ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇటాలియన్ కార్లు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మంచి నాణ్యతను కూడా కలిగి ఉంటాయి. ఈ కార్లు సాధారణ కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కార్ల బ్రాండ్లలో ఒకటి మసెరటి. మసెరటి బ్రాండ్ లో 'లెవాంటే' ఒకటి. 'లెవాంటే' అనే పేరు మెరిటరేనియన్ విండ్ నుండి ఉద్భవించింది. ఇది సాధారణ స్థాయి నుంచి అత్యంత వేగవంతమైన స్థాయికి చాలా వేగవంతంగా చేరుకుంటుంది.

ఇటీవల మేము 'మసెరటి లెవాంటే' కారుని డ్రైవ్ చేసాము. మసెరటి లెవాంటే ఏవిధంగా పనిచేస్తుంది, ఇందులోని ఫీచర్స్ ఏంటి అనే విషయాలను గురించి ఈ రివ్యూలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.. రండి.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

డిజైన్ & స్టైల్:

ఇటాలియన్ బ్రాండ్ అయిన మసెరటి లెవాంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం ఇటాలియన్ టచ్ ఇందులో కనిపిస్తుంది. లెవాంటే సాధారణ ఎస్‌యూవీ కాదు. ఇది రేసింగ్ మరియు గ్రాండ్ టూరింగ్ నుంచి వచ్చిన బ్రాండ్. కావున ఇది అన్ని వైపులా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

లెవాంటే ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగి ఉంటుంది. ఇది పరిమాణం పరంగా సరైన ఫుల్ సైజ్ ఎస్‌యూవీ లాగా కనిపిస్తుంది. ఇది తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఈ అనుభూతిని ఇస్తుంది. అయితే మీరు ఈ లెవాంటే పక్కన నిలబడినప్పుడే అది చాలా పెద్దదని మీరు గ్రహించగలరు.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

లెవాంటే అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది 8 వర్టికల్ స్లాట్ గ్రిల్‌తో, మసెరటి ట్రైడెంట్(త్రిశూలం) లోగోను పొందుతుంది. ఇది ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కూడా పొందుతుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో కూడా మసెరటి లోగో ఎంబోస్ చేయబడింది. ఈ ఎస్‌యూవీలో క్రోమ్ రౌండ్ ఫాగ్ లాంప్స్ పొందుతుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

లెవాంటే యొక్క బోనెట్ పొడవుగా ఉండటమే కాకూండా, చాలా స్పోర్టీగా కూడా కనిపించే లైన్స్ కలిగి ఉంటుంది.

లెవాంటే యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మీరు 20 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ గుర్తిస్తారు. సిల్వర్ తో ఫినిషింగ్ అయిన ఇందులోని చక్రాలు మీ దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్థాయి. ఫ్రంట్ ఫెండర్‌లో మూడు ఫాక్స్ ఎయిర్ ఇంటెక్స్ ఉన్నాయి. ఫెండర్ యొక్క దిగువ చివరలో 'గ్రాన్స్ స్పోర్ట్స్' వేరియంట్ బ్యాడ్జింగ్ ఉంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

రూప్ యొక్క వెనుక వైపుకు వాలుగా ఉంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన స్పోర్ట్‌బ్యాక్ స్టైలింగ్‌ను సృష్టిస్తుంది, డి- పిల్లర్ పై మరొక మసెరటి ట్రైడెంట్ (త్రిశూలం) ఉంది. డోర్ హ్యాండిల్స్ క్రోమ్‌లో పూర్తయ్యాయి. ఇది మొత్తం డిజైన్ & స్టైల్‌కు ప్రీమియం టచ్‌ను జోడిస్తుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మసెరటి లెవాంటే యొక్క వెనుక భాగం చాలా స్పోర్టిగా ఉంటుంది. ఇక్కడ స్టైలిష్ స్ప్లిట్ టెయిల్ లాంప్స్, ఫాక్స్ బాష్ ప్లేట్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌ వంటివి గమనించవచ్చు. ఇది మధ్యలో స్టైలిష్ మసెరటి సింబల్ కలిగి ఉంది మరియు దాని క్రింద క్రోమ్ స్ట్రిప్ ఉంది. ఇది టైల్ గేట్ యొక్క కుడి దిగువ వైపు లెవాంటే బ్యాడ్జింగ్ మరియు దిగువ ఎడమ వైపు క్యూ 4 బ్యాడ్జింగ్‌ను కూడా గమనించవచ్చు.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

ఇటాలియన్ కార్ల యొక్క డిజైన్ సాధారణంగా కార్ల లాగా సరళంగా ఉండదు. ఇంటీరియర్ మొత్తం చాలా లగ్జరీగా మరియు ఆడంబరంగా ఉంటుంది. మసెరటి లెవాంటే యొక్క లోపలి భాగం మొత్తం రెడ్ కలర్ లో చాలా విలాసవంతంగా ఉంటుంది. లోపలి భాగం మొత్తం లెదర్ తో కప్పబడి ఉంటుంది. ఇందులో చాలా చోట్ల కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మసెరటి లెవాంటే యొక్క లోపలి భాగంలోని డాష్‌బోర్డ్‌లో అనలాగ్ క్లాక్ ఉంటుంది. ఇది కారు యొక్క లగ్జరీ ఆకర్షణను మరింత పెంచుతుంది. దీని క్రింద 8.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ ద్వారా కారు యొక్క దాదాపు అన్ని విధులనుకంట్రోల్ చేయవచ్చు.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఈ స్క్రీన్ కి ఇరువైపులా రెండు వర్టికల్ ఎయిర్ కండిషనింగ్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద ఎయిర్ కండిషనింగ్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కారులో డ్రైవర్ వైపు మరియు ప్రయాణీకుల వైపు 2 జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇందులోని కంట్రోల్స్ ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటాయి. టచ్‌స్క్రీన్ ద్వారా క్లైమేట్ కంట్రోల్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇన్స్ట్రుమెంటేషన్ కోసం అనలాగ్-డిజిటల్ క్లస్టర్ అందించబడుతుంది. 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఎస్‌యూవీ గురించి అన్ని వివరాలను ఇస్తుంది. అల్యూమినియం ఫినిషింగ్ తో అనలాగ్ గేజ్‌లు అద్భుతమైనవిగా కనిపిస్తాయి. దీని కొనుగోలుదారులు హర్మాన్ కార్డాన్ మరియు బోవర్స్ & విల్కిన్స్ ఆడియో సిస్టమ్స్ మధ్య ఎంచుకోవచ్చు. రెండూ చాలా అధిక నాణ్యత గల ధ్వనిని ఇస్తాయి.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇందులోని సీట్లు చాలా స్పోర్టీగా ఉండటమే కాకూండా, చాలా సౌకర్యంగా కూడా ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు కూడా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సీట్లలో వెంటిలేషన్ మరియు హీటింగ్ ఫీచర్ ఇవ్వబడింది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఈ కారులోని వెనుక సీట్లు కూడా అదే కంఫర్ట్ స్థాయిని పొందుతాయి. కానీ హీటింగ్ అండ్ వెంటిలేషన్‌ను కోల్పోతాయి. వెనుక వైపు ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. అయితే ఇక్కడ మూడవ వ్యక్తి కూర్చుంటే ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్ కోల్పోతారు. వెనుక ప్రయాణీకుల కోసం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్లాట్‌లతో ఫ్లోర్-మౌంటెడ్ ఎసి వెంట్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మసెరటి లెవాంటేలోని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వెనుక సీట్లు ప్రయాణీకులకు మెరుగైన లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌ను కూడా అందిస్తాయి. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే, లగ్జరీ ఎస్‌యూవీ అందించే అన్ని ఫీచర్స్ మసెరటి లెవాంటే కలిగి ఉంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

దీని సెంటర్ కన్సోల్‌లో వాలెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంచడానికి క్యూబిహోల్స్‌ ఉన్నాయి. సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కింద డీప్ స్టోరేజ్ ఏరియా ఉంటుంది. ఇది కూలింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. కూలింగ్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఇందులో చిన్న స్విచ్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

డోర్ ప్యానెల్స్‌లో బాటిల్ హోల్డర్లు కొంచెం పెద్దవిగా ఉండవచ్చు. రెండవ వరుస సీట్లతో బూట్ స్థలం 580 లీటర్లు. సీట్లు ముడుచుకున్నప్పుడు బూట్ స్పేస్ 1,625 లీటర్ల వరకు పెరుగుతుంది. కావున ప్రయాణికులకు లగేజ్ ఉంచడానికి కావలసినంత స్థలం అందుబాటులో ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్
Dimensions Maserati Levante 350 GranSport
Length 5,003mm
Width 1,968mm
Height 1,679mm
Wheelbase 3,004mm
Boot Space 580-litres
ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇంజిన్ పర్ఫామెన్స్ & డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

మేము మసెరటి లెవాంటే యొక్క 350 గ్రాన్‌స్పోర్ట్ వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. ఇది 3.0-లీటర్, ట్విన్-టర్బో వి 6 తో పనిచేస్తుంది. ‘350' అనేది 350 పిఎస్ పవర్ అవుట్‌పుట్‌ను సూచిస్తుంది. ఇది 5,750 ఆర్‌పిఎమ్‌ వద్ద 345 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 - 4,750 ఆర్‌పిఎమ్‌ వద్ద 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కారు యొక్క ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మసెరటి లెవాంటే, ఫెరారీ ఇంజిన్‌పై ఆధారపడింది. ఈ కారు కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. లెవాంటే యొక్క గరిష్ట వేగం గంటకు 251 కి.మీ.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మాసెరటి లెవాంటే మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి నార్మల్, స్పోర్ట్, మరియు ఇంక్రీజ్డ్ కంట్రోల్ & ఎఫిషియెన్సీ (I.C.E). నార్మల్ మోడ్‌లో, రైడ్ సప్లిప్ మరియు స్పోర్ట్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ మూసివేయబడతాయి. ఈ మోడ్ నగరంలో డ్రైవింగ్ చేయడానికి బాగా సరిపోతుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇందులోని స్పోర్ట్ మోడ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ మోడ్ లో త్రాటల్ రెస్పాన్స్ పెరుగుతుంది. తెడ్ షిఫ్టర్లను ఉపయోగించి గేర్ల ద్వారా మారడం చాలా ఆనందంగా ఉంది. ఈ మోడ్‌లో డ్రైవింగ్ చాలా మంచి అనుభూతిని అందించింది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

ఇక ఇంక్రీజ్డ్ కంట్రోల్ & ఎఫిషియెన్సీ మోడ్ విషయానికి వస్తే, ఇది వినియోగదారులు SUV లోని సెట్టింగులను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. స్టీరింగ్ తేలికగా ఉండగానే సస్పెన్షన్ దృడంగా ఉంటుంది. ఇది పూర్తిగా డ్రైవర్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మసెరటి లెవాంటే 350 20 ఇంచెస్ వీల్స్ పై నడుస్తుంది, ఇది స్పోర్టిగా కనిపించడమే కాకూండా నిర్వహణకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో సస్పెన్షన్‌ సెటప్ అద్భుతంగా ఉండటం వల్ల ఇది ఎలాంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

మసెరటి లెవాంటే 350 బరువు 2,100 కేజీలు ఉన్నప్పటికీ, ఇది ఒక స్పోర్ట్స్ కార్ లాగా ఉంటాయి. ఇది ఆఫ్-రోడ్ మోడ్‌ను కూడా పొందుతుంది, ఇది ప్రారంభించిన వెంటనే దాని గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచుతుంది మరియు ఆఫ్ రోడింగ్ కి సిద్ధంగా ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఆఫ్-రోడ్ మోడ్‌లో 247 మిమీకి పెంచవచ్చు.

ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్:

భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎస్‌యూవీలలో మసెరటి లెవాంటే ఒకటి. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహనదారునికి ఎంతగానో అనుకూలంగా ఉంటాయి. మసెరటి లెవాంటేలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

 • అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్
 • లేన్ కీపింగ్ అసిస్ట్
 • సరౌండ్-వ్యూ కెమెరా
 • యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్
 • హిల్ డీసెంట్ కంట్రోల్
 • మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు
 • ఏబీఎస్ విత్ ఈబిడి
 • ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

  కీ ఫీచర్స్:

  • అడాప్టివ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు
  • సాఫ్ట్-క్లోజ్ డోర్స్
  • కీలెస్ ఎంట్రీ & గో
  • ఫుట్ సెన్సార్‌తో పవర్డ్ టెయిల్‌గేట్
  • క్వాడ్ ఎగ్జాస్ట్ అవుట్ లెట్
  • క్యూ 4 ఇంటెలిజెంట్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్
  • స్కైహూక్ సస్పెన్షన్
  • ప్రీమియం ఆడియో సిస్టమ్
  • డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్
  • మల్టిఫుల్ డ్రైవ్ మోడ్‌లు
  • ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

   మసెరటి లెవాంటే 350 వేరియంట్స్:

   మాసెరాటి లెవాంటే 350 రెండు వేరియంట్లలో లభిస్తుంది: అవి

   1. గ్రాన్‌లుసో
   2. గ్రాన్‌స్పోర్ట్
   ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

   మసెరటి లెవాంటే 350 ప్రత్యర్థులు:

   మసెరటి లెవాంటే 350 అనేది మార్కెట్లోని పోర్స్చే కయెన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

   ఇటాలియన్ బ్రాండ్ 'మసెరటి లెవాంటే 350' రివ్యూ; సూపర్ పవర్ & సూపర్ ఫీచర్స్

   డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

   మసెరటి లెవాంటే 350 ఈ విభాగంలో చెప్పుకోదగ్గ ప్రజాదరణ పొందిన ఎంపిక కాదు. కానీ ఒక ఖరీదైన మరియు లగ్జరీ కారు కొనుగోలు చేయదలచిన కస్టమర్లకు మాత్రం ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. మసెరటి లెవాంటే 350 ఒక ప్రాక్టికల్ ఎస్‌యూవీలాగ ఉన్నప్పటికీ క్షణంలో మంచి పర్ఫామెన్స్ కారుగా మారుతుంది. స్పోర్టి అనుభూతినిచ్చే శక్తివంతమైన ఎస్‌యూవీ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లైతే మీకు మసెరటి లెవాంటే 350 ఒక మంచి ఎంపిక అని ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
Maserati Levante 350 GranSport Review. Read in Telugu.
Story first published: Thursday, July 29, 2021, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X