TVS Ronin రివ్యూ.. మీ ప్రశ్నలన్నింటికీ ఇదే సమాధానం

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఇటీవల కొత్త 'రోనిన్' (Ronin) మోటార్ సైకిల్ విడుదల చేసింది. ఈ బైక్ చూడగానే ఇది కొంత బలహీనంగా ఉంటుంది అనే కొన్ని సంభాషణలు వినిపించాయి. అయితే ఈ సంభాషణలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి మేము ఈ లేటెస్ట్ బైక్ రైడ్ చేసాము.

Recommended Video

TVS Ronin యాక్ససరీస్ ప్యాక్ | వివరాలు

టీవీఎస్ కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ మమ్మల్ని ఎంతగానో ఆకర్శించింది. అయితే ఇది రైడ్ చేయడానికి ఎలా ఉంది, ఈ కొత్త బైక్ స్క్రాంబ్లర్ బైకా, క్రూయిజర్ బైకా లేదా రోడ్‌స్టర్ బైకా..? ఇందులో ఇంజిన్ పనితీరు ఎలా ఉంది మరియు ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఈ రివ్యూ ద్వారా.. మీ కోసం.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

TVS Ronin డిజైన్ మరియు స్టైల్:

టీవీఎస్ కంపెనీ యొక్క బైకులు సాధారణంగా చూడటానికి చాలా సింపుల్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. కావున ఈ కొత్త రోనిన్ మోటార్ సైకిల్ మొదటి చూపులోనే మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. అయితే ఇది చూడగానే మా మనసులో ఒక ప్రశ్న మొదలైంది. అదేమిటంటే ఈ బైక్ 'స్క్రాంబ్లర్ బైకా, క్రూయిజర్ బైకా లేదా రోడ్‌స్టర్ బైకా' అని. అయితే ఇది కంపెనీ యొక్క సెగ్మెంట్లోనే కొంత భిన్నంగా ఉంది. కావున ఈ బైక్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ బైక్ పుల్ బ్యాక్ హ్యాండిల్‌బార్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. అయితే సీటు మరియు ఫెండర్‌లు క్రూయిజర్‌ బైక్ లో కనిపించే విధంగా ఉంటుంది. కానీ ఫుట్‌పెగ్‌లు, ఎగ్జాస్ట్ మరియు రౌండ్ హెడ్‌ల్యాంప్ వంటివి రోడ్‌స్టర్‌లలో మాదిరిగా ఉన్నాయి. అదే సమయంలో టైర్లు మరియు ఆఫ్‌సెట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి స్క్రాంబ్లర్‌ మోడల్ లో కనిపించే విధంగా ఉన్నాయి.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఈ బైక్ యొక్క ముందు భాగంలో టి-షేప్ కలిగిన రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ హెడ్‌ల్యాంప్ టీవీఎస్ సెగ్మెంట్‌లోనే చాలా పవర్ పుల్ గా ఉంది. అంతే కాకుండా టీవీఎస్ కంపెనీ యొక్క ఇతర ఏ మోటార్ సైకిల్స్ లోనూ ఈ తరహా హెడ్‌ల్యాంప్ లేదు. మేము ఈ బైక్ ని రాత్రి సమయంలో రైడ్ చేయలేదు, కానీ పగటిపూట రైడ్ చేసాము ఆ సమయంలో రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డ్‌ లైటింగ్ ని బట్టి ఇది చాలా శక్తివంతమైనదని చెబుతున్నాము.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఇందులో షోవా బిగ్-పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ గోల్డ్ కలర్ లో పూర్తి చేయబడి ఉన్నాయి. కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ కేవలం మిడ్ మరియు టాప్-స్పెక్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ లో బ్లాక్ కలర్ లో ఉంది. ఈ బైక్ యొక్క ఫ్రంట్ మడ్‌గార్డ్ మెటల్‌తో తయారు చేయబడి ఉంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఈ బైక్ లో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇందులోని సింగిల్-పాడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ యూనిట్. ఇక ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ 14 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంది. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ఒక ఫుల్ ట్యాంక్ తో గరిష్టంగా 400 కిమీ పరిధికి అందిస్తుంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్‌ అద్భుతమైన పెయింటింగ్ స్కీమ్ పొందుతుంది. ముఖ్యంగా ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఆకర్షణీయమైన వెయిటింగ్ స్కీమ్ చూడవచ్చు. బేస్ వేరియంట్ కేవలం సింగిల్-టోన్ కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మేము టీవీఎస్ రోనిన్ యొక్క టాప్-స్పెక్ ట్రిపుల్ టోన్ డ్యూయెల్ ఛానల్ వేరియంట్‌ రైడ్ చేసాము. ఇది డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది చాలావరకు బూడిద రంగును కలిగి ఉంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కింద ఒక ప్లాస్టిక్ ప్యానెల్ లభిస్తుంది. సైడ్ ప్యానెల్‌లు రోనిన్ బ్యాడ్జింగ్‌ను పొందుతాయి.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఇక సీటింగ్ విషయానికి వస్తే, టీవీఎస్ రోనిన్ చాలా సౌకర్యవంతమైన సీటును పొందుతుంది. రైడింగ్ సమయంలో కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క వెనుక భాగంలో ఎల్ఈడీ లైటింగ్ ఉంది. మొత్తం మీద టీవీఎస్ రోనిన్ యొక్క డిజైన్ అందరిని ఆకట్టుకునేలా ఉంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

TVS Ronin ఫీచర్లు:

ఇప్పుడు టీవీఎస్ రోనిన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మొదటగా ప్రీమియం మోటార్‌సైకిల్ కాదు, ఎందుకంటే ఇది ఒక ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్. కావున ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ ఫీచర్స్ లో మొదటగా చెప్పుకోవలసినది రౌండ్ ఎల్‌సిడీ ఇన్స్ట్రుమెంటేషన్ యూనిట్. ఇందులో అనేక ఫంక్షన్స్ నిర్వహించడానికి టెల్-టేల్ లైట్స్ ఉన్నాయి. లోపలి భాగంలో చిన్న ఎల్‌సిడీ స్క్రీన్ ఉంది. ఇది బైక్ గురించి ఎక్కువ సమాచారం అందిస్తుంది. కావున మీరు స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్స్ మరియు ఫ్యూయల్ గేజ్ వంటి వాటితోపాటు క్విక్ ఫ్యూయెల్ కెపాసిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి వాటిని కూడా పొందుతారు.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. కావున మీ స్మార్ట్‌ఫోన్‌కి జత చేసుకోవచ్చు. ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా మీ ఫోన్ కాల్స్ స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అంతే కాకుండా మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయవచ్చు.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ మూడు-దశల అడస్టబుల్ బ్రేక్ మరియు క్లచ్ లివర్‌లను కలిగి ఉంటుంది. కావున సౌకర్యవంతమైన మరియు నమ్మకమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ ఈ ఫీచర్ ను కేవలం టాప్-స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందించింది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

TVS Ronin ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:

ఇప్పుడు మనం ఈ కొత్త టీవీఎస్ రోనిన్ ఇంజిన్ ఎలాంటి పనితీరుని అందిస్తుంది, రైడింగ్ చేయడానికి ఎలా ఉంది అనే వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున టీవీఎస్ రోనిన్ 225.9 సిసి ఎయిర్ & ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఇంజిన్ ఆధారంగా రూపొందించడం జరిగింది. కానీ ఇందులో కొన్ని మార్పులు ఉన్నాయి.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ కంపెనీ ఇప్పుడు కేవలం రేస్ ట్రాక్ కోసం కాకుండా తక్కువ మరియు మిడ్-రేంజ్ ట్రాక్టబిలిటీ కోసం రూపిందించింది. ఇందులోని బోర్ మరియు స్ట్రోక్ 66 మిమీ వరకు ఉంది. కావున ఇది మంచి పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తం మీద కంపెనీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించింది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ యొక్క ఇంజిన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20.12 బిహెచ్‌పి పవర్ మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 19.93 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మొదట మీరు ఈ బైక్ చూడగానే ఇది మంచి పనితీరుని అందించగలదా అనే అనుమానం తలెత్తవచ్చు, కానీ మీరు ఈ బైక్ రైడింగ్ ప్రారంభించగానే మీ అనుమానం తప్పు అని స్ఫష్టంగా అర్థమవుతుంది. సీట్ ఎత్తు రైడర్ కి తగిన విధంగా ఉంది. అదే సమయంలో ఇందులోని పుల్ బ్యాక్ హ్యాండిల్‌బార్ చాలా సౌకర్యవంతంగా ఉంది. రైడింగ్ పొజిషన్ కూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. కావున మీరు అద్భుతమైనరైడింగ్ అనుభూతిని తప్పకుండా ఆస్వాదిస్తారు.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఈ బైక్ లోని స్టార్ట్ బటన్ నొక్కి స్టార్ట్ చేయగానే చాలా సున్నితంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టీవీఎస్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మోటారును ఉపయోగించింది, కావున ఇది ఎక్కువ సౌండ్ చేసే అవకాశం లేదు. ఇందులో గ్లైడ్ త్రూ టెక్నాలజీ అందుబాటులో ఉంది. కావున తక్కువ వేగంలో కూడా బైక్ ఎక్కడా నిలిచిపోకుండా ఉండటానికి అనుమతిస్తుంది, అంతే కాకుండా ఇది టాఫిక్ లో చాలా అనుకూలంగా ఉంటుంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

మేము సుందర ప్రదేశమైన గోవా రోడ్లపైన వర్షంలో రైడ్ చేసాము. నిజంగా ఆ అనుభూని మమ్మల్ని ఎంతగానో మంత్రముగ్దుల్ని చేసింది. మేము గంటకు 100 కిమీ వేగంతో రైడింగ్ చేసాము. అయితే ఈ బైక్ ట్రిపుల్ డిజిట్ వేగంలో కొంత ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. అయితే గంటకు 90 కిమీ వరకు చాలా సౌకర్యవంతంగా అనిపించింది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ 4,500 ఆర్‌పిఎమ్ వద్ద కూడా అద్భుతమైన రైడింగ్ ఆస్వాదించవచ్చు. అయితే 3,750 ఆర్‌పిఎమ్ వరకు రైడింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంది. రోనిన్ బైక్ ఒక 'ఫన్-టు-రైడ్ మోటార్‌సైకిల్‌'. ఇది 3,750 ఆర్‌పిఎమ్ నుంచి 7,750 ఆర్‌పిఎమ్ వరకు కూడా మీరు మంచి రైడింగ్ పొందవచ్చు.

మేము సింగిల్ గా రైడింగ్ చేయడమే కాకుండా పిలియన్ తో పాటు కూడా రైడింగ్ చేసాము. పిలియన్ ఉన్నప్పుడు కూడా టీవీఎస్ రోనిన్ మంచి పనితీరుని అందించింది. 2,000 ఆర్‌పిఎమ్ వరకు సౌకర్యవంతంగా ఉంది. ఆ తరువాత 3,750 ఆర్‌పిఎమ్ చేరుకోగానే మీ ఫన్ రైడ్ ప్రారంభమవుతుంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ మంచి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో షోవా బిగ్-పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ ఉంది, వెనుక వైపు మోనోషాక్ సెటప్ ఉంది. కావున ఎలాంటి రహదారిలో అయినా మీరు సులభంగా రైడింగ్ చేయవచ్చు. మూలలలో కూడా మీ రైడింగ్ ని మరింత సులభతరం చేస్తుంది. అయితే ఇది రేస్ ట్రాక్ లో ఉపయోగించడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

గోవా ప్రాంతంలో మరియు హైవేపై మేము చాలా వంకరగా ఉన్న రోడ్లమీద రైడింగ్ చేయాల్సి వచ్చింది. ఇది అలనాటి రోడ్డులో కూడా సజావుగా ముందుకు దూసుకెళ్లింది.

రోనిన్ యొక్క బ్రేకింగ్ సిస్టం గురించి మాట్లాడాలనుకుంటే, ఈ బైక్ యొక్క ముందు వైపు 300 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అయితే మేము టాప్-స్పెక్ వేరియంట్‌ రైడ్ చేసాము కావున ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతుంది. మొత్తం మీద బ్రేకింగ్ చాలా షార్ప్ గా అనిపించింది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

ఇందులో రెయిన్ మరియు అర్బన్ అనే రెండు ఎబిఎన్ మోడ్‌లు ఉన్నాయి. గోవాలో రైడ్ చేసే సమయంలో వర్షాభావం కారణంగా వర్షంలో రైడ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇందులోకి టైర్లు కూడా మంచి పట్టుకి అందించాయి. ఇందులోని యూరోగ్రిప్ రెమోరా టైర్లు డ్యూయెల్ పర్పస్ టైర్లు కావున రైడింగ్ సమయంలో మంచి పట్టుని అందించాయి. మొత్తం మీద టీవీఎస్ రోనిన్ పనితీరుని తనకు తానే సాటి అనేలా తయారుచేయబడింది.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

TVS Ronin వేరియంట్స్ మరియు కలర్ ఆప్సన్స్:

ఇప్పుడు టీవీఎస్ కంపెనీ కొత్తగా విడుదలాచేసిన ఈ రోనిన్ బైక్ లో అద్భుతమైన కలర్ ఆప్సన్స్ అందించింది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇది మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి టీవీఎస్ రోనిన్ సింగిల్ టోన్ సింగిల్ ఛానల్, టీవీఎస్ రోనిన్ డ్యూయెల్ టోన్ సింగిల్ ఛానల్ మరియు టీవీఎస్ రోనిన్ ట్రిపుల్ టోన్ డ్యూయెల్ ఛానల్.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ సింగిల్ టోన్ సింగిల్ ఛానల్:

టీవీఎస్ యొక్క సింగిల్ టోన్ సింగిల్ ఛానల్ వేరియంట్ అనేది కంపెనీ విడుదల చేసిన రోనిన్ బేస్ వేరియంట్. దీని రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్ కేవలం సింగిల్ టోన్ కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి మాగ్మా రెడ్ మరియు లైట్నింగ్ బ్లాక్ కలర్లు.

ఈ సింగిల్ టోన్ వేరియంట్ యొక్క అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ బ్లాక్‌లో కలర్ లో పూర్తి చేయబడ్డాయి. ఇది బేస్ వేరియంట్ కావున ఇందులో ఎలాటి కనెక్టివిటీ ఫీచర్‌లు లేదు. ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. కానీ అడ్జస్టబుల్ లివర్లు కూడా లేవు.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ డ్యూయెల్ టోన్ సింగిల్ ఛానల్:

ఇక టీవీఎస్ రోయిన్ యొక్క రెండవ మోడల్ ఈ డ్యూయెల్ టోన్ సింగిల్ ఛానల్. దీని ధర రూ. 1.58 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఈ లైనప్ లో మడిలో ఉటుంది. అయితే ఇందులోని అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ గోల్డెన్ కలర్ లో ఆకర్షణీయంగా ఉంది.

టీవీఎస్ రోనిన్ డ్యూయెల్ టోన్ సింగిల్ ఛానల్ వేరియంట్ డెల్టా బ్లూ మరియు స్టార్‌గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ వేరియంట్ యొక్క అల్లాయ్ వీల్స్‌పై రెడ్ పిన్‌స్ట్రైప్ స్టిక్కర్‌లను గుర్తించవచ్చు.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

టీవీఎస్ రోనిన్ ట్రిపుల్ టోన్ డ్యూయెల్ ఛానల్:

ఇక చివరగా టీవీఎస్ రోనిన్ యొక్క టాప్ వేరియంట్ ఈ ట్రిపుల్ టోన్ డ్యూయెల్ ఛానల్. దీని ధర 1.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది గెలాక్టిక్ గ్రే కలర్ లో ఉంటుంది. అంటే ఇది గ్రే మరియు బ్లాక్ లేదా డాన్ ఆరెంజ్ మిశ్రమం. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

టీవీఎస్ రోనిన్ ట్రిపుల్ టోన్ డ్యూయెల్ ఛానల్ వేరియంట్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందటమే కాకుండా అడ్జస్టబుల్ లివర్స్ కూడా పొందుతుంది. ఇందులోని అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ గోల్డెన్ కలర్ లో ఆకర్షణీయంగా ఉంది. మొత్తం మీద ఈ మూడు వేరియంట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

TVS Ronin రివ్యూ: దీని ఫెర్ఫామెన్స్ వేరే లెవెల్ గురూ..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టీవీఎస్ కంపెనీ తన రోనిన్ బైక్ లాంచ్ చేసే సమయంలో #Unscripted మరియు #NewWayOfLife అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించింది. ఎందుకంటే ఈ కొత్త బైక్ కంపెనీ సెగ్మెంట్లో ఉన్న బైకులకు కొంత భిన్నంగా ఉంటుంది. మరియు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ రైడింగ్ చేసినప్పుడు ఇవి రెండూ నిజమే అని తెలిశాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
Tvs ronin review riding impressions engine specs performance features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X