యమహా ఎఫ్‌జెడ్-ఎస్: లార్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్ - బైక్ రివ్యూ
స్పోర్ట్స్ బైక్‌ల తయారీకి 'యమహా' బ్రాండ్ పెట్టింది పేరు. ఆకర్షనీయమైన డిజైన్, ఆకట్టుకునే ఏరోడైనమిక్స్, స్పోర్టీ లుక్, సాటిలేని పెర్ఫామెన్స్, శక్తివంతమైన ఇంజన్, రాజీపడని పికప్, పర్‌పెర్ట్ రైడ్ హ్యాండ్లింగ్, సాలిడ్ సస్పెన్షన్, ఇంటెలిజెంట్ బ్రేకింగ్ వంటి అనేక ఫీచర్లు ఈ యమహా స్పోర్ట్స్ బైక్‌ల సొంతం. యమహా ఇండియా దేశీయ విపణిలో తమ ఎఫ్‌జెడ్ సిరీస్ స్పోర్ట్స్ బైక్‌లను విడుదల చేసిన తర్వాత కంపెనీ తలరాతే మారిపోయింది. అప్పటి వరకూ అంతంత మాత్రంగా ఉన్న యమహా తమ స్పోర్ట్స్ బైక్‌లతో భారత మార్కెట్లో విస్తృతమైన బ్రాండ్ నేమ్‌ను సంపాధించుకుంది.
యమహా అందిస్తున్న ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్-ఎస్ కంపెనీకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇది పైన తెలిపిన అన్ని ఫీచర్లను పాటిస్తూ, సరసమైన ధరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది అత్యధికంగా అమ్ముడుపోతోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసుకొని కంపెనీ విడుదల చేసిన ఈ యమహా ఎప్‌జెడ్-ఎస్ స్పోర్ట్స్ బైక్ యూరోపియన్ ఇంటర్నేషనల్ డిజైన్, సరికొత్త కలర్స్, బాడీ గ్రాఫిక్స్, ఏరోడైనమిక్స్, స్టయిలిష్ అండ్ స్పోర్టీ కార్బన్ పాటర్న్ మీటర్ కన్సోల్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్‌తో మంచి మాచో లుక్‌ను కలిగి ఉంటుంది. ఫ్యాషనబల్, స్టయిలిష్ రైడ్ కోరుకునే యువత కోసం ఎఫ్‌జెడ్-ఎస్ 'లార్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్' అనే ట్యాగ్‌లైన్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. మరి ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫీచర్లేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
యువతను టార్గెట్ చేసుకొని కంపెనీ విడుదల చేసిన ఈ యమహా ఎప్‌జెడ్-ఎస్ స్పోర్ట్స్ బైక్ యూరోపియన్ ఇంటర్నేషనల్ డిజైన్, సరికొత్త కలర్స్, బాడీ గ్రాఫిక్స్, ఏరోడైనమిక్స్, స్టయిలిష్ అండ్ స్పోర్టీ కార్బన్ పాటర్న్ మీటర్ కన్సోల్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్‌తో మంచి మాచో లుక్‌ను కలిగి ఉంటుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
ఫ్యాషనబల్, స్టయిలిష్ రైడ్ కోరుకునే యువత కోసం ఎఫ్‌జెడ్-ఎస్ 'లార్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్' అనే ట్యాగ్‌లైన్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* పవర్‌ఫుల్ ఇంజన్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో సరికొత్త 153సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14 పిఎస్‌ల గరిష్ట పవర్‌ను, 13.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* మోనోక్రాస్ సస్పెన్షన్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ మోనోక్రాస్ సస్పెన్షన్ (వెనుక వైపు ఉండే సింగిల్ సెంటర్ షాక్ అబ్జార్వర్)తో లభిస్తుంది. ఈ మోనోక్రాస్ రియర్ సస్పెన్షన్ యూనిట్ 120 మి.మీ. వీల్ ట్రావెల్‌ను అందిస్తుంది. ఇది రన్నింగ్ పెర్ఫామెన్స్ పెంచడంలోనూ అలాగే మంచి హ్యాండ్లింగ్‌ను అందించడంలో సహకరిస్తుంది. ఇది రైడర్‌కు అలాగే వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుడికి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* మిడ్‌షిప్ మఫ్లర్ (సైలెన్సర్):
ఇందులో ఉపయోగించిన సరికొత్త సైలెన్సర్ మంచి స్టయిలిష్ డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఎగ్జాస్ట్ సామర్థ్యాన్ని పెంచడంలోను అలాగే మంచి మాస్ బీటింగ్‌ను అందించడంలో తోడ్పడుతుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* వెడల్పాటి వెనుక టైరు:
ఈ బైక్‌కు వెనుక వైపు వెడల్పాటి రేడియల్ కలిగిన టైరును అమర్చటం జరిగింది. 140/60-R17 సైజ్ కలిగిన ఈ టైరు భారతదేశంలోనే మొట్టమొదటి. ఇది మంచి రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండి, బైక్ స్కిడ్ కావటం జరగదు అలాగే, మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కూడా అందిస్తుంది. చిన్న చిన్న పంక్చర్ల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* కొత్త స్టయిలిష్ గ్రాఫిక్స్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఉండే గ్రాఫిక్స్ బైక్‌కు సూపర్ స్టయిలిష్ లుక్‌ని ఇస్తాయి. అంతేకాకుండా, ఈ గ్రాఫిక్స్ బైక్‌కు మంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఈ బైక్‌పై వెళ్తుంటే, ఇది రోడ్డుపై వెళ్లేవారి దృష్టిని మీ వైపుకు తిప్పుకోవటం ఖాయం.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్:
ఈ బైక్ స్టయిలిష్ లుక్‌ను కలిగి ఉండటానికి ప్రధానం కారణంగా దీని ఫ్యూయెల్ ట్యాంక్. 12 లీటర్ల సామర్థ్యం కలిగి పెద్ద స్టీల్ ఫ్యూయెల్ ట్యాంక్ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* ట్రెండీ మీటర్ కన్సోల్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో సెంటర్ కన్సోల్ (డిజిటల్ స్పీడో మీటర్) కూడా మరొక ప్రధాన ఆకర్షనగా చెప్పుకోవచ్చు. ఫుల్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే కలిగిన ఈ డిజిటల్ మీటర్ విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్‌తో ఇతర ఇండికేటర్లను కలిగి ఉంటుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* పొడవైన, వెడల్పాటి ఫెండర్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ విశాలమైన రియర్ ఫెండర్‌ను కలిగి ఉండి, తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు బురద, నీటి తుంపరల నుంచి రక్షణ కలిగిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* విశాలమైన సీట్:
దీని పొడవాటి, వెడల్పాటి సీట్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది. దీని వెనుక వైపు అమర్చిన గ్రాబ్ బార్ వెనుక వైపు కూర్చునే ప్రయాణికులకు బ్యాక్‌రెస్ట్‌గా మాత్రమే కాకుండా, గతుకుల రోడ్లలో వెనుక కూర్చునే ప్రయాణికులు గ్రిప్ కోసం చేతితో పట్టుకునే హ్యాండిల్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* కలర్ ఆప్షన్స్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. అవి:
1. ఫైరీ ఆరెంజ్
2. కాంపిటీషన్ వైట్
3. సన్‌సెట్ రెడ్
4. బ్లాక్ సైబర్ గ్రీన్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ
* ధర:
భారత మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ధర రూ.71,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ

యమహా ఎఫ్‌జెడ్-ఎస్: బైక్ రివ్యూ



Click it and Unblock the Notifications








