కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ప్రపంచ మార్కట్లతో పోలిస్తే, భారత ఆటోమొబైల్ మార్కెట్ కొత్తదనాన్ని స్వీకరించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఎల్లప్పుడూ డైనమిక్‌గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ మార్పు అనేది చాలా సహజం. భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా మార్చడానికి కూడా ఇదే ప్రధాన కారణం. కోవిడ్-19 వంటి తెచ్చిన అవాంతరాలను సైతం లెక్క చేయకుండా, ఇటీవలి కాలంలో భారత ఆటోమోటివ్ పరిశ్రమ భారీ మార్పులను చూసింది. అలాంటి మార్పులలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాల (EV) స్వీకరణ.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

భారత వాహన మార్కెట్లో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించే వేగం పెరిగిన తర్వాత, దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయి. గత రెండేళ్లలో భారత మార్కెట్లో బడ్జెట్ వినియోగదారుల కోసం సరసమైన EVలు మరియు విలాసాలను కోరుకునే ధనికుల కోసం ఖరీదైన EVలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులను బట్టి చూస్తే, ప్రపంచం మొత్తంలో భారతదేశం మాత్రమే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు చాలా ఆచరణాత్మకమైన మరియు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్నాయి.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఇప్పుడు తాజాగా, భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వృద్ధిలో భాగమయ్యేందుకు కొరియన్ కార్ కంపెనీ కియా (Kia) కూడా సిద్ధమైంది. అనుకున్నదే తడవుగా తమ అధునాతన ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) ను భారతీయుల కోసం అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లకు మరియు అత్యంత ఖరీదైన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు మధ్యలో ఉండే ఖాళీని పూర్తి చేసేందుకు ఈ ఎలక్ట్రిక్ కారు కొరియా నుండి బయలుదేరింది. భారత కార్ మార్కెట్లో SUV మరియు MPV విభాగాలపై దృష్టి సారించిన కియా, ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన విభాగంపై కన్నేసింది. పై రెండు విభాగాలలో కియా ఇప్పటికే మంచి పట్టును కలిగి ఉంది, కాగా ఈ కొత్త ఈవీ విభాగంలో కూడా తాము సక్సెస్ అవుతామని కంపెనీ చాలా ధీమాతో ఉంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఇండియా తమ లేటెస్ట్ కారులో ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది మరియు ఈ కొత్త మోడల్ అందించే పనితీరు, రేంజ్, ఫీచర్లు మరియు ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందా అనే అంశాలను తెలుసుకునేందుకు మేము కొంత సమయం ఈ ఎలక్ట్రిక్ కారుతో గడిపాము. బుధ్ ఇంటర్నేషల్ సర్క్యూట్ వేదికగా చేసుకొని ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత సక్సెస్‌ఫుల్ మోడల్ అయిన Kia EV6 భారత మార్కెట్‌కు సరిపోతుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - డిజైన్ మరియు స్టైల్

కియా మోటార్స్ తయారు చేసే యుటిలిటీ వాహనాల డిజైన్లకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. యుటిలిటీ వాహనాల తయారీలే కియా ఇంజనీర్లు చేయి తిరిగిన నిపుణులు అని చెప్పవచ్చు. ఇందుకు సోనెట్, సెల్టోస్ కార్లే చక్కటి ఉదాహరణ. అయితే, కియా ఈవీ6 మాత్రం వీటన్నింట కన్నా భిన్నంగా, ఫ్యూచర్ వెహికల్ గా కనిపిస్తుంది. ఈవీ6 డిజైన్ కోసం కియా లాన్సియా స్ట్రాటోస్ నుండి ప్రేరణ పొందిందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. స్ట్రాటోస్ ర్యాలీయింగ్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన కార్లలో ఒకటి మరియు ఇది పెట్రోల్‌హెడ్ లకు ఎంతో ఇష్టమైన కారు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

అయితే, Kia EV6ని నిజంగా స్ట్రాటోస్‌తో పోల్చలేము. అలాగని, దీనిని తన ప్లాట్‌ఫారమ్ మరియు పవర్‌ట్రెయిన్‌ను పంచుకునే హ్యుందాయ్ ఐయానిక్ 5తో కూడా పోల్చలేము. కియా ఈవీ6 ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ గేమ్‌లో దాని స్వంత స్థలాన్ని రూపొందించుకుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఏ కోణం నుండి చూసినా వాలుగా ఉండి, అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంటుంది. ఇది ముందు భాగంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఈ కోణం నుండి ఇది ఓ అధ్భుతమైన హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి, ఇదొ నాచ్‌బ్యాక్ (అంటే హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ డిజైన్‌లను కలగలపి రూపొందించిన మోడల్).

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కారు ముందు భాగంలో ప్రత్యేకమైన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, స్వీపింగ్ బానెట్‌పై ఉన్న మస్క్యులర్ లైన్‌లు, సిగ్నేచర్ గ్రిల్ మరియు బ్లాక్ ఎలిమెంట్‌లతో కూడిన బంపర్ వంటి డిజైన్ హైలైట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి భారతదేశంలో మనం ఇంకా చూడని విశిష్టమైన కారును మనకు చూపిస్తాయి. ఈ కారు ఫ్రంట్ ఎండ్ మాత్రమే స్టైలిష్‌గా మరియు ఫ్యాన్సీగా ఉందనుకుంటే పొరపాటే అవుతుంది. దాని సైడ్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది స్లోపింగ్ రూఫ్‌లైన్‌ను కలిగి ఉండి, క్రాసోవర్ లాంటి డిజైన్ ను తలపిస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

వెనుక వైపు రూఫ్ స్థిరంగా క్రిందికి వంగినట్లు ఉంటుంది మరియు స్పాయిలర్‌ వద్ద మాత్రమే అంతరాయం కలిగిస్తుంది, ఇది సూపర్ అగ్రెసివ్‌గా ఉంటుంది. వెనుక వైపు పైభాగంలో పెద్ద షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రత్యేకంగా నిలుస్తుంది మరియు EV6కి మరింత క్యారెక్టర్ ను జోడిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో డిజైన్‌లో ఫాన్సీగా కనిపించే 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి ప్రత్యేకమైన టర్బైన్ లాంటి డిజైన్‌ని కలిగి ఉంటాయి మరియు వీటిని స్పోర్ట్స్ కార్ల గుంపులో కూడా ప్రత్యేకంగా గుర్తించేలా ఉంటాయి. ఇకపోతే, సైడ్ డోర్స్ దిగువ భాగంలో ఒక రకమైన ఎయిర్-ఛానల్ ఉంటుంది, ఇది కారుకి స్టైలింగ్‌ను జోడించడంతో పాటుగా మంచి ఏరోడైనమిక్స్‌ను అందించడంలో కూడా సహాయపడుతుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

అయితే వెనుక భాగంలో, స్టైలింగ్ అంశాలు మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ముందుగా, మీకు బాడీ ప్యానెల్‌లకు మించి విస్తరించి ఉన్న టెయిల్ ల్యాంప్‌ సెటప్ కనిపిస్తుంది, ఈ టెయిల్ ల్యాంప్ బంపర్ కింద ఉన్న ఈ సిల్వప్ ఎలిమెంట్ కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. బంపర్‌లోని బ్లాక్-అవుట్ ఎలిమెంట్ మరియు రియర్ డిఫ్యూజర్‌లు కియా ఈవీ6 యొక్క వెనుక భాగాన్ని పూర్తి చేస్తాయి. ఓవరాల్‌గా కియా ఈవీ6 అన్ని వైపుల నుండి సింపుల్ గా మరియు అంతే స్టైలిష్ గా కనిపిస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

కియా ఈవీ6 యొక్క ఫ్యాన్సీ ఎక్స్టీరియర్ మాదిరిగానే ఇంటీరియర్ కూడా అంతే ఫ్యాన్సీగా ఉంటుంది. కియా ఈవీ6 ఒక గ్లోబల్ ఉత్పత్తి మరియు ఇది అనేక అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీపడుతుంది. కియా ఈ కారు కోసం మూడు రకాల ఇంటీరియర్ కలర్ షేడ్స్ ను అందిస్తుంది. కియా ఈవీ6లో వివిధ రకాల రంగులు లేవు మరియు ఇంటీరియర్ అంతటా డార్క్ థీమ్‌ను కనిపిస్తుంది. మధ్యలో ఉన్న ఫ్లాట్ పీస్ కారణంగా స్టీరింగ్ వీల్ అంతరిక్ష నౌక నుండి బయటకు తీసినట్లుగా అనిపిస్తుంది. డ్రైవర్ బ్రొటనవేళ్లు చక్రం పట్టుకోవడానికి కూడా మంచిగా కనిపిస్తాయి. ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం మరొక ప్రత్యేకమైన స్క్రీన్‌ కూడా ఉంటుంది. ఈ రెండింటితో కూడిన డ్యాష్‌బోర్డ్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. స్టీరింగ్ వీల్‌కు కుడివైపున ఓ గ్లాస్ స్లాబ్ ఉంది. దీని గ్లాస్‌ స్లాబ్‌ అని ఎందుకు అంటున్నాం అంటే, రెండు స్క్రీన్‌లు ఆఫ్‌లో ఉంటే ఇది ఒకే స్క్రీన్‌లా కనిపిస్తుంది కాబట్టి. డ్రైవర్ సమాచారం కోసం ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ 12.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లేని కలిగి ఉంటుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

మీరు ఊహించినట్లుగానే, ఈ స్క్రీన్‌పై చాలా రకాల సమాచారం ప్రదర్శించబడుతుంది. బ్యాటరీ రేంజ్, ఉష్ణోగ్రతలు, నావిగేషన్, వాహన డేటా, బ్యాటరీ స్థితి మొదలైన వాటికి సంబంధించిన అనేక సమాచారాన్ని ఇది అందిస్తుంది. అదే ప్యానెల్‌లో కలిసిపోయినట్లుగా ఉండే మరొక 12.3 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది, అయితే ఇది ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ టచ్‌స్క్రీన్ Android Auto మరియు Apple CarPlayతో సహా అనేక ఇతర ఫీచర్లను పొందుతుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కారులో వినోదం కోసం 14-స్పీకర్ మెరిడియన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది, దీని సౌండ్ క్వాలిటీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇకపోతే, డ్రైవర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్స్-అప్ డిస్‌ప్లేను కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇదొక అద్భుతమైన ఫీచర్, డ్రైవర్ తన దృష్టిని రోడ్డుపై నుండి మరల్చకుండానే, సమాచారం మొత్తం విండ్‌షీల్డ్ పై తెలుసుకోవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద పియానో ​​బ్లాక్ స్ట్రిప్ ఉంటుంది మరియు ఈ స్ట్రిప్ కింద కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఈ కంట్రోల్ ప్యానెల్ టచ్‌స్క్రీన్‌పై రెండు నాబ్‌లు మరియు వన్-టచ్ చిహ్నాలు ఉంటాయి. ఇవి ఎయిర్ కండిషనింగ్ మరియు క్లైమేట్ కంట్రోల్‌ని నియంత్రించడానికి ఉపయోగించబడతాయి. ఇది మొదట పూర్తిగా సాధారణమైనదిగా అనిపిస్తుంది. అయితే, అక్కడ ఉండే ఒక బటన్‌ను తాకగానే, టచ్ ప్యానెల్‌లోని చిహ్నాలు ఇన్ఫోటైన్‌మెంట్ బటన్‌లుగా మారుతాయి. దీనర్థం మీరు క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌లు లేదా ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్‌లను కలిగి ఉండవచ్చని మరియు రెండూ ఒకేసారి ఉండవని అర్థం. మీరు మీ కార్లు చాలా ఫాన్సీగా మరియు ఫ్యూచరిస్టిక్‌గా ఉండాలని కోరుకుంటే, ఈ ఫీచర్ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఇక సెంటర్ కన్సోల్ విషయానికి వస్తే, ఇందులో వెహికల్ కంట్రోల్ కోసం వివిధ బటన్‌లతో భవిష్యత్తుకు సంబంధించినదిగా ఉంటుంది. వీటిలో చాలా ముఖ్యమైనది రోటరీ రూపంలో ఉన్న డ్రైవ్ మోడ్ సెలెక్టర్. ఇది కాకుండా, కియా ఈవీలో డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం సౌకర్యవంతంగా ఉండే సీట్లను కూడా అందిస్తోంది, కియా వీటిని రిలాక్సేషన్ సీట్లు అని పిలుస్తుంది. ఈ సీట్లు వెంటిలేషన్ మరియు 10 వే పవర్ అడ్జస్టబల్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

కియా ఈవీ6 ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ అయినందున, ఇది చాలా సౌకర్యవంతంగా లేదా ఆచరణాత్మకంగా ఉంటుందని మేము ఊహించలేదు. అయితే, ఈ విషయంలో ఇది మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది మరియు ఈ విషయంలో మా ఆలోచనలు తప్పు అని నిరూపించింది. కారులోని సీట్లు చాలా సౌకర్యంగా ఉన్నాయి, ఇవి కంఫర్ట్ చార్ట్‌లో Kia EV6 అధిక స్కోర్‌ని పొందడంలో సహాయపడుతాయని చెప్పవచ్చు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

అంతే కాకుండా, ఇందులోని వెంటిలేటెడ్ సీట్లు మరియు శక్తివంతమైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు అన్నీ కూడా Kia EV6 కారులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. అయితే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మేము కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును పబ్లిక్ రోడ్లపై పరీక్షించలేదు. కేవలం రేస్ ట్రాక్ పై మాత్రమే దీనిని టెస్ట్ డ్రైవ్ చేశాము. నిజానికి, భారతీయ రోడ్లపైనే సౌకర్యం యొక్క అసలైన పరీక్ష జరుగుతుంది, కాబట్టి కంఫర్ట్ లెవల్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మేము ఈ కారును అసలైన భారతీయ రోడ్లపై పరీక్షించాల్సి ఉంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఇక ప్రాక్టికాలిటీ అంటారా.. కియా ఈవీ6 ఈ విషయంలో మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. కారులో తగినన్ని క్యూబీహోల్స్ ఉన్నాయి. డోర్ ప్యానెల్‌లు కేవలం వాటర్ బాటిల్ లను ఉంచడానికి మాత్రమే, ఇతర చిన్న వస్తువులను ఉంచేందుకు అనువుగా ఉంటాయి. సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కింద ఉండే స్టోరేజ్ స్పేస్ కూడా చాలా పెద్దది, మరియు ఇది చాలా ఆచరణాత్మకంగా చేస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

బూట్ స్పేస్ పరంగా చూస్తే, ఇదొక రియర్ వీల్ డ్రైవ్ మోడల్ కావడంతో ఇందులో 490 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అయితే, అదే ఆల-వీల్ డ్రైవ్ (AWD) మోడల్ అయితే, దీని బూట్ స్పేస్ 10 లీటర్లు తగ్గుతుంది. ఈ కారులో అదనపు స్థలం అవసరమైతే మరింత లగేజీ కోసం వెనుక సీట్లను మడుచుకునే వెసలుబాటు ఉంటుంది. క్యాబిన్ లోపల స్థలం గురించి చెప్పాలంటే, Kia EV6 కారులో ఐదుగురు వ్యక్తులకు సరిపోయేంత స్థలాన్ని కలిగి ఉంటుంది మరియు ఐదుగురు కూర్చోవడంలో ఎలాంటి అసౌకర్యం ఉండదు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - పవర్‌ట్రెయిన్, పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

కియా ఈవీ6 అద్భుతమైన పనితీరు స్థాయిలతో భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనంగా రూపొందించబడింది. అంటే, దీని అర్థం బ్యాటరీ పెద్దదిగా ఉండాలి మరియు మోటారు శక్తివంతంగా ఉండాలి. భారత మార్కెట్లో కియా ఈవీ6 రియల్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లలో విక్రయించబడుతుంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది, శక్తివంతమైన ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌ మరియు ఇది చాలా ఎక్కువ టార్క్ ను కలిగి ఉన్నట్లు అనిపించింది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

మీరు యాక్సిలేరషన్ పెడల్‌పై కాలు మోపిన వెంటనే, ఎలక్ట్రిక్ మోటార్ నుండి వచ్చే 605Nm ల శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది, ఇది మీకు ఓ అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందింస్తుంది. ఈ పవర్ తో మీరు యాక్సిలరేట్ చేసినప్పుడు, అది మిమ్మల్ని సీటులోకి నెట్టివేసినంత వేగంగా అనిపిస్తుంది మరియు ఇది పనితీరును దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడిందని స్పష్టంగా తెలుస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్‌లలో ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైన థ్రోటల్ మరియు స్టీరింగ్ పనితీరును కలిగి ఉంటుంది. మోడ్ మార్చగానే, వీటి పనితీరు కూడా మారుతుంది. ఎంచుకున్న మోడ్‌పై ఆధారపడి సున్నితత్వం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

స్పోర్ట్స్ మోడ్‌లో, కియా ఈవీ6 గరిష్టంగా గంటకు 192 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. మేము డ్రైవ్ చేసిన ఆల్-వీల్ డ్రైవ్ కియా ఈవీ6 కారులో 4గురు ప్రయాణికులతో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ పై ఈ కారును పరీక్షించాము. కారు ఫుల్ లోడ్ తో ఉన్నప్పటికీ, దాని యాక్సిలరేషన్ లో మాత్రం పెద్దగా మార్పుల లేదు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన పెద్ద 77.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు ఇది 320bhp యొక్క మిశ్రమ అవుట్‌పుట్ కలిగిన రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినిస్తుంది. ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ అనుకూలంగా ఉన్నందున ఈ బ్యాటరీలను చాలా వేగంగా చార్జ్ చేయవచ్చు. ఈ కారును 50kW DC ఫాస్ట్ చార్జర్ తో 10 నుండి 80 శాతానికి చార్జ్ చేయడానికి 73 నిమిషాల సమయం పడుతుంది. అదే 350kW DC ఫాస్ట్ చార్జర్ తో అయితే, కేవలం18 నిమిషాల్లోనే ఈ బ్యాటరీని 80 శాతానికి చార్జ్ చేయవచ్చు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 దాదాపు 528 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉందని మరియు దీనిని WLTP సైకిల్‌ని ఉపయోగించి కొలుస్తారు అని కియా పేర్కొంది. అయితే, భారతీయ డ్రైవింగ్ పరిస్థితుల ప్రకారం, వాస్తవ-ప్రపంచ పరిధి (రియల్ టైమ్ రేంజ్) కంపెనీ పేర్కొన్న దాని కంటే చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కియా ఈవీ6 కారులో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది వాహనం నుండి వాహనం మరియు వాహనం నుండి లోడ్ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఈ కారును ఓ చిన్న సైజు పవర్ హౌస్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చన్నమాట. కియా ఈవీ6 కారుతో వేరొక కారును చార్జ్ చేయవచ్చు లేదా దాని బ్యాటరీని ఇంటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఈ ఎలక్ట్రిక్ కారులో రీజెనరేటివ్ బ్రేకింగ్‌ కూడా ఉంటుంది, ఇది మొత్తం ఐదు స్థాయిలలో ఉంటుంది. ఇందులో 4వ స్థాయి అత్యధిక రీజెన్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం ఒక పెడల్‌తో నడపడం సాధ్యంగానే ఉంటుంది. రీజెన్ చాలా బలంగా ఉంటుంది, ట్రాక్ యొక్క ఒక హాట్ ల్యాప్ తర్వాత మేము దీని రేంజ్ 3 కిలోమీటర్ల పెరుగడం చూశాము. ఈ ఫీచర్ వలన కారులో బ్రేక్ వేసిన ప్రతిసారి వచ్చే శక్తి, బ్యాటరీని చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

ఇక స్టీరింగ్ విషయానికి వస్తే, ఇది చాలా సంపూర్ణంగా మరియు సమతుల్యంగా ఉంటుంది. అధిక వేగంతో బాగా బరువు కలిగి ఉంటుంది మరియు తక్కువ వేగంతో తేలికగా ఉంటుంది. ఈ డ్రైవ్ మోడ్‌లోని స్టీరింగ్ రెస్పాన్స్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ యొక్క కార్నర్లను డీల్ చేయడానికి సరైనది కాబట్టి మేము ఎక్కువగా దీనిని స్పోర్ట్స్ మోడ్‌లో నడిపాము. ఈ కారు దిగువ భాగంలో దాదాపు 500 కిలోల బరువున్న బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఫలితంగా, Kia EV6 అద్భుతంగా హ్యాండ్లింగ్ ను అందిస్తుంది.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

సస్పెన్షన్ మరియు స్టీరింగ్ ట్రాక్ ను పరీక్షించాలంటే, ఇది సరైన తారు రోడ్డుపై మాత్రమే సాధ్యమవుతుంది. ఇందులోని Kumho Ecsta PS71 టైర్లు మంచి ట్రాక్ గ్రిప్ ను అందించాయి, మరి ఇవి రోడ్డుపై ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి మరియు ట్రాక్ పై బ్రేక్‌లు ఫేడ్ కాలేదు. మొత్తం మీద, కియా ఈవీ అద్భుతమైన ఫస్ట్-డ్రైవ్ అనుభవాన్ని అందించింది. ఇది BICలో దాని హై-స్పీడ్ పరాక్రమాన్ని ప్రదర్శించింది మరియు వాస్తవ ప్రపంచంలో కూడా దాని వేగాన్ని, పనితీరును పరిశీలించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి.

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - సేఫ్టీ ఫీచర్లు

కియా ఈవీ6 అనేక యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో లభించే కొన్ని ప్రధాన సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

- 8 ఎయిర్‌బ్యాగ్‌లు

- అధునాతన ADAS

- అడాప్టివ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు

- లేన్ కీప్ అసిస్ట్

- ఫార్వర్డ్ కొలైజన్ అవైడెన్స్

- బ్లైండ్-స్పాట్ కొలిజన్ అవైడెన్స్ అసిస్ట్

- స్టాప్ అండ్ గో ఫంక్షనాలిటీతో కూడిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్

- లేన్ ఫాలో అసిస్ట్

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

కియా ఈవీ6 - ముఖ్యమైన ఫీచర్లు:

- ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన హెడ్స్-అప్ డిస్‌ప్లే

- 14-స్పీకర్ మెరిడియన్ ఆడియో సిస్టమ్

- 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

- కియా కనెక్ట్

- రిమోట్ క్లైమేట్ కంట్రోల్

- రిమోట్ ఛార్జింగ్ కంట్రోల్

- వెంటిలేటెడ్ సీట్లు

- వెహికల్ టూ వెహికల్ ఛార్జింగ్

కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..

చివరిగా ఏం చెబుతారు..?

భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు అనూహ్యమైన వేగంతో విడుదల అవుతున్నాయి. కియా కూడా ఇప్పుడు అదే వేగంతో తమ వేగవంతమైన ఎలక్ట్రిక్ కారును మన కోసం తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఈ కారు ధర గురించి మాకు ఇంకా తెలియలేదు. ఇది పూర్తిగా విదేశాలలో తయారైన యూనిట్‌గా ఇక్కడికి దిగుమతి చేయబడుతుంది కాబట్టి ఇది కాస్తంత ఖరీదైనదిగానే ఉండొచ్చు. ఈ కారుకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kia ev 6 test drive review range battery powertrain performace and driving impressions
Story first published: Wednesday, May 25, 2022, 13:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X