TVS యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ టైర్ల రివ్యూ.. ఆ టైర్ల కంటే ఎంతో ప్రత్యేకం..!
TVS టైర్స్ పరిచయం అవసరం లేని పేరు. భారత్‌లో ఆటోమొబైల్స్ కోసం టైర్లు తయారు చేయడం ప్రారంభించి 40 ఏళ్లు దాటింది. గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు 2019లో ఈ సంస్థ టీవీఎస్ యూరోగ్రిప్‌గా రీబ్రాండ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫలితాలు మన రోడ్లపై కనిపిస్తున్నాయి.
కొత్త రోడ్‌హౌండ్ టైర్ల తయారీ సహా ఇతర వివరాలు తెలుసుకొనేందుకు టీవీఎస్ యూరోగ్రిప్ మమ్మల్ని ఆహ్వానించింది. అందుకోసం కోయంబత్తూరులోని కారీ మోటార్ స్పీడ్‌వేలో పరీక్షించేందుకు వెళ‌్లడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రోడ్‌హౌండ్ రోడ్లపై స్థిరత్వం, ఎక్కువ రోజుల మన్నిక, స్టిఫ్‌నెస్ మరియు కార్నింగ్ గ్రిప్‌ను అందిస్తుంది. బేస్ లేయర్ కాంపౌండ్ మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది.

టీవీఎస్ యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ స్పెసిఫికేషన్లు, ధర, రైడింగ్ అనుభూతి : రోడ్‌హౌండ్ అనేది క్వాడ్ కాంపౌండ్ రేడియల్ టైర్. ఇది కార్నింగ్ గ్రిప్, సౌకర్యం, మన్నిక కోసం డిజైన్ చేయబడింది. తడి రోడ్లపై కూడా రోడ్‌హౌండ్ మంచి గ్రిప్‌ను ఇస్తుందని టీవీఎస్ యూరోగ్రిప్ చెబుతోంది. కాంటాక్ట్ ప్యాచ్‌పై ఉన్న గ్రూవ్‌లు నీటిని త్వరగా బయటకు పంపుతాయని, ఫలితంగా ఆక్వా ప్లానింగ్ జరిగే అవకాశాన్ని ఈ టైర్లు తగ్గి్స్తాయి.
టీవీఎస్ యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ ముందు టైర్లు ఒకే సైజులో అందుబాటులో ఉన్నాయి. ముందు టైర్లు 120/70 యూనిట్ ధర రూ.12,999గా ఉంది. అదే వెనుక టైర్లు రెండు సైజుల్లో అందుబాటులో ఉంటాయి. 160/60 ధర రూ.14,999 మరియు 180/55 రూ.16,999కు లభిస్తాయి.

టీవీఎస్ యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ టైర్ల అధునాతన తయారీ ప్లాంట్ మధురైలో ఉంది. ఈ ఫ్లాంట్‌లో టైర్ల ఉత్పత్తిని మొదటి నుంచి చివరి వరకు చూసే అవకాశం దక్కింది. తొలిదశలో రబ్బర్‌ను వేడిచేయడం నుంచి టైర్లు ఉత్పత్తి అయ్యే వరకు అన్నింటిని చూశాం.
తర్వాత రోజు రోడ్‌హౌండ్ టైర్లు అమర్చిన కొన్ని అధునాతన బైక్‌లతో కోయం బత్తూరులోని కారీ మోటార్స్‌కు చేరుకున్నాం. బెనెల్లి లియోన్సీనో, TRK 502, కవాసకి నింజా 650, Z650, హోండా CBR 650R మరియు హార్లే డెవిడ్‌సన్ స్ట్రీట్‌రోడ్ బైక్‌లు ఉన్నాయి.

బైక్‌లతో సంబంధం లేకుండా రోడ్‌హౌండ్ టైర్లు ఒకే రకమైన పనితీరును కనబరిచాయి. రోడ్‌హౌండ్ టైర్లు ప్రారంభం నుంచి మెరుగైన గ్రిప్‌ను అందించాయి. చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కలిగించాయి. ఎలాంటి రోడ్లపైనైనా ఎటువంటి ఆందోళన లేకుండా ఈ టైర్లతో డ్రైవింగ్ చేయవచ్చు.
బ్రేకింగ్ సమయంలోనూ ఈ టైర్లు అత్యంత సౌకర్యంగా అనిపించాయి. ఎటువంటి ఫిర్యాదులు లేకుండా త్వరగానే లోడ్ తీసుకున్నాయి. కర్వడ్ రోడ్లపై కూడా ఎటువంటి ఆందోళన లేకుండా డ్రైవింగ్ చేసేందుకు రోడ్‌హౌండ్ అనుమతించింది. అత్యధిక వేగంతో డ్రైవింగ్ చేసినప్పుడు కూడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. అన్ని రోడ్ల మార్గాలు, ప్రయాణాల్లో రోడ్‌హౌండ్‌లు స్థిరంగా డ్రైవింగ్ చేసేందుకు కావాల్సిన టైర్ గ్రిప్‌ను అందిస్తాయి. ప్రత్యేక ట్రాక్‌లో వీటిని పరీక్షించాము.

టీవీఎస్ యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ టైర్లులో ఇతర టైర్ల కంటే స్పష్టమైన మార్పులు గమనించవచ్చు. ట్రాక్ సహా ఇతర రోడ్లపై ఈ టైర్లు అద్బుత పనితీరును కనబరిచాయి. రేస్ ట్రాక్‌లపై ట్విస్ట్, టర్న్‌లోను ఆస్వాదించేందుకు రోడ్‌హౌండ్ టైర్లు సరైన గ్రిప్‌ను అందిస్తాయి. మొత్తంగా మిగిలిన టైర్లతో పోల్చితే యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ ప్రత్యేకంగా నిలుస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








