భారత్‌లో లభిస్తున్న టాప్ బెస్ట్ 200సీసీ-250సీసీ బైక్స్
మీరు తక్కువ బడ్జెట్‌లో హై పెర్ఫామెన్స్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? కానీ, సరైన మోడల్‌ను ఎంచుకోవటంలో తికమక పడుతున్నారా..? అయితే, కంగారుపడకండి.. ఈ కథనంలో, మేము భారత్‌లో లభిస్తున్న ఉత్తమ 200సీసీ-250సీసీ బైక్‌ల గురించి తెలియజేస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన, మీ ఫేవరేట్ బైక్‌ను ఎంచుకోండి.
ఇటీవలి కాలంలో, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సరికొత్త మోడళ్ల రాకతో పోటీ జోరందుకుంది. స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఒకప్పుడు పల్సర్, కరిజ్మా మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే, ఇప్పుడు అనేక కొత్త హై-పెర్ఫామెన్స్ బైక్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బెస్ట్ బైక్‌లు ఏవో ఓ లుక్కేద్దాం రండి..!

బజాజ్ పల్సర్ 200ఎఫ్
ధర - రూ.84,055 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
సగటు మైలేజ్ - 45 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 15 లీటర్లు
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 220సీసీ
పవర్ & టార్క్ - 21.05 పిఎస్ & 19.12 ఎన్ఎమ్
గరిష్ట వేగం - 135 కెఎమ్‌పిహెచ్

బజాజ్ పల్సర్ 200ఎఫ్
బజాజ్ పల్సర్ 220ఎఫ్ ఒకప్పుడు భారతదేశపు అత్యంత వేగవంతమైన బైక్. ఇది కార్బురేటర్ బేస్డ్ ఫ్యూయెల్ డెలివరీ సిస్టమ్ కలిగి ఉన్నప్పటికీ, ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగి కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌ను పెర్ఫామెన్స్ పరంగా ఇది ఓవర్‌టేక్ చేసేది. అయితే, ఇప్పుడు పల్సర్ 220ఎఫ్ అవుట్‌డేటెడ్ మోడల్ అయిపోయింది.

హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్
ధర - సుమారు రూ.1 లక్షకు పైగా (ఆన్ రోడ్)
సగటు మైలేజ్ - 40 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 16 లీటర్లు
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 223సీసీ
పవర్ & టార్క్ - 17.6 హెచ్‌పి & 18.35 ఎన్ఎమ్
గరిష్ట వేగం - 130 కెఎమ్‌పిహెచ్

హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్
కరిజ్మా ఆర్ బైక్‌కు ఫుల్లీ ఫెయిర్డ్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా కరిజ్మా జెడ్ఎమ్ఆర్ సెప్టెంబర్ 2009లో భారత మార్కెట్లో విడుదలైంది. దీని స్పోర్ట్స్ బైక్ స్టయిలింగ్ ప్రధానంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. పెర్ఫామెన్స్ పరంగా ఇది పల్సర్ 220ఎఫ్ కన్నా కాస్తంత తక్కువగానే ఉంటుంది. అయితే, సుపీరియర్ హ్యాండ్లింగ్ మరియు టూరింగ్ అంశాల్లో మాత్రం పల్సర్ 220ఎఫ్ కన్నా బెటర్‌గా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్
ధర - సుమారు రూ.85,706 (ఎక్స్-షోరూమ్)
సగటు మైలేజ్ - 35 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 199.5సీసీ
పవర్ & టార్క్ - 23.52 హెచ్‌పి & 18.3 ఎన్ఎమ్
గరిష్ట వేగం - 135 కెఎమ్‌పిహెచ్

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్
బజాజ్ నుంచి లభిస్తున్న అత్యంత అధునాతన బైక్ ఇది. కెటిఎమ్ డ్యూక్200లో ఉపయోగించిన ఇంజన్‌ను కొత్తగా ట్యూన్ చేసి ఇందులో ఉపయోగించారు. డిజైన్, స్టయిల్ పరంగా ఇది ఆకట్టుకున్నంతగా, మైలేజ్ విషయంలో ఆకట్టుకోలేకపోతుంది. కెటిఎమ్ డ్యూక్200 మీ బడ్జెట్‌లో లేకపోయినట్లయితే, అదే పెర్ఫామెన్స్‌తో కూడిన పల్సర్ 200ఎన్ఎస్ మీకు చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు.

కెటిఎమ్ డ్యూక్200
ధర - సుమారు రూ.1.5 లక్షలు (ఆన్-రోడ్)
సగటు మైలేజ్ - 30 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 199.5సీసీ
పవర్ & టార్క్ - 25 హెచ్‌పి & 19.2 ఎన్ఎమ్
గరిష్ట వేగం - 135 కెఎమ్‌పిహెచ్

కెటిఎమ్ డ్యూక్200
కెటిఎమ్ డ్యూక్ 200 కేవలం 9.01 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

హోండా సిబిఆర్250ఆర్
ధర - సుమారు రూ.1.73 లక్షలు (నాన్-ఏబిఎస్, ఆన్-రోడ్)
ధర - సుమారు రూ.2.04 లక్షలు (ఏబిఎస్, ఆన్-రోడ్)
సగటు మైలేజ్ - 25-30 కెఎమ్‌పిఎల్
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 249.6సీసీ
పవర్ & టార్క్ - 26 హెచ్‌పి & 22.9 ఎన్ఎమ్
గరిష్ట వేగం - 140 కెఎమ్‌పిహెచ్

హోండా సిబిఆర్250ఆర్
భారత మార్కెట్ నుంచి కవాసకి నిన్జా 250ఆర్ బైక్ తొలగిపోయిన తర్వాత, ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఫుల్లీ ఫెయిర్డ్ క్వార్టర్ లీటర్ జపనీస్ బైక్‌గా హోండా సిబిఆర్25ఆర్ మాత్రమే మిగిలింది. ఇందులో హై-పెర్ఫామెన్స్‌నిచ్చే నాణ్యమైన హోండా ఇంజన్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)లు విశిష్టమైనవి.


Click it and Unblock the Notifications








