Yezdi Adventure Bike Full Review యెజ్డీ అడ్వెంచర్ బైక్ మెప్పించిందా? రివ్యూ చదివి మీరే చెప్పండి!
క్లాసిక్ లెజెండ్స్ కొత్తగా విడుదల చేసిన యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) బైక్‌ని టెస్ట్‌డ్రైవ్ చేయడానికి మా డ్రైవ్స్‌పార్క్ బృందాన్ని ఆ సంస్థ పూణెకు ఆహ్వానించింది. అక్కడికి వెళ్లగానే ఇప్పటి వరకు మేము చేసిన బైక్ రివ్యూల కంటే భిన్నంగా కఠినమైన ఆఫ్-రోడ్ ట్రాక్, బురదతో నిండిన ప్లేగ్రౌండ్, ఇతర ఎత్తు పల్లాల మధ్య రైడ్ చేయమని మా టీమ్‌కి సూచించింది. దీంతో మా టీమ్ ఈ యెజ్డీ కొత్త మోటార్‌సైకిల్‌ని రైడ్ చేయడానికి బైక్‌ని తీసుకుంది. అప్పుడే ఆ బైక్ ఒక పూర్తి అడ్వెంచర్ (ఆఫ్‌రోడర్) సామర్థ్యాలను కలిగి ఉందని అర్థమైంది. ఇక ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్ ఎలా ఉంది? దీని పూర్తి ఫర్ఫామెన్స్ ఎలా ఉంది? చివరగా ఈ బైక్ మెప్పించిందా లేదా అనే విషయానికి సంబంధించిన పూర్తి రివ్యూ మీ కోసం..
యెజ్డీ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా యువ రైడర్ల కోసం హై-ఫర్ఫామెన్స్ అందించే బైక్‌లను తీసుకువస్తుంది. ఇది కంపెనీ నిబద్ధతకు అద్ధం పడుతోంది. తాజాగా ఈ సంస్థ వస్తున్న యెజ్డీ కూడా దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉండనుంది. అయితే ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్‌లో శుద్ధి చేయబడిన ఇంజిన్ (Refined Engine), మెరుగైన ఛాసిస్, పూర్తి స్థాయిలో అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేలా అప్‌డేట్ చేసింది.

డిజైన్ & స్టైలింగ్: యెజ్డీ అడ్వెంచర్ ఆసక్తికరమైన క్లాసీ లుక్‌తో వస్తుంది. ఇంజిన్ చుట్టూ ఉన్న కొత్త మెటల్ కవర్‌ని అందించారు. ఇది ఆఫ్‌రోడ్‌లలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ దెబ్బ తినకుండా ఉండేందుకు సహాయ పడుతుంది. ఎగ్జాస్ట్ పైప్ మధ్యలో ఉండే చల్లని టచ్ పైప్ హీట్ అవ్వకుండా చేస్తుంది. ఇక పొడవైన విండ్‌షీల్డ్‌ని కూడా అందించారు. ఇది అడ్వెంచర్ బైక్‌లకు ఇది అదనపు లుక్‌ని ఇస్తుంది.
ఇంజిన్: ఈ అడ్వెంచర్ బైక్‌లో కొత్తగా డెవలప్ చేసిన ఆల్ఫా-2 ఇంజిన్ ఉంది. ఈ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పవర్‌హౌస్ మెరుగైన పనితీరు అందిస్తుంది. ఈ బైక్ ఇంజిన్‌లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ మెరుగైన పవర్, హై స్పీడ్‌లో వైబ్రేషన్ తగ్గించడానికి, మంచి ఫ్యూయల్ సరాఫరాకు సపోర్ట్ చేస్తుంది. కొత్త లిక్విడ్-కూల్డ్ 334cc ఇంజిన్, 30.2 PS మరియు 29.9 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ బైక్ ఆన్‌రోడ్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లకు బాగా సరిపోతుంది. ఇది 220mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు అనువుగా ఉంటుంది. ఇందులోని భారీ 15.5-లీటర్ ఇంధన ట్యాంక్ వల్ల లాంగ్ జర్నీలో ఎటువంటి ఆటంకం ఏర్పడదు. ఈ బైక్ 188 కిలోల బరువును కలిగి ఉంది. ఇందులోని సస్పెన్షన్ సెటప్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు మోనోషాక్ మంచి బ్యాలెన్స్‌ని అందిస్తుంది.
ఈ అడ్వెంచర్ ఛాసిస్‌ని పూర్తిగా మార్పు చేసిన ఫ్రేమ్‌తో తీసుకువచ్చారు. ఇది కఠినమైన దారుల్లోను ప్రయాణానికి అనువుగా ఉంటుంది. కొత్త ఫ్రేమ్, ఆప్టిమైజ్ చేసిన డిజైన్ ఆన్ రోడ్ అలాగే ఆఫ్-రోడ్ రెండింటిలోనూ మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. రాళ్లు, ఎత్తైన కొండల మధ్య ప్రయాణించే సమయంలో ఇంజిన్ భాగాలను రక్షించడానికి యెజ్డీ అడ్వెంచర్‌లో కొత్త సంప్ గార్డ్‌ని అమర్చారు.

కఠినమైన భూభాగాల్లో రైడ్ చేసే సమయంలో రైడర్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంతో ముందుకు కదిలేలా సంప్‌గార్డ్ వీలు కల్పిస్తుంది. ఇక ఈ బైక్ బరువు, హ్యాండ్లింగ్ డైనమిక్స్ మెరుగ్గా ఉన్నాయి. రెండవది ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఆప్టిమైజేషన్‌ని కలిగి ఉంది. ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
సెంట్రల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అడ్వెంచర్‌కి అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ బైక్‌లో వైబ్రేషన్‌లు రాకుండా మ్యూట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. కొన్నిసార్లు ఇది ఆఫ్‌రోడర్‌లా అస్సలు అనిపించదు. ఈ బైక్ పవర్ డెలివరీ మరింత మెరుగ్గా ఉంటుంది. ఇందులోని ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ అసిస్ట్ మరియు స్లిప్ క్లచ్‌తో వస్తుంది. ఇది ట్రాఫిక్, ఆఫ్-రోడ్‌లలో సులభంగా యాక్సెస్ చేసేలా అందించారు.

చివరగా.. ఈ బైక్‌లోని కొత్త ఇంజిన్, ఇతర ఫీచర్లు, సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ ఇతర అప్‌గ్రేడ్స్ రైడింగ్ ఔత్సాహికులకు లాంగ్ జర్నీ, ఆఫ్‌రోడ్‌లలో బెస్ట్ ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ యెజ్డీ అడ్వెంచర్ (అడ్వెంచర్ మోటార్‌సైకిల్) విభాగంలో గట్టి పోటీదారుగా నిలువనుంది. మంచి ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు కలిగిన అడ్వెంచర్ బైక్ కోసం చూస్తున్న టూరిస్ట్‌లకు, బైకింగ్ ఔత్సాహికులకు ఇది బెస్ట్ మోటార్‌సైకిల్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








