బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవీని రూ. 35.90 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభించింది. మేము ఇటీవల ఈ ఫేస్ లిఫ్టెడ్ ఎక్స్1 ఎస్‌యూవీని నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. బిఎమ్‌డబ్ల్యూ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి యొక్క ఫీచర్స్ మరియు ఇతర పూర్తి వివరాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

డిజైన్ & ఎక్స్టీరియర్:

మేము డ్రైవ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి సన్‌సెట్ ఆరెంజ్ కలర్ లో ఉంది. ఈ కారు నిజంగా మొదటి చూపులోనే మంత్రముగ్ధుల్ని చేసింది. ఇది చాలా మంది డిజైన్ కలిగి ఉంది, దీని ముందు వైపు బిఎమ్‌డబ్ల్యూ యొక్క సిగ్నేచర్ ఎల్ఇడి హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. ఇందులో ఎల్ఇడి డిఆర్ఎల్ కూడా ఉంది. వీటివల్ల ఈ ఎస్‌యూవి యొక్క దృశ్యమానత చాలా అద్భుతంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవిలో ఫాగ్ లాంప్స్ బంపర్‌లో కొద్దిగా దిగువన ఉంటుంది. ఇందులో బంపర్ పునఃరూపకల్పన చేయబడి ఉంటుంది, కావున సైడ్ ప్రొఫైల్ లో వెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకాన్ని ఉన్న ఇతర బిఎమ్‌డబ్ల్యూ మోడళ్ల మాదిరిగా కాకుండా, ఎక్స్1 20డి ఫ్రంట్ గ్రిల్‌లో యాక్టివ్ వెంట్స్‌ లేదు. ఇందులో పెద్ద సింగిల్-పీస్ గ్రిల్‌తో పాటు ముందు భాగంలో తక్కువ క్రోమ్‌ ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇక ఈ ఎస్‌యూవి యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 17 ఇంచెస్ సింగిల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి మొత్తం కారు పరిమాణంతో బాగా కలిసిపోతాయి. ఇందులో షార్ప్ బాడీలైన్‌కు బదులుగా, హెడ్‌లైట్ నుండి టైల్ లైట్ వరకు అన్ని వైపులా లైన్స్ మరియు క్రీజెస్ కలిగి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి బాడీ-కలర్ ORVM లను ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి టర్న్ సిగ్నల్ ఇండికేటర్లతో పొందుతుంది. ఇవి దిగువన సగం మాట్టే బ్లాక్ కలర్ లో ఉంటాయి. ప్రస్తుతం ఇందులో క్రోమ్‌కు బదులుగా, విండోస్ చుట్టూ బ్లాక్-అవుట్ ట్రీట్మెంట్ పొందుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇప్పుడు బిఎండబ్ల్యూ ఎక్స్1 యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మీ దృష్టిని ఆకర్శించే సొగసైన టైల్ లాంప్ ఉంటాయి. అంతే కాకుండా పెద్ద డ్యూయెల్ టిప్స్ ఎగ్జాస్ట్‌లు కారు యొక్క స్పోర్టి రూపాన్ని మరింత పెంచడంలో సహాయపడతాయి. ఎగ్జాస్ట్ టిప్స్ క్రోమ్‌లో పూర్తయ్యాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

అంతే కూండా దీని వెనుక భాగంలో ఎక్స్1 బ్యాడ్జ్‌తో పాటు ‘ఎస్-డ్రైవ్ 20డి' బ్యాడ్జింగ్ క్రోమ్‌లో పూర్తయింది. కారు అంతటా రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి, కావున సహాయంతో గట్టి ప్రదేశాలలో పార్కింగ్ చేయడం మరింత సులభం అవుతుంది. మొత్తానికి ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎక్స్టీరియర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్:

బిఎండబ్ల్యు ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి యొక్క లోపలికి అడుగు పెట్టగానే మీకు విశాలమైన మరియు అద్భుతమైన క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇందులో ఉన్న పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

బిఎండబ్ల్యూ ఎక్స్‌1 అనేక ఫీచర్లు, పరికరాలు మరియు టెక్నాలజీలను కలిగి ఉంటుంది. ఎక్స్1 ఎస్‌యూవి డాష్‌బోర్డ్‌లో 8.8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది టచ్ చేయగానే రెస్పాండ్ అయ్యే విధంగా ఉంది. ఇది ఆపిల్ కార్ప్లేతో వస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఆటోతో సిస్టమ్‌ను సన్నద్ధం చేయడంలో బిఎమ్‌డబ్ల్యూ విఫలమైంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ధర వద్ద ఆండ్రాయిడ్ ఆటో లేకపోవడం కొంత వేలతిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి కారులోని ఈ ఫీచర్స్ ఉంటుంది, కావున భవిష్యత్తులో బీఎండబ్ల్యూ కంపెనీ ఏదో ఒక సమయంలో ఈ ఫీచర్‌తో ఎక్స్1 ను అప్‌డేట్ చేస్తుందని భావిస్తున్నాము.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

బిఎండబ్ల్యూ ఎక్స్‌1 లో డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కారు గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది, కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయబడదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇందులో యాంబియంట్ లైటింగ్ డోర్ ప్యానెల్స్‌లో మరియు డాష్‌బోర్డ్‌లో చక్కగా విలీనం చేయబడింది. ఇందులో సుమారు ఏడు యాంబియంట్ లైటింగ్ ఆప్సన్స్ ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లో ఉపయోగించబడిన వుడ్ ట్రిమ్ మరియు యాక్సెంట్స్ దీని ప్రీమియం రూపాన్ని మరింత మెరుగుపరిచేలా చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఎక్స్1 లో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఇది టెంపరేచర్ వంటివాటిని డిస్ప్లైలో ప్రదర్శిస్తుంది. ప్రతి డోర్ లో బాటిల్ హోల్డర్ ఉంటుంది మరియు స్టోరేజ్ కోసం క్యూబి హొల్స్ కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి ఉండటం వల్ల వాహనదారునికి మంచి పట్టుకి అందిస్తుంది. స్టీరింగ్ వీల్ లో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఎర్గోనామిక్‌గా ఉంచబడతాయి. మేము ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటె బాగుంటుందని ఆశిస్తున్నాము.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇక ఇందులో ఉన్న సీట్ల విషయానికి వస్తే, డ్రైవర్ సీటు రెండు సెట్టింగులతో మెమరీ ఫంక్షన్‌ను పొందుతుంది. ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి కాని కొంచెం ఎక్కువ కుషనింగ్ కలిగి ఉంటాయి. ముందు సీట్లు సైడ్ బోల్స్టర్లను కూడా పొందుతాయి. కావున లాంగ్ డ్రైవ్ సమయంలో కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ఎస్‌యూవి యొక్క వెనుక సీట్లు తగిన మొత్తంలో లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ కలిగి ఉంటాయి. ముందు సీట్ల వెనుక స్కూప్‌లు ఉన్నాయి, తద్వారా ప్రయాణీకులకు కొంచెం ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. వెనుక సీటు ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు, ఒకవేళా మూడవ వ్యక్తి కూర్చుంటే కొంత అసౌకర్యంగా ఉంటుంది. వెనుక భాగంలో రెండు ఎసి వెంట్స్ మరియు రెండు టైప్-సి స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుట్‌లెట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇంజిన్ మరియు హ్యాండ్లింగ్:

బిఎండబ్ల్యు ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గారప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇందులో పవర్ ముందు చక్రాలకు మరియు వెనుక వైపుకు ప్రసారం చేయబడుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఎక్స్1 ఫ్రంట్-వీల్-డ్రైవ్ కారు కాబట్టి, త్రాటల్ రెస్పాన్స్ వాహనదారిఇకి అనుకూలంగా ఉంటుంది. మొదటి మూడు గేర్‌లలో, ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్ ద్వారా ప్రేరేపించబడిన టార్క్ కారణంగా మీరు స్టీరింగ్ వీల్‌ను చాలా గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెటప్ కారణంగా, ఎస్‌యూవీ ఇప్పుడు దాని బిఎస్ 4 మోడల్ కంటే తక్కువ బరువుని కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవిలో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ మోడ్‌లు. ఎకో ప్రో మోడ్‌లో, స్టీరింగ్ తేలికగా ఉటుంది, కానీ త్రాటల్ రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది, కానీ ఈ మోడ్ లో ఇంధనం చాలావరకు ఆదా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇక కంఫర్ట్ మోడ్‌లో, స్టీరింగ్ మరియు త్రాటల్ రెస్పాన్స్ కొంత మెరుగుపడుతుంది, కావున వాహనదారులు ఈ మోడ్ లో డ్రైవింగ్ చేస్తే అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చని సిపార్సు చేస్తున్నాము. చివరగా స్పోర్ట్స్ మోడ్ లో స్టీరింగ్ వీల్ గట్టిగా ఉంటుంది, త్రాటల్ రెస్పాన్స్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. ఈ మోడ్‌లో కారు యొక్క గరిష్ట సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1లో సస్పెన్షన్ సెటప్ కొంచెం మృదువైనదిగా ఉంటుంది. కావున వాహనదారునికి సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. సస్పెన్షన్ సెటప్ అద్భుతంగా ఉండటం వల్ల ఈ ఎస్‌యూవి ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉటుంది. ఇందులో ఇన్సులేషన్ లెవెల్స్ కూడా అద్భుతంగా ఉంటుంది, కావున బయట శబ్దం లోపలికి రావాడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది నగరంలో ఒక లీటరుకు 12 నుండి 14 కిమీ వరకు అందించింది. సమయం చాలా తక్కువ ఉన్నందున మేము హైవేపై మైలేజ్ టెస్ట్ చేయలేకపోయాము. కానీ హైవేపై ఒక లీటరుకు 19 కి.మీ నుండి 20 కి.మీ వరకు ఉంది. ఈ మైలేజ్ నిజంగా మమ్మల్ని చాలా ఆకట్టుకుంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో జర్మన్ బ్రాండ్ అందించే ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఈ బిఎమ్‌డబ్ల్యూ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్ 1. ఈ ఎస్‌యూవీలో వాహనదారునికి అనుకూలమైన సౌకర్యం మరియు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, ఆడి క్యూ 3 ఎస్‌యూవీ వంటి వాటికిప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
BMW X1 S-Drive 20d Review. Read in Telugu.
Story first published: Friday, April 16, 2021, 19:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X