ప్రత్యేకించి యువత కోసం: డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ (ఫస్ట్ డ్రైవ్ రివ్యూ)

డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగవ మోడల్ రెడి-గో ను 1.0-లీటర్ వేరియంట్లో విడుదలకు సిద్దం చేసింది. రెడి-గో ను 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ ద్వారా అనుకూల మరియు వ్యతిరేక అంశాలు నేటి రివ్యూలో...

By Anil

పునరుద్దరించబడిన డాట్సన్ సంస్థ సరిగ్గా నాలుగేళ్ల క్రితం నిస్సాన్ భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను మాత్రమే ఉత్పత్తి చేసే ఉద్దేశంతో వచ్చి గో మరియు గో ప్లస్ కార్లను విపణిలోకి విడుదల చేసింది.

జపాన్ దిగ్గజం డాట్సన్ ఈ రెండు మోడళ్ల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే జూన్ 1, 2016 న విపణిలోకి విడుదలైన రెడి-గో హ్యాచ్‌బ్యాక్ సంచలనాత్మక విక్రయాలతో డాట్సన్‌కు భారీ సక్సెస్ సాధించి పెట్టింది. బెస్ట్ మైలేజ్, న్యూ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలను టార్గెట్ చేస్తూ వచ్చిన రెడి-గో భారీ విక్రయాల బాటపట్టింది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

800సీసీ ఇంజన్‌తో సరిగ్గా ఏడాది క్రితం విడుదలైన రెడి-గో ను ఇప్పుడు 1.0-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లో విడుదలకు సిద్దం చేసింది. మార్కెట్లో ఇది వరకే ఉన్న మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ మరియు భాగస్వామ్యపు సంస్థ రెనో వారి క్విడ్ కార్లకు పోటీగా రెడి-గో 1.0-లీటర్ వచ్చింది.

సరికొత్త 1.0-లీటర్ డాట్సన్ రెడి-గో పోటీదారులను నిజంగానే ఎదుర్కొంటుందా..? కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునే వారికి డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ వెర్షన్ సరైన ఎంపికేనా...? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డిజైన్...

డిజైన్ విషయానికి వస్తే, 800సీసీ ఇంజన్‌తో లభించే రెడి-గో రూపంలోనే ఈ 1.0-లీటర్ ఉంటుంది. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పోటీగా ఉన్న కార్లతో పోల్చుకుంటే, కండలు తిరిగి శరీరాకృతి, ఎత్తైన బాడీ మరియు విశాలమైన ఇంటీరియర్ దీని సొంతం.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న బ్లాక్ కలర్ హానికాంబ్ ఫ్రంట్ గ్రిల్ కలదు. దీని చుట్టూ క్రోమ్ పట్టీ బార్డర్ అందివ్వడం జరిగింది. ఫ్రంట్ బానెట్‌ మీద మలుపుల నుండి మొదలయ్యి, ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా షార్ప్ లుకింగ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ కలదు. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెడి-గో సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, చూడగానే గుర్తించగల మస్కలర్ థీమ్ మరియు క్యారెక్టర్ లైన్స్ యథావిధిగా ఉన్నాయి, అదే విధంగా 13-అంగుళాల చక్రాలకు సియట్ టైర్స్ వారి 155/80 ఆర్13 కొలతల్లో ఉన్న టైర్లను అందివ్వడం జరిగింది (800సీసీ వెర్షన్ రెడి-గో కారులో జెకె టైర్లు ఉన్నాయి).

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇక్కడ కూడా పెద్దగా గుర్తించదగిన మార్పులేమీ లేవు. అయితే కారు చివరిలో ఉండే రెడి-గో పేరు ప్రక్కన 1.0 అనే బ్యాడ్జి వచ్చి చేరింది. సాధారణ రెడి-గో తో 1.0-లీటర్ వెర్షన్‌ను భిన్నంగా చూపడానికి 1.0 బ్యాడ్జి అందివ్వడం జరిగింది. లగేజ్ స్టోరేజ్ కోసం 222-లీటర్స్ కెపాసిటి గల బూట్ స్పేస్ ఉంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్

రెడి-గో 1.0-లీటర్ వెర్షన్ క్యాబిన్‌లోకి ప్రవేశించగానే, మార్పులను సులభంగా గుర్తించవచ్చు. బ్లాక్ థీమ్ ఇంటీరియర్‌లో ఎలాంటి అదనపు మెటల్ షీట్స్ లేవు. అయితే ప్యూర్ డార్క్ క్యాబిన్ చూడటానికి మోడ్రన్‌గా ఉంటుంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెడి-గో లోని అన్ని సీట్లను డ్యూయల్ టోన్ థీమ్‌లో అందివ్వడం జరిగింది. హై సీటింగ్ పొజిషన్ కల్పించడంతో డ్రైవర్ రోడ్డును క్లియర్‌గా వీక్షించగలడు. అన్ని సీట్లు కూడా సౌకర్యవంతంగానే ఉన్నాయి.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సగటు ఇండియన్ కొనుగోలుదారుడిని దృష్టిలో ఉంచుకుని క్యాబిన్ హైట్ మరియు లెంథ్ నిర్ణయించింది డాట్సన్. దీంతో పొడవు ఎక్కువగా ఉన్న ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించడం కష్టమే, అయితే సగటు ఎత్తున్న వారికి మోకాళ్లు మరియు తల చుట్టుప్రక్కల విశాలమైన స్పేస్ ఉంటుంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెనో క్విడ్ కారులో అందించిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడంలో డాట్సన్ ఫెయిల్ అయ్యింది. దీని స్థానంలో డిస్క్ డ్రైవ్, యుఎస్‌బి సపోర్ట్ మరియు ఏయుఎక్స్ ఇన్‌పుట్స్ గల మ్యూజిక్ సిస్టమ్‌ను రెడి-గో 1.0 వెర్షన్‌లో అందివ్వడం జరిగింది. అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఇవ్వలేకపోయింది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకునే వారి కోసం ఇంటీరియర్‌లో కొన్ని ప్రదేశాల్లో స్టోరేజ్ స్పేస్ కల్పించడం జరిగింది. సెంటర్ కన్సోల్‌కు ప్రక్కవైపుల చిన్న బటన్ ద్వారా ఆపరేట్ చేయగల సెంట్రల్ లాకింగ్ మరియు కీ లెస్ ఎంట్రీ ఫీచర్లను అందివ్వడం జరిగింది.

భద్రత పరంగా డాట్సన్ పోటీదారులకు అవకాశం ఇచ్చేసింది. డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ వెర్షన్‍‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగుని అందించింది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంజన్ వివరాలు...

సరికొత్త డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ వెర్షన్‌లో 999సీసీ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ రెనో క్విడ్‌లో కూడా కలదు. మూడు సిలిండర్ల 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి కంటే 200సీసీ తక్కువ సామర్థ్యం ఉన్న 800సీసీ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ కన్నా 14బిహెచ్‌పి ఎక్కువ పవర్ మరియు 19ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చెస్తుంది.

ఏఆర్ఏఐ ప్రకారం డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ మైలేజ్ లీటర్‌కు 22.5కిమీలుగా ఉంది. రోడ్డు మీద పరీక్షిస్తున్నపుడు 19 నుండి 20కిలోమీటర్ల మధ్య మైలేజ్‌నిచ్చింది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవ్ అండ్ పర్ఫామెన్స్

దీనిని డ్రైవ్‌ చేస్తున్నపుడు ఇంజన్ శబ్దం స్వల్పంగా క్యాబిన్ లోనికి వస్తుంది. ఇంజన్ కెపాసిటి పెరిగినప్పటికీ కొన్ని కఠినమైన రహదారుల మీద కావాల్సిన పవర్ ఉత్పత్తి చేయడంలో విఫలం చెందింది. లాంగ్ డ్రైవ్‌ కన్నా సిటి డ్రైవ్‌కు బాగా సూట్ అవుతుంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

తక్కువ స్పీడ్ వద్ద స్టీరింగ్ కాస్త హార్డ్‌గా తిప్పాల్సి ఉంటుంది. అయితే వేగం పుంజుకున్నాక స్టీరింగ్ మీద ఎలాంటి బలం ప్రయోగించాల్సిన అవసరం ఉండదు, స్మూత్‌గా హ్యాండిల్ చేయవచ్చు. ఇందులో ఉన్న 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కూడా కొన్ని సార్లు చాలా సింపుల్‌గా గేర్లు మారిపోతాయి, మరికొన్ని సార్లు మొరాయించినట్లు అనిపిస్తుంది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫ్యాక్ట్ షీట్...

పరీక్షించిన వేరియంట్ రెడి-గో 1.0 ఎల్ఎస్
ధర అంచనా రూ. 3.55 లక్షలుగా ఉండవచ్చు
ఇంజన్ 3-సిలిండర్ల 999సీసీ పెట్రోల్ ఇంజన్
గేర్‌బాక్స్ 5-స్పీడ్ మ్యాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 28-లీటర్లు
మైలేజ్ 22.5కిమీ(ఏఆర్ఐఏ ప్రకారం), టెస్టింగ్‌లో 19-20కిమీ/లీ
పవర్ & టార్క్ 68బిహెచ్‌పి/91ఎన్ఎమ్
బూట్ స్పేస్ 222-లీటర్లు
టైర్ సైజ్ 155/80 ఆర్13
టర్నింగ్ రేడియస్ 4.7-మీటర్లు
డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

తీర్పు

డాట్సన్ రెడి-గో దేహంలో కొత్త హృదయాన్ని అందిస్తోందని చెప్పవచ్చ. కాబట్టి మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే పనితీరు మెరుగ్గానే ఉంది. డిజైన్, ఇంటీరియర్ ద్వారా కొత్త కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ధరలను ఆచితూచి నిర్ణయించి విడుదల చేస్తే డాట్సన్‌కు మరో సక్సెస్ ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: First Drive: Datsun redi-GO 1.0L Review — Finally Redi-To-Go?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X