2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

భారతదేశంలో టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం చెందిన మోటార్ సైకిల్స్ లో ఒకటి 'అపాచీ ఆర్‌టిఆర్ సిరీస్'. ఈ సిరీస్ లో స్పోర్టి 160 సిసి సమర్పణల నుండి మరియు ఆర్‌టిఆర్ 200 4 వి మోడల్ వరకు ఉన్నాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ సిరీస్ రేంజ్-టాపింగ్ మోడల్ అయిన ఆర్‌టిఆర్ 200 4 వి మోడల్ 2020 లో అప్డేట్ చేయబడింది. ఆ సమయంలో ఈ బైక్ కొత్త రూపకల్పనలో మార్పులను అందుకోవడమే కాకుండా, కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను అందుకుంది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ 2021 లో గణనీయమైన మార్పులను పొందినప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్స్ అందుకోవడం జరిగింది. ఈ ఫీచర్స్ కొత్త ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ ను స్పోర్టిగా కనిపంచేలా చేస్తాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

రద్దీగా ఉండే బెంగళూరు నగరంలో మాత్రమే కాకుండా, మెట్రోపాలిటన్ చుట్టూ ఉన్న హైవేలలో కూడా ఈ కొత్త బైక్ ను రెండు రోజులు పాటు ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రైడ్ చేసాము. కావున 2021 మోడల్ లో ఉన్న కొత్త అప్డేట్స్ ఏమిటి మరియు ఇది వాస్తవ ప్రపంచంలో ఎలా ఉంటుంది అనే మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

డిజైన్ మరియు స్టైల్ :

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి మొదటి చూపులోనే దాని మునుపటి మోడల్ ని గుర్తుచేస్తుంది. ఈ కొత్త బైక్ లో పెద్దగా డిజైన్ మార్పులు చేయబడలేదు. అయితే ఈ 2021 వెర్షన్ మోటారుసైకిల్ చుట్టూ షార్ప్ లైన్స్ తో చాలా దూకుడుగా కనిపిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ కొత్త బైక్ యొక్క ముందుభాగం నుంచి ప్రారంభించినట్లైతే, ఇది స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో వస్తుంది. ఇదే హెడ్‌ల్యాంప్ యూనిట్, మొదట 2020 బిఎస్ 6 కంప్లైంట్ మోడల్‌లో ప్రారంభమైంది. కొత్త హెడ్‌ల్యాంప్‌లు బిఎస్ 4 వెర్షన్‌తో పోల్చితే మంచి త్రో మరియు ఇంటెన్సిటీని అందిస్తాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి కూడా అదే స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంకుతో ముందుకు వెళ్తుంది. ఇది పెద్ద కౌల్‌ను కలిగి ఉంది, అంతే కాకుండా ఇది షార్ప్ లైన్స్ మరియు క్రీజెస్ కలిగి ఉండటం వల్ల చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. మోటారుసైకిల్‌లో ఆఫ్-సెట్ ఫ్యూయల్ క్యాప్, స్ప్లిట్ స్టెప్-అప్ సీట్లు మరియు బాడీ-కలర్ ఇంజిన్ కౌల్ ఉన్నాయి. ఇవన్నీ మోటారుసైకిల్ యొక్క స్పోర్టి స్వభావాన్ని మరింత పెంచుతుంది. ఈ బైక్ వెనుక భాగంలో ఎల్ఇడి టైల్ లైట్స్ కూడా ఉన్నాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ కొత్త మోడల్ బైక్ లోని చాలా స్టైలింగ్ మరియు డిజైన్ ఎలిమెంట్స్ దాని మునుపటి మోడల్ నుండి తీసుకున్నప్పటికీ, ఈ కొత్త మోడల్ లో చెప్పుకోదగ్గ మార్పు దాని పెయింట్ స్కీమ్. 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి ఇప్పుడు 'రెడ్' బాడీ గ్రాఫిక్‌లతో 'మాట్టే బ్లూ' పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఈ కొత్త కలర్ స్కీమ్ టీవీఎస్ రేసింగ్ యొక్క 'వన్ మేక్ ఛాంపియన్‌షిప్' మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందింది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఇంపార్టెంట్ ఫీచర్స్ :

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి అనేక ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువభాగం దాని మునుపటి బిఎస్ 6 మోడల్ నుంచి గ్రహించనవే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్ప్లిట్ సీట్లు వంటివి మరెన్నో ఉన్నాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ కొత్త మోడల్‌లో అతి ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే దాని రైడింగ్ మోడ్‌లు, స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీ, గ్లైడ్ త్రూ టెక్నాలజీ, అడ్జస్టబుల్ బ్రేక్స్, క్లచ్ లివర్‌లు మరియు ముందు, వెనుక వైపున అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి ఇప్పుడు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌ను మూడు రైడింగ్ మోడ్‌లతో అందిస్తుంది. అవి రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్ మోడ్స్. ఈ మూడు మోడ్‌లు పనితీరు మరియు ఇతర అంశాలలో స్వల్ప తేడాలను గమనించవచ్చు. రైడర్ కుడి హ్యాండిల్‌బార్‌లోని 'మోడ్' బటన్‌ను ఉపయోగించి మూడు రైడింగ్ మోడ్‌ల మధ్య టోగుల్ చేయవచ్చు.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 వెర్షన్‌లోని మరో ముఖ్యమైన ఫీచర్ బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీ. మోటారుసైకిల్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్‌తో వస్తుంది. ఇది రైడర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌కు స్పెషల్ యాప్ ద్వారా జత చేయడానికి అనుమతిస్తుంది. కనెక్ట్ అయిన తర్వాత, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మెసేజ్ అలెర్ట్, కాల్ అలెర్ట్ మరియు నావిగేషన్ వంటి అనేక అడిషినల్ ఫీచర్స్ అందిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 బ్రాండ్ యొక్క 'గ్లైడ్ త్రూ టెక్నాలజీ'తో వస్తుంది, ఇది మోటారుసైకిల్‌ను నిలిపివేయకుండా (కార్లపై క్రూయిజ్ కంట్రోల్ మాదిరిగానే) రైడర్ క్లచ్‌ను తక్కువ వేగంతో వదిలివేయడానికి అనుమతిస్తుంది. గ్లైడ్ త్రూ టెక్నాలజీతో, మోటారుసైకిల్ ని మొదటి గేర్‌లో 7 కి.మీ / గం, రెండవది 15 కి.మీ / గం మరియు మూడవ గేర్‌లో 25 కి.మీ / గం రైడ్ చేయవచ్చు. త్రాటల్ ట్విస్టింగ్ ద్వారా మరియు టేకింగ్ బ్యాక్ కంట్రోల్ ద్వారా రైడర్స్ అవసరమైనప్పుడు టెక్నాలజీని నిలిపివేయవచ్చు.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ మోటారుసైకిల్ అడ్జస్టబుల్ క్లచ్ మరియు బ్రేక్ లివర్లతో కూడా వస్తుంది, రెండు చివర్లలో సస్పెన్షన్ సెటప్ కూడా అడ్జస్ట్ చేయవచ్చు. బ్రేక్ మరియు క్లచ్ లివర్లు త్రీ లెవెల్ అడ్జస్టబుల్ ను అందిస్తాయి. ఇవి త్వరగా మరియు సులభంగా ఉంటాయి. అడ్జస్టమెంట్ వేరియస్ మరియు హ్యాండిల్‌బార్ మధ్య అంతరాన్ని మారుస్తుంది. ఇది రైడర్‌ యొక్క అవసరాలకు అనుగుణంగా సెట్ చేయడానికి అనుమతించాలి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఇక ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్‌ విషయానికి వస్తే, ఇది ఫుల్-అడ్జస్టబిలిటీ అందించదు, ఇది ప్రీలోడ్ అడ్జస్టబుల్ తో వస్తుంది. ఇది రైడర్ తన ఎత్తు, బరువు మరియు ఒక పిలియన్‌తో ప్రయాణించేటప్పుడు లేదా సుదీర్ఘ ప్రయాణాల సమయంలో వెనుక భాగంలో లగేజ్ అమర్చినప్పుడు, సస్పెన్షన్ సెటప్‌ను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 ముందు భాగంలో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంది. బ్రేకింగ్ రెండు చివర్లలో పెటల్ డిస్క్ ద్వారా నిర్వహించబడుతుంది. ముందు భాగంలో 270 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ ఉంటుంది. ఈ రెండింటికి డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ మద్దతు ఇస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఇంజిన్, పర్ఫామెన్స్ మరియు హ్యాండ్లింగ్:

కొత్త 2021 టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి దాని మునుపటి 2020 మోడల్ యొక్క అదే 197 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 'స్పోర్ట్' మోడ్‌లో 9000 ఆర్‌పిఎమ్ వద్ద 20.5 బిహెచ్‌పి మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

'రెయిన్' మరియు 'అర్బన్' మోడ్‌లకు మార్చినప్పుడు మోటారుసైకిల్‌ యొక్క పవర్ శక్తి 7800 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 బిహెచ్‌పికి పరిమితం కాగా, టార్క్ 5750 ఆర్‌పిఎమ్ వద్ద 16.5 ఎన్ఎమ్‌కి తగ్గుతుంది. ఇంజిన్ అదే 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్-క్లచ్‌తో స్టాండర్డ్ గా జతచేయబడుతుంది. మొదటి రెండు మోడ్‌లలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి టివిఎస్ త్రాటల్ మ్యాప్‌లను కొద్దిగా మార్చింది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఇక ఈ కొత్త బైక్ యొక్క వస్తే, ఇది ఒక లీటరుకు 44 కి.మీ అందిస్తుంది. అదే 'అర్బన్' మోడ్‌లో మరింత రిలాక్స్డ్ రైడింగ్ అనుభవాన్ని అందించడంతో పాటు ఒక లీటరుకు 46 కి.మీ మార్కును దాటడాన్ని చూడవచ్చు.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

రోజువారీ నగర ప్రయాణానికి ఈ మోడ్స్ అనుకూలంగా ఉంటాయి. అయితే హైవే మీద 'స్పోర్ట్' మోడ్‌కు మారవలసిన అవసరం ఉంటుంది. స్పోర్ట్ మోడ్ లో ఈ బైక్ 21 బిహెచ్‌పి శక్తికి ఇస్తుంది, ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ మార్క్ వరకు ఉంటుంది. లో రివ్-రేంజ్‌లో పెద్ద తేడా లేనప్పటికీ, మోటారుసైకిల్ ఈ మోడ్‌లో అధిక వేగంతో రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 లోని ఇంజిన్ మృదువైన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ వైబ్రేషన్స్ కలిగి ఉంది. త్రాటల్ మ్యాప్‌లతో పాటు, మూడు మోడ్‌లు మోటారుసైకిల్ యొక్క యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ప్రవర్తనను మారుస్తాయి. రెయిన్ అండ్ అర్బన్ మోడ్‌లోని డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ సిస్టం అనుచితంగా అనిపించినప్పటికీ, ఇది 'స్పోర్ట్' మోడ్‌లో మరింత తేలికగా అనిపిస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

అపాచీ ఆర్‌టిఆర్ 200 బైక్ కూడా రైడర్ నిటారుగా కూర్చోవడానికి అనుమతిస్తుంది. సీట్లు మంచి కుషనింగ్‌ను అందిస్తాయి. ఇవి సుదూర ప్రయాణంలో కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ మోటారుసైకిల్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని పర్ఫామెన్స్. 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 చాలా సమతుల్యతను కలిగి ఉంటుంది. ఇది 151 కేజీల బరువు ఉండటం వల్ల చాలా చురుగ్గా పనిచేస్తుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్‌తో హ్యాండ్లింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది, ఇది ముందు మరియు వెనుక భాగంలో లభిస్తుంది. అయినప్పటికీ, సెటప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ కి మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఇది రైడర్ వారి బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ను అడ్జస్ట్ చేయడానికి సహాయపడుతుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ బైక్ యొక్క ముందు భాగంలో ఉన్న టెలిస్కోపిక్ ఫోర్కులు సులభంగా అమర్చవచ్చు. రియర్ మోనో-షాక్ సస్పెన్షన్‌ను అడ్జస్ట్ చేయడం, సెటప్ చేయడానికి కొంత సమయం పడుతుంది. మోటారుసైకిల్‌పై బ్రేకింగ్ 270 మిమీ మరియు 240 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్‌లు ఇరువైపులా ఉంటుంది. బ్రేకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

వేరియంట్స్, కలర్ మరియు ప్రైస్:

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి సింగిల్-ఛానల్ లేదా డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో కూడిన రెండు వేరియంట్ల పరిధిలో అందించబడుతుంది. రైడింగ్ మోడ్‌లు మరియు అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫీచర్లు ప్రత్యేకంగా టాప్-ఎండ్ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ అమర్చిన మోడల్‌లో అందించబడతాయి. అన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఈ 2021 మోడల్ ధర రూ. 1.33 లక్షలు. ఇది దాని మునుపటి 2020 మోడల్ కంటే కేవలం 1000 రూపాయల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

కొత్త బిఎస్ 6, 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి మూడు కలర్ అప్సన్స్ లో అందించబడుతుంది. అవి గ్లోస్ బ్లాక్, పెర్ల్ వైట్ మరియు మాట్టే బ్లూ.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

కాంపిటీషన్ & ఫ్యాక్ట్ చెక్

భారత మార్కెట్లో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 మరియు కెటిఎమ్ 200 డ్యూక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిళ్లలో ఒకటి. ఆర్‌టిఆర్ 200 మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందిస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా రైడర్ కి మంచి అందిస్తుంది.

Most Read Articles

English summary
2021 TVS Apache RTR 200 4V BS6 With Riding Modes Review. Read in Telugu.
Story first published: Tuesday, February 23, 2021, 11:20 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X