మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు "బిగ్ డాడీ".. నమ్మట్లేదా, మీరే చూడండి!

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio).. భారతదేశంలో పరిచయం అవసరం లేని ఓ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ. మార్కెట్లో మహీంద్రా కీర్తిని పతాకస్థాయికి తీసుకెళ్లిన మోడళ్లలో ఇది కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్ధాలుగా భారత ఎస్‌యూవీ మార్కెట్‌ను పాలిస్తున్న మోడల్ కూడా ఇదే. విఐపిలు, పోలీసులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు కూడా ఇష్టపడే మోడల్ మహీంద్రా స్కార్పియో. అట్లుంటది.. ఆ కారు యొక్క రోడ్ ప్రజెన్స్. రోడ్డుపై గంభీరమైన వైఖరి మరియు కారు లోపల అత్యుత్తమ కంఫర్ట్, శక్తివంతమైన ఇంజన్ మరియు సాటిలేని సామర్థ్యం ఇవన్నీ స్కార్పియో విజయానికి బాటలు వేశాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియో విజయగాధను తిరిగి రాస్తూ, ఈ మోడల్‌ను మరిన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందు మహీంద్రా ఇందులో పూర్తిగా స్క్రాచ్ నుండి తయారు చేసిన ఓ కొత్త తరం మోడల్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా కంపెనీని ఏ ముహుర్తాన "ఎస్‌యూవీ స్పెషలిస్ట్" అన్నారో కానీ ఇది నిజంగా ఎస్‌యూవీలను తయారు చేయడంలో చేయి తిరిగిన కంపెనీగా అవతరించింది. కొనుగోలుదారులు ఓ టిపికల్ ఎస్‌యూవీలో ఏమైతే కోరుకుంటారో అలాంటి అన్ని ఫీచర్లను మహీంద్రా అందిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

వాస్తవానికి, మహీంద్రా ఒకప్పుడు తయారు చేసిన వాహనాలలో కంపెనీ ఇంజనీర్లు విలాసవంతమైన క్యాబిన్‌ కంటే కూడా ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణించగలిగే ఆఫ్-రోడ్ సామర్థ్యాలను అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీరు గమనించినట్లయితే, ఇప్పటికీ కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనాలు ఎక్కువగా మహీంద్రా బ్రాండ్‌కి చెందినవే (ప్రత్యేకించి జీప్‌లు) అయి ఉంటాయి.అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాలంతో పాటుగా మహీంద్రా కూడా అప్‌గ్రేడ్ అవడం మొదలు పెట్టింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఇటీవలి కాలంలో మహీంద్రా తయారు చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీలలో క్యాబిన్‌ అనుభూతి వెయ్యి రెట్లు ఎక్కువ విలాసవంతంగా మారింది. మహీంద్రా ఎస్‌యూవీల యొక్క ఎక్స్టీరియర్ మొరటుతనానికి (రగ్గడ్‌నెస్) ప్రసిద్ధి చెందినవి. అయితే, ఇప్పుడు అదే మొరటుతనాన్ని మనం వాటి ఇంటీరియర్లలో కూడా చూడొచ్చు. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కూడా ఇదే మొరటతనాన్ని క్యాబిన్ లోపల మరియు వెలుపల కలిగి ఉంటుంది. ఇతర స్కార్పియో మోడళ్ల మాదిరిగానే ఇది బయటి నుండి గంభీరమైన వైఖరితో మంచి రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉంటుంది.

మహీంద్రా తొలిసారిగా 2002లో తమ మొదటి తరం స్కార్పియో ఎస్‌యవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. స్కార్పియో రాకతో మహీంద్రా వాహనాలఫై కస్టమర్లకు ఉండే "రఫ్ అండ్ టఫ్" అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో మహీంద్రా తమ స్కార్పియో ఇంటీరియర్ క్యాబిన్‌ను అందంగా మరియు విలాసవంతంగా తీర్చిదిద్దింది. అలాగే ఆ సమయంలో మహీంద్రా వాహనాలలో ఎన్నడూ చూడని ఇంటీరియర్‌ గురించి గొప్పగా చెప్పుకున్నారు. వీటికి అధనంగా ఇది లక్షల కిలోమీటర్లు ఎలాంటి ట్రబుల్ లేకుండా ముందుకు సాగిపోయే ఇంజన్ ఎక్కడికైనా వెళ్లగల సామర్థ్యాన్ని (గో-ఎనీవేర్ కెపాసిటీ) కలిగి ఉంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

గడచిన 20 ఏళ్లలో మహీంద్రా స్కార్పియో అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. డిజైన్, స్టైల్, ఇంజన్, గేర్‌బాక్స్, ఫీచర్స్‌లో అనేక మార్పులు చేర్పులు జరిగాయి మరియు కొత్త తరం మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. కస్టమర్లు స్కార్పియోలో చేసిన ప్రతి అప్‌డేట్‌ను కూడా సానుకూలంగానే స్వాగతించారు మరియు ఈ ఎస్‌యూవీ తనకంటూ ఒక కల్ట్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. కాగా ఇప్పుడు, మహీంద్రా స్కార్పియో బ్యాడ్జ్‌ను కంపెనీ మార్చింది. కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీని ఇప్పుడు స్కార్పియో-ఎన్‌ (Scorpio-N) పేరుతో పిలుస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

బహుశా ఇందులో ఎన్ (N) అంటే నూతనమైనదని అర్థం కాబోలు. పేరుకి తగినట్లుగానే ఈ కొత్త స్కార్పియో-ఎన్ అన్ని విషయాలలో చాలా కొత్తగా ఉంటుంది. పాత మోడల్‌తో దీనికి ఏమాత్రం పోలిక ఉండదు మరియు పాత మోడల్ స్కార్పియోలో ఉపయోగించిన ఏ పరికరాలు ఈ కొత్త స్కార్పియో-ఎన్‌లో ఉపయోగించలేదు. అయినప్పటికీ, కొత్త స్కార్పియో-ఎన్ యొక్క కొన్ని డిజైన్ అంశాలు మాత్రం మీకు పాత మోడల్‌ స్కార్పియోని గుర్తు చేస్తాయి. ఈ కొత్త మోడల్ ఇప్పుడు సరికొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు ఇది 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో కూడా లభిస్తుంది.

మరి కంపెనీ చెబుతున్నట్లుగా ఈ కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీలు అన్నింటికీ పెద్దనాన్న (Big Daddy Of SUVs)గా ఉందా? దీని డిజైన్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఈ ఎస్‌యూవీ డ్రైవింగ్ పనితీరు ఎలా ఉంది? దీని కొత్త ఆఫ్-రోడ్ సామర్థ్యాలు ఎలాంటి కఠినమైన రోడ్లకైనా సరిపోతాయా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా స్కార్పియో: ఓసారి గతాన్ని తిరగేస్తే..

ముందుగా మనం కొత్త తరం 2022 స్కార్పియో-ఎన్ గురించి చెప్పుకోవడానికి ముందు, అసలు స్కార్పియో బ్రాండ్ పట్టుపూర్వత్రాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీని మొదటిసారిగా 2002లో ప్రారంభించబడింది. అయితే, కంపెనీ ఈ కారును ఉదయం డిజైన్ చేసి, సాయంత్రానికి మార్కెట్లో విడుదల చేయలేదు. దీనికి వెనుక ఐదేళ్ల కృషి ఉంది. అంటే, మహీంద్రా స్కార్పియో అభివృద్ధి పనులు 1997లో ప్రారంభమయ్యాయి!

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియోని విడుదల చేయడానికి ముందు, మహీంద్రా తన వాహనాలు మరియు వాటి డిజైన్‌ను విల్లీస్ జీప్‌పై ఆధారపడి రూపొందించేది. ఆ కాలంలో మహీంద్రా వివిధ మోడళ్లను విడుదల చేసినప్పటికీ, అవి చాలా వరకూ ఒకేరకమైన శైలిని కలిగి ఉండేవి. అప్పుడే, మహీంద్రా స్కార్పియో సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో తెరపైకి వచ్చింది. స్కార్పియో, మహీంద్రా స్క్రాచ్ నుండి నిర్మించిన మొదటి ఎస్‌యూవీ, అంతేకాదు ఇది ఈ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి 'గ్లోబల్' ఉత్పత్తి కూడా.

భారతదేశంలో స్కార్పియో 2002లో అందుబాటులోకి రాగా, యూరోపియన్ మార్కెట్లలో 2003లో విడుదలైంది. ఆ తర్వాత 2006లో, మహీంద్రా స్కార్పియో యొక్క మొదటి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ విడుదలైంది మరియు 2007లో పికప్ ట్రక్ రూపంలో స్కార్పియో గెట్‌అవేగా మన ముందుకు వచ్చింది. అప్పటి వరకూ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించిన స్కార్పియో, 2008లో తొలిసారిగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందింది. అంతేకాదు, ఆ సమయంలో ఈ ఫీచర్‌తో సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చిన మొదటి ఎస్‌యూవీ కూడా ఇదే.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి దాదాపు ఏడేళ్లు పూర్తయిన తర్వాత కంపెనీ ఇందులో రెండవ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఓ ఐదేళ్ల పాటు మార్కెట్లో కొసాగింది. ఆ తర్వాత చివరిగా 2014లో, మూడవ ఫేస్‌లిఫ్ట్‌ను అందుకుంది. ఈసారి మరింత ఆధునికమైన డిజైన్ మరియు మరింత శక్తివంతమైన ఇంజన్‌తో పాటుగా పూర్తిగా ఆధునికమైన ఇంటీరియర్‌తో ప్రారంభించబడింది. వాస్తవానికి, గత కొన్నేళ్లుగా మహీంద్రా స్కార్పియో భారతీయ కుటుంబాల్లో ఒక ఇంటి పేరుగా మారిపోయింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా స్కార్పియో బ్రాండ్‌కి దాదాపు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికీ డిమాండ్‌లోనే ఉంది మరియు ప్రజలు దానిని కొనుగోలు చేయడానికి క్యూలో నిలుస్తున్నారు. అందుకే, పాత తరం స్కార్పియో అభిమానులను నిరుత్సాహపరచకుండా, మహీంద్రా ఇప్పుడు తమ కొత్త తరం స్కార్పియో-ఎన్ తో పాటుగా పాత మోడల్ స్కార్పియోని కూడా విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడు పాత స్కార్పియో మోడల్ "స్కార్పియో క్లాసిక్" (Scorpio Classic) పేరుతో పిలవబడుతుంది. ఇక గతం గురించి ఆపేసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతంలోకి వచ్చేసి కొత్త 2022 స్కార్పియోని టెస్ట్ డ్రైవ్ చేసేద్దాం రండి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: డిజైన్ మరియు స్టైల్

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా సరే, దానిపై నుండి తమ కళ్లను తప్పించడానికి కష్టపడాల్సి వస్తుంది. ప్రతి కోణం నుంచి దీని డిజైన్ మరియు స్టైల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాస్తవానికి, స్కార్పియో బ్యాడ్జ్ కొనుగోలుదారులకు చాలా ఎమోషన్‌తో కూడుకున్నది. అయితే, ప్రస్తుత మహీంద్రా డిజైన్ లాంగ్వేజ్ కు ఇప్పటికే అనేక మంది అలవాటు పడ్డారు కాబట్టి, ఈ ఎమోషన్‌కు మోడ్రన్ టచ్ ఇస్తూనే, పాత తరపు జ్ఞాపకాలను చెరపకుండా ఉండటానికి మహీంద్రా ఇంజనీర్లు చాలానే కష్టపడ్డారని చెప్పవచ్చు.

సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ బ్రాండ్-న్యూ గా ఉండాలి మరియు ఐకానిక్ పాత స్కార్పియోను ప్రజలకు గుర్తుచేసే కొన్ని డిజైన్ ఎలిమెంట్‌లను ఈ బ్రాండ్-న్యూ వాహనంలో కనిపించేలా చేయాలి. ఇది ఖచ్చితంగా ఒక సవాలు మరియు ప్రత్యేకించి మహీంద్రా డిజైనర్లు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఈ ఎస్‌యూవీని దగ్గరగా చూసిన వారు అనే మొదటి మాట.. "అబ్బా! ఇంత పెద్ద కారా!" అని. అవును, నిజమే కొత్త స్కార్పియో-ఎన్ పాత స్కార్పియో కన్నా కాస్తంత పెద్ద ఎస్‌యూవీ (పరిమాణంలోనూ మరియు ఫీచర్లలోనూ).

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ మెగా ఎస్‌యూవీ ముందు భాగంలో అమర్చిన సరికొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లు పాత తరం స్కార్పియోను గుర్తుకు తెస్తాయి. ఇది ప్రొజెక్టర్ మరియు రిఫ్లెక్టర్ సిస్టమ్‌లు రెండింటినీ పొందుతుంది మరియు హెడ్‌ల్యాంప్‌లు కొద్దిగా వెనుకకు వంగినట్లుగా ఉంటాయి. ప్రంట్ గ్రిల్ పెద్దది మరియు హారిజాంటల్ స్లాట్‌లతో గంభీరమైనదిగా కనిపిస్తుంది. ఇందులో ఆరు నిలువు క్రోమ్ స్ట్రిప్స్ మరియు పెద్ద హారిజాంటల్ క్రోమ్ స్ట్రిప్ ఉన్నాయి. ఎక్స్‌యూవీ700పై తొలిసారిగా కనిపించిన మహీంద్రా యొక్క కొత్త లోగో ఈ స్కార్పియో-ఎన్‌ పై కూడా కనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

దీని ఫ్రంట్ బంపర్ పెద్దగా ఉంటుంది మరియు ఫాగ్ ల్యాంప్‌ల దగ్గర C-ఆకారపు క్రోమ్ ఇన్‌సర్ట్‌లను కలిగి ఉంటుంది. ఈ బంపర్ దిగువ భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ ఉంటుంది. బోనెట్ చాలా పొడవుగా ఉండి, మజిక్యులర్ డిజైన్ లైన్లను కలిగి ఉంటుంది. ఈ కారును ముందు వైపు నుండి చూసినప్పుడు, బయటకు ఉబ్బినట్లగా ఉండే దాని ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఈ ఎస్‌యూవీకి అదనపు మజిక్యులర్ లుక్‌ని తెచ్చిపెడుతాయి. కొత్త స్కార్పియో-ఎన్ సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, A-పిల్లర్ నుండి C-పిల్లర్ వరకు ఉన్న విండో లైన్‌పై నడిచే సిల్వర్ ట్రిమ్, సిల్వర్ ఫినిష్డ్ ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, బ్లాకవుట్ B అండ్ C పిల్లర్స్ మరియు చంకీ డోర్ హ్యాండిల్స్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియో-ఎన్ సైడ్ ప్రొఫైల్‌లో చెప్పుకోవాల్సిన మరొక ప్రత్యేకమైన డిజైన్ ఎలిమెంట్ దాని 18 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్. వీటిని మీరు ఎంత ఎక్కువగా చూస్తారో, అంత ఎక్కువగా అవి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో చిన్న 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు దిగువ వేరియంట్లలో స్టీల్ వీల్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇకపోతే, ఈ కారు వెనుక వైపు నుండి కూడా అందగా కనిపిస్తుంది. కొత్త స్కార్పియో-ఎన్ వెనుక భాగంలో పాత స్కార్పియోతో సారూప్యతను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

వెనుక వైపు పొడవాటి నిలువుగా పేర్చబడిన టెయిల్ ల్యాంప్‌ సెటప్ ఉంటుంది. ఇది చూడటానికి వోల్వో కార్ల నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. ఇది పాత స్కార్పియో మాదిరిగానే టెయిల్ గేట్‌కు ఎడమ వైపున చంకీ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉంటుంది. టెయిల్ గేట్ పైకి ఓపెన్ అవ్వకుండా ఇప్పటికీ పక్కకు తెరుచుకునేలానే ఉంటుంది. ఇది కూడా పాత స్కార్పియోను గుర్తుకు తెస్తుంది. వెనుక వైపు మహీంద్రా బ్యాడ్జింగ్, స్కార్పియో-ఎన్ బ్యాడ్జింగ్, కొత్త బ్రాండ్ లోగో మరియు 4XPLOR బ్యాడ్జింగ్ కూడా సరికొత్తగా ఉన్నాయి. మొత్తం మీద, కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఒక అందమైన, చక్కగా చెక్కబడిన ఎస్‌యూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

మహీంద్రా 20 సంవత్సరాల క్రితం మొదటిసారిగా స్కార్పియోని విడుదల చేసినప్పుడు దాని ఇంటీరియర్స్ విషయంలో ఎలాంటి ప్రశంసలనైతే అందుకుందో, ఈ కొత్త స్కార్పియో-ఎన్ ఇంటీరియర్స్ విషయంలో కూడా ఖచ్చితంగా అలాంటి అద్భుతమైన ప్రశంసలనే అందుకుంటుంది. కొత్త స్కార్పియో-ఎన్ క్యాబిన్ రిచ్ కాఫీ-బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్‌ థీమ్‌ను కలిగి ఉంటుంది మరియు ఈ కలర్ కాంబినేషన్ చాలా క్లాస్సీగా ఉంటుంది. డ్యాష్‌బోర్డులో ఎక్కువ భాగాన్ని కాఫీ కలర్ డామినేట్ చేసినట్లుగా అనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో కనిపించిన అదే స్టీరింగ్ వీల్ ఈ స్కార్పియో-ఎన్ లో కూడా కనిపిస్తుంది. ఇదొక మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్. ఇందులో ఆడియో మరియు క్రూయిజ్ కంట్రోల్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి మరియు ఇవి చాలా సరళంగా ఉండి, ఉపయోగించడానికి సులభమైనవిగా ఉంటాయి. స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో డిజిటల్-అనలాగ్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది మరియు ఇది డ్రైవర్‌కు కావల్సిన అన్ని రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది. స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ అనలాగ్ డయల్స్ మధ్యలో ఉన్న 7.0 ఇంచ్ ఫుల్ కలర్ డిస్ప్లే స్క్రీన్ పై సమాచారం ప్రదర్శించబడుతుంది.

డ్యాష్‌బోర్డ్ రెండు చివర్లలో నిలువుగా ఉండే ఎయిర్ కండిషనింగ్ వెంట్‌లు ఉంటాయి మరియు డ్యాష్‌బోర్డ్ మధ్యలో కూడా రెండు నిలువుగా ఉండే ఏసి వెంట్స్ ఉంటాయి. ఈ ఏసి వెంట్స్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్స్ ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న ఏసి వెంట్‌లు ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌కు అటూ ఇటూ అమర్చబడి ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే ఓ 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్. ఈ కారులో అత్యుత్తమ ఆడియో క్వాలిటీ కోసం 12-స్పీకర్లతో కూడిన సోనీ ఆడియో సిస్టమ్ ఉంటుంది మరియు దీని ద్వారా వచ్చే ధ్వని చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ కారులో నిరుత్సాపరచే అంశం ఏంటంటే, ఇంత పెద్ద ఎస్‌యూవీకి అంత చిన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వడమే. ఇది ఈ కారుకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఇలాంటి కార్లకు కనీసం 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్‌నైనా జోడించాలి. బహుశా, ఈ కారులో చిన్న ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందించడానికి కారణం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ చిప్ కొరత కాబోలు. స్కోడా వంటి కంపెనీలు కూడా తమ ప్రీమియం కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సైజును తగ్గించి విక్రయిస్తున్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఇక ఈ టచ్‌స్క్రీన్ దిగువన గమనిస్తే, దానికి అనుబంధంగా కొన్ని ఫెథర్ టచ్ బటన్‌లు మరియు కొన్ని నాబ్‌లు ఉన్నాయి. ఈ బటన్‌ల క్రింద ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ కూడా ఉంటాయి మరియు వివిధ వాహన ఫంక్షన్ల కోసం మరికొన్ని స్విచ్‌లు కూడా కనిపిస్తాయి. ఈ బటన్‌లన్నీ కూడా పియానో ​​బ్లాక్ ప్యానెల్‌లో అమర్చబడి ఉంటాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌ ఫీచర్‌తో వస్తుంది. ఒకవేళ, మీరు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసినట్లయితే, ఈ ఫీచర్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

వైర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి లేదా ఇన్ఫోటైన్‌మెంట్‌కి కనెక్ట్ చేయడానికి రెండు USB పోర్ట్‌లు కూడా ఉన్నాయి. దీని సెంటర్ కన్సోల్‌లో బ్రష్డ్ అల్యూమినియం సరౌండ్‌తో ఫినిష్ చేయబడి ఉంటుంది. దాని దిగువ భాగంలో గేర్ లివర్ మరియు దాని వెనుక 4XPLOR (ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్) కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఇది చూడటానికి కొన్ని ఖరీదైన మరియు ప్రీమియం బ్రిటీష్ ఎస్‌యూవీలను తలపిస్తుంది. డ్రైవర్ ఈ బటన్‌ను నొక్కినప్పుడు డ్రైవ్‌ట్రెయిన్‌ను 4WD లో లేదా 4WD హై కి మార్చవచ్చు. ఇక ఆ పక్కనే పెద్ద నాబ్‌ను తిప్పడం ద్వారా, డ్రైవర్ రోడ్, మడ్, స్నో మరియు శాండ్ వంటి టెర్రైన్ మోడ్‌లను ఎంచుకోవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఆఫ్-రోడ్‌ ఔత్సాహికులకు ఇది నిజంగా ఓ ఆసక్తికరమైన ఫీచర్ మరియు దీనిని ఉపయోగించడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. పాత స్కార్పియోలో కనిపించే ప్లెయిన్-జేన్ 2H-4H-4L నాబ్ నుండి ఇది చాలా చాలా విభిన్నంగా మరియు ప్రీమియంగా ఉంటుంది. ఇకపోతే, సెంటర్ కన్సోల్ చాలా పెద్ద ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంటుంది మరియు ఈ ఆర్మ్‌రెస్ట్ కింద లోతైన క్యూబీహోల్‌ (స్టోరేజ్ స్పేస్) ఉంటుంది. ఇందులో మీ వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: కంఫర్ట్ మరియు ప్రాక్టికాలిటీ

కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ విషయంలో కొత్త స్కార్పియో-ఎన్ తగ్గేదేలేదు. వాస్తవానికి, ఇది ఈ విషయంలో అత్యంత సౌకర్యవంతమైన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంటుంది. మృదువైన సస్పెన్షన్, ఖరీదైన సీట్లు మరియు విశాలమైన క్యాబిన్ స్థలం స్కార్పియోలోని ప్రయాణీకులకు ఓ మంచి హోమ్లీ అనుభూతిని అందిస్తాయి. ఈ కారులోని సీట్లు నడుము, తొడ మరియు వెనుక భాగాలలో మంచి మద్దతును అందిస్తాయి. వెనుక సీటు సౌకర్యంగా ఉంటుంది, దాని ఫిర్యాదు చేసే అవకాశమే లేదు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియో-ఎన్‌లోని A-పిల్లర్ మరియు సెంటర్ కన్సోల్‌పై గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవి స్కార్పియో-ఎన్‌లోకి ప్రవేశించేటప్పుడు మరియు బయటికి వచ్చేటప్పుడు సహాయకరంగా ఉంటాయి మరియు రోడ్డుపై వెళ్లే సమయంలో ప్రయాణీకులు పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్ అనేది స్కార్పియో యొక్క కఠినమైన స్వభావాన్ని వినియోగదారులకు గుర్తు చేసే మరొక అంశం. ప్రాక్టికాలిటీ పరంగా, స్కార్పియో-ఎన్‌లో అనేక స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇందులో లోతైన గ్లోవ్‌బాక్స్, సెంటర్ కన్సోల్‌లో క్యూబీహోల్, డోర్ ప్యానెల్స్‌లో డీప్ పాకెట్స్ మొదలైనవి ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే, మహీంద్రా దీనికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన సంఖ్యలను బహిర్గతం చేయనప్పటికీ, మూడు వరుసలలో సీట్లు పైకి ఉన్నప్పటికీ ఇది అత్యంత విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉన్నట్లు మాకు అనిపించింది. అయితే, మరింత ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారు మూడవ వరుసలోని సీట్లను ముడుచుకుని స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 57 లీటర్లుగా ఉంటుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు, 1,857 మిమీ ఎత్తు మరియు 2,750 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

మొదటి తరం మహీంద్రా స్కార్పియో దాని 2.6-లీటర్ CRDe డీజిల్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో ఈ సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా నిలిచింది. ఆ తర్వాత mHawk ఇంజన్ రాకతో, స్కార్పియో మరింత శక్తివంతమైనదిగా మారింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌లను కలిగి ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 2.2-లీటర్ mHark డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది మరియు 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా XUV700లో కూడా ఇవే ఇంజన్లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ముందుగా పెట్రోల్ ఇంజన్ పవర్ టార్క్ గణాంకాలను చూస్తే, ఇందులోని 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 200 బిహెచ్‌పి పవర్ మరియు 1,750-3,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 370 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. స్కార్పియో-ఎన్‌లోని ఈ పెట్రోల్ ఇంజన్ రియర్ వీల్ డ్రైవ్‌ (RWD)తో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడం ద్వారా ఈ పెట్రోల్ మోడల్‌తో కొన్ని అద్భుతమైన ఆఫ్-రోడ్ ఫీట్లను చేయవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మొదటితో తక్కువ ట్యూనింగ్‌లో లభించే 2.2-లీటర్ mHawk ఇంజన్. ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 130 బిహెచ్‌పి పవర్ మరియు 1,500-3,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు రియర్ వీల్ డ్రైవ్‌ (RWD)తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే, ఇదే డీజిల్ ఇంజన్ మరింత శక్తివంతమైన ట్యూనింగ్‌తో లభిస్తుంది. ఇది 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 172.4 బిహెచ్‌పి పవర్ ను విడుదల చేస్తుంది. అయితే, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌ల మధ్య టార్క్ అవుట్‌పుట్ భిన్నంగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్ యొక్క మాన్యువల్ వేరియంట్ 1,500-3,000 ఆర్‌పిఎమ్ మధ్యలో 370 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఆటోమేటిక్ వేరియంట్ 1,750-2,750 ఆర్‌పిఎమ్ మధ్యలో 400 ఎన్ఎమ్ టార్క్‌తో మరింత టర్నింగ్ ఫోర్స్‌ని అందిస్తుంది. మేము ఈ టాప్-ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్‌లను టెస్ట్ డ్రైవ్ చేశాము. ఇందులోని RWD (రియర్ వీల్ డ్రైవ్) వెర్షన్‌తో లభించే 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ పనితీరు చాలా అద్భుతంగా అనిపించింది. అధిక ట్యూనింగ్ స్థితిలో, ఇది నిజంగా చాలా చురుకైనదిగా ఉంటుంది మరియు దీని థ్రోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ ఇంజన్ 1,750 ఆర్‌పిఎమ్ నుండి 3,500 ఆర్‌పిఎమ్ మధ్యలో చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. అయితే, 3,500 ఆర్‌పిఎమ్ తర్వాత దాని శ్వాస ఆగిపోయినట్లుగా ఉంటుంది. అలాగే, ఈ ఇంజన్ 1,500 ఆర్‌పిఎమ్ లోపు కొంత టర్బో లాగ్‌ని కలిగి ఉంటుంది. ఈ టర్బో లాగ్‌ని కవర్ చేయడానికి కంపెనీ ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించింది. ఈ గేర్‌బాక్స్ ఒక సాధారణ టార్క్ కన్వర్టర్ యూనిట్, కాబట్టి దీని ప్రతిస్పందన కూడా నెమ్మదిగానే ఉంటుంది మరియు గేరు మారడం కూడా నెమ్మదిగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

నిజానికి, ఇది టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల‌లో కనిపించే సాధారణ లక్షణం కాబట్టి, దీని ఫిర్యాదు చేయకూడదు. పైన చెప్పినట్లుగా మీరు ఇంజన్‌ను ఆ పవర్ బ్యాండ్‌ (1,750 - 3,500 ఆర్‌పిఎమ్ మధ్య)లో ఉంచగలిగితే, మీరు టార్క్ కన్వర్టర్‌ వలన ఎదురయ్యే సవాళ్లను సులువుగా అధిగమించవచ్చు. స్కార్పియో-ఎన్ కోసం నిర్వహించిన మీడియా డ్రైవ్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ వేరియంట్లను కంపెనీ అందుబాటులో ఉంచలేదు. కాబట్టి, దీని పనితీరు గురించి ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు. కానీ, ఈ 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ఖచ్చితంగా డ్రైవ్ చేయడానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాము.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీలో మరొక ఆసక్తికరమైన విషయం దాని 4WD (ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్). కంపెనీ ఈ టెక్నాలజీని ఫోర్ఎక్స్‌ప్లోర్ (4XPLOR) అనే పేరుతో పిలుస్తోంది. మేము ఈ వేరియంట్‌ని కూడా టెస్ట్ డ్రైవ్ చేశాము, ఇది మమ్మల్మి ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వేరియంట్‌ను సాధారణం రోడ్డుపై అలాగే ఆఫ్-రోడ్‌పై నడిపాము. ఆన్-రోడ్‌పై స్కార్పియో-ఎన్ దాని విభాగంలోనే అత్యుత్తమ హ్యాండ్లింగ్‌ను అందించే టిపికల్ ఓల్డ్-స్కూల్ ఎస్‌యూవీగా ఉంటుంది. ఇక ఆఫ్-రోడ్‌పై అయితే, దీని పనితీరు నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఈ ఎస్‌యూవీలోని కొత్త సస్పెన్షన్ సెటప్ ఎలాంటి రోడ్లపై అయినా మృదువైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు ముందు భాగంలో కాయిల్-ఓవర్ షాక్‌లతో డబుల్ విష్‌బోన్‌లు ఉన్నాయి మర్యు వెనుక భాగంలో ఐదు లింక్‌లతో కూడిన సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కంపెనీ దీనిని పెంటాలింక్ సస్పెన్షన్ అని పిలుస్తుంది. ఈ సస్పెన్షన్ సెటప్ కారణంగా కారు లోపల రైడ్ చాలా మృదువుగా ఉంటుంది మరియు స్కార్పియో-ఎన్ గుంతలపై ప్రయాణించినప్పుడు, అక్కడ అసలు గుంతలు లేవనే భావన కలుగుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

స్కార్పియో-ఎన్ స్టీరింగ్ వీల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మహీంద్రా ఈ స్టీరింగ్ వీల్‌ను తేలికైన వైపు ఉండేలా ట్యూన్ చేసింది. అయితే, మేము మాత్రం దానిని ఎక్కువ బరువుగా ఉంచడానికి ఇష్టపడతాము. మహీంద్రా ఈ స్టీరింగ్ వీల్‌ను ప్రత్యేకించి ఆఫ్-రోడ్ పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. నిజానికి ఇది అటువంటి రోడ్ పరిస్థితులకు ఖచ్చితంగా సరిపోతుంది. మేము ఈ ఎస్‌యూవీ యొక్క శక్తిసామర్థ్యాలను చెక్ చేసేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించిన ఆఫ్-రోడ్ ట్రాక్‌పై నడిపాము.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

ఇటువంటి సవాళ్లతో కూడిన ఆఫ్-రోడ్ పరిస్థితులపై లైట్ స్టీరింగ్ ఖచ్చితంగా ఒక వరంగా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ నిజంగా ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దాని సాటిలేని 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్. మహీంద్రా స్కార్పియో-ఎన్‌ 4XPLOR అనే ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో అమర్చబడింది. ఇది వివిధ రకాల టెర్రైన్ మోడ్‌లను కలిగి ఉండి, ఎలాంటి భూభాగాలనైనా సులువుగా అధిగమించేలా ఉంటుంది. ఈ టెక్నాలదీ థ్రోటల్ రెస్పాన్స్‌ను మరియు ఇంజన్ నుంచి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు పంపే విధానాన్ని మారుస్తుంది. ఇందులోని 4హై మరియు 4లో ఫీచర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో రోడ్, స్నో, శాండ్ మరియు మడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. డ్రైవర్ ఎంచుకునే డ్రైవ్ మోడ్‌ని బట్టి ఈ కారు ప్రతిస్పందించే విధానం కూడా మారుతూ ఉంటుంది. ఎంచుకున్న డ్రైవ్ మోడ్‌కి అనుగుణంగా కారులోని మెకానికల్స్ ఆటోమేటిక్‌గా మారడం ప్రారంభిస్తాయి. మేము ఈ డ్రైవ్ మోడ్స్‌ని పరీక్షించడానికి కొత్త స్కార్పియో-ఎన్‌ని బాగానే కష్టపెట్టామని చెప్పాలి. గుంటలు, నీరు, బురద, ఇసుక ఇలా అన్ని రకాల భూభాగలపై దీని శక్తిసామర్థ్యాలను మేము పరీక్షించాము. వీటన్నింటినీ కొత్త స్కార్పియో-ఎన్ చాలా సునాయాసంగా అధిమించి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేసింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

సాధారణ రోడ్డుపై స్కార్పియో-ఎన్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డుపై స్పీడ్ లిమిట్స్ లేకపోతే, మీకు ఈ కారులో రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంది (అతివేగం ప్రమాదకరం జాగ్రత్త!!). రోడ్ టెర్రైన్ మోడ్‌లో మరియు జూమ్ డ్రైవింగ్ మోడ్‌లో మేము నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నాము. ఇది చాలా క్విక్ డ్రైవ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తమ్మీద Scorpio-N అనేది మహీంద్రా నుండి వచ్చిన మరొక ఇంజనీరింగ్ మాస్టర్‌పీస్‌గా చెప్పుకోవచ్చు. ఇది అన్ని విషయాలలో ఆకట్టుకునే ఎస్‌యూవీ. స్కార్పియో-ఎన్ యొక్క మరిన్ని వేరియంట్లను టెస్ట్ డ్రైవ్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా స్కార్పియో-ఎన్ సేఫ్టీ ఫీచర్లు:

- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

- డ్రైవర్ డ్రౌజీనెస్ అలెర్ట్

- 18 ఫీచర్లతో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

- జియో-లొకేషన్‌తో కూడిన SOS బటన్

- హిల్ హోల్డ్ అసిస్ట్

- హిల్ డీసెంట్ కంట్రోల్

- ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు

- ఈబిడితో కూడిన ఏబిఎస్

- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ప్రధానమైన ఫీచర్లు:

- 6 రకాలుగా సర్దుబాటు చేయగల ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్

- 12 స్పీకర్‌లతో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్

- ఫ్రంట్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు

- వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్

- ఆప్షనల్ కెప్టెన్ సీట్లు

- కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్

- పూర్తి ఎల్ఆడి లైటింగ్

- ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు ఆటో వైపర్

- 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

మహీంద్రా స్కార్పియో-ఎన్ కలర్ ఆప్షన్లు:

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఏడు ఆసక్తికరమైన మరియు క్లాసీ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుది. అవి:

- డాజ్లింగ్ సిల్వర్

- డీప్ ఫారెస్ట్

- గ్రాండ్ కెన్యాన్

- ఎవరెస్ట్ వైట్

- నాపోలి బ్లాక్

- రెడ్ రేజ్

- రాయల్ గోల్డ్

మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇది నిజంగానే ఎస్‌యూవీలకు

చివరిగా ఏం చెబుతారు..?

సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, మహీంద్రా తమ గేమ్ ఛేంజర్‌ మోడల్ స్కార్పియోని ప్రారంభించింది. స్కార్పియో రాకతో భారత ఆటోమోటివ్ మార్కెట్లో మహీంద్రా స్థానం కొత్త ఎత్తులకు చేరుకుంది మరియు స్కార్పియో కూడా భారత ఆటోమోటివ్ హీరోగా మారింది. ఇది అందరూ ఆకాంక్షించే ఎస్‌యూవీగా మరియు ప్రతిష్టకు చిహ్నంగా మారింది. స్కార్పియో తన అలుపెరగని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు, కొత్త తరం మోడల్‌గా, స్కార్పియో-ఎన్‌గా మరియు మహీంద్రాకు మరొక గేమ్ ఛేంజర్ మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇది స్కార్పియో విజయగాథను మరియు చరిత్రను తిరిగి రాస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Mahindra scorpio n test drive review design features engine drving impressions
Story first published: Thursday, June 30, 2022, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X