Triumph Speed 400 Full Review ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంజిన్ ఫర్మామెన్స్, ఫీచర్లు పుల్ రివ్యూ
భారత్‌లోని బైక్ రైడర్‌లు 350cc మరియు 500cc వాహనాలు కావాలంటే కేవలం రాయల్ ఎన్‌ఫీల్డ్ వైపు చూడవలసి వచ్చేది. ఇదే పరిస్థితి చాలా కాలం కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తాజాగా జావా యెజ్డీ మరియు హోండా థంపర్‌లు పోటికి వచ్చాయి.
అయితే ప్రస్తుతం పరిస్థితిని గుర్తించిన హార్లే డేవిడ్‌సన్ రూపంలో అమెరికన్లు, ట్రయంఫ్ రూపంలో బ్రిటిషర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు
అయితే హీరో హార్లే భాగస్వామ్యంతో వచ్చిన 440x వాహనం ఉపయోగించే అవకాశం ఇంకా రాలేదు. అయితే బజాజ్ భాగస్వాగ్యంతో వచ్చిన ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌ను రైడ్ చేసేందుకు అవకాశం దక్కింది. పూణేలోనే కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400ను నడిపాం.
ట్రయంఫ్ స్పీడ్ 400 డిజైన్, ఫీచర్లు : ఇటీవల ఆవిష్కరించిన ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ట్రయంఫ్ ప్రధాన కార్యాలయం హింక్లీలో డిజైన్ చేయబడింది. స్లీడ్ 400 బైక్ ట్రయంఫ్ యొక్క ఆధునిక క్లాసిక్ మోడల్ లుక్‌ను పొందింది. క్లాసిక్ ట్రయంఫ్ రోడ్‌స్టర్ సిల్హౌట్ నుంచి గార్డ్ నుంచి ట్యాంక్ వరకు మరియు ఇంజిన్ హెడ్, బోల్డ్ గ్రాఫిక్స్, ఎగ్జాస్ట్ సహా అన్ని క్లాసిక్ మోడల్ నుంచి అడాప్ట్ చేయబడ్డాయి.
ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో హ్యాండిల్ బార్ పైనున్న స్క్రోల్ బటన్‌తో యాక్సెస్ చేయగల అనలాగ్ స్వీడోమీటర్ ఉంటుంది. డ్యూయల్ ఫార్మాట్‌లో ట్రయంఫ్ సిగ్నేచర్ డే టైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌ను స్పీడ్ 400 బైక్ కలిగి ఉంటుంది.

గోల్డెన్ యూఎస్‌డీ ఫోర్క్స్, సింగిల్ సీట్ సెటప్, పుట్‌పెగ్ మరియు అపోలో/ ఎంఆర్‌ఎఫ్ టైర్లతో కూడిన కాస్ట్ అల్యూమినియం 10 స్పోక్ అల్లాయ్ వీల్స్, స్టాండర్డ్ స్టీరింగ్ లాక్, యాంటీ థెఫ్ట్ ఇమ్మొబిలైజర్, USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఫాంట్ బ్లాక్‌తో కూడిన కార్నివాల్ రెడ్, స్టార్మ్ గ్రేతో కూడిన కాస్పియన్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్‌తో కూడిన స్టార్మ్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంజిన్, స్పెసిఫికేషన్లు : ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ సరికొత్త TR సీరిస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ తరహా ఇంజిన్ ఉన్న తొలి బైక్ స్పీడ్ 400 మాత్రమే. 398సీసీ సింగిల్ సిలిండర్ ప్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్ రకానికి చెందినది. 4 వాల్వ్ DOHC ఇంజిన్ తక్కువ రెసీప్రొకేటింగ్ మరియు డీఎల్‌సీ కోటింగ్‌ను కలిగి ఉంటుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంజిన్ 39.5 bhp శక్తి మరియు 37.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. కుడివైపున ఉన్న చైన్ డ్రైవ్ వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది. మరియు అప్‌స్వీప్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంటుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 హైబ్రిడ్ స్పైన్/ పెరిమీటర్, ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ సెటప్ మరియు బోల్ట్ ఆన్ రియర్ సబ్‌ప్రేమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్ ముందువైపు 43mm పెద్ద పిస్టన్ ఫోర్క్‌లు, వెనుక వైపున ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన మోనోషాక్, ట్విన్ సైడ్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌ను కలిగి ఉంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ముందువైపు 140mm, వెనుకవైపు 130mm వీల్ ట్రావెల్‌ను కలిగి ఉంటుంది.
సరికొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ముందు టైర్ 110/70 మరియు 150/60 వెనుకటైర్లు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. అయితే భారత్‌లో అపోలో, MRF టైర్ల అప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
రెండు చివర్లలో ABSతో కూడిన డిస్క్‌లను కలిగి ఉంది. 176 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు బ్రేక్ 4 పిస్టన్ రేడియల్ కాలిపర్లను కలిగిన 300 డిస్క్ ఉంటుంది. అదే వెనుకవైపు సింగిల్ పిస్టన్ కాలిపర్ ద్వారా బిగించబడిన 230mm డిస్క్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS, రైడ్ బై వైర్, స్విచ్‌బుల్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు టార్క్ అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉంటుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 పనితీరు : ట్రయంఫ్ స్పీడ్ 400 5వ గేర్‌లో గంటకు 20 నుంచి 120 కిమీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగిన వాహనం ఇది. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ 3000rpm నుంచి 9000rpm మధ్య ప్రయాణిస్తున్నప్పుడు 80 శాతం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని ట్రయంఫ్ చెబుతోంది.
ఈ బైక్ గేర్‌బాక్స్, లైట్ క్లచ్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. మొదటి మూడు గేర్లలో ప్రత్యేక పనితీరు కనబరుస్తుంది. ఫ్రీరివింగ్ ఇంజిన్, గేర్‌బాక్స్ కేవలం 2.8 సెకన్లలో 0-60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే 7 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అయితే రైడ్ బై వైర్ వ్యవస్థ అలవాడు పడేందుకు కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో మరో ప్రత్యేకత ఉంది. గరిష్ఠ స్పీడ్ పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. అంటే గరిష్ఠంగా 145 కిమీ/ గం పరిమితం చేయబడినట్లు ట్రయంఫ్ తెలిపింది. అయితే 165 కి.మీ/ గంటలకు వేగంగా స్పీడో మీటర్‌ను గమనించడం జరిగింది.
ట్రయంఫ్ స్పీడ్ 400 రైడింగ్ పొజిషన్‌తో కొంత సౌకర్యంగానే ఉన్నా.. వెనుక సీట్ మాత్రం ఇతర బైక్‌ల మాదిరిగానే కొంచెం ఇరుకుగా ఉంటుంది. మరియు టైర్లపై ట్రయంప్ కీలక ప్రకటన చేసింది. స్పీడ్ 400 బైక్ సస్పెన్షన్ సిస్టమ్, టైర్లు వివిధ మార్కెట్‌లకు అనుగుణంగా అమర్చబడతాయి. అయిదే భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే బైక్ మాత్రం కొంచెం బరువు ఉంటుందని తెలిపింది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో మరో ప్రత్యేకత ఉంది. రోడ్లపై ఎత్తుపల్లాలు సహా ఇతర అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లుపై సస్పెన్షన్ వ్యవస్థ చాలా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అయితే మోనోషాక్ సస్సెన్షన్ సిస్టమ్ కొంచెం గట్టిగా ఉన్నట్లు హెవీ రైడర్‌లకు అనిపించవచ్చు.
స్పీగింగ్ సహా మంచి పనితీరును కనబరిచే సస్పెన్షన్ వ్యవస్థ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ అత్యుత్తమ క్లాసిక్ బైక్‌గా మార్చింది. అయితే ఈ బైక్ 176 కిలోల బరువు ఉంటుంది. అయితే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బరువు ప్రభావం తెలియదు. మరియు ట్రాక్షన్ కంట్రోల్ కూడా అనుకూలంగా ఉంటుంది. వంద కిలోమీటర్లకు పైగా వేగంగా వెళ్తున్నప్పుడు కూడా మరింత వేగంగా వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ బ్రేకింగ్ వ్యవస్థ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. 300 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 230 mm బ్రేకింగ్ పవర్ కంటే ఎక్కువ పనితీరును కనబరుస్తాయి. మరియు ABS మరింత మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థను జోడిస్తుంది.
బజాజ్ భాగస్వామ్యంతో వచ్చిన ట్రయంఫ్ బైక్ కచ్చితంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తుంది. ఫీచర్లు, పనితీరు, డిజైన్ వినియోగదారులను ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్ బైక్‌లకు సుస్థిర స్థానం సంపాందించుకొనే అవకాశం ఉంది. ఇతర బైక్‌లకు కచ్చితంగా చుక్కలు చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








