TVS యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ టైర్ల వీడియో రివ్యూ.. బైక్‌తో సంబంధం లేకుండా..!!
TVS యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ అనేది కొత్త క్వాడ్ కాంపౌండ్ టైర్. ఇది సరికొత్త రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. కొత్త రోడ్‌హౌండ్ టైర్ల తయారీ సహా ఇతర వివరాలు తెలుసుకొనేందుకు టీవీఎస్ యూరోగ్రిప్ మమ్మల్ని ఆహ్వానించింది. అందుకోసం కోయంబత్తూరులోని కారీ మోటార్ స్పీడ్‌వేలో పరీక్షించేందుకు వెళ‌్లడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ ట్రాక్‌లో ఎలాంటి పనితీరు కనబరుస్తుంది. రోడ్లపై ఎలాంటి సౌకర్యం ఉంటుంది. రేసింగ్ ట్రాక్‌లపై ట్విస్ట్, టర్న్‌లోనూ ఎలా పనిచేస్తుంది. మిగిలిన టైర్లతో పోలిస్తే యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ ప్రత్యేకత ఏంటి వంటి పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి. రోడ్‌హౌండ్ వీడియో రివ్యూపై మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలియజేయండి.
టీవీఎస్ యూరోగ్రిప్ రోడ్‌హౌండ్ ముందు టైర్లు ఒకే సైజులో అందుబాటులో ఉన్నాయి. ముందు టైర్లు 120/70 యూనిట్ ధర రూ.12,999గా ఉంది. వెనుక టైర్లు రెండు సైజుల్లో అందుబాటులో ఉంటాయి. 160/60 ధర రూ.14,999 మరియు 180/55 ధర రూ.16,999కు అందుబాటులో ఉన్నాయి.

బైక్‌లతో సంబంధం లేకుండా రోడ్‌హౌండ్ టైర్లు ఒకే రకమైన పనితీరును కనబరిచాయి. రోడ్‌హౌండ్ టైర్లు ప్రారంభం నుంచి మెరుగైన గ్రిప్‌ను అందించాయి. చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కలిగించాయి. ఎలాంటి రోడ్లపైనైనా ఎటువంటి ఆందోళన లేకుండా ఈ టైర్లతో డ్రైవింగ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








