రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్. ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ బ్రాండ్ ఇప్పుడు భారత మార్కెట్లో అవధులు లేకుండా వేగంగా విస్తరిస్తోంది. మార్కెట్లోకి ఎన్ని అధునాతన మోటార్‌సైకిళ్లు వచ్చినప్పటికీ, ఈ దేశీయ బ్రాండ్ భారతదేశంలో ఓ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ బ్రాండ్ పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ కూడా ఐకానిక్ బుల్లెట్ బైక్ లను విక్రయించడమే కాకుండా, వివిధ రకాల వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కొత్త విభాగాలలో కూడా ఉత్పత్తులను అందిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి తాజాగా వచ్చిన మరో కొత్త మోడల్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). చాలా మందిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అలనాటి పాతకాలపు బుల్లెట్ మోటార్‌సైకిళ్లే గుర్తుకు వస్తాయి. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త హంటర్ 350 లాంచ్ తో అలాంటి వారి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బాస్ సిద్ధార్థ్ లాల్ పేర్కొన్నట్లుగా.. సరికొత్త హంటర్ 350 బైక్ రాకతో అంతా మారిపోయింది. ఆయన ప్రకారం ఇది 'ఓల్డ్ స్కూల్ మీట్స్ న్యూ ఏజ్', అంతేకాదు కొత్త హంటర్ 350 'మాగ్జిమమ్ మోటార్‌సైకిల్ పర్ స్క్వేర్ ఇంచ్'. వీటికి నిజమైన అర్థం ఏంటో ఈ డీటేల్డ్ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల లైనప్ ఎల్లప్పుడూ రెట్రో లుక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ బ్రాండ్ ఇప్పటికీ తమ మోటార్‌సైకిళ్లలో ఓల్డ్-స్కూల్ డిజైన్ లాంగ్వేజ్ ను కొనసాగిస్తున్నప్పటికీ, ఆధునిక టెక్నాలజీతో నేటి యువతరాన్ని కూడా ఆకట్టుకుంటోంది. కొత్త హంటర్ 350 నే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. మరి ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 శతాబ్దాల నాటి మోటార్‌సైక్లింగ్ చిహ్నం కోసం నిజంగా గేమ్‌ను మారుస్తుందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త హంటర్ 350 టెస్ట్ రైడ్ చేయడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మమ్మల్ని బ్యాంకాక్ (థాయిలాండ్‌)కు ఆహ్వానించింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బుల్లెట్టు బండిని ఎక్కేద్దామా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 - డిజైన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ని టెస్ట్ రైడ్ చేయడానికి ముందుగా మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ హంటర్ 350 అనేది మీరు వినే కొత్త పేరు మాత్రమే, ఇందులోని పరికరాలన్నీ పాతవే. అఫ్‌కోర్స్.. కంపెనీ ఈ మోడల్ డిజైన్‌లో తమ నైపుణ్యాన్ని చూపినప్పటికీ, ఇందులో ఉపయోగించిన ఫ్రేమ్, విడిభాగాలు, ఫీచర్లు మరియు ఇంజన్ అన్నీ కూడా ప్రస్తుత ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోటార్‌సైకిళ్ల (క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350) నుండి సేకరించబడినవే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

కంపెనీ చెబుతున్నట్లుగా హంటర్ 350 సరికొత్త మోటార్‌సైకిల్ కావచ్చు, అయితే ఇది కొన్ని మార్పులు మినహా రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ప్రధాన డిజైన్ ఆదేశాలను అనుసరిస్తుంది. అయితే, దీని డిజైన్‌కు సంబంధించి చేసిన ఈ ట్వీక్‌లు హంటర్ 350ని మిగిలిన J-ప్లాట్‌ఫారమ్ తోబుట్టువుల నుండి ప్రత్యేకంగా నిలబడేలా చేస్తాయి. ఈ మార్పులను రాయల్ ఎన్‌ఫీల్డ్ హిప్ రెట్రో-మెట్రో బ్యూటీ అని పిలుస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

కొత్త హంటర్ 350 ఈ ఐకానిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క రెట్రో మోటార్‌సైకిల్ లో ఉండాల్సిన అన్ని సాధారణ లక్షణాలను కలిగి ఉంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్, గుండ్రటి టర్న్ ఇండికేటర్లు, గైటర్‌లతో కూడిన ఫ్రంట్ ఫోర్క్స్ మరియు పొట్టి మడ్‌గార్డ్ తో ఇది రెట్రో రూపాన్ కలిగి ఉంటుంది. అయితే, ఇందులోని 17 ఇంచ్ ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ (ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన షాడ్) హంటర్ 350 యొక్క రెట్రో లుక్‌లకు మరింత ఆధునికతను జోడిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఈ రెట్రో లుకింగ్ బైక్ కి మోడ్రన్ అప్పీల్ తెచ్చిపెట్టే మరొక అంశం, దాని స్పీడోమీటర్. ఇందులోని వృత్తాకారపు పాడ్ ఇంధన స్థాయి, ట్రిప్ మీటర్లు, ఓడోమీటర్ మరియు ప్రస్తుత సమయంతో పాటుగా రైడర్‌కు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించే LCD యూనిట్ గా ఉంటుంది. ఈ బైక్ ను కొనుగోలు చేసే యజమానులు రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌కు అనుకూలంగా ఉండే డిస్‌ప్లేను హోస్ట్ చేసే రెండవ వృత్తాకార పాడ్‌ను కూడా ఆప్షనల్ గా ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఈ రెండవ డిజిటల్ మీటర్ మీరు ఇదివరకు మీటియోర్ 350లో చూసినదే. ఈ గుండ్రటి డిజిటల్ పాడ్ మీ రైడ్ కోసం అవసరమైన టర్న్-బై-టర్న్ నావిగేషన్ ను ప్రదర్శిస్తుంది మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ యాప్ సాయంతో ఏమేమి చేయవచ్చో మీరు ఇదివరకే మీటియోర్ 350లో చూసుంటారు. ఇకపోతే, ఇందులో రెట్రో స్విచ్ గేర్ కూడా మీటియోర్ 350 నుండి నేరుగా తీసుకోబడినదే. ఇందులోని రోటరీ స్టార్టర్ స్విచ్ క్యూబ్ చాలా బాగుంది మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు తమ పరికరాలను ఛార్జ్ చేయాలని చూస్తున్న రైడర్లు మరియు మోటో వ్లాగర్ల కోసం ఇందులో USB చార్జింగ్ పోర్ట్ ఫీచర్ కూడా లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

హంటర్ 350లో చెప్పుకోవాల్సిన మరొక విలక్షణమైన డిజైన్ ఫీచర్ ఏంటంటే, దాని ఇంధన ట్యాంక్. ఇది సాంప్రదాయ టియర్ డ్రాప్ ఆకారంలో కనిపించినప్పటికీ, దానికి ఇరువైపులా ఉండే క్రీజ్ లైన్స్ రైడర్ కు మంచి థై సపోర్ట్ ను అందించేలా మరియు కదలికలో ఉన్నప్పుడు మీ మోకాళ్లను లాక్ చేయడానికి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. హంటర్ 350 సైడ్ ప్యానెల్స్ స్పీడోమీటర్ నుండి స్పూర్తి పొందిన కొత్త లోగో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ పై రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇంధన ట్యాంక్ కింది భాగంలో J సిరీస్ ఇంజన్ బ్లాక్ ఫినిషింగ్ లో ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఇక ఇందులో చెప్పుకోవాల్సిన మరొక విషయం దాని సింగిల్ పీస్ సీట్. ఈ ఒక్క సీట్ కారణంగా ఇది చూడగానే స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ గా కనిపిస్తుంది. అలాగే, దాని వెనుక భాగం కూడా గుండ్రటి లైట్లతో చాలా సింపుల్ గా, ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది. హంటర్ 350 వెనుక వైపు స్ప్లిట్ గ్రాబ్ రెయిల్‌లు ఉంటుంది, ఇది పిలియన్ రైడర్‌కు మంచి గ్రిప్ ను అందిస్తుంది. ఇందులోని సింగిల్-సిలిండర్ ఇంజన్ చేసే శబ్ధానికి కంపెనీ ఓ సరికొత్త ఎగ్జాస్ట్ నోట్ ను అందించింది. ఇది పాత డుగ్గు డుగ్గు శబ్ధం కన్నా చాలా వినసొంపుగా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 - స్పెసిఫికేషన్‌లు

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో అదే పాత 349సీసీ, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన J సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా హంటర్ 350కి సంబంధించిన యాక్సిలరేషన్ గణాంకాలను వెల్లడించనప్పటికీ, ఇది గరిష్టంగా గంటకు 114 వేగాన్ని అందుకోగలదని మాత్రం పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

హంటర్ 350 ఇప్పటికే ఈ బుల్లెట్ బ్రాండ్ నుండి వచ్చిన ఇతర J సిరీస్ 350సీసీ మోటార్‌సైకిళ్ల కంటే చాలా తేలికగా ఉంటుంది. తేలికపాటి ఛాసిస్ సెటప్ మరియు కొత్త ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌ కారణంగా ఈ కొత్త హంటర్ 350 బరువు కేవలం 181 కిలోలు మాత్రమే ఉంటుంది. దీనిని ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లతో పోల్చి చూస్తే, కొత్త హంటర్ 350 మీటియోర్ 350 కంటే 10 కిలోలు మరియు క్లాసిక్ 350 కంటే 14 కిలోలు తేలికైనదిగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్‌తో ముందువైపు 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందువైపు రెండు-పిస్టన్ కాలిపర్‌లతో కూడిన 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో కూడిన 270 మిమీ డిస్క్‌ లను కలిగి ఉంది. ఇరు వైపులా 17 ఇంచ్ లైట్ వెయిట్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌ ను కలిగి ఉంటుంది. వీటిలో ముందు చక్రం పై 110/70-17 ట్యూబ్‌లెస్ టైర్ ఉండగా, వెనుక చక్రంపై 140/70-17 వద్ద ట్యూబ్‌లెస్ టైర్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 - రైడింగ్ ఇంప్రెషన్స్

ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. అదేంటంటే, హంటర్ 350 బైక్ మీటియోర్ 350 మరియు క్లాసిక్ 350 బైక్‌ల మాదిరిగా అదే ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ దీని క్యారెక్టర్‌ఫుల్ రైడ్‌కు తగినట్లుగా ఇగ్నిషన్ మరియు ఫ్యూయల్ మ్యాపింగ్‌ను సర్దుబాటు చేసింది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ మూడు 350సీసీ మోటార్‌సైకిళ్లు ఒకే హృదయాన్ని (ఇంజన్‌ను) కలిగి ఉన్నప్పటికీ, వాటి గుండె చప్పుడు (ఇంజన్ పనితీరు) మాత్రం ఆయా మోటార్‌సైకిళ్ల క్యారెక్టర్ కు తగినట్లుగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ హంటర్ 350 ని మిడ్-రేంజ్‌లో అత్యుత్తమ పనితీరును అందించేలా ట్యూన్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ సగటున గంటకు 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో సూనాయాసంగా దూసుకుపోతుంది. ఈ స్పీడ్ రేంజ్‌లో బైక్ ఎక్కడా కూడా కష్టపడుతున్నట్లు అనిపించదు. బ్యాంకాక్ వీధుల్లో మేము రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే క్రూయిజ్ చేయగలిగాము. ఈ వేగం వద్ద బ్లాక్-అవుట్ సైలెన్సర్ పైప్ నుండి వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్ చెవులకు చాలా ఇంపుగా అనిపించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

హంటర్ 350 హ్యాండిల్ చేసే విధానం చాలా కాలంగా REలో మనం చూసిన అత్యంత ముఖ్యమైన మార్పు అని చెప్పవచ్చు. ఇది ఇకపై మీ సాధారణ రాయల్ ఎన్‌ఫీల్డ్ మాదిరిగా ఉండదు, మీరు దాన్ని చుట్టూ తిప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి ఉంటుంది. హంటర్ ఒక "స్పోర్టీ" రాయల్ ఎన్‌ఫీల్డ్. అవును మీరు చదువుతున్నది నిజమే, ఇది నిజంగానే స్పోర్టీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లంటే కేవలం లాంగ్ రైడ్స్, టూరింగ్, క్రూయిజింగ్ వంటి వాటికే కాకుండా సరదాగా సిటీ ట్రాఫిక్ లో కూడా రైడ్ చేయగలిగే బైక్స్ అని నిరూపించింది కొత్త హంటర్ 350.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

షార్ప్ స్టీరింగ్ హ్యాండ్లింగ్, చిన్న చక్రాలు, తక్కువ వీల్‌బేస్ మరియు చురుకైన ఇంజన్ కారణంగా ఇది ఇరుకైన రోడ్లలో కూడా రయ్ రయ్ మని దూసుకుపోతుంది. ఇందులోని ఫుట్ పెగ్‌లు చాలా స్పోర్టిగా ఉంటాయి మరియు మీటియోర్ తో పోలిస్తే ఎత్తులో ఉంచబడ్డాయి. ఫలితంగా, ఇది రైడర్‌కు మంచి రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. తేలికైన ఛాస్సిస్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు మరికొన్ని ప్లాస్టిక్ భాగాల కారణంగా కంపెనీ దీని బరువు పొదుపు చేయడంతో హంటర్ 350 ఇతర ఆర్ఈ బైక్‌ల కన్నా మెరుగైన మరియు మరింత ప్రతిస్పందించే హ్యాండ్లింగ్ ను అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఫ్రంట్ సస్పెన్షన్ ఓకేగా ఉంది, హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు ఇది తక్కువ ఫోర్క్ డైవ్‌ను కలిగి ఉంది. ఇకపోతే, వెనుక వైపు ఉన్న 6-స్టెప్ ప్రీలోడ్-అడ్జస్టబుల్ షాక్‌లు చాలా దృఢంగా ఉంటాయి మరియు యాక్సిలరేషన్‌లో తక్కువ ఇంపాక్ట్ ను చూపిస్తాయి. థాయ్‌లాండ్ రోడ్లు చాలా అందంగా మరియు అంతే నున్నగా ఉన్నాయి కాబట్టి, గుంతలతో నిండిన రోడ్లపై దీని సస్పెన్షన్ పనితీరు ఎలా పనిచేస్తుందో మేము పరీక్షించలేకపోయాము. అయితే, కొన్ని రోడ్ హంప్‌లపై ఈ సస్పెన్షన్ పనితీరును గమనిస్తే, ఇది ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యంగా ఉంటుందనిపించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

హంటర్ 350 బ్రేకింగ్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ఇతర RE బైక్‌లతో పోలిస్తే మెరుగైన బ్రేకింగ్ ను కలిగి ఉంది. కాకపోతే, మార్కెట్లో ఇతర స్పోర్టీ 300సీసీ బైక్‌లతో పోలిస్తే హంటర్ 350 ఇది షార్ప్ బాడీ డిజైన్ ను కలిగి ఉండదు కాబట్టి, దీని ప్రారంభ బ్రేక్ అనుభూతి కొంచెం అసౌకర్యంగానే అనిపిస్తుంది. అయితే, మీరు త్వరలోనే దీనికి అలవాటు పడిపోతారు. బైక్‌ను స్క్వేర్ అప్ చేయడానికి కొంచెం వెనుక బ్రేకింగ్ కూడా అవసరమనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఇకపోతే, కొత్త హంటర్ 350కి అమర్చిన టైర్లు రోడ్డుపై తగినంత పట్టును అందిస్తాయి. మేము బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ స్పీడ్‌వే పార్క్‌లో హంటర్‌ని పరీక్షించాము. ఈ ట్రాక్ లోని నేరుగా ఉండే రోడ్డు మరియు కార్నరింగ్స్ లో కూడా బైక్ మంచి పనితీరును కనబరించింది. అయితే, దీనిని చాలా గట్టిగా నెట్టినప్పుడు, మేము కొంత వరకూ వెనుక టైర్ జారడాన్ని గమనించాము. ఈ టైర్లు రోడ్డు కోసం ఉద్దేశించినవి కాబట్టి, ట్రాక్ పై ఇలా జరగడం సాధారణమైన విషయమే. హంటర్ 350లో మేము గమనించిన మరొక విషయం, ఇది ఇతర ఆర్ఈ బైక్‌ల కన్నా చాలా తక్కువ వైబ్రేషన్ కలిగి ఉండటం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 - ప్లస్‌లు, మైనస్‌లు

• దీని స్పీడోమీటర్‌పై రీడింగ్‌లను చదవడం సులభం మరియు రాత్రి రైడ్‌ల కోసం ఇది చక్కగా వెలుగుతూ కనిపిస్తుంది.

• దీని 800 మిమీ సీట్ హైట్ కారణంగా, కాస్తంత పొట్టిగా ఉండే రైడర్లు కూడా దీనిని సులువుగా హ్యాండిల్ చేయగలరు.

• ఇది రైడ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది మరియు వేగం మరియు మూలల్లో మంచి హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది.

• దీని ఛాస్సిస్ బాగా ట్యూన్ చేయబడింది మరియు హార్డ్ బ్రేకింగ్ కింద సస్పెన్షన్ డైవ్ కాదు.

• హంటర్ 350 మిడ్-రేంజ్‌లో మరియు వేగాన్ని పెంచుతున్నప్పుడు ఎగ్జాస్ట్ నోట్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది.

• రివ్-కౌంటర్ చేర్చబడి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం.

• పనితీరు కోరుకునే వారు ఈ ఇంజన్ ఇంకొంచెం ఎక్కువ శక్తిని ఇష్టపడతారు.

• మీరు ఫ్యూయల్ ట్యాంక్‌కు దగ్గరగా కూర్చుని రైడింగ్ చేసే స్టైల్‌ని కలిగి ఉంటే, మీరు కొంత ట్యాంక్ వైబ్రేషన్ ఫీల్ అవుతారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

అదంతా సరే.. చివరిగా ఏం చెబుతారు..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ రెట్రో మోటార్‌సైకిల్ అనే కంఫర్ట్ జోన్ కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి, నేటి యువత కోరుకునే స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను ఈ హంటర్ 350 ద్వారా అందించిందని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ బ్రాండ్ నుండి మీరు ఇప్పటి వరకూ ఇలాంటి స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను రైడ్ చేసి ఉండరనేది మా అభిప్రాయం. హంటర్ 350 ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీ అభిప్రాయం కూడా దాదాపుగా ఇలానే ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్ట్ రైడ్ రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండిలో అంత సత్తా ఉందంటారా..?

ఇక ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభించే టాప్-ఎండ్ స్కూటర్ కన్నా మరియు అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ల కన్నా కూడా సరసమైన ప్రైస్ ట్యాగ్‌తోనే హంటర్ 350 మార్కెట్లోకి వచ్చింది. దీని బేస్ రెట్రో వేరియంట్ ధర రూ. 1.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ బేస్ వేరియంట్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు ఎల్ఈడి టైల్‌లైట్‌ను కోల్పోతుంది. ఇవన్నీ కావాలనుకుంటే, రైడర్లు హంటర్ 350 లో మెట్రో అనే వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ మెట్రో వేరియంట్ ధర రూ.1.64 లక్షల వద్ద కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Royal enfield hunter 350 test ride review design specs features and first ride impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X