Ultraviolette F77 Superstreet Review: అల్ట్రావయోలెట్‌ F77 సూపర్‌స్ట్రీట్ బైక్ ఫర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు అయినటువంటి అల్ట్రావయోలెట్‌ (Ultraviolette) దేశంలో ఈవీ టూవీలర్ విభాగంలో ఎప్పుడు కూడా అమ్మకాల్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తున్న అల్ట్రావయోలెట్‌ తాజాగా ఇటీవల F77 సూపర్‌స్ట్రీట్ (F77 Superstreet) మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది రైడర్లకు మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిని F77 మాక్ 2 ఆధారంగా రూపొందించారు. దానిలాగే, లుక్స్ పరంగా ఒకేలా కనిపించినప్పటికి ప్రత్యేకంగా కొన్ని అప్‌డేట్స్‌ను దీనిలొ ఇచ్చారు. రైడింగ్ పొజిషన్ రోజువారీ ఉపయోగం కోసం కొంచెం ముందుకు వంగి ఉన్నట్లు ఉంది. తాజాగా F77 సూపర్‌స్ట్రీట్ బైక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ చేసింది. దానిని కొద్ది సమయం పాటు నడిపినప్పుడు మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది

అల్ట్రావయోలెట్ F77 సూపర్‌స్ట్రీట్ సమీక్ష: F77 సూపర్‌స్ట్రీట్‌ చూడటానికి F77 మాక్ 2 లాగా కనిపించినప్పటికి ప్రధానంగా బైక్ ముందు భాగంలో కొత్త మార్పు కనిపిస్తుంది. హెడ్‌లైట్ డిజైన్‌ను అప్‌డేట్ చేశారు. F77 మాక్ 2 తో పోలిస్తే హెడ్‌లైట్ డిజైన్ దాదాపు 15% ఎక్కువ ఏరోడైనమిక్‌గా ఉందని తెలుస్తుంది. ఈ విషయాన్ని అంతకుముందు అల్ట్రావయోలెట్ కూడా పేర్కొంది.

Ultraviolette F77 Superstreet Riding Impressions

కొత్త హెడ్‌లైట్ 5-అంగుళాల TFTని కొద్దిగా భిన్నంగా కోణంలో అమర్చారు. మరో మార్పు ఏంటంటే, కొత్త హ్యాండిల్‌బార్ ఉంటుంది. ఇది మాక్ 2 యూనిట్ కంటే వెడల్పుగా, పొడవుగా ఉంటుంది. ఫుట్‌పెగ్‌ల విషయంలో ఎలాంటి మార్పులు లేనప్పటికి 80-డిగ్రీల రైడర్ ట్రయాంగిల్ కారణంగా F77 సూపర్‌స్ట్రీట్‌లో నిటారుగా కూర్చున్నట్లు ఉంది.

ఈ రెండు మార్పులు కాకుండా, F77 సూపర్‌స్ట్రీట్ F77 మాక్ 2తో సమానంగా ఉంటుంది. కొత్త బైక్ మాక్ 2 - 7.1kWh (సూపర్‌స్ట్రీట్) బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 211km దూరం ప్రయాణిస్తుంది. అదే 10.3kWh (సూపర్‌స్ట్రీట్ రీకాన్) మోడల్ 323km IDC పరిధిని అందిస్తుంది. F77 సూపర్‌స్ట్రీట్ బేస్ మోడల్ బ్యాటరీ ప్యాక్ 36.2bhp ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానించబడి ఉంది.

Ultraviolette F77 Superstreet Display

ఇది 90Nm పీక్ టార్క్‌ను కూడా అందిస్తుంది. 2.9 సెకన్లలో 0-60km/h వేగాన్ని అందుకుంటుంది. 7.8 సెకన్లలో 0-100km/h వేగాన్ని చేరుకుంటుంది. సూపర్‌స్ట్రీట్ రీకాన్ మోటారు 40.2bhp పవర్, 100Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 0-60km/h, 0-100km/h స్ప్రింట్‌లకు 0.1 సెకన్ల తగ్గుదలను అనుమతిస్తుంది. F77 సూపర్‌స్ట్రీట్ రెండు వెర్షన్‌లు గంటకు 155 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 4mm USD ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ అందించారు. రెండూ కూడా ప్రీలోడ్ సర్దుబాటు చేయగలిగే విధంగా ఉంటాయి. ఇవి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అల్యూమినియం బల్క్‌హెడ్ సెటప్‌తో వస్తాయి. సూపర్‌స్ట్రీట్ F77 మోడల్ మాక్ 2 వలె ముందు 320mm, వెనుక 230mm డిస్క్ బ్రేక్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.

Ultraviolette F77 Superstreet Specifications

ముందు డిస్క్‌ను గట్టిగా పట్టుకునే నాలుగు-రేడియల్ పిస్టన్ కాలిపర్‌లు, వెనుక ఫ్లోటింగ్ సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి. F77 సూపర్‌స్ట్రీట్ 110/70 R17 (ముందు), 150/60 R17 (వెనుక) టైర్‌లతో 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. F77 సూపర్ స్ట్రీట్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు, 10 రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవల్స్, మూడు ట్రాక్షన్ కంట్రోల్, ABS మోడ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.

రైడింగ్ ఇంప్రెషన్స్: F77 సూపర్‌స్ట్రీట్, మాక్ 2 లాగానే రోడ్డుపై సాఫీ ప్రయాణాన్ని ఇస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు మాక్ 2 లాగానే ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి, రైడింగ్ పొజిషన్ సరైనదిగా అనిపిస్తుంది. బైక్ మాక్ 2 కంటే కొంచెం వేగంగా కదిలినట్లు ఉంటుంది. రోడ్లపై మలుపుల సమయంలో కూడా కంఫర్ట్‌గానే ఉంది. అయితే, సీటు మాక్ 2లో కనిపించే అదే హార్డ్ యూనిట్‌తో కనిపిస్తుంది.

Ultraviolette F77 Superstreet Riding Review

చివరగా: అల్ట్రావయోలెట్ F77 సూపర్‌స్ట్రీట్ బైక్ F77 మాక్ 2 మాదిరిగానే రోడ్-ఫోకస్డ్‌గా రన్ అవుతుంది. నిటారుగా కూర్చోవడం వలన రైడింగ్‌లో ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఎక్కువ ఏరోడైనమిక్ ఫ్రంట్ ఎండ్ అంటే F77 మాక్ 2తో పోలిస్తే F77 సూపర్‌స్ట్రీట్ చాలా కంఫర్ట్ మోడల్.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2025, 9:00 [IST]
English summary
Ultraviolette f77 superstreet riding impressions specifications and features in telugu
Read more on: #ultraviolette #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+