హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఎక్కువ ప్రజాదరణ ఉంది. ఈ కారణంగానే మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా దాదాపుగా ఎస్‌యూవీలను తయారుచేసి విక్రయిస్తున్నాయి.

భారత మార్కెట్లో అత్యధిక ప్రాచుర్యం పొందిన వాహన తయారీదారులలో హ్యుందాయ్ ఒకటి. దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలతో దూసుకెళ్తున్న కంపెనీల జాబితాలో హ్యుందాయ్ కూడా ఒకటిగా ఉంది. హ్యుందాయ్ హ్యాచ్ బ్యాక్ కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఒకప్పుడు మార్కెట్లో హ్యుందాయ్ సాంట్రో, ఐ 10, ఐ 10 గ్రాండ్, ఐ 20 వంటి హ్యాక్ బ్యాక్ కార్లు బాగా అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

భారతదేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వీటి ఆదరణ కొంత తగ్గి కొత్త వాటికి ఆదరణ పెరిగింది. ఇందులో భాగంగానే హ్యాచ్ బ్యాక్ కార్ల స్థానాన్ని ఎస్‌యూవీలు కైవసం చేసుకున్నాయి. ఇందులో వెన్యూ, క్రెటా, కోన ఈవి మరియు టుసాన్ వంటి హ్యుందాయ్ ఎస్‌యూవీలు కొత్త రికార్డ్ సృష్టించాయి.

కాలక్రమంగా హ్యుందాయ్ కంపెనీ కూడా కొత్త ఉత్పత్తులపై నిమగ్నమైంది. ఇందులో భాగంగానే కంపెనీ 2021 జూన్ 18 న భారత మార్కెట్లో కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆల్కాజార్ భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మేము ఈ కొత్త అల్కాజార్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్, 6-సీటర్, సిగ్నేచర్ మోడల్‌ను డ్రైవ్ చేసాము. దీని గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

డిజైన్ అండ్ స్టైల్:

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని ముందు భాగంలో కొత్త హ్యుందాయ్ క్రెటాలో మనం చూసిన మాదిరిగానే ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. ఇది బంపర్‌లో ఉంచిన హెడ్‌ల్యాంప్‌లతో ఒకే హెడ్‌ల్యాంప్ మరియు డిఆర్‌ఎల్ సెటప్‌ను పొందుతుంది. ఇది ట్రై-బీమ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్. అదేవిధంగా ఇది సెగ్మెంట్ యొక్క ఫస్ట్ ఫీచర్.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఈ ఎస్‌యూవీకి పెద్ద క్రోమ్-స్టడెడ్ సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ లభిస్తాయి. హ్యుందాయ్ లోగో దీని గ్రిల్‌లో మనం చూడవచ్చు. దీనికితో పాటు ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ మరియు ఇండికేటర్ వంటివి బంపర్‌ కింద ఉంటాయి. మొత్తం మీద ఫ్రంట్ ఎండ్ హ్యుందాయ్ క్రెటా యొక్క ఫ్రంట్ ఫాసియాను పోలి ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్ యొక్క సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇది హ్యుందాయ్ క్రెటాపై ఆధారపడి ఉందని చెప్పడం కష్టం. ఈ ఎస్‌యూవీ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ప్రీమియం ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్‌ను ఇవ్వడానికి A, B మరియు C పిల్లర్స్ అన్నీ బ్లాక్ చేయబడ్డాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్ ప్రీమియం డైమండ్-కట్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై ప్రత్యేకమైన డిజైన్‌ని కలిగి ఉంటుంది. ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ సైడ్ ఫుట్ స్టెప్ కూడా పొందుతుంది. ఇది వాహనం యొక్క మొత్తం రూపకల్పనతో బాగా మిళితం అవుతుంది. వీల్ ఆర్చెస్ అద్భుతంగా ఉంటాయి. ఈ ఎస్‌యూవీ ఫ్లోటింగ్ రూప్ డిజైన్ కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

కొత్త హ్యుందాయ్ అల్కాజార్‌ ఎస్‌యూవీలో డార్క్ క్రోమ్‌లో పూర్తి చేసిన క్లాస్సి డోర్ హ్యాండిల్స్‌ ఉంటాయి.వెనుక భాగం ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఇది స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్‌ను పొంది, డార్క్ క్రోమ్ స్ట్రిప్ వాటిని కలుపుతుంది. ఈ డార్క్ క్రోమ్ స్ట్రిప్‌లో ఆల్కాజర్ అనే పదాన్ని చూడవచ్చు.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్‌లో ట్విన్-ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు కూడా ఉన్నాయి. మేము సిగ్నేచర్ ట్రిమ్‌లో 2.0-లీటర్ ఇంజిన్ పవర్డ్ మోడల్‌ను నడిపాము. దీని టెయిల్‌గేట్ దిగువ-ఎడమ వైపున '2.0' బ్యాడ్జ్, అదే విధంగా టెయిల్‌గేట్ దిగువ-కుడి వైపున 'సిగ్నేచర్' బ్యాడ్జ్ చూడవచ్చు.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్స్:

హ్యుందాయ్ అల్కాజార్ లోపలి భాగం విశాలంగా ఉండి, వాహనదారునికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌పై టగ్ చేసి, డోర్ ఓపెన్ చేయగానే మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ స్వాగతం పలుకుతుంది. హ్యుందాయ్ దీనిని 'కాగ్నాక్ బ్రౌన్' అని పిలుస్తుంది. ఇది బ్రౌన్ మరియు బ్లాక్ యొక్క కలయిక.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఈ ఎస్‌యూవీలోని డాష్‌బోర్డ్ మృదువైన-టచ్ మెటీరియల్స్ తో తయారు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఇందులోని మొత్తం డాష్‌బోర్డ్ సరైన హార్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. అయినప్పటికీ ఇది సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌లా కనిపిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

డాష్‌బోర్డ్‌లో సెంటర్-స్టేజ్ తీసుకుంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉండటం మీరు గమనించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను సిస్టమ్‌కి కనెక్ట్ చేయడం చాలా సులభం, కావున ఫీచర్లు సులభంగా దీనిద్వారా పొందవచ్చు.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

స్క్రీన్ యొక్క టచ్ చాలా అద్భుతమైనది, దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఈ టచ్‌స్క్రీన్ ద్వారా 64 కలర్ అమ్బియంట్ లైటింగ్‌తో సహా అనేక ఇతర వాహన విధులను కూడా కంట్రోల్ చేయవచ్చు. యాంబియంట్ లైటింగ్ ఈ స్థలంలో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఇన్స్ట్రుమెంటేషన్ 10.25 ఇంచెస్ స్క్రీన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది అన్ని సమయాల్లో వాహనానికి కావలసిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్స్ కి కూడా అనుమతిస్తుంది.

డ్రైవర్ ఎడమ లేదా కుడివైపున ఉన్న ఇండికేటర్స్ ఉపయోగించినప్పుడు, స్క్రీన్ పై స్పీడోమీటర్ ORVM లలో ఉన్న కెమెరాల నుండి చిత్రాల ద్వారా భర్తీ చేయబడుతుంది. ఇది ఎస్‌యూవీ యొక్క బ్లైండ్ స్పాట్‌లో ఉన్న ఏదైనా వస్తువులను హైలైట్ చేస్తుంది. బోస్ నుండి 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ చాలా స్పష్టమైన ధ్వనిని పునరుత్పత్తి చేస్తుంది. రెండవ వరుసలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

మేము డ్రైవ్ చేసిన సిగ్నేచర్ వేరియంట్ ఆరు సీట్ల వేరియంట్, ఇది రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో వస్తుంది. రెండవ వరుసలో ఉండేవారు ఫోల్డ్ డౌన్ టేబుల్స్ పొందుతారు. ఇవన్నీ సుదీర్ఘ ప్రయాణంలో కూడా అనుకూలంగా ఉండేవిధంగా చేస్తాయి. సాధారణంగా భారతీయ కస్టమర్లు అదనపు స్థలం మరియు ప్రాక్టికాలిటీని ఆశిస్తారు. కావున ఇందులో ఉన్న మూడవ వరుస సీట్లు వీరికి తగిన విధంగా ఉంటాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఆరు లేదా ఏడుగురు వ్యక్తులు కూర్చునే హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక వాహనం అల్కాజార్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మూడవ వరుసలోని ప్రయాణీకులు ఎసి వెంట్స్ పొందుతారు, దీనితోపాటు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఇండ్యూజువల్ ఫ్యాన్ కంట్రోల్ నాబ్ కూడా పొందుతారు. హ్యుందాయ్ మూడవ వరుస కోసం యుఎస్బి ఛార్జింగ్ పోర్టులను కూడా అందించింది. ఇవన్నీ వాహనదారునికి చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ అండ్ బూట్ స్పేస్:

కొత్త అల్కాజార్ ఎస్‌యూవీ తన విభాగంలోనే అత్యంత సౌకర్యవంతమైన కారు అని హ్యుందాయ్ తెలిపింది. అల్కాజర్‌తో కొన్ని గంటలు గడిపిన తరువాత, మొదటి మరియు రెండవ వరుసలు చాలా సౌకర్యంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులోని మూడవ వరుస కొంత ఇబ్బందిగా ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్ దాని విభాగంలో పొడవైన వీల్‌బేస్ 2,760 మి.మీ కలిగి ఉంది. ఇది విశాలమైన క్యాబిన్‌గా అందిస్తుంది. ఏదేమైనా, మూడవ వరుస సౌకర్యవంతంగా ఉండటానికి ఈ వీల్‌బేస్ సరిపోదు. మూడవ వరుసలో పెద్దవారు కూర్చున్నట్లయితే కొంత అసౌకర్యంగా ఉంటుంది. అయితే మూడవ వరుస పిల్లలకు ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

మూడవ వరుసకు వెళ్లడం మరియు రావడం అనేది అనేది ఒక టచ్ టిప్, ఇది చాలా సులభంగా ఉంటుంది. కెప్టెన్ సీటు లేదా స్ప్లిట్ సీటు ముందుకు దూసుకుపోతుంది. మూడవ వరుసతో పోల్చితే రెండవ వరుస కొంత విరుద్ధంగా ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా సీట్లలో ఉపయోగించిన మెటీరియల్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

కెప్టెన్ సీట్ల మధ్య కప్‌హోల్డర్లు మరియు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటి వాటితో పాటు ఆర్మ్‌రెస్ట్ కూడా ఉంది. సీట్ బ్యాక్ టేబుల్స్ ప్రతిదీ సౌకర్యవంతంగా చేస్తాయి. ఈ ఫోల్డ్ టేబుల్స్ ఐటి డివైస్ హోల్డర్ మరియు రిట్రెక్టబుల్ కప్ హోల్డర్‌తో వస్తాయి. హ్యుందాయ్ అల్కాజార్ ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కోసం డిస్ప్లే కూడా ఉంది. ఇది కరోనా మహమ్మారి సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండవ వరుస ప్రయాణీకులకు సన్ షేడ్స్ సౌలభ్యం కూడా లభిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఇందులో ఉన్న డ్రైవర్ సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 8 వే పవర్ అడ్జస్ట్ మరియు త్రీ లెవెల్ కూలింగ్ అండ్ వెంటిలేషన్ ఫీచర్ పొందుతుంది. ముందు ప్యాసింజర్ సీటు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్ లోని ఉత్తమమైన లక్షణాలలో ఒకటి పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్. సన్‌రూఫ్‌ను ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ద్వారా వాయిస్ ఆపరేట్ చేయవచ్చు. సన్‌రూఫ్ ఖచ్చితంగా క్యాబిన్‌కు మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది. కావున వాహనదారులకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్ ఇన్ని ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల మార్కెట్లో తప్పకుండా తనదైన ముద్ర వేస్తుంది. ఇది బహుళ సీటింగ్ ఎంపికలతో వస్తుంది. మూడవ వరుస మరియు రెండవ వరుసలోని సీట్లను పూర్తిగా లేదా పాక్షికంగా మడవవచ్చు. మూడు వరుసల సీటింగ్‌తో ఉన్న హ్యుందాయ్ అల్కాజార్‌లో 180 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సీట్లు ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి కావలసినంత బూట్ స్పేస్ లభిస్తుంది.

Dimensions Hyundai Alcazar
Length 4,500mm
Width 1,790mm
Height 1,675mm
Wheelbase 2,760mm
Boot Space 180 litres
Ground Clearance 200mm
హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఇంజిన్ పర్ఫామెన్స్ & డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

మేము డ్రైవ్ చేసిన సిగ్నేచర్ వేరియంట్ 2.0-లీటర్ ఎంపిఐ మోటారు కలిగి ఉంది. ఇందులోని 1,999 సిసి, ఇన్లైన్-ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 157 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్‌ వద్ద 191 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మేము 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. అయితే, ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ 1.5-లీటర్ డీజిల్ యూనిట్‌తో ఆల్కాజార్‌ను రిటైల్ చేస్తుంది, ఇది 4,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 113.4 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 2,750 ఆర్‌పిఎమ్‌ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

పెట్రోల్ యూనిట్లో పవర్ డెలివరీ చాలా సరళంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి స్ట్రాంగ్ మిడ్ రేంజ్ ఉంది కాని టాప్ ఎండ్‌లో పవర్ లేదు. ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మోటారు కాబట్టి, కొన్ని టర్బోచార్జ్డ్ కార్లలో కనిపించే లాగ్ లేనందున దీనికి క్విక్ త్రాటల్ రెస్పాన్స్ ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఎస్ మోడ్‌లో, కారు తదుపరిదానికి మారడానికి ముందు ఎక్కువ కాలం గేర్‌లను కలిగి ఉంటుంది. ప్యాడిల్ షిఫ్టర్స్ ద్వారా గేర్‌బాక్స్‌పై డ్రైవర్ పూర్తి కంట్రోల్ పొందవచ్చు. కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, కంఫర్ట్ మరియు స్పోర్ట్స్ మోడ్స్.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

ఈ ఎస్‌యూవీ ఎకో మోడ్‌లో గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. కానీ త్రాటల్ రెస్పాన్స్ కొంత తక్కువగా ఉంటుంది. కంఫర్ట్ మోడ్ లో డ్రైవింగ్ అద్భుతంగా ఉంటుంది, నగరం చుట్టూ డ్రైవింగ్ చేయడానికి వాహనదారునికి ఇది ఉత్తమమైన ఎంపిక. స్పోర్ట్ మోడ్‌లో, ఎస్‌యూవీ చాలా స్పందిస్తుంది. ఈ ఇంజిన్ మోడ్‌లతో పాటు, ఎస్‌యూవీకి మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు లభిస్తాయి. అవి మడ్, సాండ్ మరియు స్నో.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

అల్కాజార్‌లో సస్పెన్షన్ సెటప్ చాలా మృదువైనదిగా ఉంటుంది. కావున మీకు సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుంది. స్టీరింగ్ వీల్ చాలా ప్రతిస్పందిస్తుంది. స్టీరింగ్ వీల్ లో బాగా నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఇప్పుడు మునుపటి కంటే కొంచెం గట్టిగా ఉంది. మునుపటి హ్యుందాయ్ కార్లలో, స్టీరింగ్ వీల్ చాలా తేలికైనది మరియు అధిక వేగంలో కొంత ప్రమాదకరమైనది. అల్కాజర్‌తో ఇది పూర్తిగా మారింది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

హ్యుందాయ్ అల్కాజార్‌ యొక్క మైలేజ్ విషానికి వస్తే ఏఆర్ఏఐ ధ్రువీకరించిన దాని ప్రకారం, పెట్రోల్ మాన్యువల్‌ వేరియంట్ ఒక లీటరుకు 14.5 కి.మీ మైలేజ్ మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 14 కి.మీ మైలేజ్ అందించింది. మరోవైపు, డీజిల్ మాన్యువల్ వేరియంట్ ఒక లీటరుకు 18.5 కిమీ మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18 కి.మీ మైలేజ్ అందించింది.

హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

సేఫ్టీ ఫీచర్స్ & కీ ఫీచర్స్:

హ్యుందాయ్ ఆల్కాజర్‌ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అల్కాజార్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ కూడా తాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే ఫీచర్లతో నిండి ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్:

  • బ్లైండ్ వ్యూ మానిటర్ (బివిఎం)
  • త్రీ ట్రాక్షన్-కంట్రోల్ మోడ్స్: స్నో, సాండ్ అండ్ మడ్
  • ఏబీఎస్ విత్ ఈబిడి
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
  • హిల్ స్టార్ట్ కంట్రోల్ (హెచ్‌ఎస్‌సి)
  • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్‌
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్)
  • ఆటో హెడ్‌ల్యాంప్స్
  • 360 డిగ్రీ కెమెరా
  • 6 ఎయిర్‌బ్యాగులు
  • రియర్ పార్కింగ్ కెమెరా
  • హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

    హ్యుందాయ్ అల్కాజార్ యొక్క కీ ఫీచర్స్:

    • క్రూయిస్ కంట్రోల్
    • 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్
    • వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్
    • రిమోట్ ఇంజిన్ స్టార్ట్ విత్ స్మార్ట్ కీ
    • పాడిల్ షిఫ్టర్లు
    • ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్
    • హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

      వేరియంట్స్, కలర్స్ మరియు ప్రైస్:

      హ్యుందాయ్ అల్కాజార్ ఆరు సింగిల్-టోన్ కలర్ ఆప్షన్స్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

      సింగిల్-టోన్ కలర్స్:

      • టైగా బ్రౌన్
      • పోలార్ వైట్
      • ఫాంటమ్ బ్లాక్
      • టైఫూన్ సిల్వర్
      • స్టార్రి నైట్
      • టైటాన్ గ్రే
      • డ్యూయెల్-టోన్ కలర్స్:

        • పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌
        • టైటాన్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌
        • హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

          వారంటీ:

          హ్యుందాయ్ కంపెనీ త కొత్త తన కొత్త అల్కాజార్ ఎస్‌యూవీపై 3 ఇయర్స్ / అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీతో పాటు రోడ్‌సైడ్ అసిస్టన్స్ కవర్‌ను స్టాండర్డ్ గా అందిస్తోంది. కొనుగోలుదారులు 5 సంవత్సరాల / 1,40,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీని ఎంచుకోవచ్చు. ఈ వ్యవధిలో కారు యాజమాన్యం బదిలీ అయినప్పుడు ఈ పొడిగించిన వారంటీ కూడా బదిలీ చేయబడుతుంది.

          హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

          ప్రత్యర్థులు మరియు కాంపాక్ట్ చెక్:

          భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్ అత్యంత పోటీతత్వ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీ, కొత్త టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కి కూడా మంచి పోటీ ఇవ్వనుంది.

          హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

          కొత్త హ్యుందాయ్ అల్కాజార్ మంచి ఫీచర్స్ మరియు పరికలను కలిగి ఉండటంతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఇది దాని పోటీదారులకు గట్టి పోటీఇవ్వనుంది.

          Specifications Hyundai Alcazar Tata Safari MG Hector Plus
          Engine 2.0-litre Petrol / 1.5-litre Turbo-Diesel 2.0-litre Turbo-Diese 1.5-litre Turbo-Petrol / 1.5-litre Turbo-Petrol Hybrid / 2.0-litre Turbo-Diesel
          Power 157bhp / 113.4bhp 167.6bhp 141bhp / 141bhp / 167.6bhp
          Torque 191Nm / 250Nm 350Nm 250Nm / 250Nm / 350Nm
          Transmission 6-Speed Manual / 6-Speed Automatic 6-Speed Manual / 6-Speed Automatic 6-Speed Manual / DCT / CVT
          Starting Price Rs 16.30 lakh (ex-showroom) Rs 14.99 lakh (ex-showroom) Rs 13.62 lakh (ex-showroom)
          హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

          అల్కాజర్‌ ఫస్ట్ డ్రైవ్ పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

          హ్యుందాయ్ అల్కాజార్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలుతో వస్తుంది. ఇది మంది ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ మల్టిపుల్ సీటింగ్ ఆప్సన్స్, మల్టిపుల్ పవర్‌ట్రైన్ ఆప్సన్స్ ఉన్నాయి. కావున ఇది మార్కెట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకోగలదు. హ్యుందాయ్ బ్రాండ్ లో ఒక అద్భుతమైన కారుగా అల్కాజార్ తప్పకుండా నిలుస్తుంది.

          హ్యుందాయ్ కంపెనీ యొక్క అద్భుతమైన ఎస్‌యూవీ 'అల్కాజార్' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; వివరాలు

          హ్యుందాయ్ అల్కాజార్ ధర విశ్యానికి వస్తే, ఇది టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ అధిక ధరల కారణంగా, అమ్మకాలు కొంత ప్రవితం అయ్యే అవకాశం ఉంది. ధర మరియు అమ్మకాల విషయాన్నీ పక్కనపెడితే ఈ ఎస్‌యూవీ ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.

Most Read Articles

English summary
Hyundai Alcazar First Drive Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X