Triumph Speed T4 Full Review తక్కువ బడ్జెట్‌లో రెట్రో లుక్‌తో వచ్చే ఈ బైక్‌ని కొనవచ్చా, లేదా?
సరిగ్గా ఏడాది కింద బ్రిటీష్ కంపెనీకి చెందిన ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 X మోటార్‌సైకిల్స్‌తో సింగిల్-సిలిండర్ (300-500cc) రెట్రో లుక్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ రెండు ట్రయంఫ్ క్లాసిక్ బైక్స్ తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యాయి. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ ట్రయంఫ్ కొత్త 400 సిరీస్ మోడ్రన్ క్లాసిక్‌ల ధరలను పెంచబోతోందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ సంస్థ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త బైక్‌ని చాలా తక్కువ ధరలో ప్రవేశపెట్టింది.
తాజాగా ట్రయంఫ్ స్పీడ్ T4 (Triumph Speed T4)ని రూ. 2.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. బడ్జెట్ ధరలో ఈ రెట్రో లుక్‌తో బైక్‌ని తీసుకువచ్చి ఆశర్యానికి గురిచేసింది. ఈ బైక్‌ని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. ఈ బైక్ పూర్తి రివ్యూ మీ కోసం..

ట్రయంఫ్ స్పీడ్ T4లో మార్పులు: ఈ స్పీడ్ T4కి అచ్చం స్పీడ్ 400 వలె ఉంటుంది. ఇందులో పెద్దగా మెకానికల్ మార్పులు కూడా చేయలేదు. దీనిలో ఉండే సాధారణ ఫోర్క్స్ (ఇకపై గోల్డెన్ లుక్‌తో రాదు) సైడ్ ప్లేట్‌లో స్పీడ్ T4 బ్యాడ్జింగ్ కలదు. స్పీడ్ 400లో USD యూనిట్స్‌కి బదులుగా ఇప్పుడు సంప్రదాయ టెలిస్కోపిక్ యూనిట్‌లను ఫ్రంట్ ఫోర్క్స్ కలవు.
T4లో ఇప్పుడు MRF జాపర్స్ బయాస్-ప్లై యూనిట్స్‌తో వస్తుంది. స్పీడ్ 400లో కనిపించే రేడియల్ యూనిట్‌లు కనిపించవు. అప్‌డేట్ చేయబడిన MY2025 స్పీడ్ 400 ఇప్పుడు వెర్డెస్టెయిన్ (Vredestein)) టైర్లను కలిగి ఉంది. కొత్త T4లో రేడియల్-మౌంటెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, నాన్-అడ్జస్టబుల్ బ్రేక్ లివర్‌లు కూడా ఉన్నాయి.

ఇంజిన్: ఇందులోని 398cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ 7,000rpm వద్ద 30.6bhp 5,000rpm వద్ద 36Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది స్పీడ్ 400 కంటే 8.9bhp, 1.5Nm కంటే తక్కువ. స్పీడ్ T4 ఇంజిన్ 2,500rpm నుంచి అందించే 85% టార్క్ శక్తి లభిస్తుంది. ఇది సిటీలోని రోజువారీ పరిస్థితులలో ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుంది.
రైడింగ్ ఇంప్రెషన్స్: ఇందులోని శక్తి తగ్గడం వల్ల ట్రయంఫ్ స్పీడ్ T4 స్పీడ్ 400 ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ని తొలగిస్తుంది. ప్రయాణంలో, ట్రయంఫ్ స్పీడ్ T4, స్పీడ్ 400 కంటే చాలా తేలికగా అనిపిస్తుంది. సిటీ రైడ్స్‌లో తక్కువ టార్క్‌తో రైడ్ చేయడం సులభంగా అనిపిస్తుంది. దీని అర్థం హై-గేర్ వద్ద తక్కువ వేగంతో వెళ్లవచ్చు. భారీ ట్రాఫిక్‌లో గేర్‌ని వెతకడానికి తక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది.

స్పీడ్ T4ని స్పష్టంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు పవర్‌లో ఎటువంటి తగ్గుదల ఎక్కువగా ఉండదు. ట్రయంఫ్ స్పీడ్ T4 రెవ్ రేంజ్ దీనిని మరింత వేగవంతం చేస్తుంది. 90 కి.మీ వేగం వద్ద యాక్సిలరేషన్ కొంచెం తగ్గించినప్పటికీ, స్పీడ్ T4 హైవేపై సులభంగా డ్రైవింగ్ చేయడానికి ఉపయోగించానికి సహాయ పడుతుంది. మొత్తంమీద దీని ఇంజిన్ చాలా స్మూత్‌గా, శుద్ధి చేయబడినట్లు అనిపించింది.
ఇక ఇందులోని సాంప్రదాయిక ఫ్రంట్ ఫోర్క్స్ మారినప్పటికీ సస్పెన్షన్ సెటప్ చురుగ్గా పనిచేస్తుంది. స్పీడ్ T4లో ఎటువంటి సమస్య లేకుండా బంప్‌లు, ఇతర కఠినమైన రూట్‌ల మీదుగా వెళ్లేటప్పుడు సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అయితే ఫ్రంట్ ఎండ్ భారీ బ్రేకింగ్‌లో కొంచెం ఎక్కువ డైవ్ చేసినట్లు అనిపిస్తుంది. మూలల వద్ద ఫ్రంట్ ఎండ్ కొంచెం తేలికగా మారుతుంది.

దీనిలోని బ్రేక్స్ మిక్స్‌డ్ ఫర్ఫామెన్స్‌ని అందిస్తాయి. ఫ్రంట్ బ్రేక్ స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఇందులోని ABS కూడా బాగానే పని చేస్తుంది. మరోవైపు వెనుక బ్రేక్స్ తక్కువ వేగంలో ఎక్కువగా పనిచేస్తాయి. మీరు హై స్పీడ్‌లో బ్రేకింగ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి దీని బ్రేకింగ్ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు.
చివరగా: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ స్పీడ్ T4 బైక్ క్లాసిక్ లుక్‌ని అందిస్తుంది. సరదాగా గడపాలని కోరుకుంటున్న వారికి ఇది సరిపోతుంది. మంచి ఫర్ఫామెన్స్, సస్పెన్షన్, బ్రేకింగ్స్‌లో ఈ బైక్ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. రైడింగ్, ఇతర అడ్వెంచర్స్ కోసం చూసే వారు ఈ కంపెనీలోని ఇతర బైక్స్‌ని ఎంచుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








