TVS Apache RTR 310 Full Review టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ డిజైన్, ఫీచర్లు ఫర్మామెన్స్ పుల్ రివ్యూ
అనేక సంవత్సరాలుగా టీవీఎస్ అపాచీ బైక్‌లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. టీవీఎస్, బీఎండబ్ల్యూ భాగస్వామ్యంతో అపాచీ RTR 310 బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న అపాచీ RR 310 బైక్ అందరికీ ఆకట్టుకుంది. అపాచీ లైనప్‌లోకి కొత్తగా RTR బైక్ వచ్చి చేరింది.
టీవీఎస్ అపాచీ RTR 310 బైక్‌ను టెస్ట్ డ్రైవ్ చేసేందుకు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో అవకాశం వచ్చింది. ఇందుకోసం థాయ్ 'సిటీ ఆఫ్ ఏంజెల్స్'కు ఆహ్వానించింది. ఇక్కడ బైక్ పనితీరును సహా ఇతర స్పెసిఫికేషన్లు, వేగం సహా ఇతర అన్ని విభాగాలను పరీక్షించాము.

టీవీఎస్ అపాచీ RTR 310.. డిజైన్, ఫీచర్లు : టీవీఎస్ అపాచీ లైన్‌ప్‌లో RTR 310 బైక్ కొత్తగా వచ్చి చేరింది. ఈ బైక్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. తొలిచూపులోనే అనేక మందికి కచ్చితంగా నచ్చే బైక్‌గా మారుతుంది. అపాచీ ఆర్‌టీఆర్ 310 బైక్ ముందువైపు డ్యూయల్ LED హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ముందువైపు USD ఫ్రంట్ ఫోర్క్, మడ్‌గార్డు ఉంటుంది.
టీవీఎస్ అపాచీ RTR 310 రెండు వైపులా మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది షార్ప్ ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. బైక్‌కు చుట్టూ ఉండే కటౌట్‌లు అగ్రసివ్ లుక్ ఉంటుంది. వాహనం వెనుక సీటును క్లైమేట్‌కు అనుగుణంగా మార్చుకోవచ్చు. అయితే ఎగ్జాస్ట్ మాత్రం అపాచీ RR 310 బైక్ మాదిరిగానే ఉంటుంది.

కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ 17 అంగుళాల స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఇవి రెండు రంగుల్లో లభిస్తాయి. అవి ముందువైపు బ్లాక్, వెనుకవైపు పసుపు రంగులో ఉంటాయి. దీంతోపాటు 5 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ద్వారా డ్రైవింగ్ మోడ్‌లను మార్చుకోవచ్చు. హెడ్‌లైట్ బ్రైట్‌నెస్, క్రూయిజ్ కంట్రోల్ చేసుకొనేందుకు అనుమతి ఇస్తుంది.
దీంతోపాటు ఫోన్ కనెక్ట్, గో ప్రో కెమెరా, స్మార్ట్ హెల్మెట్‌తో కనెక్ట్ కావచ్చు. దీంతోపాటు క్రాష్ అలెర్ట్‌లను పంపవచ్చు. డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ను ఆన్ ఆఫ్ చేయవచ్చు. మరియు ఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వొచ్చు. దీంతోపాటు రివర్స్ ఇక్లైన్డ్ ఇంజిన్, అడ్జస్టబుల్ హ్యాండ్ లెవల్, హ్యాండ్ బార్‌లున్నాయి.

టీవీఎస్ అపాచీ RTR 310 స్పెసిఫికేషన్లు, కొలతలు : టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ 312.2cc రివర్స్ ఇక్లైన్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ను అపాచీ RR 310, BMW G 310 లైనప్‌లో బైక్‌లు కలిగి ఉంటాయి.
టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ 9700 rpm వద్ద 35bhp శక్తి, 6650 rpm వద్ద 28.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గ్రేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌లను కలిగి ఉంటాయి.

టీవీఎస్ అపాచీ RTR ట్రెల్లిస్ ఫ్రేమ్, అల్యూమినియం వెనుక సబ్‌ఫ్రేమ్‌తో కూడిన స్ప్లిట్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు 41mm USD ఫోర్క్, మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్‌తో వస్తుంది. రెండు సస్పెషన్లు ప్రీలోడ్, కంప్రెషన్, రీబౌండ్ ఏర్పాట్లను కలిగి ఉంటాయి.
టీవీఎస్ కొత్త భైక్ బెబ్రే బ్రేక్ కాలిపర్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 4 పిస్టన్ కాలిపర్‌తో కూడిన 300mm యూనిట్, 240mm సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో డిస్క్ బ్రేకులు ఉంటాయి. డిస్క్ బ్రేకులు డ్యూయల్ ఛానల్ ABS సపోర్టుతో వస్తాయి. ఫలితంగా మెరుగైన బ్రేకింగ్ పనితీరును కనబరుస్తాయి.

ఈ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 110/70, వెనుకవైపు 150/60 టైర్లు ఉంటాయి. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, రెయిర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్, వీలీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిక్స్ యాక్సిస్ IMU కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABSతో వస్తుంది.
టీవీఎస్ రైడింగ్ ఇంప్రెసన్ : టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ మిశ్రమ అనుభూతిని కలిగించింది. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఫలితాలు, మరికొన్ని సమయాల్లో కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అర్బన్, రెయిన్ మోడ్‌లో ఇంజిన్ నుంచి స్పందన కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే ట్రాఫిక్‌లో ఉన్న సమయాల్లో ఇది బాగా అనిపిస్తుంది.

టీవీఎస్ అపాచీ RTR 310 బైక్ సామర్థ్యాన్ని పూర్తిగా పొందాలంటే ట్రాక్ మోడ్, స్పోర్ట్స్ మోడ్‌లో డ్రైవింగ్ చేయవచ్చు. నగరాలు, పట్టణ రోడ్లపై రెండెంకెల వేగంతో ప్రయాణం చాలా బాగుంటుంది. అయితే 100 కి.మీ వేగంతో ప్రయాణం చేసినప్పుడు కొంచెం వైబ్రేషన్‌ను గుర్తించవచ్చు.
క్విక్‌షిఫ్టర్ కారణంగా గేరింగ్ చాలాసులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. 150 కి.మీ కంటే వేగంగా దూసుకెళ్లినప్పుటికీ మోటార్ శక్తి కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా మెరుగైన అనుభూతి కలుగుతుంది. సస్పెన్షన్‌లో మరిన్ని మెరుగుదలను ఊహించాము. కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంది. క్రైమేట్ కంట్రోల్డ్ సీటు, డైనమిక్ కిట్ కోసం కొంచెం అదనంగా ఖర్చుచేయాల్సి ఉంది. అయితే మొత్తంగా బైక్ మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది. వాతావరణానికి అనుగుణంగా బైక్ సీట్‌లను మార్పులు చేయవచ్చు.

టీవీఎస్ అపాచీ RTR 310 బైక్.. అపాచీ 310 క్లబ్‌లో చేరింది. అయితే ఈ డిజైన్ చాలా ఆకట్టుకుంటుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అయితే అపాచీ RTR 310 కొన్ని విభాగాల పనితీరును మెరుగుపరచాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








