దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ.!! పూర్తి రివ్యూ మీకోసం

హైబ్రిడ్, ఎలక్ట్రిక్, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్.. ఇక ఇవే మన భవిష్యత్ ఇంధనాలు కాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) లభ్యత తగ్గిపోవడంతో, వాహన తయారీదారులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలోనే పెట్రోల్ ధర ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయింది.

మనదేశంలో కూడా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లను బయటకు తీయాలంటేనే భయమేస్తోంది. మరి ఇందుకు ప్రత్యామ్నాయం ఏంటా అని ఆలోచిస్తుంటే, జపనీస్ కార్ కంపెనీ హోండా తమ సిటీ సెడాన్‌లో ఓ హైబ్రిడ్ వేరియంట్‌తో ముందుకొచ్చింది. మరి ఇది స్టాండర్డ్ వేరియంట్ సిటీ సెడాన్ కన్నా ఎలా భిన్నంగా ఉంది, ఎంత మైలేజ్ ఇచ్చింది, దీని డ్రైవింగ్ పనితీరు ఎలా ఉంది వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ పూర్తి సమీక్షలో తెలుసుకుందాం రండి.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ (Honda City) సెడాన్‌కు భారత మార్కెట్‌కు చాలా బలమైన సంబంధం ఉంది. జపాన్‌కు చెందిన హోండా 1998లో మొట్టమొదటిసారిగా సిటీ సెడాన్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ ఎగ్జిక్యూటివ్ సెడాన్ తకనంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకుంది. మార్కెట్లోకి హోండా సిటీ రావడంతో కార్లలో పనితీరు, నిర్వహణ మరియు మెరుగుదల కోసం దేశీయ మార్కెట్లో కొత్త ప్రమాణాలు సెట్ చేయబడ్డాయి. ఆ సమయంలో వచ్చిన VTEC పెట్రోల్ ఇంజన్ చాలా మందిని ఆకట్టుకుంది మరియు హోండా సిటీని ఓ ఐకానిక్ కారుగా మార్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ హోండా సిటీ కారులో అనేక కొత్త మోడళ్లు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ యొక్క ఈ సిల్వర్ జూబ్లీ (25 ఏళ్ల) ప్రయాణంలో కంపెనీ అనేక రిఫ్రెష్డ్ మోడళ్లను మరియు సరికొత్త వెర్షన్లను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, హోండా మార్కెట్లో తమ ఐదవ తరం సిటీ సెడాన్ కారుతో పాటుగా నాల్గవ తరం సిటీ సెడాన్‌లో కొన్ని వేరియంట్లను విక్రయిస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు వీటన్నింటికీ మించి టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్‌గా తమ సరికొత్త హైబ్రిడ్ కారు (Hybrid Car) హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మార్కెట్లోని ఇతర మైల్డ్-హైబ్రిడ్ కార్ల మాదిరిగా ఇది (హోండా సిటీ ఇ-హెచ్ఈవి) పేరుకి హైబ్రిడ్ అనే బ్యాడ్జ్‌ని కలిగి ఉండే హైబ్రిడ్ కారు మాత్రమే కాదు, ఇది అసలుసిసలైన మరియు అత్యంత బలమైన హైబ్రిడ్ కారు.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి - డిజైన్ మరియు స్టైల్

కొత్త (5వ తరం) సిటీ సెడాన్ మీరు ఇదివరకే చూసి ఉన్నట్లయితే, ఇందులో కొత్తగా వచ్చిన హైబ్రిడ్ వేరియంట్ మీకు ఇదివరకే పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇది ఐదవ తరం సిటీ సెడాన్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ఆధారంగా తయారు చేయబడింది. సింపుల్‌గా చెప్పాలంటే, మొదటి చూపులో, ఈ హైబ్రిడ్‌ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కాస్తంత నిశితంగా పరిశీలిస్తే e:HEV వేరియంట్‌లో చిన్నపాటి డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అవేంటంటే, ఫ్రంట్ గ్రిల్ పైన మందపాటి క్రోమ్ స్ట్రిప్‌ మరియు ఆ గ్రిల్‌లో స్టాండర్డ్ మోడల్‌లో కనిపించే హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా ఉండే హనీకోంబ్ ప్యాటర్న్ ఉంటాయి.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఇక ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి, వీటిలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే, ఈ హైబ్రిడ్ వేరియంట్ యొక్క ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది, ఇప్పుడు ఇది చూడటానికి పంజా లాంటి స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందు వైపు కనిపించే మరొక ప్రధానమైన మార్పు ఏంటంటే, దాని ఫ్రంట్ హోండా లోగో. స్టాండర్డ్ సిటీ వేరియంట్లలో ఇది పూర్తి క్రోమ్‌లో ఉంటుంది, అయితే, హైబ్రిడ్ వేరియంట్‌లో మాత్రం ఇది బ్లూ కలర్ యాక్సెంట్‌లను కలిగి ఉండి, ఇది హైబ్రిడ్ వాహనం అని గుర్తు చేస్తుంది. ఇకపోతే, దీని సైడ్ ప్రొఫైల్‌లోని డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు, ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. అంటే, స్టాండర్డ్ మరియు హైబ్రిడ్ వేరియంట్లను సైడ్ నుంచి చూస్తే, ఏది ఏంటనేది గుర్తించడం కాస్తంత కష్టమే.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఈ హైబ్రిడ్ కారులో బ్లాక్-అవుట్ B-పిల్లర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు స్ట్రాంగ్ షోల్డర్ లైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అవే 16 ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. అయితే, ఈ చక్రాలపై గన్‌మెటల్ గ్రే ఫినిషింగ్‌కు బదులుగా, నిగనిగలాడే బ్లాక్ కలర్ ఫినిషింగ్ కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, ఎడమవైపు సైడ్ మిర్రర్ క్రింద కెమెరా అమర్చబడి ఉంటుంది. డ్రైవర్ ఎడమ వైపు టర్న్-సిగ్నల్ ఇండికేటర్‌ను ఆన్ చేయగానే, ఈ కెమెరా యాక్టివేట్ అయి, ఎడమ వైపు వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డ్యాష్‌బోర్డులోని స్క్రీన్‌పై డిస్‌ప్లే చేస్తుంది. డ్రైవర్ ఎడమ వైపు లేన్‌కి మారేటప్పుడు కానీ లేదా ఎడమ వైపుకు మలుపు తీసుకునే సమయంలో కానీ ఖచ్చితమైన మరియు సురక్షితమైన నిర్ణయం తీసుకోవడంలో డ్రైవర్‌కు సహకరిస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఇక కారు వెనుక వైపు చేసిన మార్పులను గమనిస్తే, ఈ హైబ్రిడ్ వేరియంట్ ఇప్పుడు బూట్ లిడ్‌పై లిప్ స్పాయిలర్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ లోగో మాదిరిగానే రియర్ లోగో కూడా బ్లూ యాక్సెంట్స్‌ను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్‌లో వెనుక వైపు 'City' మరియు 'ZX' అనే బ్యాడ్జింగ్‌ ఉంటుంది, ఇది టాప్-స్పెక్ వేరియంట్ అని సూచిస్తుంది. ఇక తర్వాత వెనుక వైపు కనిపించే మరొక బ్యాడ్జ్ e:HEV, ఇది దీనిని హైబ్రిడ్‌గా గుర్తించడానికి సహకరిస్తుంది. అయితే, ఇక్కడ అతిపెద్ద మార్పు పెద్ద డిఫ్యూజర్ రూపంలో ఉంటుంది, ఇది ఫాక్స్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, సాధారణంగానే, కొత్త ఐదవ తరం హోండా సిటీ సెడాన్ చూడటానికి చాలా అద్భుతమైన కారుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన హైబ్రిడ్ వేరియంట్, చిన్న డిజైన్ ట్వీక్స్‌తో దాని ప్రత్యేకతను తెలియజేస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

హోండా సిటీ ఈ విభాగంలో లభిస్తున్న ఓ మంచి ఎగ్జిక్యూటివ్ సెడాన్. ఇది దాని ఎక్స్టీరియర్ స్టైలింగ్‌కు తగినట్లుగానే ప్రీమియం ఇంటీరియర్‌ను కూడా కలిగి ఉంటుంది. సిటీ హైబ్రిడ్ టాప్-ఎండ్ వేరియంట్ ఆధారంగా తయారైన మోడల్ కావడంతో, ఇది ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు మరియు ప్రీమియం కంఫర్ట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రధానంగా ఆకట్టుకునేది దాని డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ థీమ్. ఇది ఐవరీ మరియు బ్లాక్ కలర్‌లో ఉంటుంది. హోండా సిటీ సెడాన్ కారులో ఈ ఇంటీరియర్ కలర్ స్కీమ్ కొత్తది మరియు ఇందులోని ఐవరీ లెదర్ కారు లోపలి భాగాన్ని మరింత ప్రీమియంగా మరియు విలాసవంతంగా కనిపించేలా చేస్తుంది. మీరు డ్రైవర్ సీటులో కూర్చున్నప్పుడు, ఇది ఈ సెగ్మెంట్‌లోనే సొగసైన మరియు ఖరీదైన ఇంటీరియర్స్‌లో ఒకటనే అనుభూతి చెందుతారు.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

కారు లోపల డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ ప్యానెల్స్ నలుపు రంగులో ఉండి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేయబడి ఉంటాయి. కాగా, వాటిపై అమర్చిన ఐవరీ లెథర్ ఇన్‌సెర్ట్స్ ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. ఈ వేరియంట్‌లోని సీట్లన్నీ కూడా పూర్తి ఐవరీ కలర్‌లోనే ఉంటాయి. డ్రైవర్ సీట్ ముందు భాగంలో ఉండే స్టీరింగ్ వీల్, లెథర్‌తో చుట్టబడి ఉండి ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది మరియు చేతులకు నిండుగా అనిపిస్తుంది. ఇదొక మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్. ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్‌ స్విచ్, క్రూయిజ్ కంట్రోల్ స్విచ్‌లు మరియు కొన్ని ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్‌ల కోసం మౌంటెడ్ కంట్రోల్‌లను ఈ స్టీరింగ్ వీల్‌పై చూడొచ్చు. ఇందులో లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కోసం కూడా ప్రత్యేక బటన్లు ఉన్నాయి.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఇక స్టీరింగ్ వీల్ వెనుక భాగాన్ని గమనిస్తే, ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇదొక అనలాగ్ మరియు డిజిటల్ మీటర్. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్ రూపంలో ఉంటుంది మరియు దానికి ఎడమ వైపున 7.0 ఇంచ్ TFT డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది, ఇది డ్రైవర్‌కు అవసరమైన అనేక రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది.

ఇందులో హైబ్రిడ్ డ్రైవ్ మోడ్‌లు, పవర్ సోర్స్, ఓడోమీటర్, రీజెన్ గేజ్, పవర్ యూసేజ్ గేజ్, రేంజ్, ప్రస్తుత ఇంధన వినియోగం వంటి కీలక సమాచారంతో పాటుగా, ఈ కారుకి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా కనిపిస్తాయి, కాకపోతే ఇవి గేర్‌బాక్స్‌కు సంబంధించినవి కావు, ఇంజన్ పనితీరు మరియు హ్యాండ్లింగ్ విభాగంలో ఈ ప్యాడిల్ షిఫ్టర్‌లు ఉపయోగపడుతాయి. కంపెనీ దీనిని డిక్లరేషన్ సెలక్టర్ ప్యాడిల్ అని పిలుస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఇక సెంటర్ డ్యాష్‌బోర్డ్‌ను గమనిస్తే, ఇందులో ప్యాసింజర్ వైపున చెక్కతో కూడిన ప్లాస్టిక్ స్ట్రిప్ ఉంటుంది, ఇది ఇంటీరియర్‌కు మరింత ప్రీమియం మరియు విలాసవంతమైన టచ్‌ను ఇస్తుంది. ఇందులో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది కూడా వాహనానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. అయితే, హోండా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని మరింత మెరుగైన గ్రాఫిక్స్‌తో అందించి ఉండవచ్చనేది మా అభిప్రాయం. అంతేకాదు, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే సిస్టమ్ కూడా వైర్‌లెస్ కాదు, తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ని వైరుతో అనసంధానం చేయడం ద్వారా ఈ కనెక్టివిటీ ఫీచర్లు పనిచేస్తాయి.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

సంగీత ప్రియుల చెవులను అలరించేందుకు ఇందులో 6-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ ఉంటుంది, ఇందులో నుండి వచ్చే ధ్వని చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగంలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించే ఓ చిఎన్న LCD స్క్రీన్‌పై ఫ్యాన్ వేగం, ఉష్ణోగ్రత, గాలి-ప్రవహించే దిశ మొదలైన సమాచారం తెలుస్తుంది. ఏసి కంట్రోల్ బటన్స్‌లో మూడు గుండ్రటి డయల్స్ ఉంటాయి, సిల్వర్ గార్నిష్‌తో ఇవి చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. ఓవరాల్‌గా చూస్తే, స్టాండర్డ్ మోడల్‌ సిటీతో పోల్చినప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ యొక్క సెంటర్ కన్సోల్ కొద్దిగా పెంచబడినట్లుగా ఉంటుంది. ఇందులో రెండు కప్ హోల్డర్‌లు, మీ మొబైల్ ఫోన్‌ను ఉంచడానికి రెండు స్లాట్లు, గేర్ లివర్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. అయితే, నేటి ఆధునిక కార్లలో అత్యంత కామన్ ఫీచర్ అయిన వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఆప్షన్ హోండా సిటీ హైబ్రిడ్‌లో మిస్ అయింది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి - ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు బూట్ స్పేస్

కొత్తగా వచ్చిన సిటీ హైబ్రిడ్ కారే కాదు, అంతకు ముందు విక్రయించబడిన అన్ని రకాల సిటీ కార్లు కూడా మంచి ప్రాక్టికాలిటీని అందించనవే. కాబట్టి, ప్రాక్టికాలిటీ విషయంలో సిటీ హైబ్రిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు దశాబ్దాల కాలంలో, కంపెనీ తమ సిటీ సెడాన్‌లో కొత్త తరం మోడళ్లను, సరికొత్త సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చి, ఈ కారును మరింత ఆచరణాత్మకంగా మార్చింది. కొత్త హోండా సిటీ ఇ:హెచ్ఈవి మంచి స్టోరేజ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. డోర్ పాకెట్స్‌లో 1-లీటర్ బాటిల్‌ హోల్డర్స్, సెంటర్ కన్సోల్‌లోని ఆర్మ్‌రెస్ట్‌లో వాలెట్ వంటి వస్తువులనే దాచుకునేందుకు చిన్న క్యూబీహోల్‌ ఉంటుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

స్టోరేజ్ తర్వాత ఈ కారులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దాని సీటింగ్ కంఫర్ట్ గురించి. ఈ కారులోని సీట్లు ఈ సెగ్మెంట్‌లో అత్యంత సౌకర్యవంతమైనవిగా ఉంటాయి. దూరప్రయాణాలలో సైతం మంచి సౌకర్యవంతమైన అనుభూతిని అందించేలా, ఇందులోని ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక ఇందులోని వెనుక సీట్లయితే, ఈ సౌకర్యవంతమైన అనుభూతిని నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళతాయి. విశాలమైన లెగ్ రూమ్, క్నీ రూమ్, మరియు హెడ్ రూమ్‌తో ఇది ఓ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న అనుభూతిని అందిస్తుంది. అయితే, వెనుక సీటులో మధ్య వరుసలో కూర్చున్న ప్రయాణీకుడికి మాత్రం కాస్తంత అసౌకర్యంగానే అనిపిస్తుంది. ఈ వెనుక సీటులోని సెంటర్ కన్సోల్ ఓపెన్ చేసుకొని, నలుగురితో (డ్రైవరుతో కలిపి) ప్రయాణిస్తే మాత్రం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

వెనుక వరుసలోని ప్రయాణీకుల ప్రయాణ అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు, ఇందులో సెంటర్ కన్సోల్‌కు అమర్చబడిన రియర్ ఏసి వెంట్‌లు, రెండు 12V ఛార్జర్ స్లాట్‌లు మరియు కప్‌హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక చివరగా బూట్ స్పేస్ విషయానికి వస్తే, సాధారణంగా హోండా సిటీ కారులో బూట్ స్పేస్‌కు కొదవే ఉండదు, ఎంత లగేజ్‌నైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అయితే, హోండా సిటీ హైబ్రిడ్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. స్టాండర్డ్ సిటీతో పోల్చితే, హైబ్రిడ్ సిటీలో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, ఈ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌లో భాగంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను బూట్‌లో జోడించడమే. దీని కారణంగా బూట్ స్పేస్ దాదాపు 200 లీటర్లు తగ్గింది. హోండా సిటీ హైబ్రిడ్ బూట్ స్పేస్ ఇప్పుడు 306 లీటర్లుగా ఉంటుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి - ఇంజన్ పనితీరు, హైబ్రిడ్ డ్రైవ్‌ట్రెయిన్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్

హోండా బ్రాండ్ అంటేనే దాని మన్నికైన ఇంజన్లకు పెట్టింది పేరు. ఇంజన్ మరియు డ్రైవ్‌ట్రెయిన్ విషయానికి వస్తే హోండా సిటీ ఎల్లప్పుడూ చాలా ఆకట్టుకునే కారుగా ఉంటుంది. ఇందులో కొత్తగా వచ్చిన హైబ్రిడ్ వేరియంట్ కూడా పర్యావరణ అనుకూలమైన రీతిలో చాలా అద్భుతమైనదిగా ఉంటుంది. ఈ హైబ్రిడ్ కారులో పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లు ఉంటాయి. హోండా సిటీ e:HEV రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు లిథియం-అయాన్ బ్యాటరీతో పాటుగా 1.5-లీటర్ i-VTEC ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి గరిష్టంగా 126 బిహెచ్‌పి శక్తిని మరియు 253 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ మల్టిపుల్ డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ కారణంగా హోండా సిటీ హైబ్రిడ్ కూడా బహుళ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. కాబట్టి, ఈ కారు ఆ డ్రైవ్ మోడ్స్ మధ్య స్వయంచాలకంగా మరియు సజావుగా మారడంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోదు.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఈవీ డ్రైవ్ (EV Drive):

ఈ మోడ్‌లో హోండా సిటీ ఇ:హెచ్ఈవి కారును స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనంగా ఉపయోగించుకోవ్చచు మరియు ఇది స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు డిఫాల్ట్‌గా ఈ మోడ్‌లోకి మారిపోతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై 'EV' సూచన కనిపిస్తే, మీ సిటీ కారు EV మోడ్‌లో ఉన్నట్లు అర్థం మరియు ఈ మోడ్‌లో నడపడం కూడా చాలా సులభం. గేర్ లివర్‌ను D లేదా B మోడ్‌లోకి స్లాట్ చేసి, బ్రేక్ పెడల్‌పై కాలు తీసేయండి, మీ Honda City e:HEV ఎలాంటి సంశయం లేకుండా ముందుకు సాగిపోతుంది. అయితే, థ్రోటల్‌ను నొక్కగానే EV మోడ్ అదృశ్యమవుతుంది మరియు ఇది హైబ్రిడ్ మోడ్‌కు దారి తీస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హైబ్రిడ్ డ్రైవ్ (Hybrid Drive):

హోండా సిటీ ఇ:హెచ్ఈవి ఒక బలమైన హైబ్రిడ్ కారు, దీనిని మంచి వేగంతో పట్టణం చుట్టూ నడిపేటప్పుడు ఇది హైబ్రిడ్ డ్రైవ్ మోడ్‌ను ఉపయోగిస్తుంది. కారు హైబ్రిడ్ డ్రైవ్‌లో ఉన్నప్పుడు పెట్రోల్ ఇంజన్ యాక్టివ్‌గా ఉంటుంది మరియు దానికి కనెక్ట్ చేయబడి ఉండే జనరేటర్-మోటార్‌ సాయంతో వచ్చే శక్తి, కారు వెనుక భాగంలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా చార్జ్ అయిన బ్యాటరీ ప్యాక్ నుండి తిరిగి అదే శక్తి ముందు చక్రాల వద్ద ఎలక్ట్రిక్ మోటార్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదొక నిరంత ప్రక్రియ.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

ఇంజన్ డ్రైవ్ (Engine Drive):

ఈ డ్రైవ్ మోడ్‌లో, ఎలక్ట్రిక్ మోటారు పూర్తిగా ఆపివేయబడుతుంది మరియు క్లచ్ నిమగ్నమై ఉంటుంది మరియు ఇంజన్ ముందు చక్రాలను నేరుగా eCVT గేర్‌బాక్స్ ద్వారా డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ డ్రైవ్ మోడ్‌ను హైవేపై వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా క్విక్ యాక్సిలరేషన్ కావాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ కారులోని అధునాతన టెక్నాలజీ వలన డ్రైవరు నడిపే ప్రస్తుత డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఏ డ్రైవ్ మోడ్ అయితే బాగా సరిపోతుందో నిర్ణయించుకొని, ఆటోమేటిక్‌గా ఆ డ్రైవ్ మోడ్‌కు మారుతుంది. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు ఆటోమేటిక్‌గా ఈ డ్రైవింగ్ మోడ్‌లకు మారే అనుభాతిని అస్సలు తెలియదు. అయితే, హైబ్రిడ్ నుండి ఇంజన్ డ్రైవ్‌కు మారేటప్పుడు మాత్రం హార్డ్ యాక్సిలరేషన్‌లో ఇంజన్ శబ్దం ఎక్కువగా వినబడుతుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ హైబ్రిడ్ కారు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, తక్కువ ఇంధనం ఉపయోగించి ఎక్కువ మైలేజీని అందించడం. హోండా కూడా అదే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ కారును ప్రోగ్రామ్ చేసింది. కాబట్టి, ఇంధన వినియోగంలో తగ్గుదల కోసం హోండా ఇందులో అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పరిచయం చేసింది. అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ సాధారణ ఫోర్-స్ట్రోక్ ఇంజన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, దీని కంప్రెషన్స్ స్ట్రోక్‌లో మాత్రం తేడా ఉంటుంది. సాధారణ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌లో, పిస్టన్ ఇన్‌టేక్ స్ట్రోక్ సమయంలో లోపలికి వచ్చిన గాలి మరియు ఇంధనం మొత్తాన్ని కంప్రెస్ చేస్తుంది. కానీ, అట్కిన్సన్ సైకిల్‌లో, ఇన్‌టేక్ వాల్వ్ కొంచెం ఎక్కువసేపు తెరరవబడి ఉంటుంది. ఫలితంగా, పిస్టన్ కంప్రెషన్ స్ట్రోక్‌లో పైకి కదిలేటప్పుడు కొంత ఇంధనం మరియు గాలిని తిరిగి తీసుకొని మానిఫోల్డ్‌లోకి నెట్టివేస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

కాబట్టి, సాధారణ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌తో పోలిస్తే, ఈ ఆట్కిన్సన్ ఇంజన్‌లో తక్కువ గాలి మరియు ఇంధనం మండుతుంది, ఫలితంగా మైలేజ్ కూడా పెరుగుతుంది. అలాగని, ఇది ఇంజన్ పనితీరును పెద్దగా ప్రభావితం చేయదు. అయితే, హోండా సిటీ హైబ్రిడ్‌లోని ఎలక్ట్రిక్ మోటారు దీని కంటే ఎక్కువగా ఉంటుంది. హోండా ఈ హైబ్రిడ్ కారులో రీజనరేషన్ టెక్నాలజీని కూడా అందించింది. గేర్ లివర్‌ను 'B' లోకి స్లాట్ చేసినప్పుడు ఇది జరుగుతుంది మరియు ఇక్కడే పాడిల్ షిఫ్టర్‌ల పాత్ర తెరపైకి వస్తుంది. ఈ సమయంలో గేర్‌లను మార్చడానికి బదులుగా, పునరుత్పత్తి స్థాయిని పెంచడానికి లేదా తగ్గించడానికి ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగిస్తారు. ఇందులో '+' షిఫ్ట్ రీజనరేషన్‌ను తగ్గిస్తుంది మరియు '-' షిఫ్ట్ రీజనరేషన్‌ని పెంచుతుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి రాకతో, ఈ విభాగంలో కూడా ADAS ఫీచర్లు ప్రారంభమయ్యాయి. జపనీస్ కార్ బ్రాండ్ ఈ హైబ్రిడ్ సెడాన్‌లో రోడ్ డిపార్చర్ మిటిగేషన్, కొలైజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైన అడాస్ ఫీచర్లను అందిస్తోంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్లను ఉపయోగించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మరియు ఇవి ప్రయాణీకుల భద్రతకు హామీగా కూడా నిలుస్తాయి. అయితే, ఈ ADAS ఫీచర్లలో కొన్ని పనిచేయాలంటే, కారు వేగం గంటకు 72 కిమీ కంటే ఎక్కువ ఉండాలి (అతి వేగం ప్రమాదకరం అని గుర్తుంచుకోండి).

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ హైబ్రిడ్ మోడల్‌ కాస్తంత అదనపు బరువును కలిగి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం ఎలక్ట్రిక్ మోటార్స్ మరియు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్. ఈ కారు బరువు పెరిగినప్పటికీ, దాని హ్యాండ్లింగ్ లో మాత్రం ఎలాంటి మార్పు అనిపించదు. హోండా ఈ హైబ్రిడ్ కారులో పెరిగిన బ్యాటరీ ప్యాక్ యొక్క బరువుకు తగ్గట్టుగానే వెనుక సస్పెన్షన్‌ను కూడా సర్దుబాటు చేసింది. కాబట్టి, హోండా సిటీ e:HEV కూడా సరిగ్గా స్టాండర్డ్ మోడల్ సిటీ మాదిరిగానే హ్యాండిల్ చేస్తుంది. దీని బాడీ రోల్ కూడా నియంత్రణలో ఉంటుంది మరియు రైడ్ చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి - సేఫ్టీ మరియు ముఖ్యమైన ఫీచర్లు

హోండా తమ కొత్త సిటీ ఇ:హెచ్ఈవి సేఫ్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కంపెనీ ఇందులో అధునాతన ADAS ఫీచర్లతో పాటుగా, అవసరమైన అనేక ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందించింది. వీటిలో కొన్ని సేఫ్టీ ఫీచర్లు ఇలా ఉన్నాయి:

- హోండా సెన్సింగ్ టెక్నాలజీస్

- కొలైజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్

- రోడ్ మిటిగేషన్ సిస్టమ్

- లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్

- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

- ఆటో హై-బీమ్

- బ్రేక్ హోల్డ్

- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

- హిల్ స్టార్ట్ అసిస్ట్

- వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్

- ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి యొక్క ముఖ్యమైన ఫీచర్లు:

- 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే (వైర్‌లెస్ కాదు)

- 6 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్

- ఎల్ఈడి లైటింగ్

- 7.0 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే

- వన్-టచ్ సన్‌రూఫ్ ఆపరేషన్

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

హోండా సిటీ ఇ:హెచ్ఈవి కలర్ ఆప్షన్స్:

- రేడియంట్ రెడ్ మెటాలిక్

- మెటిరాయిడ్ గ్రే మెటాలిక్

- ప్లాటినం వైట్ పెర్ల్

- లూనార్ సిల్వర్ మెటాలిక్

- గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్

దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! హోండా సిటీ (e:HEV) హైబ్రిడ్ రాకతో ఇతర సెడాన్ల పరిస్థితి ఇదీ..!! పూర్తి రివ్యూ మీకోసం..

చివరగా ఏం చెబుతారేంటి..?

హోండా సిటీ ఇ:హెచ్ఈవి రివ్యూ కంచికి చేరే సమయం వచ్చింది కాబట్టి, ఈ కారు గురించి మేము ఏం చెబుతామంటే.. దీనిని పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా, మెరుగైన మైలేజీనిచ్చే బెస్ట్ మిడ్-సైజ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ అనొచ్చు. సాధారణ పెట్రోల్ వెర్షన్ సిటీ సెడాన్ లీటరుకు 17 కిమీ సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంటే, ఈ హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్ దాని శక్తివంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సెటప్ కారణంగా లీటరుకు 26.5 కిమీ మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది (రియల్ వరల్డ్ మైలేజ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము). కాబట్టి, ప్రస్తుత పెట్రోల్ ధరలను పరిగణలోకి తీసుకుంటే, ఈ మైలేజ్ ఫిగర్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు కూడా ఒప్పుకుంటారా.. హోండా సిటీ హైబ్రిడ్ రాకతో దెబ్బకు ఠా సెడాన్ల ముఠా..! అని.

Most Read Articles

English summary
Honda city e hev hybrid car review design features driving impressions mileage and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X