సుజుకి జిక్సర్ మరియు కాంపిటీటర్స్: కంపారిజన్

By Ravi

పెర్ఫార్మెన్స్‌తో పాటుగా స్టయిలిష్ రైడ్ కోరుకునే యువత ప్రస్తుతం 150సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే పలు ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ వివిధ ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా, జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, 150సీసీ సెగ్మెంట్లో తమ సరికొత్త మోటార్‌సైకిల్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను ప్రవేశపెట్టింది.

కేవలం రూ. 72,199 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే సుజుకి తమ జిక్సర్ 150సీసీ బైక్‌ను విక్రయిస్తోంది. సుజుకి జిక్సర్ మోటార్‌‌సైకిల్ రాకతో 150సీసీ బైక్ సెగ్మెంట్లో పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఈ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ డిటిఎస్ఐ 150, హోండా సిబి ట్రిగ్గర్ మరియు యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 మోడళ్లు ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ 150సీసీ మోటార్‌సైకిళ్లుగా ఉన్నాయి.

ఈ కథనంలో మనం సుజుకి జిక్సర్ 150 మోటార్‌సైకిల్‌తో బజాజ్ పల్సర్ డిటిఎస్ఐ 150, హోండా సిబి ట్రిగ్గర్ మరియు యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 మోటార్‌సైకిళ్లను పోల్చి చూద్దాం రండి.

సుజుకి జిక్సర్ కాంపిటీటర్స్

తర్వాతి స్లైడ్‌లలో సుజుకి జిక్సర్ 150, బజాజ్ పల్సర్ డిటిఎస్ఐ 150, హోండా సిబి ట్రిగ్గర్ మరియు యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0 మోటార్‌సైకిళ్ల కంపారిజన్‌ను చూడండి.

సుజుకి జిక్సర్ కాంపిటీటర్స్

ఈ నాలుగు 150సీసీ మోటార్‌సైకిళ్ల ఇంజన్ పవర్, పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్‌ను గమనిస్తే, వీటిలో జిక్సర్ ఇంజన్ కెపాసిటీ (155సీసీ) మిగిలిన మూడు మోటార్‌సైకిళ్ల కన్నా అదనం. వీటి పవర్ డిటేల్స్ ఇలా ఉన్నాయి:

* సుజుకి జిక్సర్ - 14.6 బిహెచ్‌‌పి @ 8000 ఆర్‌పిఎమ్

* బజాజ్ పల్సర్ - 14.9 బిహెచ్‌‌పి @ 9000 ఆర్‌పిఎమ్

* హోండా సిబి ట్రిగ్గర్ - 14.0 బిహెచ్‌‌పి @ 8500 ఆర్‌పిఎమ్

* యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వి2.0 - 12.9 బిహెచ్‌‌పి @ 8000 ఆర్‌పిఎమ్

(తర్వాతి స్లైడ్‌లో టార్క్ వివరాలు తెలుసుకోండి)

సుజుకి జిక్సర్ కాంపిటీటర్స్

టార్క్ విషయంలో సుజుకి జిక్సర్ ఈ మూడు మోటార్‌సైకిళ్ల కన్నా బెస్ట్ అని చెప్పవచ్చు. వీటి టార్క్ వివరాలు ఇలా ఉన్నాయి:

* సుజుకి జిక్సర్ - 1.42 కెజిఎమ్ @ 6000 ఆర్‌పిఎమ్

* బజాజ్ పల్సర్ - 1.27 కెజిఎమ్ @ 6500 ఆర్‌పిఎమ్

* హోండా సిబి ట్రిగ్గర్ - 1.27 కెజిఎమ్ @ 6500 ఆర్‌పిఎమ్

* యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వి2.0 - 1.30 కెజిఎమ్ @ 6000 ఆర్‌పిఎమ్

(పైన తెలిపిన 150సీసీ బైక్స్ అన్నీ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి)

సుజుకి జిక్సర్ కాంపిటీటర్స్

సస్పెన్షన్

* సుజుకి జిక్సర్ - టెలిస్కోపిక్ (ఫ్రంట్), మోనోషాక్ (రియర్)

* బజాజ్ పల్సర్ - టెలిస్కోపిక్ (ఫ్రంట్), అడ్జస్టబల్ (రియర్)

* హోండా సిబి ట్రిగ్గర్ - టెలిస్కోపిక్ (ఫ్రంట్), మోనోషాక్ (రియర్)

* యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వి2.0 - టెలిస్కోపిక్ (ఫ్రంట్), మోనోషాక్ (రియర్)

సుజుకి జిక్సర్ కాంపిటీటర్స్

ధరలు

* సుజుకి జిక్సర్ - రూ.81,900

* బజాజ్ పల్సర్ - రూ.75,055

* హోండా సిబి ట్రిగ్గర్ - రూ.75,600

* యమహా ఎఫ్‌జెడ్-ఎస్ వి2.0 - రూ.87,618

(అన్ని ధరలు ఆన్-రోడ్, పూనే)

Most Read Articles

English summary
Suzuki Motorcycle India has recently launched their new 150cc motorcycle Gixxer. Lets compare the Suzuki Gixxer with Bajaj Pulsar 150 DTS-i, Honda CB Trigger and the new Yamaha FZ-S V2.0.
Story first published: Wednesday, September 10, 2014, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X