ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

భారతదేశానికి మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసిన సంస్థ మహీంద్రా (Mahindra). దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్‌ను ముందుగానే ఊహించి 2013 లోనే మహీంద్రా రేవా ఈ2ఓ పేరుతో కంపెనీ ఓ 4-సీటర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారతీయులకు పరిచయం చేసింది. ఆ తర్వాత తమ ఎలక్ట్రిక్ వెరిటో సెడాన్‌ను విడుదల చేసింది. మహీంద్రా ప్రారంభంలోనే భారతదేశంలో ఈవీ వాహనాల విషయంలో ఉన్న సవాళ్ల గురించి గళం విప్పింది. అయితే, ఈవీల విషయంలో సర్కారు నుండి కూడా పెద్దగా జోక్యం లేకపోవడంతో మహీంద్రా ప్లాన్స్‌కు పెద్ద బ్రేక్ పడింది.

Recommended Video

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రివ్యూ

కాగా, ప్రస్తుతం పరిస్థితులు మారాయి, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలికసదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయి. మరోవైపు, దేశంలోని అనేక ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ వ్యాపారంలోకి ప్రవేశించాయి. అయితే, మహీంద్రా మాత్రం ఈసారి ఆలోచించి అడుగు వేయాలని నిర్ణయించుకుంది. మహీంద్రా రేవా విషయంలో జరిగినట్లుగా నష్టాల బాట పట్టకుండా, కాస్తంత లౌక్యంగా ఆలోచించి, అన్నీ అనుకూలించిన తర్వానే ఈవీ మార్కెట్లోకి రావాలనుకుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. మహీంద్రా తమ అధునాతన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400 EV)ని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మహీంద్రాకు ఇదివరకే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసిన అనుభం ఉండటం మరియు ఇది కంపెనీ యొక్క పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు కావడంతో మార్కెట్లో ఈ మోడల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మరి కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు మార్కెట్ అంచనాలను అందుకుందా? ఇది ఈ విభాగంలోని పోటీదారులను ధైర్యంగా ఢీకొట్టగలదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను వెతికేందుకు మేము ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారును చెన్నైలో టెస్ట్ డ్రైవ్ చేశాము. మరి ఇది మమ్మల్ని ఎలా ఆకట్టుకుంది, మిమ్మల్ని ఏవిధంగా ఆకట్టుకోనుందనే విషయాన్ని ఈ పూర్తి సమీక్షలో తెలుసుకుందాం రండి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 - పరిచయం మరియు డిజైన్

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మొదటిసారిగా చూసేవారు ఇది ఎక్స్‌యూవీ300 యొక్క లేటెస్ట్ వెర్షన్ అని పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఇది అదే ప్లాట్‌ఫామ్‌పై తయారైంది కాబట్టి. మహీంద్రా సంస్థ 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మహీంద్రా ఇఎక్స్‌యూవీ300 (Mahindra eXUV300) కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో తిరిగి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి ప్రవేశించాలనే తన ఆలోచనను ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్‌యూవీ400 కూడా ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారుకి చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

వాస్తవానికి, మహీంద్రా నుండి ఈ ఎలక్ట్రిక్ కారు చాలా కాలం క్రితమే మార్కెట్లోకి రావాల్సి ఉంది. అయితే, ఆటోమొబైల్ పరిశ్రమలో ఏర్పడిన పలు సవాళ్ల కారణంగా ఇది కాన్సెప్ట్ దశ నుండి ఉత్పత్తి దశకు చేరుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. మహీంద్రా తమ యూరోపియన్ డిజైన్ బృందం సహకారంతో ఎట్టకేలకు భారత మార్కెట్లో తమ రిఫ్రెష్డ్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎక్స్‌యూవీ400 కారు గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. కాగా, ధరలు బుకింగ్ సమాచారం తెలియాలంటే మాత్రం మరి కొన్ని నెలలు వేచి ఉండాలి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ నుండి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 కొన్ని స్పష్టమైన eXUV300 కాన్సెప్ట్ ప్రేరేపిత ట్వీక్‌లతో అంతర్గత దహన ఇంజన్ ఆధారిత XUV300 యొక్క రీట్వీక్ చేయబడిన వెర్షన్‌గా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూలింగ్ అవసరాల కోసం కంపెనీ ఇందులోని ఫ్రంట్ ఎండ్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ రెండింటినీ మూసివేసింది. అయినప్పటికీ, ఇది ఫేక్ గ్రిల్ సాయంతో పూర్తిగా కవర్ చేయబడి ఉంటుంది. కాబట్టి, ముందు వైపు చూడటానికి నిజంగా గ్రిల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో ఉండే ఫేక్ ఫ్రంట్ గ్రిల్ పై కాపర్-కలర్ హైలైట్స్ మరియు కాపర్ కలర్ మహీంద్రా ట్విన్ పీక్స్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ కాపర్ కలర్ ఎలిమెంట్స్ కొత్త ఎక్స్‌యూవీ400 ప్రంట్ బంపర్, హెడ్‌లైట్స్ క్రింది భాగం, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో సైడ్ డిజైన్‌లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం ఏంటంటే, డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌. ఇవి పెట్రోల్/డీజిల్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఎక్స్‌యూవీ400 వెనుక వైపు డిజైన్ మరియు టెయిల్‌లైట్‌లు అదే ఆకారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ కొత్ యారో హెడ్ ఆకారంలో ఉండే డిజైన్ హైలైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా ఈ కారులో చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, రియర్ డోర్ మౌంటెడ్ రూఫ్ స్పాయిల్ విత్ హై-మౌంట్ స్టాప్ లైట్, ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ మరియు డ్యూయెల్ టోన్ రియర్ బంపర్ వంటి అంశాలను కూడా గమనించవచ్చు. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నాపోలి బ్లాక్ మరియు ఇన్ఫినిటీ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవన్నీ శాటిన్ కాపర్ ఫినిషింగ్‌లో డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 - ఇంటీరియర్స్ మరియు ఫీచర్లు

కొత్త ఎక్స్‌యూవీ400 డోర్ హ్యాండిల్ పుల్ చేసి కారులోకి ప్రవేశించగానే, మీరు ఎక్స్‌యూవీ300 కారులో ఉన్నట్లే ఫీల్ అవుతారు. ఈ ఎలక్ట్రిక్ కారు తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు మహీంద్రా దాని క్యాబిన్ లోపల పెద్దగా మార్పులు చేయలేదు. మొత్తం క్యాబిన్ లేఅవుట్ అలాగే ఉన్నప్పటికీ, లోపలి భాగం ఇప్పుడు నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కారు అని తెలియజేసేందుకు ఏసి వెంట్స్, సౌండ్ మరియు ఏసి కంట్రోల్స్, స్టీరింగ్ వీల్‌పై ట్విన్ పీక్స్ బ్యాడ్జ్‌ల చుట్టూ కాపర్ ఇన్‌సర్ట్‌లు హైలైట్‌గా నిలుస్తాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

క్యాబిన్ లోపల కనిపించే అతిపెద్ద మార్పు దాని కొత్త గేర్ సెలెక్టర్ రూపంలో ఉంటుంది, ఇది కూడా శాటిన్ కాపర్ సరౌండ్‌ను కలిగి ఉంటుంది. కారు లోపల సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరోసారి ఈ కారు ఎలక్ట్రిక్ మోడల్ అని హైలైట్ చేసేందుకు కంపెనీ ఈ సీట్లపై బ్లూ కలర్ స్టిచింగ్‌ను ఉపయోగించింది. క్యాబిన్ లోపలి భాగంలో దాదాపు ప్రతిచోటా గట్టి ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉపయోగించారు, ఇది అంత సాఫ్ట్ టచ్ ఫీల్‌ను ఇవ్వదు. సెంట్రల్ కన్సోల్ పియానో బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉండి, ప్రీమియంగా కనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది కూడా ఎక్స్‌యూవీ300 మోడల్‌లో కనిపించే యూనిట్ మాదిరిగానే ఉంటుంది, పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. కాకపోతే, ఈ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటుగా మహీంద్రా యొక్క కొత్త అడ్రినాక్స్ (AdrenoX) సాఫ్ట్‌వేర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది (పెట్రోల్, డీజిల్ మోడళ్లలో ఈ సదుపాయం లేదు).

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఇంకా ఇది మహీంద్రా యొక్క బ్లూ సెన్స్+ సూట్ అనే కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది యూజర్‌కు కారుకి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని రిమోట్‌గా తెలియజేయడంలో సహకరిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ యాప్, ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు మరియు చార్జింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన వివరణాత్మక రూట్ ప్లానింగ్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ చిన్న ఎలక్ట్రిక్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, చైల్డ్ సీట్ల కోసం ఐఎస్ఓఫిక్స్ యాంకర్లు, ఎలక్ట్రిక్ మోటారు మరియు బ్యాటరీ ప్యాక్ కోసం IP67 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 - పవర్‌ట్రెయిన్ మరియు కొలతలు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చబడిన సింగిల్ పర్మినెంట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది గరిష్టంగా 147.5 బిహెచ్‌పి శక్తిని మరియు 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్ స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారులో అమర్చిన పెద్ద 39.4kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఎక్స్‌యూవీ400లో పవర్ డెలివరీ, రీజెన్ మరియు స్టీరింగ్ అనుభూతిని ప్రభావితం చేసే మూడు ప్రధాన డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి - ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్. ఇంకా ఇందులో లైవ్లీ మోడ్ కూడా ఉంటుంది, ఈ మోడ్ సాయంతో సింగిల్ పెడల్ డ్రైవింగ్ సాధ్యం అవుతుంది. ఇక అతి ముఖ్యమైన విషయం రేంజ్ (మైలేజ్) విషయానికి వస్తే, కారులో అమర్చిన 39.4kWh బ్యాటరీ ప్యాక్ సవరించిన భారతీయ డ్రైవింగ్ పరిస్థితులలో (MIDC) పూర్తి చార్జ్ పై 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 యొక్క బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారును స్టాండర్డ్ 3.3 kW/16A డొమెస్టిక్ సాకెట్‌ సాయంతో చార్జ్ చేసినప్పుడు, పూర్తిగా చార్జ్ చేయడానికి 13 గంటల సమయం పడుతుంది. అదే, 7.2 kW/32A అవుట్‌లెట్‌తో చార్జ్ చేసినప్పుడు పూర్తిగా 100 శాతం ఛార్జ్‌ కావడానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే, ఈ బ్యాటరీ ప్యాక్‌ను శక్తివంతమైన 50kW DC సూపర్ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఓ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని మొత్తం పొడవు 4,200 మిమీ, వెడల్పు 1,821 మిమీ మరియు ఎత్తు 1,634 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క వీల్‌బేస్ 2,600 మిమీగా ఉంది మరియు దీని బూట్ స్పేస్ సామర్థ్యం 378 లీటర్లుగా ఉంటుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. క్యాబిన్ లోపల లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ మరియు ఇంటీరియర్ స్థలం విషయానికి వస్తే, ఇది దాదాపు ఎక్స్‌యూవీ300 మోడల్‌కి సమానంగానే ఉంటుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ400 యొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ చాలా క్విక్ టార్క్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇది క్షణాల్లో వేగవంతంగా మారుతుంది. ఎక్స్‌యూవీ400 కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, ఇది గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 4 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఈ కారులోని డ్రైవింగ్ మోడ్‌ల (ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫన్ మోడ్‌లో, గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది మరియు ఈ మోడ్‌లో స్టీరింగ్ చాలా తేలికగా అనిపిస్తుంది. అలాగే, థ్రోటల్ రెస్పాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ మోడ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ నుండి 90 శాతం శక్తిని ఉపయోగిస్తుంది, ఈ మోడ్‌లో టాప్ స్పీడ్ గంటకు 135 కిలోమీటర్లుగా ఉంటుంది. ఫన్ మోడ్‌తో పోలిస్తే ఈ మోడ్‌లో థ్రోటల్ (యాక్సిలరేటర్) రెస్పాన్స్ వేగంగా అనిపిస్తుంది మరియు స్టీరింగ్ కూడా హెవీగా అనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఇక చివరి మోడ్ ఫియర్‌లెస్ డ్రైవింగ్ మోడ్ విషయానికి వస్తే, ఇందులో స్టీరింగ్ కొంచెం బరువుగా అనిపిస్తుంది మరియు మీరు మీ కుడి పాదంతో యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కినప్పుడు, ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ఫుల్ పవర్‌ను ఫీల్ కావడం ప్రారంభిస్తారు. ఈ మోడ్‌లో టాప్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లుగా ఉంటుంది. కాగా, మేము మహీంద్రా యొక్క టెస్ట్ ట్రాక్‌లో టెస్ట్ డ్రైవ్ చేసిన ప్రీ-ప్రొడక్షన్ ఎక్స్‌యూవీ400 గంటకు గరిష్టంగా 160 లకు పైగా వేగాన్ని చేరుకోగలిగింది. బహుశా ప్రొడక్షన్ వెర్షన్‌లో దీన్ని యాంత్రికంగా పరిమితం చేసే అవకాశం ఉంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

ఈ మూడు డ్రైవింగ్ మోడ్‌లు కూడా విభిన్నమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ స్థాయిలను కలిగి ఉంటాయి. డ్రైవర్ ఎంచుకునే మోడ్స్‌ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. రీజెన్ స్థాయిలు ఫన్ మోడల్‌లో ఎక్కువగా, ఫాస్ట్ మోడ్‌లో మధ్యస్థంగా మరియు ఫియర్‌లెస్ మోడ్‌లో తక్కువగా ఉంటాయి. మహీంద్రా ఇందులో 'లైవ్లీ' అనే కొత్త సింగిల్ పెడల్ డ్రైవింగ్ మోడ్‌ను కూడా జోడించింది. దీని సాయంతో డ్రైవర్ బ్రేక్ పెడల్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే, కేవలం సింగిల్ (థ్రోటల్) పెడల్ సాయంతో డ్రైవ్ చేసేందుకు ఇది అనుమతిస్తుంది. ట్రాఫిక్ జామ్‌ల వద్ద విసిగిపోయిన వారికి ఈ మోడ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మహీంద్రా ఎక్స్‌యూవీ400 యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన బరువైన బ్యాటరీ ప్యాక్ కారణంగా, కంపెనీ ఇందులో కొంచెం గట్టిగా ఉండేలా సస్పెన్షన్‌ను డిజైన్ చేసింది. తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ లైట్‌గా అనిపిస్తుంది. అయితే, వేగం పెరిగే కొద్దీ స్టీరింగ్ కూడా హెవీగా మారుతూ ఉంటుంది. ఎక్స్‌యూవీ400 తక్కువ గురుత్వాకర్షణ కేంద్రంతో పాటుగా తక్కువ బాడీ రోల్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, మలుపుల వద్ద ఈ కారును నడిపే డ్రైవర్లకు అదనపు భరోసా ఇస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మేము ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారును చెన్నైలో మహీంద్రా తమ వాహనాలను పరీక్షిచడం కోసం ఏర్పాటు చేసుకున్న అధునాతన టెస్టింగ్ ట్రాక్‌పై మాత్రమే పరీక్షించగలిగాము. ఈ ట్రాక్ అంతా నునుపైన తారు రోడ్లను కలిగి ఉంటుంది కాబట్టి, వాస్తవిక భారతీయ రోడ్డు పరిస్థితులపై ఈ ఎస్‌యూవీ పనితీరు ఎలా ఉంటుందనే విషయాన్ని మేము పూర్తిగా పరీక్షించలేకపోయాము. కఠినమైన భారత రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ కారు ఎలా పరుగులు తీస్తుందో తెలియాలంటే, మేము మరోసారి ఈ కారును పరీక్షించాల్సి ఉంటుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ400 అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులను కలిగి ఉండి, ఏబిఎస్ కలయితో మంచి డ్రైవరుకు మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను అందిస్తుంది. బ్రేక్ పెడల్ కూడా చాలా తక్కువ ట్రావెల్‌ను కలిగి ఉండి, ఆపరేట్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 లోని రీజెన్ బ్రేకింగ్ సిస్టమ్ పనితీరు బాగానే అనిపించింది మరియు ఈ ఎలక్ట్రిక్ కారుని వేగంగా ఆపడంలో సహాయపడుతుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి, క్యాబిన్ చాలా నిశ్శబ్ధంగా అనిపిస్తుంది. అయితే, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం టైర్లు చేసే శబ్ధం కారు లోపల కూడా వినిపిస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

చివిరిగా ఏం చెబుతారు..?

మహీంద్రా అందరికన్నా ముందే ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం టాటా మోటార్స్ జెట్ స్పీడుతో ఈ విభాగంలో రారాజుగా ఉంది. అయితే, మహీంద్రా కూడా అదే స్పీడ్‌తో తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ400తో టాటా మోటార్స్ నుండి భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సరికొత్త XUV400 దాని టాటా ప్రత్యర్థి కంటే పెద్దది మరియు శక్తివంతమైనది మరియు అధిక రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది.

ఎక్స్‌యూవీ400 టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. ఎక్కువ రేంజ్ ఇచ్చామా లేదా..!

మేము టెస్ట్ డ్రైవ్ చేసింది ప్రీ-ప్రొడక్షన్ యూనిట్ కాబట్టి, దీని యొక్క రియల్ టైమ్ రేంజ్‌ను మేము పరీక్షించలేకపోయాము. కంపెనీ చెప్పినట్లుగా ఇది పూర్తి చార్జ్ పై 450 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుందా లేక అంతకన్నా తక్కువ రేంజ్‌ను కలిగి ఉంటుందా అనే విషయం తెలియాలంటే, ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క లాంగ్ టెర్మ్ రివ్యూ కోసం వేచి ఉండాల్సిందే. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్‌పై ఓ కన్నేసి ఉంచండి.

Most Read Articles

English summary
Mahindra xuv400 electric suv test drive review design features specs battery range and first drive i
Story first published: Sunday, September 11, 2022, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X