక్ మొదటి మూడు గేర్‌లలోనే మంచి పవర్‌ అవుట్‌పుట్‌ని అందిస్తుంది. ఇక టాప్‌ గేర్‌లలోకి ప్రవేశించిన తర్వాత, పవర్ పెరిగి గోవాన్ క్లాసిక్ బరువు మీకు అంతగా అనిపించదు. అయితే ‌అధిక రేస్‌ వద్ద ఇంజిన్ నుంచి వైబ్రేషన్‌లు గమనించవచ్చు.

ఇందులోని గేర్‌బాక్స్ మృదువైనదిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది సిటీ ట్రాఫిక్‌లో సులభమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. టాప్ గేర్‌లో స్థిరమైన 40 కిమీ/గం వద్ద కూడా ఎగ్జాస్ట్ నుంచి సుపరిచితమైన సౌండ్‌ వస్తుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఔత్సాహికులను ఖచ్చితంగా ఆనందపరుస్తుంది. కావున మంచి రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పొందవచ్చు. ఇందులోని మొత్తం సస్పెన్షన్ సెటప్ మృదువుగా అనిపిస్తుంది.

Royal Enfield Goan Classic 350 Mileage

మీరు ఎక్కువ వేగంతో బంప్ లేదా రూట్ తీసుకుంటే మిమ్మల్ని సీటుపై కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. ఈ గోవాన్ క్లాసిక్ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. కఠినమైన పట్టణ రహదారుల్లో దూకుడుగా ప్రయాణిస్తుంది. ఇది మూలల వద్ద ఈజీ బ్యాలెన్సింగ్‌, హ్యాండ్లింగ్‌ను అందించడంలో సహాయపడుతుంది. గోవాన్ క్లాసిక్ ఫ్రంట్ బ్రేక్‌, వెనుక ABS ఛానల్‌ ఏక కాలంలో బైక్‌ని నిలిపివేసేందుకు సహాయపడతాయి.

చివరగా: మొత్తంమీద ఈ గోవాన్ క్లాసిక్ 350 రైడింగ్‌ ఔత్సాహికుల కోసం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ బైక్‌ మీ రైడ్‌ని అందంగా చూపిస్తుంది. అయితే దూర ప్రయాణాల్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కావున మీ స్టైల్‌ను ప్రదర్శించాలనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 మీకు మంచి ఆప్షన్‌ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 23, 2024, 20:28 [IST]
English summary
Royal enfield goan classic 350 review riding impressions specifications and features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+