మొదటి చూపుతోనే మనసు దోచిన 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' ఫస్ట్ లుక్ రివ్యూ - డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తన ఆధునిక SUV అయిన 'ఫ్రాంక్స్' (Fronx) ఆవిష్కరించింది. ఈ SUV మొదటి చూపుతోనే ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచేసింది. ఇది చూడటానికి కొంత మారుతి బాలెనొ మాదిరిగా అనిపించినప్పటికీ భిన్నమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2023 లో అరంగేట్రం చేసిన కొత్త మారుతి సుజుకి మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా ఆధునిక కాలంలో ఉపయోగపడే ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ SUV సస్పెన్షన్ సెటప్ కూడా మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. ఈ SUV ని చూసినవెంటనే చాలా మంది కస్టమర్లు దీని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి ఉంటారు. మారుతి ఫ్రాంక్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫస్ట్ లుక్ రివ్యూ

మారుతి సుజుకి ఫ్రాంక్స్: డిజైన్

మొదట్లో చెప్పుకున్నట్లుగానీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. నిజానికి ఈ SUV దాని విభాగంలో సరికొత్త డిజైన్ పొందిందని చెప్పవచ్చు. ఈ SUV కంపెనీ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ SUV కూపే అవుతుంది. ఇది చూడటానికి గ్రాండ్ విటారా మాదిరిగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రాండ్ విటారా మాదిరిగానే మారుతి సుజుకి ఫ్రాంక్స్ లో కూడా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ చూడవచ్చు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క ముందు మరియు వెనుక బంప్‌లు కూడా కొత్తవి మరియు రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లు మరియు క్రోమ్ వంటివి ఉన్నాయి. గ్రిల్ ఎగువ భాగంలో ఉన్న సుజుకి బ్యాడ్జ్ సొగసైన LED DRLలకు కనెక్ట్ చేయబడింది. అదే సమయంలో ఈ SUV ఫ్రంట్ బంపర్ కింద ఒక చిన్న ఎయిర్ డ్యామ్‌ కూడా చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు బాలెనోను గుర్తుకు తెస్తుంది.

మొదటి చూపుతో మనసు దోచిన మారుతి ఫ్రాంక్స్ ఫస్ట్ లుక్ రివ్యూ

మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క C పిల్లర్ ఒక నల్లని ఇన్సర్ట్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ SUV జామెట్రిక్ ప్రెసిషన్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన స్నాజీ సెట్‌ పొందుతుంది. ఇది దాని ఆకర్షణను మరింత పెంచడంలో సహాయపడుతుంది. వీల్స్ చుట్టూ కూడా బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ చూడవచ్చు. ఇవి మారుతి సుజుకి ఫ్రాంక్స్ డిజైన్ ని మరింత అట్రాక్టివ్ గా చేయడంలో సహాయపడతాయి.

ఇక రియర్ ఫ్రొఫైల్ విషయానికి వస్తే, వెనుక భాగంలో రూప్ మీద ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఎలిమెంట్‌ చూడవచ్చు. అదే సమయంలో బ్రాండ్ యొక్క లోగో వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే టెయిల్ లైట్ పైన ఉంటుంది. అంతే కాకుండా Fronx బ్యాడ్జ్ కూడా రియర్ ఫ్రొపైల్ లో గమనించవచ్చు. మొత్తం మీద ఈ SUV యొక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉందని చూడగానే చెప్పవచ్చు.

మొదటి చూపుతో మనసు దోచిన మారుతి ఫ్రాంక్స్ ఫస్ట్ లుక్ రివ్యూ

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కలర్ ఆప్సన్స్:

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది. అవి నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఎర్టెన్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్. ఇందులో మొదటి మూడు సింగిల్ టోన్ కలర్స్ మాత్రమే లభిస్తాయి, అయితే మూడు కలర్స్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ స్కీమ్‌లలో కూడా అందించబడతాయి. కావున కొనుగోలుదారుడు తనకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచునికే అవకాశం కూడా ఉంటుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ డిజైన్ మాత్రమే కాదు, ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ SUV లోపలి అడుగుపెట్టగానే మీకు బాలెనొని తలపించినప్పటికీ ఇందులోకి కొన్ని ఫీచర్స్ దీనిని కొత్తదని చూపించడంలో సహాయపడతాయి. ఫ్రాంక్స్ SUV మల్టి లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లపై డ్యూయల్ టోన్ థీమ్‌ పొందుతుంది. కావున ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మారుతి ఫ్రాంక్స్ SUV లో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు కంపెనీ యొక్క ఇన్-బిల్ట్ సుజుకి కనెక్ట్ సూట్ ద్వారా 40+ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లు ఇందులో లభిస్తాయి. అంతే కాకుండా AC వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మునుపటి మోడల్స్ మాదిరిగానే అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ పార్కింగ్ కెమరా, రియర్ డీఫాగర్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహనం వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇంజిన్

మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త ఫ్రాంక్స్ SUV 1.0 లీటర్, త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ బూస్టర్‌జెట్ ఇంజిన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ బిఎస్6 ఉద్గార నిబంధనల అమలు కారణంగా 2020 లో నిలిపివేయబడింది. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్ అన్ని ప్రమాణాలకు అనుకూలంగా మారనుంది. కావున అదే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ పొందే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ బూస్టర్ జెట్ ఇంజన్‌తో పాటు బాలెనో యొక్క 1.2 లీటర్ K12C డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ కూడా పొందనుంది. బూస్టర్‌జెట్ ఇంజిన్ అనేది ఫ్రాంక్స్ యొక్క డెల్టా+, జీటా మరియు ఆల్ఫా ట్రిమ్ స్థాయిలతో అందించబడుతుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 98.7 బిహెచ్‌పి పవర్ మరియు 2,000 ఆర్‌పిఎమ్ నుంచి 4,500 ఆర్‌పిఎమ్ మధ్య 147.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. ఇక 1.2-లీటర్ సుజుకి K12C ఇంజన్ విషయానికి వస్తే, ఇది 88.05 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్సన్స్ తో అందించబడుతుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొలతలు:

మారుతి సుజుకి ఫ్రాంక్స్ పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాల అనుకూలంగా ఉంటుంది. ఈ SUV పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ మరియు ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ SUV వీల్‌బేస్‌ పొడవు 2,520 మిమీ కాగా, బూట్ స్పేస్ 308-లీటర్ల వరకు ఉంటుంది. ఈ SUV యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 37-లీటర్లు కావున లాంగ్ డ్రైవ్ కి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ గురించి మా అభిప్రాయం:

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ పొంది ఉందొ అందరికి తెలుసు, కావున కంపెనీ విడుదల చేయనున్న ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ SUV డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా చాలా ఆధునికంగా ఉండటం వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

అయినప్పటికీ మారుతి సుజుకి తన కొత్త ఫ్రాంక్స్ SUV ని రూ. 7 లక్షల ప్రారంభ ధరతో విడుదల ఉందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ SUV ఈ సంవత్సరం మార్చి నాటికి దేశీయ మార్కెట్లో మారుతి నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. ఈ మారుతి ఫ్రాంక్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki fronx first look review design features specs details in telugu
Story first published: Thursday, January 19, 2023, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X