టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో: ఏది బెస్ట్?

By Ravi

ఇదివరకటి కథనంలో మనం పవర్‌పుల్ హోండా డియో, హెవీ డ్యూటీ హీరో మ్యాస్ట్రో, స్టయిలిష్ యమహా రే స్కూటర్లలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుంన్నాం. ఇప్పుడు తాజాగా ఈ స్కూటర్ సెగ్మెంట్లోకి మరొక కొత్త మోడల్ వచ్చి చేరింది. అదే టీవీఎస్ జూపిటర్. చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ లభిస్తున్న లేటెస్ట్ మోడల్ ఇది.

లేట్‌గా వచ్చినప్పటికీ లేటెస్ట్‌గా వచ్చిన 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఈ సెగ్మెంట్లో హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మరి ఈ మూడు స్కూటర్ల (టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో)లో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి. మరిన్ని వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో: ఏది బెస్ట్?

టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో స్కూటర్లలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఓవర్‌వ్యూ - టీవీఎస్ జూపిటర్

ఓవర్‌వ్యూ - టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ అందిస్తున్న వెగో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని జూపిటర్ స్కూటర్‌ను తయారు చేశారు. బేసిగ్గా ఈ రెండు మోడళ్లు డిజైన్, ఫీచర్ల పరంగా తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. టీవీఎస్ జూపిటర్‌ను ప్రత్యేకించి పురుషులను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లో ప్రవేశపెట్టారు.

* దేశీయ విపణిలో దీని ధర రూ.44,200 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఓవర్‌వ్యూ - హోండా యాక్టివా

ఓవర్‌వ్యూ - హోండా యాక్టివా

హోండా యాక్టివా స్కూటర్ గురించి స్కూటర్ ప్రియులకు కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత్‌లోని పాపులర్ స్కూటర్లలో నెంబర్ వన్‌గా ఉన్నది ఇదే. దీని డిజైన్ కాస్తంత పాతదిగా అనిపించినప్పటికీ, పెర్ఫామెన్స్, మైలేజ్ వంటి అంశాల్లో ఇది కింగ్ అనిపించుకుంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా దీనిని ఎవరైనా రైడ్ చేయొచ్చు.

* దేశీయ విపణిలో హోండా యాక్టివా ధర రూ.49,965 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఓవర్‌వ్యూ - హీరో మ్యాస్ట్రో

ఓవర్‌వ్యూ - హీరో మ్యాస్ట్రో

హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) నుంచి లభిస్తున్న పవర్‌ఫుల్ స్కూటర్ హీరో మ్యాస్ట్రో. ప్రత్యేకించి పురుషులను టార్గెట్ చేసుకొని విక్రయిస్తున్న స్కూటర్ ఇది. దీనిని హోండా అందిస్తున్న ఏవియో ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. ఇందులోని ఇంజన్ కూడా హోండా నుంచి గ్రహించినదే. అయితే, ఇందులో హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ) మాత్రం లేదు.

* దేశీయ విపణిలో హీరో మ్యాస్ట్రో ధర రూ.46,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

స్టయిలింగ్ - టీవీఎస్ జూపిటర్

స్టయిలింగ్ - టీవీఎస్ జూపిటర్

జూపిటర్‌ను సైడ్ నుంచి గమనిస్తే, ఇది యాక్టివా, మ్యాస్ట్రోల మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇది ఆ రెండింటి కన్నా తేలికైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేకించి ఈ స్కూటర్‌లో ట్విన్ ఫ్రంట్ సిటీ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వి షేపులో ఉండే బాడీ లైన్స్ మరింత విజువల్ అప్పీరెన్స్‌ను అందిస్తాయి.

స్టయిలింగ్ - హోండా యాక్టివా

స్టయిలింగ్ - హోండా యాక్టివా

హోండా యాక్టివా డిజైన్ సింపుల్‌గా ఉంటుంది, అయినప్పటికీ ధృఢంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగిన ఫ్యాన్సీ ఫీచర్లేమీ లేవు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక చక్కటి ఫ్యామిలీ స్కూటర్ అనొచ్చు.

స్టయిలింగ్ - హీరో మ్యాస్ట్రో

స్టయిలింగ్ - హీరో మ్యాస్ట్రో

స్టయిలింగ్ విషయంలో హీరో మ్యాస్ట్రో, టీవీఎస్ జూపిటర్‌లో ఒకే ట్రెండ్‌ను కలిగి ఉంటాయి. ఉదాహరణగా ట్విన్ ఫ్రంట్ లైట్స్, వి షేప్డ్ బాడీ స్కల్ప్ట్, ఒకేవిధమైన స్టయిల్‌తో కూడిన సైడ్ ప్యానెల్స్ చెప్పుకోవచ్చు. మ్యాస్ట్రోలో డ్యూయెల్ కల్ మిర్రర్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మొత్తమ్మీద చూస్తే, ఇది యాక్టివా మాదిరిగా సింపుల్ డిజైన్‌ను కలిగి లేదు, అలాగని జూపిటర్ మాదిరిగా ఆకర్షనీయమై డిజైన్ కలిగి లేదు.

ఇంజన్, మైలేజ్ - టీవీఎస్ జూపిటర్

ఇంజన్, మైలేజ్ - టీవీఎస్ జూపిటర్

* ఇంజన్: 107.7సీసీ

* పవర్: 7.88 బిహెచ్‌పి

* టార్క్: 8 ఎన్ఎమ్

* సర్టిఫైడ్ మైలేజ్: 62 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్: 43-47 కెమ్‌పిఎల్

* ఫ్యూయెల్ కెపాసిటీ: 5.3 లీటర్లు

ఇంజన్, మైలేజ్ - హోండా యాక్టివా

ఇంజన్, మైలేజ్ - హోండా యాక్టివా

* ఇంజన్: 109సీసీ

* పవర్: 8 బిహెచ్‌పి

* టార్క్: 8.74 ఎన్ఎమ్

* సర్టిఫైడ్ మైలేజ్: 60 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్: 45-49 కెమ్‌పిఎల్

* ఫ్యూయెల్ కెపాసిటీ: 5.3 లీటర్లు

ఇంజన్, మైలేజ్ - హీరో మ్యాస్ట్రో

ఇంజన్, మైలేజ్ - హీరో మ్యాస్ట్రో

* ఇంజన్: 109సీసీ

* పవర్: 8 బిహెచ్‌పి

* టార్క్: 9.10 ఎన్ఎమ్

* సర్టిఫైడ్ మైలేజ్: 60 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్: 35-40 కెమ్‌పిఎల్

* ఫ్యూయెల్ కెపాసిటీ: 5.3 లీటర్లు

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - టీవీఎస్ జూపిటర్

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - టీవీఎస్ జూపిటర్

ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక గ్యాస్ ఫిల్డ్ హైడ్రాలిక్ సస్పెన్షన్లతో ఇది ఎలాంటి రోడ్లపై కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఉంటాయి. బ్రేక్స్ విషయానికి ఈ స్కూటర్‌లో 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఉన్నాయి. వెగో మాదిరిగా డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - హోండా యాక్టివా

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - హోండా యాక్టివా

ఇందులో ముందు వైపు స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. గతుకుల రోడ్లపై వెళ్లినప్పుడు ఇది అంత సౌకర్యవంతంగా అనిపించదు. ఇందులో స్టీల్ వీల్స్ మాత్రమే ఉంటాయి, అల్లాయ్ వీల్స్ ఉండవు. ట్యూబ్‌లెస్ టైర్లు, 130 మి.మీ. డ్రైమ్ బ్రేక్స్ ఉంటాయి. యాక్టివాలో కొత్తగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అనే ఫీచర్ లభిస్తుంది. దీని వలన బ్రేక్ వేసినప్పుడు ముందు, వెనుక బ్రేక్‌లు ఒకేసారి అప్లయ్ అయ్యి, బ్రేకింగ్ దూరాన్ని తగ్గిస్తాయి.

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - హీరో మ్యాస్ట్రో

సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ - హీరో మ్యాస్ట్రో

యాక్టివాలో ఉన్న సస్పెన్షన్ సమస్యే మ్యాస్ట్రోలోను ఉంది. ఇది కూడా ముందు వైపు స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్‍‌తోనే లభిస్తుంది. ఇందులో కూడా మెటల్ వీల్సే ఉంటాయి. అయితే, టైర్లు మాత్రం ట్యూబ్‌లెస్ టైర్లు కాదు. ఇకపోతే బ్రేక్స్ కూడా యాక్టివా కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఈ మూడు స్కూటర్లలో కెల్లా టీవీఎస్ జూపిటర్‌లో అనేక విశిష్టమైన ఫీచర్లు లభిస్తాయి. మొదటగా, ట్యాంక్‌లో ఇంధనం తక్కువగా ఉందని చూపించే లో ఫ్యూయెల్ ఇండికేటర్, మంచి మైలేజ్ కోసం నిర్ధిష్ట వేగాన్ని మెయింటైన్ చేసేలా రైడర్‌కు సహకరించే ఎకోనోమీటర్.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

సీట్ క్రింద ఏర్పాటు చేసిన బ్యాగ్ హుక్ సరైన ఎత్తులో ఉంటుంది, అవసరం లేదనుకుంటే దీనిని తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్‌లో ట్విన్ సిటీ ల్యాంప్స్‌కు అదనంగా హెడ్‌ల్యాంప్‌లో మరో రెండు పైలట్ ల్యాంప్స్ ఉంటాయి.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఇందులో ఓ డెడికేటెడ్ పాస్ లైట్ స్విచ్ కూడా ఉంటుంది. వెనుక వైపు విద్యుత్‌ను ఆదా చేసేలా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కూడా ఉంటుంది.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్‌లో సీట్ క్రింద 17 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ఓ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో మొబైల్‌ను ఛార్జ్ చేసుకునేందుకు ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది.

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఫీచర్స్ లిస్ట్ - టీవీఎస్ జూపిటర్

ఇతర స్కూటర్ల మాదిరిగా పెట్రోల్‌ను నింపుకోవటానికి సీట్‌ను పైకి లేపాల్సిన అవసరం లేదు. ఇందులో బయటి వైపే ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ ఉంటుంది.

ఫీచర్స్ లిస్ట్ - హోండా యాక్టివా

ఫీచర్స్ లిస్ట్ - హోండా యాక్టివా

ఫీచర్ల పరంగా జూపిటర్‌తో పోల్చుకుంటే యాక్టివా చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. యాక్టివాలో బేసిక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 18 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో పెట్రోల్ నింపుకోవాలంటే, ప్రతిసారి సీట్‌ను అన్‌లాక్ చేసి పైకి లేపాల్సి ఉంటుంది. ఇది రైడర్లకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంటుంది.

ఫీచర్స్ లిస్ట్ - హీరో మ్యాస్ట్రో

ఫీచర్స్ లిస్ట్ - హీరో మ్యాస్ట్రో

హీరో మ్యాస్ట్రో కూడా అంతే, జూపిటర్‌తో పోల్చుకుంటే, ఇందులోని ఫీచర్లు చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అయితే, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మాత్రం అనలాగ్, డిజిటల్ కాంబినేషన్‌తో లభిస్తుంది.

చివరిగా ఏది బెస్ట్..?

చివరిగా ఏది బెస్ట్..?

ఈ మూడు స్కూటర్లలో ఏది బెస్ట్ అని అడిగితే డౌట్ లేకుండా టీవీఎస్ జూపిటర్ అని చెప్పాలి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా అధునాత ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దారు. ఇతర స్కూటర్లలో లభ్యం కాని ఫీచర్లు ఇందులో లభిస్తాయి. కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా, ధర విషయంలో కూడా ఇది యాక్టివా, మ్యాస్ట్రోల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ మూడింటిలో మా ఓటు టీవీఎస్ జూపిటర్‌కే..!!

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2013, 17:47 [IST]
English summary
With the launch TVS Jupiter, buyers have yet another 110cc model to choose from - not that we are complaining, in fact its the contrary. In this post we have slotted the new TVS Jupiter up against other similarly styled models, Honda Activa and Hero Maestro. This guide should come in handy to prospective buyers and help them in making a decision.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+