టీవీఎస్ అపాచే రేస్ ఎడిషన్ 1,000 కిలోమీటర్ల లాంగ్-టర్మ్ రివ్యూ

By Anil Kumar

బైక్ లేదా కారు షోరూమ్‌కు వెళ్లినపుడు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి సార్ అంటారు. నిజానికి మనం టెస్ట్ డ్రైవ్ చేస్తున్నపుడు వెహికల్ గురించి పెద్దగా తెలుసుకోలేకపోవచ్చు. చాలా మంది 500 నుండి 1000 కిలోమీటర్లు నడిపిన తరువాత తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. నిజమే, కొన్ని రోజుల పాటు నడిపితేగానీ తెలియదు ఆ వాహనం ఎంత వరకు మంచిదో...

రెండు మూడు కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్ చేయడానికైతే ఒప్పుకుంటారుగానీ, ఏకంగా 1000కిమీలు అంటే ఏ డీలర్ కూడా ఒప్పుకోరు. అయితే, టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ బైకును 1000కిమీలు టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగు టీమ్‌కు ఇచ్చింది.

ఇవాళ్టి టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 లాంగ్ టర్మ్ (1000కిలోమీటర్లు) రివ్యూలో మేము గుర్తించిన గుడ్ అండ్ బ్యాడ్ ఏంటో చూద్దాం రండి...

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

బ్లాక్ అండ్ రెడ్ స్ట్రిప్స్ గల అపాచే 200 4వి రేస్ ఎడిషన్ 2.0 ఫస్ట్ లుక్‌లోనే అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సాధారణ కమ్యూటర్ మోటార్ సైకిల్, స్కూటర్ చివరికి పాత అపాచే రైడర్లు కూడా మోటార్‌సైకిల్‌ను ఎంతో ఆసక్తికరంగా గమనించారు.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

బైకును రివ్యూ చేయండలో భాగంగా కొన్నాళ్ల పాటు రోజు వారి అవసరాలకు ఉపయోగించాను. అపాచే రేస్ ఎడిషన్ 2.0 గురించి ధర మరియు మైలేజ్ ప్రజల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అంతే కాకుండా, కొంత మంది యువకులకు కూడా ఈ బైకును రైడ్ చేసే అవకాశాన్ని కల్పించాను. నా అభిప్రాయమే కాదు, ఇతరులు కూడా బైకు గురించి ఏమంటున్నారో తెలుసుకునేందుకు ఇలా ఇచ్చాను.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

టీవీఎస్ అపాచే రేస్ ఎడిషన్ 2.0 బైకు మా చేతికి వచ్చినపుడు అప్పటికే 1,489 కిలోమీటర్లు తిరిగింది. ఇక మీ టీమ్‌లో ఉన్న కొంత మంది కొలీగ్స్ రైడింగ్ తీసుకెళ్లారు. చివరగా రివ్యూ చేయడానికి నా చెంతకు చేరింది. బెంగళూరు బైక్ రైడర్లు తరచూ వెళ్లే నంది హిల్స్‌కు రైడింగ్ చేసాను.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

టీవీఎస్ అపాచే 200 4వి రేస్ ఎడిషన్ 2.0 బైకు యొక్క కార్నరింగ్ సామర్థ్యాలను తెలుసుకోవడానికి మలుపులతో కూడిన నంది హిల్స్ రైడ్ ఎంతగానో ఉపయోగపడింది. బైకును చాలా అద్భుతంగా నిర్మించారు. కొన్ని సందర్భాల్లో అసలైన రేస్ మోటార్ సైకిల్‌ను తలపిస్తుంది. అయితే, సీటు ఎత్తు కాస్త ఎక్కువగా ఉండటంతో మలుపుల్లో తరుచూ కార్నిరింగ్ చేయడం మంచిది కాదనిపిస్తుంది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

ఏదేమైనప్పటికీ, రియర్-ఫుట్ పెగ్స్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్ అమరికి చాలా చక్కగా ఉంది. ప్రత్యేకించి ఛాసిస్ మరియు సస్పెన్షన్ ఏర్పాటు తీరు మనలో ఉన్న ఫన్ రైడర్‌ను బయటకు తీసుకొస్తుంది. అనుకోకుండా ఎదురయ్యే మలుపుల్లో ఇంజన్ ప్రొడ్యూస్ చేసే టార్క్ ఎంతగానో సహకరిస్తుంది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

టీవీఎస్ అపాచే 200 4వి రేస్ ఎడిషన్ 2.0 బైకులో గాలి మరియు ఆయిల్‌తో చల్లబడే 197.7సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్ ఇంది. ఎంతో చలాకీగా స్పందించే ఇంజన్ గరిష్టంగా 20.21బిహెచ్‌పి పవర్ మరియు 18.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

ఏదేమైనప్పటికీ, 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరష్ట టార్క్ మరియు 8,500ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట పవర్‌నిస్తుంది. అయితే, ఇంజన్ ఎక్కువ వేగంలో ఉన్నపుడు మనం ఆశించిన పవర్ అవుట్‌పుట్ కాస్త తక్కువగానే ఉంటుంది. మొదట్లో యాక్సిలరేషన్ ఎక్కువ చేసినపుడు ఎక్కువ పవర్ ఆశించాను కానీ ఒకరకంగా నిరాశపరించింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

యాక్సిలరేషన్ పరంగా ఒక్కొక్కరి అంచనా ఒక్కోరకంగా ఉంటుంది. బహుశా నేను అవసరానికి మించి పవర్ అవుట్ ఆశించి ఉండవచ్చు. రేసింగ్ తరువాత సాధారణంగా ఉపయోగిస్తున్నపుడు, టీవీఎస్ అభివృద్ది చేసిన రేస్-ట్యూన్డ్ ఇంటేకర్, కార్బోరేటర్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ నిజంగా అద్భుతం చేశాయి. ఇందులో గరిష్టంగా 23.65బిహెచ్‌పి పొందేందుకు అదనంగా క్యామ్ షాఫ్ట్ అడ్జెస్టర్ కూడా వచ్చింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

సాధారణంగా రోడ్డు మీద వెళుతున్నపుడు అధిక యాక్సిలరేషన్‌లో ఇంజన్ వేగం ఎక్కువగా ఉన్నపుడు పవర్ అవుట్‌పుట్ ఎక్కువ రావడం బహుశా ఇందుకే కాబోలు. ఇంజన్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఇది కూడా నా దృష్టికి వచ్చింది. రోజు వారి మరియు రేసింగ్ అవసరాలకు సందర్భానికి తగిన పవర్ అందివ్వడం దీని ప్రత్యేకం.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, టీవీఎస్ రోడ్ రేసింగ్ మరియు ర్యాలీ రేసింగ్ మోటార్‌సైకిళ్లలో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించారు. నాణ్యత, నమ్మకం, విశ్వయనీయత గల ఈ ఇంజన్ కొన్ని రేస్‌లలో టీవీఎస్‌కు పలు ట్రోఫీలు సాధించిపెట్టింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

డైలీ యూసేజ్ అయినా... రేసింగ్ అయినా... తన తత్వంతో ఎక్కడైనా విజయాన్ని సాధిస్తుందనడానికి చక్కటి ఉదాహరణ టీవీఎస్ అపాచే. ఉదాహరణ మాత్రమే కాదు టీవీఎస్ అపాచే మార్కెట్లో మరియు రేస్ ట్రాక్‌ల మీద నిరూపించుకుంది కూడా.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

అపాచే రేస్ ఎడిన్ 2.0 బైకులోని మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తన ఎగ్జాస్ట్ సౌండ్ ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇంజన్ యొక్క అరుదైన సౌండ్ ప్రతి రైడర్ మోములో కూడా చిరునవ్వుని తెప్పిస్తుంది. ఇక ఓ మోస్తారు వేగంతో నగర వీధుల వెంబడి వెళుతుంటే బైకు వైపుకు తలతిప్పని వారంటూ ఉండరు.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

మోటార్‌సైకిల్‌లో ఉన్న యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) బైకుల్లో ఓవర్ స్పీడింగ్ వలన కలిగే ప్రమాదాలను దాదాపు తగ్గించడంలో ఏబీఎస్ కీలకపాత్ర పోషిస్తుంది. ఒక వారం రోజుల పాటు బైకును రైడ్ చేశాను. ఓ సారి సుమారుగా 70కిలోమీటర్ల వేగంతో వెళుతున్నపుడు, ఓ మహిళను గమనించకుండా రోడ్డు మీదకు వచ్చేసింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

ప్రమాదాన్ని తప్పించడానికి రెండు బ్రేకులను గట్టిగా అప్లే చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ బైకు చక్రాలు ఏ మాత్రం స్కిడ్ కాకుండా ఒకే లైన్‌లో ఆగుతుందని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. టీవీఎస్ అపాచే రేస్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇందులోని ఏబిఎస్ టెక్నాలజీ ద్వారా పైన చెప్పిన రెండూ సాధ్యమవుతాయి. దీనికి తోడు సులభంగా గేర్లను తగ్గించేందుకు ఇందులో అందించిన టీవీఎస్ ఏ-ఆర్‌టి స్లిప్పర్ క్లచ్ ఉంది. ఈ రెండింటి పనితీరు మిమ్మల్ని అపాచే ప్రేమలో పడేస్తాయి.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

కేవలం 9.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని మరియు టాప్ స్పీడ్ గంటకు 133కిమీలు. రెండు రీడింగులు కూడా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో రికార్డ్ అయ్యాయి. నిజమే, టీవీఎస్ సూచించిన వేగానికంటే ఇది ఎక్కువే. టీవీఎస్ సమాచారం ప్రకారం, 100కిమీల వేగం 12.2 సెకండ్ల వ్యవధిలో మరియు గరిష్ట వేగం 129 కిమీలుగా రికార్డు అయ్యింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

వెయ్యి కిలోమీటర్ల రైడింగ్ తెలియకుండానే గడిచిపోయింది. ఎలాంటి సమస్యలైతే గుర్తించలేదు. అయితే, బైకును తీసుకునేటప్పుడే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కాలిపర్ వద్ద ఉండాల్సిన రబ్బర్ బుష్ ఒకటి మిస్సయ్యింది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

దగ్గరలోని స్పేర్ పార్ట్స్ స్టోర్‌లో కొనుగోలు చేసి, లోకల్ గ్యారేజీలో దానిని ఫిక్స్ చేయించాను. ఇందుకు రూ. 40 ఖర్చయ్యింది. ఇదొక సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. రబ్బర్ బుష్‌ను ఎవరైనా కావాలని తొలగిస్తే మినహా దానంతట అదే రాదు. దీనిక గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

స్టార్టర్ బటన్‌తో చిన్న సమస్య ఉంది - స్టార్ట్ అవ్వడానికి కొన్నిసార్లు మొరాయిస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా తప్పుగా పనిచేస్తుంది. బైకు ఫస్ట్ గేరులో ఉన్నపుడు కూడా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ల్పేలో న్యూట్రల్ అని చూపిస్తుంది. అయితే ఈ రెండు పెద్ద సమస్యలేమీ కాదు, బైకు 2,500 నుండి 3,000 కిలోమీటర్లు తిరినపుడు చేయించాల్సిన రెండవ సర్వీస్‌లో వీటిని సరిచేయించుకోవచ్చు. అన్ని బైకుల్లో ఈ రెండు సమస్యలు తలెత్తుతాయని కూడా చెప్పలేం.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎసా అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకునే అసలైన స్ట్రీట్ స్పోర్ట్ బైకు. నిజానికి మరో వెయ్యి కిలోమీటర్లు రైడ్ చేయాలని ఉంది. అయితే, టీవీఎస్ మాకు ఇచ్చిన గడువు, మా 1000 కిలోమీటర్లు రైడ్ పూర్తవ్వడంతో తప్పనిసరిగా బైకును వెనక్కిచ్చేశాము.

బైకు విషయానికి వస్తే, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ రేస్ ఎడిషన్ రిటైల్ ధర రూ. 1.11 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. నాన్-ఏబిఎస్ వేరియంట్ కంటే దీని ధర రూ. 13,800 ఎక్కువగా ఉంది. ధర ఎక్కువైనప్పటికీ ఏబిఎస్ వేరియంట్ చాలా ముఖ్యమైనది.

టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ
  • ప్రయాణించిన దూరం: 1,021కిలోమీటర్లు
  • యాక్సిలరేషన్ (0-100కిమీలు): 9.9 సెకండ్లలో
  • గరిష్ట వేగం గంటకు: 133కిలోమీర్లు
  • మైలేజ్: 38కిమీ/లీ (సగటున)
టీవీఎస్ అపాచే 200 లాంగ్-టర్మ్ రివ్యూ

గుడ్ ఏంటి..?

  • అద్భుతమైన ఇంజన్,
  • రైడ్ క్వాలిటీ,
  • విభిన్నమైన సైలెన్సర్ సౌండ్

బ్యాడ్ ఏంటి...?

  • స్టార్టర్ బటన్(మరికొంత యాక్టివ్‌గా ఉండాలి)
  • గేర్ పొజిషన్ ఇండికేటర్ తప్పుగా పనిచేసింది (టైస్ట్ రైడ్ చేసిన బైకులో మాత్రమే)

డ్రైవ్‌స్పార్క్ తెలుగు చెంతకు టీవీఎస్ మాత్రమే కాదు, మరెన్నో లగ్జరీ కార్లు మరియు బైకులు రివ్యూ కోసం వచ్చాయి... మరిన్ని రివ్యూ స్టోరీల కోసం...

Most Read Articles

English summary
Read In Telugu: TVS Apache 200 Race Edition Long-Term Review — 1,000 Kilometres Of Fun
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X