బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్

2021 ప్రారంభంలోని జనవరి నెలలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన లాంగ్ వీల్‌బేస్ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్‌ను తీసుకువచ్చింది. అయితే లాంగ్ వీల్‌బేస్ లాంచ్ అయిన కొద్ది నెలల తరువాత, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ తన ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ తో ముందుకు వచ్చింది.

ఇటీవల ఈ సరికొత్త బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ సెడాన్ ని డ్రైవ్ అవకాశం మాకు లభించింది. ఈ కొత్త ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, భారతదేశంలో ప్రారంభమైన మొట్టమొదటి ఎమ్ కారు ఇదే. కావున ఈ కారును మేము నగరంలో మరియు హైవేలో డ్రైవ్ చేసాము.. కొత్త బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ గురించి మరింత సమాచారం ఇక్కడ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

ఎక్స్టీరియర్ మరియు డిజైన్:

కొత్త బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ సెడాన్ ను చూడగానే ముందు గ్రిల్‌లో M బ్యాడ్జింగ్ లేనందున ఇది పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సెడాన్ అని చెప్పడం కొంత కష్టమవుతుంది. అయితే సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే బ్యాడ్జ్‌లు మరియు వీల్స్ కారణంగా ఇది సాధారణ 3 సిరీస్ కాదని మీరు గ్రహిస్తారు.

ఈ సెడాన్ యొక్క ముందు భాగంలో ఎయిర్ వెంట్స్ తో కూడిన సూక్ష్మ గ్రిల్‌ను పొందుతుంది. ఇవి మూసివేయబడిన తర్వాత మంచి ఏరోడైనమిక్స్ ని అందిస్తాయి. కారులో క్రోమ్ లేదు, కానీ గ్రిల్ క్రోమ్ బిట్స్‌తో నిండినట్లు కనిపిస్తుంది. ఈ కారును సూక్ష్మంగా పరిశీలిస్తే అది సిల్వర్ బ్రష్ చేయబడిందని గ్రహిస్తారు.

ఈ కారు సరికొత్త బిఎండబ్ల్యు లేజర్ ఎల్ఇడి హెడ్‌లైట్‌లను కూడా పొందటం వల్ల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక్కడ అద్భుతంగా కనిపించే ప్రొజెక్టర్ లోపల బ్లూ కలర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. సెడాన్ ముందు భాగంలో బంపర్‌ చాలా దూకుడుగా కనిపిస్తుంది.

ఇక ఈ సెడాన్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఫెండర్‌లోని చిన్న ఎమ్ బ్యాడ్జ్. ఇందులో ఉన్న 18 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్ M డివిజన్ నుండి వచ్చినవి. ఇవి డ్యూయల్-టోన్ కలర్‌లో పూర్తవుతాయి. చక్రాలు పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటె చూడటానికి ఇంకా చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఎందుకంటే కారు యొక్క సన్‌సెట్ ఆరెంజ్ కలర్ లో ఉంది కావున బ్లాక్ కలర్ ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ కారుకి ఇరువైపులా వైపులా క్రోమ్ ఉండదు. దీనికి బదులుగా, విండో చుట్టూ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ కొత్త సెడాన్ పెద్ద సన్‌రూఫ్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది బాడీ లైన్స్ మరియు క్రీజులు వంటి వాటిని కలిగి ఉండదు. అయినప్పటికీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ యొక్క వెనుక వైపుకు వెళ్ళినట్లైతే, ఇది ఒక జత సొగసైన ఎల్‌ఈడీ టైల్ లైట్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా వెనుకవైపు M340i బ్యాడ్జ్, ఎక్స్‌డ్రైవ్ బ్యాడ్జ్ కలిగి ఉంటాయి. వెనుకవైపు సరైన మార్గదర్శకాలతో రివర్స్ పార్కింగ్ కెమెరాను కూడా పొందుతుంది. ఇది గట్టి ప్రదేశాలలో సులభంగా పార్క్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న కెమెరా క్యాలిటీ చాలా బాగుంది.

ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ యొక్క క్యాబిన్ బిట్స్ మరియు బ్రష్ చేసిన సిల్వర్ మరియు అల్కాంటారా ముక్కలతో పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ కారణంగా, క్యాబిన్ చాలా స్పోర్టిగా కనిపిస్తుంది. డోర్ ప్యానెల్స్‌పై మరియు డాష్‌బోర్డ్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్ ఉపయోగించబడి ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉన్న 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ స్టేజ్ లో ఉంటుంది. టచ్ చాలా అద్భుతంగా ఉంది, కావున తొందరగా రెస్పాండ్ అవుతుంది.

ఇందులో ఉన్న 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ కావున అద్భుతంగా ఉంటుంది. అయితే కారు యొక్క మోడ్‌లను మార్చినట్లైతే స్క్రీన్‌పై డిస్ప్లే కూడా మారుతుంది. డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా క్లస్టర్‌ను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. క్లస్టర్ పైన కుడివైపున ఉన్న హెడ్స్-అప్-డిస్ప్లే, ఎవరైనా కాల్ చేస్తుంటే లేదా మీరు పాటను ఎంచుకోవాలనుకుంటే, డ్రైవర్ దృష్టిని రహదారిపై ఉంచడం వంటి చాలా సమాచారాన్ని కూడా అందిస్తుంది.

స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి ఉంటుంది, కావున అద్భుతమైన పట్టుని అందిస్తుంది. ఇది కూడా M బ్యాడ్జిని పొందుతుంది. అయితే ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కాదు. అయినప్పటికీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చక్కగా ఉంటాయి. వీటిని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా టోగుల్ చేయవచ్చు.

డోర్ ప్యానెల్స్ మరియు క్లైమేట్ కంట్రోల్ దిగువన చాలా స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇది త్రీ జోన్ కలిమెట్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. ఇందులో మొబైల్ కోసం అనేక ఛార్జింగ్ సాకెట్లను మరియు వైర్‌లెస్ ఛార్జర్‌ కూడా ఉంటుంది.

ఈ సెడాన్ యొక్క సీట్ల విషయానికి వస్తే, ముందు సీట్లు బకెట్ ఆకారంలో ఉంటాయి మరియు లెదర్ మరియు అల్కాంటారాలో చుట్టబడి ఉంటాయి. వీటిని ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు కాని డ్రైవర్ వైపు మాత్రమే సీట్ మెమరీ ఫంక్షన్‌ను పొందుతుంది. ఏదేమైనా, సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. కాని ఇందులో మంచి కుషనింగ్ లేకపోవడం వల్ల, సుదీర్ఘ ప్రయాణంలో కొంత విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది.

వెనుక సెట్లను గమనించినట్లయితే, ఇక్కడ అండర్ థాయ్ సపోర్ట్‌ ఉంటుంది. ఈ సీట్లు ముందు సీట్ల కంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ రెండు కప్ హోల్డర్లతో సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కూడా పొందుతారు. వెనుక భాగంలో థార్డ్ క్లైమేట్ కంట్రోల్ మరియు రెండు సి టైప్ సి ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి.

ఈ కారుకి 440 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది నలుగురు ప్రయాణీకుల లగేజ్ మోయడానికి కూడా సరిపోయేవిధంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ స్థలం అవసరమైతే, 60:40 స్ప్లిట్ అందుబాటులో ఉంది. ఎక్కువ లగేజ్ ఉంచాలనుకున్నప్పుడు వెనుక ఇరువైపులా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది.

ఇంజిన్ మరియు హ్యాండ్లింగ్ :

బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ సెడాన్‌లో ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, ట్విన్-స్క్రోల్ టర్బో, 3.0 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది 5800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 385 బిహెచ్‌పి శక్తిని మరియు 1850 ఆర్‌పిఎమ్ మరియు 5000 ఆర్‌పిఎమ్ మధ్య 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ట్రెయిన్ అన్ని చక్రాలకు పంపిన శక్తితో 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ సెడాన్ మంచి పనితీరుని కలిగి ఉంటుంది. ఈ కారు కేవలం 4.4 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగవంతం అవుతుంది. ఇది ఎలక్ట్రానిక్ ద్వారా గంటకు 250 కి.మీ వరకు పరిమితం చేయబడిన అగ్ర వేగాన్ని కలిగి ఉంది.

ఇది మూడు డ్రైవింగ్ మోడ్లను కలిగి ఉంది. మీరు ఎకో ప్రో మరియు కంఫర్ట్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఎటువంటి శబ్దం రాదు. అయితే హమ్మింగ్ శబ్దం వచ్చినా, అంత శబ్దం ఉండదు. దీనిని స్పోర్ట్స్ మోడ్ కి మార్చినప్పుడు ఎగ్జాస్ట్ ప్రాణం పోసుకుంటుంది. ఇది లోపల ఒక వాల్వ్ కలిగి ఉంది, అది కారు చాలా స్మూత్ గా అనిపిస్తుంది.

మీరు కారు‌ను 4,000 ఆర్‌పిఎమ్ మార్క్ వరకు లాగితే, మీరు షిఫ్ట్ చేసిన ప్రతిసారీ మీరు ఎగ్జాస్ట్ క్రాకిల్ వినగలుగుతారు మరియు మీరు డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా అదే జరుగుతుంది.

డ్రైవింగ్ మోడ్‌ను మార్చిన ప్రతిసారీ త్రాటల్ రెస్పాన్స్ మారుతుంది, ఇది స్పోర్ట్‌లో చాలా స్పష్టంగా ఉంటుంది. త్రాటల్ మాత్రమే కాదు, స్టీరింగ్ వీల్ మరియు సస్పెన్షన్ కూడా గట్టిపడతాయి, కానీ మంచి రెస్పాన్స్ ఉంటుంది.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ గట్టి సస్పెన్షన్ ను పొందుతుంది. అయితే ఎకో ప్రో మరియు కంఫర్ట్ మోడ్‌లో సస్పెన్షన్ కొద్దిగా మృదువైనది ఉంటుంది. కానీ స్పోర్ట్స్ మోడ్ లో ఇది గట్టిపడుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ యొక్క మైలేజ్ విషయానికొస్తే, ఇది స్పోర్టి కారు కాబట్టి దాని నుండి మంచి మైలేజీని అందించే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఎకో మోడ్‌లో డ్రైవ్ చేస్తే ఒక లీటరుకు 10 కి.మీ మార్కును దాటడం చూస్తారు. కానీ మీరు వేగంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఒక లీటరుకు 6 నుండి 7 కి.మీ మధ్య మైలేజ్ అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ భారత మార్కెట్లో త్వరలో విక్రయించబోయే స్పోర్టియెస్ట్ సెడాన్లలో ఒకటి. ఈ సెడాన్ స్పోర్టి ఫీచర్స్ తో పాటు, ఇది ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉటుంది. అంతే కాకుండా వాహనదారునికి చాలా మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కారు దేశీయ మార్కెట్లో ఇంకా లాంచ్ కాలేదు, అయితే దీని ధర రూ. 65 నుంచి రూ. 70 లక్షల ఎక్స్‌షోరూమ్ మధ్య ఉంటుందని మేము భావిస్తున్నాము.

Most Read Articles

English summary
BMW M340i xDrive First Drive Review. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X