కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' గత సంవత్సరం తన పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విడుదల చేసింది. ఇందులో ఒకటి అల్ట్రావయోలెట్ ఎఫ్77 కాగా మరొకటి రీకాన్.

భారాతదేశంలో విడుదలైనప్పటి నుంచి కుర్రకారు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉర్రూతలూగిపోతున్నారు. ఇటీవల మేము బెంగళూరులో అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్ రైడ్ చేసాము. ఈ బైక్ ధర మార్కెట్లో రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ బైక్ డిజైన్ ఏమిటి, ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంది, ఛార్జింగ్ టైమ్ ఏంటి మరియు రేంజ్ ఎంత ఇస్తుంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అల్ట్రావయోలెట్ F77 రివ్యూ

అల్ట్రావయోలెట్ F77 రీకాన్ డిజైన్ మరియు ఫీచర్స్:

ఆధునిక కాలంలో యువ రైడర్స్ ఇష్టపడే అద్భుతమైన డిజైన్ ఈ 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' లో చూడవచ్చు. ఇది చూడగానే ఆకర్శించే విధంగా రూపొందించబడింది. ముందు భాగంలో యాంగ్యులర్ హెడ్‌లైట్ ఉంటుంది. డ్యూయల్ పాడ్ లైటింగ్ కాన్ఫిగర్ మూడు ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ మాదిరిగా షార్ప్ గా ఉంటాయి. అప్సైడ్డౌన్ ఫోర్క్‌లు వాటి ఏరో కవర్‌లతో ఫ్రంట్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ లేటెస్ట్ బైకులో 17 ఇంచెస్ వీల్స్ కొత్తగా డిజైన్ చేయబడిన MRF రబ్బరుతో ఉండటం ఇక్కడ చూడవచ్చు. సైడ్ నుంచి చూసినప్పుడు కూడా ఇది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ జెట్ ఫైటర్‌ల మాదిరిగానే ప్రతి ప్యానెల్ ప్రెస్ ఫిట్‌గా అమర్చబడి ఉంటుంది. కావున మీరు సైడ్ ప్రొఫైల్ లో నట్స్ గానీ బోల్ట్ వంటి వాటిని గానీ చూసే అవకాశం లేదు. మొత్తం కప్పబడి ఉంటుంది.

కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ F77 రీకాన్ రివ్యూ

ఈ కొత్త బైకులో ఛార్జింగ్ పాయింట్ అనేది సాధారణ బైకులలో ఉంటే ఫ్యూయెల్ ట్యాంక్ వద్ద ఉంటుంది. ఎందుకంటే ఈ బైకులో ఫ్యూయెల్ ట్యాంక్ ఉండదు, కావున ఆ ప్రాంతంలో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇది మొత్తం కప్పబడి ఉంటుంది, కావున ఎక్కువ రక్షణ పొందుతుంది. ఈ బైక్ లో ఉండే ఈ భాగం రైడర్ రైడింగ్ చేసేటప్పుడు మంచి పట్టుని అందించడానికి ఉపయోగపడతాయి.

ఈ బైకులో ఫంక్షనల్ క్రాష్ గార్డ్‌గా కూడా పనిచేసే చిన్న ఏరో వింగ్‌లెట్ కూడా కనిపిస్తుంది. ఇందులో టూ స్టెప్స్ సీటు కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ సీటు తక్కువ ఎత్తులో ఉండగా, పిలియన్ సీటు చాలా ఎత్తులో ఉండటం చూడవచ్చు. వెనుక వైపు ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. అయితే రియర్ టైర్ హగ్గర్ లేదు. వెనుక ఉండే వీల్ మరియు టైర్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా చేయడం జరిగింది.

అల్ట్రావయోలెట్ F77 రివ్యూ

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో TFT డిస్‌ప్లే హ్యాండిల్‌బార్‌ మీద ఉండటం చూడవచ్చు. అయితే ఇది టచ్‌స్క్రీన్ కాదు. ఈ బైక్ యొక్క ఎడమవైపు స్విచ్‌లు మరియు బటన్‌లు కూడా ఉన్నాయి. ఇందులో మీరు ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బైక్ స్పీడ్, రైడింగ్ మోడ్ మరియు నావిగేషన్ వంటి వాటిని తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. మొత్తం మీద ఫీచర్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

అల్ట్రావయోలెట్ F77 రీకాన్ పవర్‌ట్రెయిన్:

అల్ట్రావయోలెట్ F77 రీకాన్ లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇందులో అమర్చిన బ్యాటరీ ప్యాక్. ఎందుకంటే భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటివరకు బ్యాటరీ ప్యాక్ ఇందులో అమర్చబడి ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. అవి 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇవి రెండూ కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే, ఇది కేవలం అల్ట్రావయోలెట్ F77 వెర్షన్ లో మాత్రమే అందుబటులో ఉంటుంది. ఇది ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 206 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని తెలిపారు, కానీ వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య ఈ రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌ 36.2 బిహెచ్‌పి పవర్ మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

అల్ట్రావయోలెట్ F77 రీకాన్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలోనే అతి పెద్దది అని చెప్పవచ్చు. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో 307 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. వస్తావ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య ఈ రేంజ్ 261 కిమీ వరకు ఉంటుంది.

ఎఫ్77 రీకాన్ వేరియంట్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌ 38.88 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఇది 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 147 కిమీ వరకు ఉంటుంది. కావున ఈ బైక్ అద్భుతమైన పనితీరుని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పర్ఫామెన్స్ లో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కొలతల పరంగా చాలా వరకు ఒకేవిధంగా ఉంటాయి. కావున ఈ ఎలక్ట్రిక్ బైకు యొక్క వీల్‌బేస్ 1,340 మిమీ, సీటు ఎత్తు 800 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లు గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్ అనే రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. బ్యాటరీ ఛార్జ్ 70 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు బాలిస్టిక్ మోడ్‌ ఉపయోగించవచ్చు.

F77 మరియు F77 రీకాన్ రెండూ కూడా స్టాండర్డ్ ఛార్జర్‌తో వస్తాయి. ఇవి ఒక గంట ఛార్జ్ చేస్తే 35 కిమీ ప్రయాణించడానికి కావలసిన ఛార్జ్ చేసుకోగలవు. ఈ బైకులను ఒక ఫుల్ నైట్ ఛార్జ్ చేయకుండా ఉండటమే మంచిది. F77 రీకాన్ బైక్ అల్యూమినియం బల్క్‌హెడ్‌తో స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ పొందుతుంది. ఇందులో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపు మోనోషాక్‌ వంటివి ఉంటాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఎఫ్77 రీకాన్ ముందు భాగంలో 4 రేడియల్ పిస్టన్ కాలిపర్‌లతో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో ఒకే పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 230 మిమీ యూనిట్ పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందు భాగంలో 110/70 సెక్షన్ టైర్ మరియు వెనుక భాగంలో 150/60 టైర్ పొందుతుంది. ఇది 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి ఉపయోగపడతాయి.

అల్ట్రావయోలెట్ F77 రీకాన్ రైడింగ్ ఇంప్రెషన్స్:

ఇక చివరగా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఈ బైక్ రైడింగ్ ఇంప్రెషన్స్.. అల్ట్రావయోలెట్ F77 రీకాన్ మొత్తం మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్ మోడ్స్. నిజానికి ఈ బైక్ మొదటి రైడ్ చేసేవారు గ్లైడ్ ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ బైక్ అలవాటయ్యే వరకు ఈ మోడ్ లో మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. తరువాత కంబాట్ మోడ్ అలవాటు చేసుకోవచ్చు.

ఇక బాలిస్టిక్ మోడ్ విషయానికి వస్తే, ట్రాక్ లో ప్రయాణించే వారికి ఇది ఉత్తమంగా ఉంటుంది. నిజానికి ఈ బైక్ యొక్క మొత్తం సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఈ మోడ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గరిష్ట వేగంలో మీరు బైక్ రైడ్ చేసేటప్పుడు మీకు ఈ మోడ్ లో రైడింగ్ అనుభూతి చాలా గొప్పగా అనిపిస్తుంది. కావున ఈ బైక్ అద్భుతమైన పనితీరుని అందిస్తుందని చెప్పవచ్చు.

ఈ బైక్ యొక్క అద్భుతమైన సస్పెన్షన్ సెటప్, రియర్ సెట్ ఫుట్‌పెగ్‌లు, సపోర్టివ్ ఫెయిరింగ్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ ప్యాడ్‌ వంటివి మీరు మంచి రైడింగ్ అనుభూతిని పొందేలా చేస్తాయి. ఇది మీ రైడింగ్ పొజిషన్ మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఈ బైక్ మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి రోడ్ల మీద అయినా ముందుకు సాగటానికి అనుమతిస్తుంది.

రైడింగ్ సమయంలో మీరు తప్పకుండా మంచి అనుభూతిని పొందుతారు. బ్రేకింగ్ సిస్టం కూడా చాలా షార్ప్ గా ఉండటం వల్ల బైకుని వెంటనే అనుమతిస్తుంది. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇప్పటివరకు వచ్చిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఒక ఎత్తు అయితే అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులు మరో ఎత్తు అనే చెప్పాలి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్, ఆధునిక కాలానికి తగిన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగి ఉత్తమ రేంజ్ అందిస్తుంది. కావున ఆధునిక కాలంలో లేటెస్ట్ బైక్ ఉపయోగించాలనుకునే వారికి ఇది తప్పకుండా బెస్ట్ బైక్.

Most Read Articles

English summary
Ultraviolette f77 recon review riding impressions specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X