టాప్ 6 బెస్ట్ 125సీసీ మైలేజ్ బైక్స్: కంపారిజన్

By Ravi

మోటార్‌సైకిల్ వినియోగదారుల్లో ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పెర్ఫార్మెన్స్ బైక్‌లంటే ఇష్టం, మరికొందరికి మంచి స్టయిలిష్ బైక్‌లంటే ఇష్టం, ఇంకొందరికి ఎక్కువ మైలేజీనిచ్చే బైక్‌లంటే ఇష్టం. ఇవి మూడు కలగలిపిన బైక్ కావాలంటే మీకు చక్కటి ఆప్షన్ 125సీసీ బైక్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: బెస్ట్ 100-110సీసీ బైక్స్
ప్రస్తుతం మన టూవీలర్ మార్కెట్లో వివిధ కంపెనీల నుంచి అనేక రకాల 125సీసీ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈనాటి మన కంపారిజన్ శీర్షికలో అధిక మైలేజీనిస్తూ, సరసమైన ధరకే అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ స్టయిలిష్ 125సీసీ బైక్స్ గురించి తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: బెస్ట్ 150సీసీ బైక్స్
మోటార్‌సైకిళ్లలో 125సీసీ సెగ్మెంట్ బైక్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి హోండా, బజాజ్, టీవీఎస్ వంటి బ్రాండ్‌లే. దాదాపుగా అన్ని ద్విచక్ర కంపెనీలు ఈ విభాగంలో ఉత్పత్తులను అందిస్తున్నాయి. మరి వీటిలో మంచి మైలేజీనిచ్చే 125సీసీ బైక్‌ ఏదో పరిశీలించండి.

ఇది కూడా చదవండి: బెస్ట్ 200-250సీసీ బైక్స్
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాప్ 6 బెస్ట్ 125సీసీ మైలేజ్ బైక్స్

తర్వాతి స్లైడ్‌లలో బెస్ట్ 125సీసీ బైక్స్ సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

హోండా సిబి షైన్

హోండా సిబి షైన్

హోండా టూవీలర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో మొత్తం రెండు 125సీసీ బైక్స్ (సిబి షైన్, సిబిఎఫ్ స్టన్నర్) ఉన్నాయి. ఇందులో సిబి షైన్ అత్యంత పాపులర్ అయిన మోడల్. సిబిఎఫ్ స్టన్నర్ స్టయిల్, పెర్ఫార్మెన్స్‌ల విషయంలో మాత్రమే బెస్ట్ అనిపించుకుంటుంది. కానీ సిబి షైన్ మాత్రం అన్ని విభాగాల్లోను బెస్ట్‌గా నిలుస్తుంది. 125సీసీ సెగ్మెంట్లో చాలా మంది మొదటి ఎంపిక హోండా సిబి షైన్ అనే చెప్పొచ్చు.

హోండా సిబి షైన్

హోండా సిబి షైన్

ఇంజన్: 124.7సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్

పవర్: 10.12 బిహెచ్‌పి @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్: 10.54 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)

మైలేజ్: 65 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 10.5 లీటర్లు

బరువు: 120 కేజీలు

ధర: రూ.52,063 - రూ.59,243 (ఆన్-రోడ్, ఢిల్లీ)

బజాజ్ డిస్కవర్ 125 ఎమ్

బజాజ్ డిస్కవర్ 125 ఎమ్

కొత్తగా వచ్చిన రిఫ్రెష్డ్ బజాజ్ డిస్కవర్ 125 (డిస్కవర్ 125ఎమ్ వేరియంట్) కూడా ఓ ఉత్తమ 125సీసీ బైక్‌గా పరిగణించవచ్చు. ఇతర డిస్తవర్ వేరియంట్లతో పోల్చితే ఈ కొత్త డిస్కవర్ 125ఎమ్ వేరియంట్‍‌లో డిజైన్ పరంగా పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, ఇది స్టయిలిష్‌గానే ఉంటుంది. 125సీసీ సెగ్మెంట్లో అత్యధిక మైలేజీనిస్తూ, పెర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత సరసమైన ధరకే లభ్యమయ్యే బైక్ ఇది. ఈ బైక్ మంచి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

బజాజ్ డిస్కవర్ 125 ఎమ్

బజాజ్ డిస్కవర్ 125 ఎమ్

ఇంజన్: 124.6సీసీ, సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, డిటిఎస్-ఐ (విత్ ఎగ్జాస్‌టెక్)

పవర్: 11.5 బిహెచ్‌పి @ 8000 ఆర్‌పిఎమ్

టార్క్: 10.8 ఎన్ఎమ్ @ 6000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్: 4-స్పీడ్ (1-N-2-3-4)

మైలేజ్: 76 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 9.5 లీటర్లు

బరువు: 118 కేజీలు

ధర: రూ.48,500 - రూ.50,499 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హీరో గ్లామర్ ఎఫ్ఐ

హీరో గ్లామర్ ఎఫ్ఐ

హీరో మోటోకార్ప్ అందిస్తున్న గ్లామర్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వెర్షన్లలో (స్టాండర్డ్, ఫ్యూయెల్ ఇంజెక్షన్) లభిస్తుంది. ఇందులో ఫ్యూయెల్ ఇంజన్ వెర్షన్ అత్యతం పాపులర్ మోడల్. ఎందుకంటే, ఇది సెగ్మెంట్లో కెల్లా గరిష్ట మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది కాబట్టి. కానీ దీని ధర కూడా సెగ్మెంట్లో కెల్లా అధికంగానే ఉంటుంది. హీరో మోటోకార్ప్ ఇటీవలే ఇందులో రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్‌తో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. విశ్వసనీయమైన బ్రాండ్, బెస్ట్ మైలేజ్ కావాలనుకుంటే, గ్లామర్ ఎఫ్ఐను ఎంచుకోవచ్చు.

హీరో గ్లామర్ ఎఫ్ఐ

హీరో గ్లామర్ ఎఫ్ఐ

ఇంజన్: 124.8సీసీ, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఎస్ఓహెచ్‌సి

పవర్: 9.1 బిహెచ్‌పి @ 7000 ఆర్‌పిఎమ్

టార్క్: 10.35 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)

మైలేజ్: 81.1 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 12 లీటర్లు

బరువు: 129 కేజీలు

ధర: రూ.58,700 - రూ.62,750 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

టీవీఎస్ ఫినిక్స్

టీవీఎస్ ఫినిక్స్

టీవీఎస్ తమ ఫినిక్స్‌ను ఓ ప్రీమియం మోటార్‌సైకిల్ అని చెబుతుంది. అపాచే నుంచి స్ఫూర్తి పొందిన ఎల్ఈడి గైడ్ ల్యాంప్స్, ఆల్-డిజిటల్ స్పీడోమీటర్ వంటి పలు ఫీచర్లతో ఇది లభిస్తుంది. బడ్జెట్‌ ధరకే ఎగ్జిక్యూటివ్ రైడ్ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. సాధారణంగా టీవీఎస్ మోటార్‌సైకిళ్లు మైలేజ్‌కు పెట్టింది పేరు. ఇవి తక్కువ బరువును కలిగి ఉండి, మంచి హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తాయి. టీవీఎస్ ఫినిక్స్‌ను కూడా కంపెనీ ఇదే కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేసింది. టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్.

టీవీఎస్ ఫినిక్స్

టీవీఎస్ ఫినిక్స్

ఇంజన్: 124.5సీసీ ఈకోథ్రస్ట్

పవర్: 11 హెచ్‌పి @ 8000 ఆర్‌పిఎమ్

టార్క్: 10.8 ఎన్ఎమ్ @ 6000 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్: 4-స్పీడ్ (N-1-2-3-4)

మైలేజ్: 67 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 12 లీటర్లు

బరువు: 116 కేజీలు

ధర: రూ.49,850 - రూ.52,190 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

యమహా ఎస్ఎస్ 125

యమహా ఎస్ఎస్ 125

125సీసీ బైక్ విభాగంలో పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ బైక్ కావాలంటే యమహా బ్రాండ్‌ను ఎంచుకోవచ్చు. గతంలో ఆర్ఎక్స్ సిరీస్ బైక్‌లు ఉపయోగించిన వారిలో అనేక మంది ఇప్పుడు ఎస్ఎస్125ను ఉపయోగిస్తున్నవారే. స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చే యమహా ఎస్ఎస్125 బైక్ 5-స్పీడ్ గేర్‌బాకస్‌తో షార్ట్ గేర్ రేషియోతోను కలిగి ఉంటుంది. అంటే, దీని అర్థం ఇది క్విక్ యాక్సిలరేషన్‌‌ను కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ఎకానమీలో రాజీపడకుండా, సిటీలో ఫన్ టూ రైడ్ బైక్ కోరుకునే వారికి ఇదొక చక్కటి ఆప్షన్.

యమహా ఎస్ఎస్ 125

యమహా ఎస్ఎస్ 125

ఇంజన్: 123సీసీ, ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి

పవర్: 11 హెచ్‌పి @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్: 10.4 ఎన్ఎమ్ @ 6500 ఆర్‌పిఎమ్

గేర్‌బాక్స్: 5-స్పీడ్ (1-N-2-3-4-5)

మైలేజ్: 75 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 13.6 లీటర్లు

బరువు: 125 కేజీలు

ధర: రూ.57,100 - రూ.64,642 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ 125సీసీ సెగ్మెంట్లో రాణించడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. మొదట్లో సుజుకి స్లింగ్‌షాట్ పేరిట ఓ బైక్‌ను విడుదల చేసింది. అయితే, ఆశించిన రీతిలో విజయం సాధించకపోవటంతో, సుజుకి స్లింగ్ ప్లస్ పేరిట మరింత రీఫైన్డ్ ఇండన్, స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉండేలా ఈ బైక్‌ను ప్రవేశఫెట్టింది. సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ బైక్ డిజైన్ మరింత స్పోర్టీగా, స్టయిలిష్‌గా ఉంటుంది. ఈ సెగ్మెంట్లోని ఇతర 125సీసీ మోటార్‌‍సైకిళ్లతో పోల్చుకుంటే, దీని పవర్ మాత్రం కొంచెం తక్కువగా అనిపిస్తుంది.

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

సుజుకి స్లింగ్‌షాట్ ప్లస్ 125

ఇంజన్: 124సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి

పవర్: 8.8 హెచ్‌పి @ 7500 ఆర్‌పిఎమ్

టార్క్: 10 ఎన్ఎమ్

గేర్‌బాక్స్: 5-స్పీడ్ (1-N-2-3-4-5)

మైలేజ్: 75 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 12 లీటర్లు

బరువు: 129 కేజీలు

ధర: రూ.56,352 - రూ.58,077 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చివరిమాట

చివరిమాట

ఇవన్నీ కూడా టాప్ బ్రాండ్ టూవీలర్ కంపెనీల నుంచి లభిస్తున్న బెస్ట్ సెల్లింగ్ 125సీసీ బైక్స్. ఈ కథనంలో చెప్పుకున్న మోడళ్లన్నీ కూడా దాదాపుగా ఇటు పెర్ఫార్మెన్స్‌తో అటు మైలేజీలోను బెస్ట్‌గా ఉన్నాయి. అంతేకాకుండా, రెగ్యులర్ అండ్ బోరింగ్ 100-110సీసీ బైక్‌లు కాకుండా కాస్తంత ప్రీమియంగా, స్టయిలిష్‌గా, స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి ఈ 125సీసీ బైక్స్ ఎల్లప్పుడూ మంచి ఛాయిస్‌గా ఉంటాయి.

అయితే, ప్రత్యేకించి ఈ ఆరు 125సీసీ మోటార్‌సైకిళ్లలో ఏది బెస్ట్ అని అడిగితే మాత్రమే బజాజ్ డిస్కవర్ 125ఎమ్ అని చెప్పొచ్చు. పవర్, మైలేజ్, పెర్ఫార్మెన్స్, డిజైన్, ధర, బ్రాండ్, మెయింటినెన్స్ ఇలా అనేక కోణాల్లో బజాజ్ డిస్కవర్ 125ఎమ్ ఇతర మోడళ్ల కన్నా ఉత్తమంగా ఉంటుంది. మరి ఇందులో మీకు నచ్చిన బెస్ట్ 125సీసీ బైక్ ఏది?


More from DriveSpark

Article Published On: Friday, May 16, 2014, 16:51 [IST]
English summary
These are two-wheelers which are neither purely mileage oriented and neither are they considered premium. Motorcycles belonging to the 125cc segment cater to those who want to strike a balance between fuel economy, style and decent performance. The following is a list of some of the best motorcycles belonging to the 125cc segment, one from each manufacturer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+