కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా మోటార్స్ ఇండియా గత ఏడాది సెల్టోస్ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. కియా సెల్టోస్ ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్లో అనూహ్యమైన స్పందన లభించింది. ఊహించని సక్సెస్ రుచిచూసిన కియా మోటార్స్ ఆరు నెలల్లోనే మరో కొత్త మోడల్‌‌ను విపణిలోకి తెచ్చేందుకు సిద్దమైంది.

అంతర్జాతీయ మార్కెట్లో లగ్జరీ మినీ వ్యాన్‌‌గా పేరుగాంచిన కార్నివాల్ ఎంపీని ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2020లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయితే విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ లగ్జరీ ఎంపీవీ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

7 మంది ప్రయాణించే సౌలభ్యంతో అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఎంపీవీ కియా కార్నివాల్ కారుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి, ఏఆర్ఏఐ సర్టిఫికేట్స్ కూడా పొందింది. బడ్జెట్ ధరలోనే ప్రీమియం కార్ల తయారీ బ్రాండ్‌గా అవతరించేందుకు కార్నివాల్ ఎంపీవీతో సిద్దమవుతోంది.

కియా కార్నివాల్ ఎంపీవీని స్వయంగా నడిపి, పరీక్షించి, మా డ్రైవింగ్ అనుభవాన్ని పాఠకులతో పంచుకునే అవకాశం డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు లభించింది. విలాసవంతమైన లక్షణాలు, లగ్జరీ ఫీచర్లు మరియు దీనిని సొంతం చేసుకునే కస్టమర్లు ఉన్నతంగా భావించేలా కియా కార్నివాల్ ఎంపీవీని నిర్మించారు. అయితే, కియా సెల్టోస్ తరహా భారీ విజయాన్ని అందుకుంటా.. ఆశించిన స్థాయిలో కస్టమర్లను ఆకర్షిస్తుందా..? వంటి ప్రశ్నలకు సమాధానంతో పూర్తి వివరాలు ఇవాళ్టి రివ్యూలో చూద్దాం రండి..

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

డిజైన్ & స్టైల్

కియా కార్నివాల్ రోడ్డెక్కితే కచ్చితంగా అందరి కళ్లూ దీని మీదకే మళ్లుతాయి. స్టైలిష్ బాడీ లైన్స్ మరియు క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. సింపుల్‌ లుక్‌తో అనవసరం అనిపించే అదనపు డిజైన్‌ అంశాలు ఏవీ లేవు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

ఫ్రంట్ డిజైన్‌ను నుండి చూసుకుంటే లగ్జరీ ఎంపీవీలో బ్రాండ్ సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. గ్రిల్ మధ్యలో క్రోమ్ ఎలిమెంట్స్ మరియు గ్రిల్ చుట్టూ మందమైన క్రోమ్ పట్టీ చాలా కొత్తగా ఉంది.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

గ్రిల్‌కు ఇరువైపులా అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టర్ని సిగ్నల్స్ జోడింపుతో కూడిన స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. హెడ్‌ల్యాంప్స్‌కు కిందివైపునే బంపర్ మీద ఇరువైపులా ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వచ్చాయి.

కియా మోటార్స్ ఈ ఫాగ్‌ల్యాంప్స్‌ను "ఐస్-క్యూబ్స్" (మంచు ముక్కలు) అని పిలుస్తోంది. C-ఆకారంలోని క్రోమ్ హౌసింగ్స్ మధ్యలో ఫాగ్ ల్యాంప్స్ అమర్చారు. వీటిని మినహాయిస్తే, ఫ్రంట్ బంపర్ మీద విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు సిల్వర్ స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, పొడవాటి స్టైలిష్ లుక్ కలిగి ఉంది. అనవసరం అనిపించే ఎలాంటి ఎక్స్‌ట్రా డిజైన్స్ లేవు. బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న డి-పిల్లర్, ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లు, డోర్లు పక్కవైపుకు జరిగేందుకు బ్లాక్ కలర్ పట్టీలా కనిపించే చిన్న మార్గాన్ని బాడీ చివరి అంచుల్లో పొడవుగా చూడవచ్చు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ ఎంపీవీలో 18-ఇంచుల క్రోమ్ ఫినిషింగ్ గల అల్లాయ్ వీల్స్ వచ్చాయి. కియా కార్నివాల్ ఎంపీవీ మొత్తానికి అల్లాయ్ వీల్స్ అదనపు రూపాన్నిచ్చాయి. ఓవరాల్ డిజైన్‌లో అల్లాయ్ వీల్స్ కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా.. ఆకృతికి తగ్గ రూపాన్ని జోడించాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ రియర్ డిజైన్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంది. నెంబర్ ప్లేటుకు పైభాగంలో డిక్కీ డోర్ మీదున్న క్రోమ్ పట్టీ మధ్యలో అమర్చారు. ఇరువైపులా స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, బంపర్ మీద ఇరువైపులా రిఫ్లక్టర్లు మరియు మధ్యలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ వచ్చింది.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

ఇంటీరియర్

కియా కార్నివాల్ ఇంటీరియర్‌లోకి ప్రవేశిస్తే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, అవును పొడవాటి ఎంపీవీ కావడంతో మిగతా కార్ల మాదిరిగా కాకుండా క్యాబిన్ స్పేస్ ఎంతో విశాలంగా ఉంటుంది. ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రకరకాల సీటింగ్ ఆప్షన్స్ ఇందులో మరో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ ఎంపీవీ 7-సీటర్, 8-సీటర్ మరియు 9-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. కార్నివాల్ టాప్ ఎండ్ వేరియంట్ "లిమోసిన్" 7-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఫ్రంట్ వరుసలో రెండు సీట్లు, మధ్యలో రెండు వ్యక్తిగత సీట్లు మరియు చివరి వరసలో ముగ్గురు కూర్చునే సీటు కలదు. అన్ని సీట్లలో సౌకర్యంగా కూర్చోవచ్చు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

ఫ్రంట్ క్యాబిన్ గురించి మాట్లాడుకుంటే.. ఫ్రంట్ డ్రైవర్ సీటును ఎలక్ట్రిక్ పవర్‌‌తో అడ్జెస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సీటులో కూర్చుంటే రోడ్ వ్యూవ్ చాలా స్పష్టంగా ఉంటుంది, కంఫర్ట్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సీట్లను రూపొందించారు. లెథర్ ఫినిషింగ్‌ గల స్టీరింగ్ వీల్ మీద ఆడియో, ఫోన్ కాల్స్ మరియు ఇతర ఫంక్షన్లు వచ్చాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

స్టీరింగ్ వీల్ వెనుక వైపున్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో రెండు స్టైలిష్ సర్క్యూలర్ డయల్స్ వచ్చాయి. వీటిలో ఒకటి టాకో మీటర్ కోసం, మరొకటి స్పీడో మీటర్ కోసం ఏర్పాటు చేశారు. రెండు డయల్స్ మధ్యలో ఉన్న 3.5-ఇంచుల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పేలో గేర్ ఇండికేటర్, మిగిలి ఉన్న ఫ్యూయల్‌తో ఎంత దూరం ప్రయాణించవచ్చు. ఫ్యూయల్ లెవల్స్ మరియు డ్రైవర్‌కు సంభందించిన ఇతర వివరాలను చూడవచ్చు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ ఎంపీవీలోని డ్యాష్‌బోర్డ్ డ్యూయల్‌లో టోన్ పెయింట్ స్కీమ్ మరియు సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ వచ్చాయి. సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చుట్టూ ఉన్న కంట్రోల్ బటన్స్ పియానో-బ్లాక్ ఫినిషింగ్‌లో వచ్చాయి.

కియా కార్నివాల్ ఎంపీవీలో 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెహికల్ టెలీమ్యాటిక్స్ మరియు ఇన్-బిల్ట్ న్యావిగేషన్ వంటి ఎన్నో కనెక్టెడ్ ఫీచర్లు వచ్చాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో కియా ప్రత్యేకంగా అభివృద్ది చేసిన UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా అదనంగా వచ్చింది. కస్టమర్ స్మార్ట్ ఫోన్‌ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ ఫోన్లలో UVO యాప్ అందుబాటులో ఉంది. వాయిస్ అసిస్టెన్స్, వెహికల్ డియాగ్నస్టిక్స్ మరియు రిమోట్ కంట్రోల్ వంటి 35 రకాల ఫీచర్లను ఆపరేట్ చేసుకోవచ్చు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

డ్యాష్‌బోర్డుకు పైభాగంలో ఓవర్‌హెడ్ స్విచ్చులు ఉన్నాయి. డ్యూయల్-సన్‌రూఫ్ తెరవడానికి మరియు మూయడానికి, ఇరువైపులా ఉన్న ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లను తెరిచేందుకు బటన్స్ వచ్చాయి.

ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేకు ఇరువైపులా ఏసీ వెంట్స్ అందించారు. డిస్ప్లేకి కిందువైపునే క్లైమేట్ కంట్రోల్ బటన్స్ కూడా వచ్చాయి. కియా కార్నివాల్ ఎంపీవీలో త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కలదు, పొడవాటి విశాలమైన క్యాబిన్‌ను వీలైనంత త్వరగా చల్లబరుస్తుంది.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

డ్రైవర్ చేతికి అందుబాటులో ఉండేలా గేర్‌ లీవర్‌ను సరైన ప్రదేశంలో అందించారు. ఇందులో ఎలక్ట్రానిక్ బ్రేక్ కూడా ఉంది. డ్రైవర్ కోసం వెంటిలేటెడ్ సీట్, గేర్‌లీవర్ పక్కనే ఎన్నో రకాల కంట్రోల్ బటన్స్ వచ్చాయి. సౌకర్యవంతమైన సీట్లు, లెథర్ ఫినిషింగ్ గల అప్‌హోల్‌స్ట్రే, డ్యూయల్-టోన్ స్కీమ్‌లో ఉన్న సీట్లు, లగ్జరీ ఫీలింగ్ కల్పించేలా ఫ్రంట్ రెండు సీట్లకు మధ్యలో స్టైలిష్ ఆర్మ్ రెస్ట్ సపోర్ట్ వచ్చింది.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ ఎంపీవీలో వెనుక వరుస ప్యాసింజర్ల కోసం సాధారణ డోర్లు కాకుండా ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లు వచ్చాయి. కియా కార్నివాల్ టాప్ ఎండ్ వేరియంట్ "లిమోషన్"లో ప్రతి వరుసలోనూ ఒక్కో ప్యాసింజర్ కోసం ఒక్కో సీటును అందించి, నప్పా లెథర్‍ ఫినిషింగ్ అందించారు. నిజంగా చెప్పాలంటే కియా కార్నివాల్ ఇంటీరియర్ ఓ లగ్జరీ గదినే తలపిస్తుంది.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

సీట్లును మన సౌకర్యానికి తగ్గట్లుగా వంచుకోవచ్చు, కాళ్ల దగ్గర మనకు ఎంత స్పేస్ కావాలో అంత మేరకు సీట్లను వెనుకు/ముందుకు జరుపుకోవచ్చు. డ్రైవర్ మరియు రియర్ సీట్లకు కింది వైపున కాళ్లకు సపోర్ట్‌గా పొడగించబడిన సీట్ అదనంగావ వచ్చింది. మధ్య వరుసలో కూర్చునే ప్రయాణికులు అసలైన లగ్జరీ ఫీలింగ్ పొందుతారు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

చిట్ట చివరగా, మూడో వరుస సీటు విషయానికి వస్తే, అన్ని వేరియంట్లలో కూడా పొడవాటి బెంచ్ సీటును అందించారు. ఈ సీటు అత్యంత సౌకర్యవంతగా, చక్కటి కుషనింగ్ కలిగి ఉన్నాయి. కాళ్లు, తొడలు మరియు తల ప్రదేశాల్లో ఇరుకుగా అనిపించకుండా సీటింగ్ ఎంతో ఫ్రీగా ఉంటుంది. మూడు వరుసల సీట్లకు క్యాబిన్ మొత్తం ఏసీ చేరేలా ఏసీ వెంట్లను అందించారు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

7-సీటర్ తరహాలోనే కియా కార్నివాల్ 8 మరియు 9-సీటర్ వేరియంట్లను ఇదే తరహా సౌకర్యంతో డెవలప్ చేశారు. 8 సీటర్ కార్నివాల్ విషయానికి వస్తే మధ్య వరుసలో మరో సీటు అదనంగా వచ్చింది. అదే 9-సీటర్‌లో మొత్తం నాలుగు వరుస సీటింగ్ ఉంటుంది. ఫ్రంట్ వరుసలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, తర్వాత రెండు వరుస సింగల్ కెప్టెన్ సీట్లు, చివరి వరుసలో ముగ్గురు కూర్చునేలా బెంచ్ సీటును అందించారు.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

క్యాబిన్ వాడకం మరియు స్వీయఅనుభూతి విషయానికి వస్తే, కియా కార్నివాల్ ఇంటీరియల్ ఏ అంశంలో కూడా నిరుత్సాహపరచదు. 5.1-మీటర్లు పొడవున్న కార్నివాల్‌ లోపల డ్యాష్‌బోర్డు మీద డ్యూయల్ గ్లోవ్ బాక్స్, సెంటర్ కన్సోల్ మీద స్పేసెలు, డోర్లు పలు రకాల పాకెట్లు మరియు రియర్ సీట్లకు వెనుక వైపున కూడా పలు స్టోరేజ్ ప్రదేశాలు ఉన్నాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

లగేజ్ స్పేస్ విషయానికి వస్తే, 7-సీటర్ వెర్షన్ లిమోసిన్ వేకరియంట్లో 540-లీటర్ల లగేజ్ స్టోరేజ్ కెపాసిటీ కలదు, మూడో వరుస సీటును పూర్తిగా కిందకు మడిచేస్తే స్టోరేజ్ స్పేస్‌ను 1647-లీటర్లకు పెంచుకోవచ్చు. మధ్యలో ఉన్న సీటును కూడా మడిచేస్తే ఈ స్పేస్‌ను 2700-లీటర్లకు పెంచుకోవచ్చు.

కియా కార్నివాల్ కొలతలు..

పొడవు (మిమీ)

5115
వెడల్పు (మిమీ)

1985
ఎత్తు (మిమీ)

1740
వీల్ బేస్ (మిమీ)

3060
గ్రౌండ్ క్లియరెన్స్ (మిమీ)

180
లగేజ్ స్పేస్ (మిమీ)

540
కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

వేరియంట్లు, ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్లు

కియా కార్నివాల్ ఎంపీవీ కారు మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, ప్రీమియం, ప్రెస్టీజ్ మరియు హై-ఎండ్ వేరియంట్ లిమోసిన్ (మేము టెస్ట్ డ్రైవ్ చేసిన మోడల్). మూడు వేరియంట్లలో కూడా ఎన్నో రకాల సాంకేతిక టెక్నాలజీతో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి.

కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

కియా కార్నివాల్ ఎంపీవీలోని అతి ముఖ్యమైన ఫీచర్లు

  • 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 8-స్పీకర్ల హార్మన్/కార్డన్ సౌండ్ సిస్టమ్
  • 220V ల్యాప్‌టాప్ ఛార్జర్
  • 10-దిశలలో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు
  • వెంటిలేటెడ్ డ్రైవర్ సీటు
  • పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ కీ
  • సెంట్రల్ లాకింగ్
  • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే, పూర్తిగా మడిపేసే సైడ్ మిర్రర్లు
  • 18-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్
  • 60:40 నిష్పత్తిలో మడుపుకునే సౌలభ్యమున్న మూడవ వరుస సీట్లు
  • UVO కనెక్టెడ్ టెక్నాలజీ
  • వైర్-లెస్ ఛార్జింగ్
  • కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

    కియా కార్నివాల్ ఎంపీవీలో వచ్చే పలు సేఫ్టీ ఫీచర్లు

    • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
    • హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్
    • రోల్-ఓవర్ మిటిగేషన్
    • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
    • మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు
    • ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • సీట్-బెల్ట్ ప్రిటెన్షనర్లు
    • ఇంజన్ ఇమ్మొబిలైజర్
    • ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు
    • కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      డ్రైవింగ్ అనుభవం మరియు ఇంజన్ పర్ఫామెన్స్

      కియా కార్నివాల్ ఎంపీవీలో సాంకేతికంగా 2.2-లీటర్ సామర్థ్యం గల 4-సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది 3800rpm ఇంజన్ వేగం వద్ద 200బిహెచ్‌పి పవర్ మరియు 1500-2750rpm మధ్య గరిష్టంగా 440ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      2.2-టన్నుల బరువున్న కియా కార్నివాల్ ఎంపీవీని డీజల్ ఇంజన్ అతి సునాయసంగా లాక్కెళుతుంది. ఇంజన్ ఒక్కసారిగా కావాల్సినంత ఎక్కువ పవర్ ఇవ్వలేకపోయింది, అయితే కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. స్పీడ్ కూడా ఒక్కసారిగా పెరగదు, నెమ్మదిగా స్పీడ్ పెరుగుతుంది. మీరు కనుక టెస్ట్ డ్రైవ్ చేసినట్లయితే ఆ ఫీల్ తెలుస్తుంది.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      ట్రాన్స్‌మిషన్ కూడా పెద్దగా నిరూపించుకోలేకపోయింది. డ్రైవ్ మోడ్‌లోకి గేర్ మార్చి, యాక్సిలరేషన్ చేసినపుడు కారు ముందుకు కదలడానికి కాస్త టైమ్ తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ, సిటీ ట్రాఫిక్ డ్రైవింగ్‌లో మరియు వెళుతున్నపుడు గేర్‌బాక్స్ స్పందించిన తీరు చాలా బాగుంది. కియా కార్నివాల్ వేగంగా డ్రైవ్ చేయాలనుకునే పవర్ స్పోర్ట్ వెహికల్ అయితే కాదు, లాంగ్ డ్రైవింగ్స్‌కు ఉపయోగపడే ఫ్యామిలీ కారు మాత్రమే.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      సస్పెన్షన్ విషయానికి వస్తే, కియా కార్నివాల్ సస్పెన్షన్ సిస్టమ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. దీంతో హైవేల్లో ఒక లైన్ నుండి మరో లైన్‌కు మారేటప్పుడు బాడీ అటు ఇటూ తూలుతూ ఉంటుంది. అయితే, సడెన్‌గా లేన్ చేంజ్ చేయాలనుకున్నపుడు కార్నివాల్‌ అంత వేగంగా స్పందించదు. హైవేల్లో వెళుతున్నపుడు స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బెటర్‌గా అనిపిస్తుంది.

      బ్రేకింగ్ పరంగా అద్భుతమనే చెప్పాలి. నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉండటంతో బ్రేకులు వేసిన వెంటనే ఇందులోని బ్రేకింగ్ పవర్ చాలా వేగంగా కార్నివాల్ వేగాన్ని క్షణాల్లో తగ్గిస్తుంది. కానీ హైస్పీడులో ఉన్నపుడు సడెన్‌గా బ్రేకులు వేయాలన్నా కూడా మనసొప్పది, ఎందుకంటే బాడీ పొడవుగా, మరియు బరువు కూడా ఎక్కువగా ఉండటంతో ఎంపీవీ మొత్తం ముందుకు జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      NVH లెవల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ చిన్న శబ్దం కూడా క్యాబిన్‌ దరిచేరదు. డీజల్ ఇంజన్ కావడంతో ఇంజన్ సౌండ్ కొద్దిగా వినిపిస్తుంది. సిటీ డ్రైవ్ మినహాయిస్తే హైవే డ్రైవింగ్‌లో ఆ శబ్దం కూడా ఉండదు.

      Engine 2.2-litre
      Power (bhp) 200
      Torque (Nm) 440
      Transmission 8-AT
      Fuel Tank Capacity 60-litres
      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      ధర, రంగులు మరియు లభ్యత

      కియా మోటార్స్ కార్నివాల్ ఎంపీవీ ధరలు ఇంకా వెల్లడించలేదు. ఇందులోని ఫీచర్లు, ఇంజన్, మరియు లగ్జరీ ఇంటీరియర్‌ పరంగా చూస్తే దీని సుమారుగా రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. కియా కార్నివాల్ లాంచ్ రోజున వీటి ధరలు రివీల్ చేయనున్నారు.

      కియా కార్నివాల్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, ఆరారా బ్లాక్ పర్ల్, స్టీల్ సిల్వర్ మరియు గ్లేజియర్ వైట్ పర్ల్. ఒక్కసారి మార్కెట్లోకి విడుదలైతే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కియా షోరూముల్లో అందుబాటులోకి రానుంది.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      కంఫర్ట్ మరియు ఫ్యాక్ట్స్

      కియా కార్నివాల్ ఎంపీవీలో ప్రీమియం మరియు లగ్జరీ ఫీచర్ల రావడంతో ఇది మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మోడళ్ల కంటే పైస్థానంలో నిలవనుంది. పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, టయోటా ఇన్నోవా క్రిస్టాను పోటీ అని చెప్పవచ్చు. అయితే, దీనికి సరాసరి పోటీనిచ్చే మోడల్‌ ప్రస్తుతానికైతే లేదు.

      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      ఏదేమైనప్పటికీ ఇండియన్ ఎంపీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టాదే రాజ్యం. దీన్ని ఢీకొట్టే మోడల్ కూడా ఏదీ లేదు. కాబట్టి కార్నివాల్ ఏకైక పోటీ కూడా ఇన్నోవా క్రిస్టానే అని చెప్పుకోవాలి. ఈ రెండు మోడళ్లను పోల్చి చూద్దాం రండి.

      స్పెసిఫికేషన్స్

      కియా కార్నివాల్

      టయోటా ఇన్నోవా క్రిస్టా
      Engine 2.2-litre Diesel 2.7-litre Diesel
      Power (bhp) 200 150
      Torque (Nm) 400 343
      Transmission 8AT 6AT
      Price NA* Rs 15.36 Lakh
      కియా కార్నివాల్ రివ్యూ: దీని ముందు టయోటా ఇన్నోవా క్రిస్టా దిగదుడుపే!!

      కియా కార్నివాల్ రివ్యూ తీర్పు - మా అభిప్రాయం!

      కియా కార్నివాల్ మార్కెట్లోకి అతి త్వరలో విడుదలయ్యే లగ్జరీ ఎంపీవీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమ్మశక్యంగాని ఎన్నో లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజన్ మరియు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సింపుల్ అండ్ స్టైలిజ్ డిజైన్ గల మోడల్.

      కొరియాకు చెందిన కియా మోటార్స్ తమ సెల్టోస్ తర్వాత దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్న రెండవ మోడల్ కియా కార్నివాల్. ప్రీమియం బ్రాండ్‌గా అవతరించేందుకు ధర, ఫీచర్లు మరియు సేల్స్ వంటి మూడు అంశాలను లక్ష్యంగా చేసుకుని విజయమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన కియా సెల్టోస్ భారీ విజయాన్ని అందుకుంది.

      7-సీటర్, 8-సీటర్ మరియు 9-సీటింగ్ ఆప్షన్లలో లగ్జరీ మరియు పవర్ వెహికల్ కోరుకునే కస్టమర్లకు కియా కార్నివాల్ బెస్ట్ ఛాయిస్. కియా కార్నివాల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి!

Most Read Articles

English summary
Kia Carnival Review (First Drive): Extravagant On Space, Feature-Loaded And BSVI-Compliant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X