Triumph Scrambler 400 X 398 సీసీ ఇంజిన్‌, తక్కువ ధరలో వచ్చేసిన ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400 X బైక్‌ ఫుల్‌ రివ్యూ

బజాజ్‌ సహకారంతో బ్రిటీష్‌ మోటార్‌సైకిల్‌ తయారీదారు ట్రయంఫ్‌, గత జూన్‌లో స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400X పేరిట రెండు కొత్త బైక్‌లను పరిచయం చేసింది. ఇప్పుడు స్క్రాంబ్లర్ 400X గురించి తెలుసుకోబోతున్నాం.

లాంచ్‌ సమయంలో ట్రయంఫ్‌.. స్పీడ్‌ 400 ధర, వివరాలను వెల్లడించగా స్క్రాంబ్లర్‌ 400 X బైక్‌ ధరను మాత్రం రివీల్‌ చేయలేదు. ఇటీవల కాలంలో ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మన ముందుకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కొత్త స్క్రాంబ్లర్‌ 400 X(Triumph Scrambler 400 X)ను పూణెలో టెస్ట్‌ రైడ్‌ చేసేందుకు మా డ్రైవ్‌ స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది.

Triumph-Scrambler-400-X

ట్రయంఫ్‌ నుంచి విడుదలైన స్క్రాంబ్లర్‌ 400X అత్యంత మోటార్ సైకిల్‌.. ఈ బైక్‌ టెస్ట్‌ రైడ్‌ సమయంలో మేము చాలా విషయాలు గమనించాము. ఆ ఆసక్తికర సమాచారం అంటే ఈ బైక్‌ డిజైన్‌, పర్ఫామెన్స్‌, లుక్‌, ఫీచర్లు తదితర పూర్తి వివరాలను ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

స్క్రాంబ్లర్‌ 400 X డిజైన్ పరంగా కొన్ని విషయాల్లో స్పీడ్‌ 400ను పోలి ఉంటుంది. ఈ బైక్‌ను ఆఫ్‌ రోడ్‌కు సపోర్ట్‌గా ఉండేలా డిజైన్‌ చేశారు. ఇందులో LED లైటింగ్ సెటప్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్, బ్లాక్ పౌడర్-కోటెడ్ ఇంజన్ కేసింగ్‌లు, గోల్డ్ యానోడైజ్డ్ ఫ్రంట్ ఫోర్క్‌లు, ఆకర్షణీయంగా ఫ్యూయల్ ట్యాంక్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇవి దాదాపుగా రెండు బైకుల్లో సేమ్‌ ఉంటాయి.

Triumph-Scrambler-400-X

అదనంగా స్క్రాంబ్లర్ 400 X హెడ్‌లైట్ గ్రిల్, సంప్, రేడియేటర్ ప్రొటెక్టర్లు, హ్యాండిల్ బార్ బ్రేస్ ప్యాడ్, హ్యాండ్‌గార్డ్‌లతో వస్తుంది. సీటు స్ప్లిట్ సీట్ యూనిట్, ఫుట్‌పెగ్‌లు రిమూవబుల్‌ రబ్బరు ఇన్‌సర్ట్‌లతో పాటు స్పీడ్ 400లోని నార్మల్‌ సింగిల్ క్యాన్‌తో పోలిస్తే ఇందులో ఎగ్జాస్ట్ డబుల్ బారెల్ యూనిట్ ఉంది.

Speed 400 బైక్‌ మాదిరిగానే Scrambler 400 X స్విచబుల్‌ ట్రాక్షన్ కంట్రోల్, టార్క్-అసిస్ట్ క్లచ్, బాష్ డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌, స్టీరింగ్ లాక్, యాంటీ-థెఫ్ట్ ఇమ్మొబిలైజర్‌ను స్టాండర్డ్‌ ఫీచర్లుగా చూడవచ్చు. స్క్రాంబ్లర్ 400 X లో ఆఫ్-పిస్ట్ అడ్వెంచర్‌ల సమయంలో వెనుకవైపు ఉన్న ABSను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు.

Triumph-Scrambler-400-X

ఇక ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X మూడు కలర్స్‌ ఆప్షన్స్‌లో ఫ్యూయల్ ట్యాంక్‌పై సెకండరీ కలర్ స్ట్రిప్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఫ్యూజన్ వైట్‌తో మ్యాట్ ఖాఖీ గ్రీన్, సిల్వర్ ఐస్‌తో ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లాక్‌తో కార్నివాల్ రెడ్ కలర్ ఆప్షన్‌లను ట్రయంఫ్‌ ప్రవేశపెట్టింది.

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే ట్రయంఫ్ స్పీడ్‌ 400 బైక్‌ తర్వాత కొత్త TR ఇంజిన్‌ను ఉపయోగించిన రెండవ మోటార్‌ సైకిల్‌ స్క్రాంబ్లర్‌ 400 X. ఇందులో 398cc, లిక్విడ్-కూల్డ్ మరియు ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ను అమర్చారు. స్పీడ్‌ 400 మాదిరిగానే ఇందులో సింగిల్-సిలిండర్ పవర్‌ప్లాంట్ అవుట్‌పుట్ ఉంటుంది.

Triumph-Scrambler-400-X

స్క్రాంబ్లర్‌ 400 X లో DOHC ఇంజిన్ 8,000rpm వద్ద 39.5bhpని, 6,500rpm వద్ద 37.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడుతుంది. దీని ద్వారా బైక్ కుడి వైపున ఉండే చైన్ డ్రైవ్ సెటప్ ద్వారా పవర్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

సస్పెన్షన్‌ సెటప్‌ను పరిశీలిస్తే.. స్పీడ్ 400 మాదిరిగానే స్క్రాంబ్లర్ 400 X కూడా అదే ఛాసిస్ సెటప్‌ను కలిగి ఉంది. రెండింటిలోనూ ఒకేలా సస్పెన్షన్‌ సెటప్‌ను కలిగి ఉండగా.. స్క్రాంబ్లర్ 400 X మాత్రం వేగం విషయంలో కొంచెం ముందు ఉంటుందనే చెప్పవచ్చు. ఇందులో స్పోర్ట్స్ 43mm USD ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు ట్విన్-సైడ్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌తో అడ్జస్టబుల్‌ (ప్రీలోడ్) మోనోషాక్‌ను కలిగి ఉంది.

Triumph-Scrambler-400-X

స్క్రాంబ్లర్ 400 X ముందు మరియు వెనుకవైపు 150mm వీల్‌ను కలిగి ఉంది. స్పీడ్ 400తో పోల్చితే ఇందులో ముందువైపు 10mm, వెనుకవైపు 20mm డైమెన్షన్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో అస్థిరమైన 10-స్పోక్ అల్యూమినియం అల్లాయ్ వీల్ సెటప్‌ను కూడా చూడవచ్చు.

స్క్రాంబ్లర్ 400 X కూడా స్పీడ్‌ 400 మాదిరిగానే కొంచెం భిన్నమైన బ్రేకింగ్ సెటప్‌ను కలిగి ఉందనే చెప్పవచ్చు. ఇందులో ముందు భాగంలో నాలుగు-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన 320mm డిస్క్ మరియు వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలపర్‌తో 230mm డిస్క్‌ను కలిగి ఉంది.

Triumph-Scrambler-400-X

ఇక వీల్స్‌ డైమెన్షన్స్‌ను అనంతరం స్క్రాంబ్లర్ 400 X లో సీటు ఎత్తు 835mm, 13-లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్, 185 కిలోల వెట్ వెయిట్ మరియు 16,000 కిలోమీటర్లు లేదా 12 నెలల సర్వీస్ విరామం ఫీచర్లను ట్రయంఫ్‌ అందించింది. దాదాపుగా ఇంజిన్‌ కూడా స్పీడ్‌ 400 మాదిరిగానే చూడవచ్చు.

ఇక టెస్ట్‌ రైడ్‌లో మేము గమనించిందేమంటే.. ఇంజిన్ 10,000rpm యొక్క రెడ్‌లైన్‌తో ఫ్రీ-రివ్‌వింగ్‌గా, చాలా ట్రాక్టబుల్‌గా ఉంది. 398cc సింగిల్ సిలిండర్‌ ద్వారా మూడవ గేర్‌లో 25 km/h వేగంతో నిటారుగా పైకి లేపవచ్చు. స్మూత్ షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో కలిపి ఈ బైక్‌ 3 అంకెల వేగంతో దూసుకుపోతుంది.

Triumph-Scrambler-400-X

స్క్రాంబ్లర్ 400 X సస్పెన్షన్ సెటప్‌ ద్వారా ఇందులో అమర్చిన MRF డ్యూయల్-పర్పస్ టైర్‌లతో కఠినమైన రోడ్లపై సైతం ఈజీగా రైడ్‌ చేయవచ్చు. ఇంకా రోడ్డుపై టర్నింగ్‌లను తీసుకోవడం కూడా పెద్ద కష్టంగా అనిపించదు. స్క్రాంబ్లర్ 400 X లో హై-స్లంగ్ సీటుపై రైడింగ్ పొజిషన్ చాలా నిటారుగా ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ పరిస్థితులలో రైడర్‌కు ఉపయోగపడుతుంది.

దీని ద్వారా ఘాట్‌ రోడ్లు, గుంతలు లాంటివి ఉన్న రోడ్లపై ప్రయాణించేటప్పుడు.. మీకు అసౌకర్యంగా అనిపించదు. అయితే స్క్రాంబ్లర్ 400 Xలో బ్రేకుల విషయంలో కొంచెం ఎక్కువ డైన్ ట్యూనింగ్ అవసరమని మేము భావిస్తున్నాం. ఇది హార్డ్ బ్రేకింగ్‌ల సమయంలో కొంచెం స్పాంజిగా అనిపించవచ్చు. కానీ గట్టిగా బ్రేకింగ్ చేసినప్పుడు ఫ్రంట్ వీల్ లాక్ అవ్వడం కూడా మీకు పెద్దగా యూజ్‌ అవ్వదు.

Triumph-Scrambler-400-X

చివరిగా ట్రయంఫ్‌ అభిమానులు, ఆఫ్‌- పిస్ట్‌ అడ్వెంచర్స్‌ చేయాలనుకునేవారికి స్క్రాంబ్లర్ 400 X మంచి అనుభూతిని ఇస్తుంది. స్పీడ్‌ 400తో పోలిస్తే ఈ బైక్‌ ధర రూ. 30,000 మాత్రమే ఎక్కువ. డ్యూయల్‌ ఛానల్‌ ABS సిస్టమ్‌తో వస్తున్న ఈ బైక్‌.. ఆఫ్‌ రోడింగ్‌కు వెళ్లాలనుకునేవారు ట్రయంఫ్‌ బ్యాడ్జ్‌పై రూ. 2.63 లక్షల ఎక్స్‌షో రూమ్‌ ధరతో చాలా సరసమైనది.

Triumph-Scrambler-400-X

More from DriveSpark

Article Published On: Wednesday, October 18, 2023, 10:00 [IST]
English summary
Triumph scrambler 400 x motorcycle design specs engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+