Yezdi Adventure ఫస్ట్ రైడ్ రివ్యూ: ఏందులో అయినా నాకు నేనే సాటి, ఎవరూ లేదు నాకు పోటీ!!
బైక్ రైడర్స్ మదిలో ఎప్పటికి ఒక మధురమైన మరియు మరచిపోలేని అనుభూతని కలిగించే బైక్ బ్రాండ్ 'యెజ్డీ' (Yezdi). సాధారణంగా కొన్ని మెటాలిక్ సౌండ్ కలిగించే మోటార్‌సైకిళ్ల ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతాయి. ఆ కోవకి చెందిన బ్రాండ్ ఈ 'యెజ్డీ' (Yezdi) అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
'యెజ్డీ' (Yezdi) కంపెనీ యొక్క మోటార్‌సైకిళ్లు గత కొంత కాలంగా మార్కెట్లో అందుబాటులో లేదు, అయితే ఇటీవల 2022 కొత్త సంవత్సరం జనవరి 13 న మళ్ళీ భారతీయ విఫణిలో అరంగేట్రం చేశాయి. ఈ బైకుల విడుదలతో మళ్ళీ బైక్ ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. కంపెనీ ఇప్పుడు ఒక్కసారిగా మూడు బైకులను మార్కెట్లో విడుదల చేసింది.

ఇందులో యెజ్డీ రోడ్‌స్టర్ (Yezdi Roadster), యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) మరియు యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన ఈ మూడు బైకులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇటీవల మేము ఈ మూడు బైకులను రైడ్ చేసాము. ఇందులో మొదటగా ఇప్పుడు యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) బైక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి విషయాలను గురించి మరింత సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

Yezdi Adventure డిజైన్ మరియు స్టైల్:
యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) బైకుని దూరం నుంచి చూసినప్పుడు కూడా ఖచ్చితంగా అడ్వెంచర్ బైక్ అని సులభంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఇందులోని కొన్ని అంశాలు ఇది ఖచ్చితంగా ఆఫ్ రోడర్ అని స్పష్టంగా చెబుతాయి. ఇందులోని స్పోక్డ్ వీల్స్, ఫోర్క్‌పై ఉన్న రబ్బరు బూట్ లేదా డ్యూయల్-పర్పస్ టైర్లు వంటివి దీనిని ఆఫ్ రోడర్ అని చూపించడంలో సహాయపడతాయి.

యెజ్డీ అడ్వెంచర్ బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో క్రోమ్ సరౌండ్‌తో కూడిన రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. దానిపైన ఒక పెద్ద విండ్ స్క్రీన్ కూడా ఉంటుంది. అదే విధంగా దీని వెనుక భాగంలో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది చూడటానికి దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, కానీ అందులోని డిస్ప్లే రౌండ్ గా ఉంటుంది.

ఇక ఈ బైక్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ అడ్వెంచర్ మరియు టూరింగ్ సామర్థ్యాలను సూచించే వివిధ భాగాలు చాలానే ఉన్నాయి. ఇది 15-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ తో ప్రారంభమవుతుంది. ఇందులో రైడింగ్ సమయంలో రైడర్ కి అనుకూలంగా ఉండటానికి Yezdi బ్యాడ్జింగ్ మరియు ఇన్సర్ట్‌లు ఉన్నాయి. ఈ ఇన్సర్ట్‌లు ఫుట్‌పెగ్‌లపై నిలబడి స్వారీ చేస్తున్నప్పుడు గ్రిప్‌కు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి.

ఫ్యూయల్ ట్యాంక్ మీద యెజ్డీ అడ్వెంచర్‌కు కలర్ డాష్ ఉండటం మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఎంచుకున్న రంగులో పెయింట్ చేయబడిన ఏకైక భాగం ఇదే. ఇందులోని కలర్స్ గురించి చెప్పాలంటే, యెజ్డీ అడ్వెంచర్ మూడు విభిన్న కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో మ్యాట్ మరియు కామో వేరియంట్‌లుగా వర్గీకరించబడింది. కామో వేరియంట్‌లో, ప్రస్తుతం ‘రేంజర్ కామో' అనే ఒక కలర్ మాత్రమే అందుబాటులో ఉంది.

మ్యాట్ కలర్ కింద స్లిక్ సిల్వర్ మరియు మాంబో బ్లాక్ షేడ్స్ ఉన్నాయి. స్లిక్ సిల్వర్ షేడ్ చాలా ఆకర్షణీయంగా ఉందని మేము భావిస్తున్నాము. అయితే కొంత మంచి అభిరుచులు వివిధరకాలుగా ఉంటాయి, కావున మీ అభిరుచులకు అనుకూలంగా కలర్స్ ఎంచుకోవచ్చు.

Yezdi త్వరలో మరిన్ని కలర్స్ జోడిస్తుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. మీరు ఎంచుకున్న కలర్ ఏదైనా, ఫ్యూయెల్ ట్యాంక్ మాత్రమే పెయింట్ చేయబడుతుంది, మిగిలిన మోటార్‌సైకిల్ మొత్తం బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో లగేజ్ మౌంట్ ఫ్రెమ్ కూడా ఉంది. ఇది ప్రొటెక్టివ్ గార్డ్ గా పనిచేస్తుంది. ఈ ఫ్రెమ్ చాలా భాగాలను కవర్ చేస్తుంది. అంతే కాకూండా ఆఫ్-రోడ్ రైడ్ చేస్తున్నప్పుడు పడిపోతే నష్టాన్ని తగ్గించడానికి నేరుగా చాసిస్ పై అమర్చబడుతుంది.ఈ చాసిస్ ఈ బైక్ ను మరింత దూకుడుగా ఉంటుంది.

కొత్త యెజ్డీ అడ్వెంచర్ బైక్ లో 'అడ్వెంచర్' అనే సైడ్ ప్యానెల్‌లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ పెద్ద స్ప్లిట్ సీట్లను కలిగి ఉంటుంది. ఇది మొదటి చూపులో చాలా సౌకర్యవంతంగా కనిపిస్తుంది. మోటారుసైకిల్‌లో లగేజ్ ర్యాక్ కూడా అమర్చబడి ఉంటుంది. టెయిల్ ల్యాంప్ సెటప్ కూడా చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది.

ఈ బైక్ లో రిఫ్లెక్టర్ మరియు నంబర్ ప్లేట్ పైన అమర్చబడిన చిన్న రౌండ్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఇది రౌండ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ తో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ మొత్తం సెటప్ చాలా ప్రాథమికంగా కనిపిస్తుంది. ఈ బైక్ టాప్ బాక్స్‌లు, సాడిల్ బాక్స్‌లు, జెర్రీ క్యాన్‌లు, ఆక్సిలరీ లైట్లు మొదలైన వాటిని ఈ ఫ్రేమ్‌లపై అమర్చగలిగే యాక్ససరీస్ కూడా అందిస్తోంది.

ఈ యెజ్డీ అడ్వెంచర్ యొక్క ముందు భాగంలో 21 ఇంచెస్ స్పోక్డ్ వీల్ మరియు వెనుకవైపు 17 ఇంచెస్ స్పోక్డ్ వీల్స్ కలిగి ఉంటాయి. ఇందులోని CEAT గ్రిప్ టైర్లు మోటార్‌సైకిల్ యొక్క కఠినమైన స్టైలింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటాయి. ఇంజిన్ మరియు ఎగ్జాస్ట్ వంటివి కూడా ఈ బైక్ యొక్క స్టైలింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఈ బైక్ యొక్క ఇంజిన్ బ్లాక్‌లో సిలిండర్ బ్లాక్‌కు క్రోమ్ ఫిన్ లభిస్తుంది. ఇందులోని లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌లో ఎయిర్-కూలింగ్ ఫిన్‌లు ఉన్నాయి. ఇంజిన్ కేసింగ్‌లు కూడా క్షితిజసమాంతర డిజైన్ లైన్‌లను పొందుతాయి. మొత్తానికి ఈ మోటార్‌సైకిల్ పూర్తిగా మాట్ బ్లాక్‌లో అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది. మొత్తానికి ఈ బైక్ చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.

Yezdi Adventure ఫీచర్స్:
Yezdi Adventure బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ అన్ని ఎల్ఈడీ లైటింగ్‌ను పొందుతుంది. ఇందులోని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా.. ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ఇండికేటర్‌లు కూడా బాగున్నాయి.

ఈ బైక్ లో రెండు స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు యెజ్డీ అడ్వెంచర్‌లోని మరో ముఖ్యమైన ఫీచర్. మీకు అవుట్‌డోర్‌లో ఉన్న సమయంలో ఏవైనా ఛార్జింగ్ అవసరాలు వచ్చినప్పుడు ఇది మీకు చాలా అనుకూలంగా ఉండటానికి ఇందులో టైప్-ఎ మరియు టైప్-సి స్లాట్ ఉంటాయి.

ఈ బైక్ లో అత్యంత ముఖ్యమైన ఫీచర్ LCD డిస్ప్లే. ఇది ఇంజిన్ స్పీడ్, వెహికల్ స్పీడ్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, మల్టిపుల్ ట్రిప్ మీటర్లు, యావరేజ్ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటికి సంబంధించిన సమాచారం డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే బ్లూటూత్ ద్వారా పని చేసే టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీరు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా పొందుతారు. కావున మీ ఫోన్‌ను జత చేయడానికి మీరు Yezdi Connect స్మార్ట్‌ఫోన్ యాప్‌ని ఉపయోగించవచ్చు.

ఈ బైక్ లోకి టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను పూర్తిగా అనుభవించడానికి మాకు తగినంత సమయం లేదు, కానీ మా Android స్మార్ట్‌ఫోన్‌ను డిస్‌ప్లేతో జత చేసాము. ఇది చాలా వరకు రైడర్ కి ఉపయోగకరమైన ఫీచర్స్ అందిస్తుంది. మీరు మీ ఫోన్‌లో మోటార్‌సైకిల్ గురించి చాలా సమాచారాన్ని తప్పకుండా పొందవచ్చు.

ఇందులోని డిస్‌ప్లేను రైడర్ అవసరాలకు అనుగుణంగా అడ్జస్ట్ చేయవచ్చు. మీరు బైక్‌ను ఆఫ్-రోడ్‌లో తీసుకొని, ఫుట్‌పెగ్‌లపై నిలబడి స్క్రీన్‌పై చూడాలనుకుంటే, ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. అయితే ఇది ఇప్పుడు తరచుగా అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లలో కనిపించే ఫీచర్. Yezdi అడ్వెంచర్‌లోని స్విచ్‌గేర్ ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్‌పై ప్రదర్శించబడే సమాచారాన్ని హ్యాండిల్‌బార్‌లోని బటన్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. హ్యాండిల్‌బార్ గ్రిప్ కొత్త Yezdi లోగోతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. మొత్తానికి ఇందులో అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పగలము.

Yezdi Adventure ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:
యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) ఎలా పని చేస్తుంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంటుంది? అనే అనేక ప్రశ్నలకు సమాధానం అందించడానికి మేము ఈ బైక్ రైడ్ చేసాము. రైడింగ్ సమయంలో మీరు గమణించదగిన మొదటి విషయం నిటారుగా ఉండే స్థితితో సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంది. కావున నిటారుగా ఉండే వైఖరి రైడింగ్ సమయంలో ఎలాంటి అలసటను దరిచేరనివ్వకుండా చూస్తుంది. ఇందులో అనుకూలంగా ఉండే కుషనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Yezdi మోటార్‌సైకిల్‌కు ఫుట్‌పెగ్‌లు మధ్యలో సెట్ చేయబడ్డాయి, కావున ఇవి ప్రత్యేకమైన స్టడెడ్ డిజైన్‌తో మరింత ఆఫ్-రోడ్ సిద్ధంగా ఉన్నాయి. ఇందులోని ట్యాంక్ ప్యాడ్‌లు రైడర్‌ని స్టాండ్-అప్ రైడింగ్ పొజిషన్‌లో ట్యాంక్‌ను పట్టుకోవడానికి అనుమతిస్తాయి. నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ యెజ్డీ అడ్వెంచర్‌కి దాదాపు ఖచ్చితమైన అడ్వెంచర్ స్థానాన్ని అందిస్తాయి.

కొత్త Yezdi Adventure ఇందులో 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 29.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.
ఇంజిన్ మంచి బాటమ్ ఎండ్ మరియు మిడిల్ రేంజ్ కలిగి ఉంది. ఇందులోని క్రూజింగ్ సామర్ధ్యాలు నిజంగా చాలా గొప్పగా ఉంటాయి. ఇది చాలా సులభంగా ట్రిపుల్-డిజిట్ వేగంతో ప్రయాణించే సమయంలో కూడా రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది హైవేపైన కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

ఈ బైక్ లో అమర్చబడిన ఇంజిన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మిడిల్ మరియు హై రేంజ్ లో చాలా గొప్పగా ఉంటుంది. తగిన వేగంతో ఆఫ్-రోడ్ రైడింగ్ చేయడానికి ఇది బెస్ట్ బైక్. ఫుట్‌పెగ్‌లపై నిలబడి, కఠినమైన రోడ్లపై ప్రయాణించడం కూడా సరదాగా ఉంటుంది.

యెజ్డీ వివిధ పరిస్థితులలో ఇంజిన్‌ను కూలర్‌గా నడిపినట్లు కూడా పేర్కొంది. కొత్త రేడియేటర్ సెటప్‌ని ఉపయోగించడం ద్వారా ఇది జరిగింది. రేడియేటర్ యొక్క ఇంటర్నల్ కూలింగ్ పైప్స్ ఇప్పుడు సమాంతరంగా ఉంటాయి, కానీ చాలా ఇతర మోటార్ సైకిళ్ళు నిలువు పైపులను కలిగి ఉంటాయి. ఇందులోని హారిజాంటల్ పైప్స్ కూలింగ్ ని 50 శాతం వరకు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉంటాయి.

యెజ్డీ అడ్వెంచర్ హ్యాండ్లింగ్ కూడా చాలా చక్కగా సెట్ చేయబడింది. సస్పెన్షన్ డ్యూటీలు టెలిస్కోపిక్ ఫోర్క్ ద్వారా నిర్వహించబడతాయి, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 200 మిమీ మరియు వెనుకవైపు 180 మిమీ అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ కలిగి ఉంటుంది. యెజ్డీ అడ్వెంచర్ 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
యెజ్డీ అడ్వెంచర్ బైక్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. ఈ మొత్తం సెటప్ టూరింగ్ మరియు ఆఫ్-రోడింగ్ కోసం ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. ఇందులోని సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది. అయినప్పటికీ ఇది ఎలాంటి రహదారిలో అయిన రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

యెజ్డీ అడ్వెంచర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ ఉంటుంది. ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా అందుబటులో ఉంటుంది. ఈ బైకులోని బ్రేకింగ్ సెటప్ కూడా చాల అద్భుతంగా ఉంటుంది.

ఇందులో రోడ్, ఆఫ్-రోడ్ మరియు రైన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబటులో ఉంటాయి. రోడ్ మోడ్‌లో ఈ బైక్ సాధారణంగా పని చేస్తుంది మరియు చక్రాలను సులభంగా లాక్ చేయడానికి అనుమతించదు. ఆఫ్-రోడ్ మోడ్‌లో ఏబీఎస్ ముందు చక్రానికి చాలా ఆలస్యంగా వస్తుంది మరియు వెనుక చక్రానికి ఏబీఎస్ ఆఫ్ చేయబడింది, ఇది మీరు బైక్‌ను స్లైడ్ చేయడానికి అనుమతిస్తుంది. రెయిన్ మోడ్‌లో చాలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా చాలా త్వరగా కూడా వస్తుంది. యెజ్డీ అడ్వెంచర్ బైక్ రైడింగ్ చేయడానికి అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది, కావున తప్పకుండా రైడర్ కి అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Yezdi Adventure కలర్ ఆప్సన్స్ మరియు ప్రైస్:
Yezdi Adventure ప్రస్తుతం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. వీటి ధరలు ఎంచుకునే కలర్ ఆప్సన్ మీద ఆధారపడి ఉంటుంది.
- యెజ్డీ అడ్వెంచర్ స్లిక్ సిల్వర్ (Yezdi Adventure Slick Silver): రూ. 2,09,900
- యెజ్డీ అడ్వెంచర్ మంబో బ్లాక్ (Yezdi Adventure Mambo Black): రూ. 2,11,900
- యెజ్డీ అడ్వెంచర్ రేంజర్ కామో (Yezdi Adventure Ranger Camo) : రూ. 2,18,900 (ధరలు ఎక్స్ షోరూమ్- ఢిల్లీ)

Yezdi Adventure ప్రత్యర్థులు:
Yezdi Adventure బైక్ కి దేశీయ మార్కెట్లో ప్రధాన ప్రత్యర్థి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' (Royal Enfield Himalayan). హిమాలయన్ బైక్ ఖరీదైనది మరియు యెజ్డీకి లభించే కొన్ని ఫీచర్‌లను పొందలేదు. అయితే Yezdi Adventure కి కెటిఎమ్ 250 అడ్వెంచర్, బెనెల్లీ TRK 251, మరియు కెటిఎమ్ 390 అడ్వెంచర్ వంటివి కూడా ప్రత్యర్థిగా ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
యెజ్డీ బ్రాండ్ నుంచి విడుదలైన మూడు బైకులలో Yezdi Adventure చాలా అద్భుతమైన బైక్. ఈ బైక్ ఉత్తమమైన ఫీచర్స్, అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. మంచి పనితీరుని కూడా అందిస్తుంది. అడ్వెంచర్ విభాగంలో ఈ బైక్ దాని ప్రత్యర్థులకంటే కూడా ఖచ్చితంగా ఉత్తమమైన బైక్. కావున ఈ కొత్త సంవత్సరంలో కొత్త అడ్వెంచర్ బైక్ కొనాలనుకునే వారికి Yezdi Adventure చాలా మంచి ఎంపిక అవుతుంది.


Click it and Unblock the Notifications








