భారీగా పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు

భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద ధరలు పెంచినట్లు ప్రకటించింది.

By Anil

Recommended Video

Indian Army Soldiers Injured In Helicopter Fall - DriveSpark

భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని కార్ల మీద ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఈ మేరకు, మారుతి విడుదల చేసిన ప్రకటనలో ధరల సవరణ అనంతరం అమల్లోకి తెచ్చిన కొత్త ధరలు జనవరి 10, 2017 నుండి దేశవ్యాప్తంగా అన్ని మారుతి విక్రయ కేంద్రాలలో అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది.

మారుతి సుజుకి కార్ల ధరలు

ముడిసరుకు, తయారీ మరియు పంపిణీ పరంగా ఉత్పత్తి భారం పెరగడంతో తప్పనసరిగా ధరలు పెంపుచేపట్టినట్లు మారుతి తెలిపింది. ఈ పెంపు మారుతి లైనప్‌లోని అన్ని కార్ల మీద వర్తిస్తుంది.

మారుతి సుజుకి కార్ల ధరలు

కనిష్టంగా రూ. 1,700 ల నుండి గరిష్టంగా రూ. 17,000 ల వరకు వివిధ మోడళ్ల ఆధారంగా ధరలు పెంచినట్లు ప్రకటించిన మారుతి. ఏయే కార్ల మీద ఎంత మేరకు పెరిగాయో అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ వివరాలను అతి త్వరలో వెల్లడించనుంది.

మారుతి సుజుకి కార్ల ధరలు

మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌‌బ్యాక్ ఆల్టో 800 నుండి ప్రీమియమ్ క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకు విస్తృత శ్రేణి మోడళ్లను విక్రయిస్తోంది. మారుతి కార్ల ప్రారంభ ధర రూ. 2.45 లక్షలు మరియు గరిష్టంగా రూ. 11.29 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా లభిస్తున్నాయి.

మారుతి సుజుకి కార్ల ధరలు

మారుతి సుజుకి జూలై 2017లో అన్ని మోడళ్ల మీద 3 శాతం వరకు ధరలు తగ్గించింది. అయితే, సియాజ్ డీజల్ సెడాన్ మరియు ఎర్టిగా డీజల్ మరియు మైల్డ్ హైబ్రిడ్ ఎమ్‌పీవీ కార్ల మీద రూ. 1 లక్ష రుపాయల వరకు పెరిగాయి. వస్తు సేవల పన్ను అమల్లోకి రావడంతో వాటి ప్రతి ఫలాలను ధరల తగ్గింపు రూపంలో కస్టమర్లకు అందించింది.

మారుతి సుజుకి కార్ల ధరలు

మారుతి సుజుకి తమ కార్ల ధరలను తగ్గించినా... లేదంటే పెంచినా... కూడా ఇతర కంపెనీలు విక్రయించే కార్లకు ధర పరంగా గట్టి పోటీనే ఇస్తున్నాయి. ధరలు పెరిగినప్పటికీ మారుతి కార్ల మీద ఎలాంటి ప్రభావం చూపడం లేదు.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను రోడ్ రోలరుతో తొక్కించిన పోలీసులు

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో ప్రయాణికులంతా సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?

మారుతి 800 ఇంజన్‌తో ఆల్ వీల్ డ్రైవ్ మోటార్ సైకిల్ నిర్మించిన 20 ఏళ్ల కుర్రాడు

మారుతి సుజుకి కార్ల ధరలు

మారుతి సుజుకితో పాటు హ్యుందాయ్ మోటార్స్, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలు జనవరి 2018 నుండి తమ కార్ల మీద ధర పెంచుతున్నట్లు గత ఏడాది జనవరిలో అధికారికంగా వెల్లడించాయి. ఇప్పుడు మారుతి పెరిగిన ధరలు వెల్లడించింది కాబట్టి, ఇతర కంపెనీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి కార్ల ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఇండియన్ కస్టమర్ల అభిరుచికి చాలా దగ్గరగా ఉండే కార్లను ప్రవేశపెడుతోంది. దీనికి తోడు ధరలను కూడా చాలా సున్నితంగా నిర్ణయిస్తోంది. దేశవ్యాప్తంగా విసృతమైన షోరూమ్‌లు ఉండటంతో సేల్స్ పరంగా ఈ ధరలు పెంపు ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Announces Increase In Car Prices — Hike Up To Rs 17,000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X