జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ ఇండియా విభాగం ఇటీవల విపణిలోకి సరికొత్త కంపాస్ ఎస్‌యూవీ ట్రయల్‌హాక్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. కంపాస్ ఎస్‌యూవీ విడుదలైన తొలినాళ్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన కంపాస్ ఆఫ్-రోడ్ వెర్షన్ ట్రయల్‌హాక్. ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిన కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని డ్రైవ్‌స్పార్క్ టీమ్ ఫస్ట్ డ్రైవ్ చేసి, రివ్యూ చేసింది.

ఇవాళ్టి జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఎలా ఉంది.. ధరకు తగ్గ విలువలనున్నాయా.. అసలు కొనచ్చో... కొనకూడదో తెలుసుకుందాం రండి..

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌‌హాక్ అత్యంత కఠినమైన మరియు మోస్ట్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ, జీప్ ఇండియా విక్రయిస్తున్న కంపాస్ శ్రేణిలో ఈ వేరియంట్ అత్యంత ముఖ్యమైనది, మరియు విడుదలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోడల్. డ్రైవ్‌స్పార్క్ బృందానికి దీనిని టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఇవాళ్టి రివ్యూలో జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ బలాలు.. బలహీనతలేంటో తెలుసుకుందాం.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

డిజైన్ మరియు స్టైల్

ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని చూడగానే తొలిచూపులోనే గంభీరంగా కనిపిస్తుంది, కాని చాలా వరకు ఇది కంపాస్ స్టాండర్డ్ వేరియంట్‌నే తలపిస్తుంది. తీక్షణంగా చూస్తే సాధార కంపాస్ ట్రయల్‌హాక్ వెర్షన్ కంపాస్‌కు మధ్య తేడా తెలుస్తుంది. ఎస్‌యూవీ మీద పలు చోట్ల ట్రయల్‌బాక్ అనే పేరు గల బ్యాడ్జ్, పక్క డిజైన్‌లో ట్రయల్-రేటెడ్ లోగో మినహాయిస్తే డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

సైడ్ ప్రొఫైల్‌లో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు, అచ్చం కంపాస్‌ ఎస్‌యూవీనే పోలి ఉంది. కానీ ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, ముందు నుండి వెనుక వరకు పదునైన స్టైలింగ్ లైన్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డోర్ మీద బ్లాక్ కలర్‌లో హైలైట్‌గా కనిపిస్తున్న కంపాస్ పేరు మరియు బాడీ అంచుల్లో ఉన్న బ్లాక్ క్లాడింగ్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో ప్రధానంగా గుర్తించిన మార్పుల్లో పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ (భూమి నుండి ఎస్‌యూవీ బాడీ అంచు మధ్యనున్న దూరం). సాధారణ కంపాస్ కంటే కంపాస్ ట్రయల్‌హాక్ గ్రౌండ్ క్లియరన్స్ 27ఎమ్ఎమ్ అధికంగా ఉండి, కంపాస్ శ్రేణిలోనే 205ఎమ్ఎమ్ బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన మోడల్‌గా నిలిచింది. పేరుకు తగ్గట్లుగానే ఆఫ్-రోడింగ్ ఛాలెంజెస్ కోసం 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ఆల్-టెర్రైన్ రబ్బర్ టైర్లు ఇందులో వచ్చాయి. ఇది తారు నుండి రాళ్ల వరకు, ఇసుక నుండి మంచు వరకు అన్ని తలాల్లో ధీటుగా పరుగెడుతుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వెనుక డిజైన్ విషయానికి వస్తే చిన్న చిన్న మార్పులు మినహా చెప్పుకోదగ్గ అప్‌డేట్స్ ఏమీ జరగలేదు. రియర్ డిజైన్‌లో కొత్తగా రూపొందించిన బంపర్, లాక్కెళ్లడానికి ఉపయోగపడే టోయ్-హుక్ వచ్చింది. ఇది కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీ కంటే ఒకటిన్నర రెట్లు అధిక బరువు లాక్కెళ్లగలదు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

ఇంటీరియర్, ఫీచర్లు మరియు పనితీరు

కంపాస్ ట్రయల్‌హాక్ ఇంటీరియర్‌లోకి వెళితే ఆల్-బ్లాక్ కలర్ ఫినిషింగ్‌ గల క్యాబిన్ స్వాగతం పలుకుతుంది. ఖరీదైన మరియు లగ్జీర్ ఫీల్ కల్పించేందుకు తాకగానే మృదువుగా అనిపించే ఎన్నో డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఎర్రటి సొబగులను గుర్తించవచ్చు. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్ సరౌండ్స్, సీట్లు మరియు క్యాబిన్ అప్‌హోల్‌స్ట్రే మీద గమనించవచ్చు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌‌హాక్ ఎస్‌యూవీలో ఉన్న పలు ఫీచర్లు...

 • 7-అంగుళాల పరిమాణంలో ఉన్న మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే
 • 8.4-అంగుళాల పరిమాణంలో ఉన్న యు-కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే
 • ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో యాప్ సపోర్ట్
 • జీపీఎస్ న్యావిగేషన్
 • క్రూయిజ్ కంట్రోల్
 • కీ లెస్ ఎంట్రీ
 • ఇంజన్ స్టార్ట్/స్టాప్
 • బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్
 • కార్నరింగ్ ల్యాంప్స్
 • పానరోమిక్ సన్‌రూఫ్

జీప్ కంపాస్ సిరీస్‌లో ట్రయల్‌హాక్ వేరియంట్ టాప్ మోడల్. కానీ ఇందులో చాలా వరకు ఫీచర్లు మిస్సయ్యాయి. లిమిటెడ్ ప్లస్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటివి ట్రయల్‌హాక్‌లో రాలేదు.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో అత్యుత్తమ స్టోరేజ్ స్పేస్ కలదు. పలురకాల కప్ హోల్డర్లు, బాటిల్ హోల్డర్లు, మరియు ఎస్‌యూవీ మొత్తం విభిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

సౌకర్యం

కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ స్టాండర్డ్ కంపాస్‌లో ఉండే ప్రీమియమ్ ఫీల్‌ను యధావిధిగా కొనసాగించింది. విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండటం వలన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. లెథర్ ఫినిషింగ్ గల మెత్తటి సీట్లు, రెండు సీట్లను వేరు చేసి, ముంజేతులకు సపోర్ట్ ఇచ్చే లంబార్ పార్ట్, తలకు సపోర్ట్ ఇచ్చే హెడ్ రెస్ట్, ముందు రెండు సీట్లను సౌకర్యానికి అనుగుణంగా సర్దుకునేందుకు అనువుగా ఎలక్ట్రిక్ అడ్జెస్ట్‌మెంట్ వంటివి ఎన్నో ఉన్నాయి.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

వెనుక సీట్లను కూడా అత్యంత సౌకర్యంగా తీర్చిదిద్దారు. వెనుక సీట్లుగా కాస్త వాలుగా ఉండటంతో రిలాక్స్ పొజిషన్‌లో విశ్రాంతి తీసుకుంటూ కూర్చిండిపోవచ్చు. మధ్యలో ఆర్మ్ రెస్ట్ మరియు ఇతర ఫీచర్లు దూర ప్రాంత ప్రయాణాలకు ఈ ఎస్‌యూవీ బెస్ట్ అని చెప్పకనే చెబుతాయి. ఇందులో అత్యంత విశాలమైన 438-లీటర్ల సామర్థ్యం ఉన్న లగేజ్ స్పేస్ కలదు.

Length (mm) 4398
Width (mm) 1819
Height (mm) 1657
Wheelbase (mm) 2636
Ground Clearance (mm) 205
Boot Space (litres) 438
జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ అనుభవం

సాంకేతికంగా జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో అదే మునుపటి 2.0-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించేలా అప్‌గ్రేడ్ చేశారు.

ట్రయల్‌హాక్ ఇంజన్ పవర్ అవుట్‌పుట్ సాధారణ కంపాస్‌తో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంది. ఇంజన్ సౌండ్ కూడా కాస్త తగ్గింది. బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడంతో తక్కువ కాలుష్యాలను విడుదల చేస్తుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో వచ్చిన కీలక మార్పుల్లో గేర్‌బాక్స్ ఒకటి, అవును ఇందులో 9-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చింది. ఈ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ వేగం(rpm) తక్కువగా ఉన్నపుడు కూడా చాలా స్మూత్‌గా మరియు వేగంగా స్పందిస్తుంది. సిటీ ట్రాఫిక్ నుండి హైవే డ్రైవింగ్ వరకు అన్ని పరిస్థితుల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

స్టీరింగ్‌లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారతీయ రోడ్ల డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్లుగా చక్కగా రూపొందించారు. సిటీ ట్రాఫిక్‌లో కష్టం లేకుండా సులభంగా హ్యాండిల్ చేసుకోవచ్చు. హైవే రైడింగ్‌లో జారుడు స్వభావాన్ని ఏ మాత్రం ప్రదర్శించదు, దీంతో నడుపుతున్నంతసేపు ధైర్యంగా ఉంటుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలోని సస్పెన్షన్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేసింది. సస్పెన్షన్‌లోని డ్యాంపింగ్ మరింత మెరుగుపడింది. ఇందులో ప్రయాణిస్తున్నంతసేపు డ్రైవర్ మరియు తోటి ప్రయాణికులు సౌకర్యవంతమైన జర్నీ పొందుతారు. ఆన్-రోడ్ మాత్రమే కాదు ఆఫ్-రోడ్ ప్రియులను కూడా ఆకట్టుకునేందుకు రెండు అవసరాలకు సమన్యాయం చేస్తూ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీని రూపొందించారు.

కంపాస్ ట్రయల్‌హాక్‌లో అందరి దృష్టినీ ఆకర్షించేది ట్రయల్-రేటెడ్ బ్యాడ్జి. ఏదేమైనప్పటికీ ఆఫ్-రోడింగ్ విషయంలో తనను తాను నిరూపించుకుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో పలు రకాల నూతన డ్రైవింగ్ మోడ్స్‌ను జీప్ అందించింది. ప్రత్యేకించి తన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పెంచుకునేందుకు వీటిని పరిచయం చేసింది. "4X4 లో, "4X4 లాక్" మరియు రాక్ మోడ్. ఈ మూడింటినీ ఇప్పుటికే ఉన్న మడ్, స్నో, శాండ్ మరియు ఆటో మోడ్స్‌కు అదనంగా అందివ్వడం జరిగింది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలోని 4X4 లో డ్రైవింగ్ మోడ్‌ 20:1 నిష్పత్తిలో క్రాలింగ్ ఆప్షన్ కల్పించింది. అంటే, ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం 350ఎన్ఎమ్ టార్క్‌లో చక్రాలకు కేవలం గంటకు 15కిమీల వేగాన్ని మాత్రమే ఇస్తుంది. ఆఫ్-రోడ్ చేసేటప్పు ఎత్తు పల్లాలు, మలుపులు, కఠినమైన సవాళ్లతో కూడిన తలాలు, మిట్ట ప్రాంతాన్ని ఎక్కేటప్పుడు, వాలు తలంలో క్రిందకు దిగేటప్పుడు ఇలా ఎన్నో సందర్భాల్లో అత్యధిక టార్క్‌ను కేవలం 15కిమీ వేగాన్ని మాత్రమే అందించడంలో ఈ డ్రైవింగ్ మోడ్ సహాయపడుతుంది.

Engine 1956cc
Fuel Type Diesel
No. Of Cylinders In-line 4
Power (bhp) 173
Torque (Nm) 350
Transmission 9-AT
Weight (Kg) 161
జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

సేఫ్టీ ఫీచర్లు

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీలో ఎన్నో రకాల సేఫ్టీ ఫీచర్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ట్రయల్‌హాక్‌‍లో ఉన్న కీలక సేఫ్టీ ఫీచర్లు...

 • వివిధ రకాల ఎయిర్ బ్యాగులు
 • రివర్స్ పార్కింగ్ కెమెరా
 • సీట్-బెల్ట్ వార్నింగ్
 • హై-స్పీడ్ వార్నింగ్
 • ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్లు
 • ఐఎస్ఒఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్స్
 • క్రూయిజ్ కంట్రోల్
 • హిల్ స్టార్ట్ కంట్రోల్
 • హిల్ డిసెంట్ కంట్రోల్
 • యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
 • ట్రాక్షన్ కంట్రోల్
 • స్పీడ్ లిమిటర్
 • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

పోటీ మరియు వాస్తవాలు

జీప్ కంపాస్ రెగ్యులర్ మోడల్ పోటీ ఇచ్చే మోడళ్లకే కంపాస్ ట్రయల్‍‌హాక్ పోటీనిస్తుంది. టాటా హ్యారియర్, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడళ్లకు కంపాస్ ట్రయల్‌హాక్ గట్టి పోటీనిస్తుంది. కానీ దీని ధర రూ. 26.8 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉండటంతో విపణిలో ఉన్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు హ్యుందాయ్ టుసాన్ ప్రీమియం ఎస్‌యూవీలతో కూడా పోటీపడుతుంది.

జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

జీప్ కంపాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న హ్యారీయర్ మరియు క్రెటా సాంకేతిక వివరాలను ట్రయల్‌హాక్‌తో పోల్చి చూస్తే..

Rivals/Specs Jeep Compass Trailhawk Tata Harrier Hyundai Creta
Engine 2.0-litre Diesel (BS-VI) 2.0-litre Diesel (BS-IV) 1.6-litre Diesel
Power (bhp) 173 143 126
Torque (Nm) 350 350 260
Transmission 9-Speed AT 6-Speed MT 6-Speed MT/AT
Prices (ex-showroom) TBA* Rs 12 - 16 Lakh Rs 10 - 15 Lakh
జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ - బెస్ట్ లగ్జరీ ఆఫ్-రోడర్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

4X4 వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీ అత్యంత శక్తివంతమైనది. కానీ ట్రయల్‌హాక్ వేరియంట్ జోడింపుతో జీప్ కంపాస్ సిరీస్ అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ లక్షణాలను కలిగిన ఎస్‌యూవీగా మరో మెట్టు పైకెక్కింది. ఎన్నో రకాల ఇంటీరియర్ ఫీచర్లు మరియు భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే దీనికంటే క్రింది స్థానంలో ఉన్న కంపాస్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్లు ఇందులో మిస్సయ్యాయి. ఏదేమైనప్పటికీ కంపాస్ ట్రయల్-రేటెడ్ వెర్షన్ అటు ఆఫ్-రోడింగ్ ఇటు లగ్జరీ, సౌకర్య పరంగా సమతూకం పాటించి మంచి మార్కులు తెచ్చుకుంది.

బాగా నచ్చినవి..

 • అత్యద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు
 • ఖరీదైన మరియు లగ్జరీ ఫీలింగ్
 • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్

నచ్చనవి..

క్రింది స్థాయి వేరియంట్లలో ఉన్నటువంటి ఫీచర్లు ఇందులో రాకపోవడం

Most Read Articles

English summary
Jeep Compass Trailhawk First Drive Review — The Premium Off-Roader You’ve Been Waiting For!. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more