మాసేరటి క్వాట్రోపోర్ట్ ఇటాలియన్ ‌కారును టెస్ట్ డ్రైవ్ చేసిన డ్రైవ్‌స్పార్క్ తెలుగు

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్ల తయారీ సంస్థలు ఉన్నప్పటికీ ఇటాలియన్ కార్ల కంపెనీలు కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజన్, రేసింగ్ హిస్టరీ వంటి వాటికి కొన్ని దశాబ్దాల కాలం పాటు ఇటాలియన్ కార్లు ప్రసిద్ది చెందినవి.

వాటిలో మాసేరటి ఒకటి, సుమారుగా 100 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఉన్న మాసేరటి స్పోర్టివ్ లగ్జరీ సెడాన్ మరియు రేసింగ్ కార్లను తయారు చేస్తూ వచ్చింది. అంతే కాదు, విభిన్నమైన పవర్ మరియు విభిన్నమైన డిజైన్‌లతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను అందిస్తూ వస్తోంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

తొలిసారి 1963లో జరిగిన టురిన్ మోటార్ షో వేదిక మీద నాలుగు డోర్లు ఉన్న లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ - క్వాట్రోపోర్ట్ ను ఆవిష్కరించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విప్లవాత్మక లగ్జరీ సెడాన్ కారులో నాలుగు సీట్లను అందించి వి8 ఇంజన్‌ను అందించింది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

లగ్జరీ, స్పోర్టివ్ మరియు స్టైలింగ్ వంటి అంశాలు మాసేరటి సంస్థకు ట్యాగ్‌లైన్‌గా చెప్పవచ్చు. చరిత్ర లేనిదే భవిష్యత్ ఉండదు. నిజమే మరి, 1963లో ఆవిష్కరించబడిన కారు ఇప్పటికీ కొనసాగుతోంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ కు కొనసాగింపుగా జిటిఎస్ లగ్జరీ సెడాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నలుగురు కూర్చునే సీటింగ్ సామర్థ్యం ఉన్న క్వాట్రోపోర్ట్ జిటిఎస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన లగ్జరీ సెడాన్‌గా నిలిచింది. మరి ఈ గొప్పంతా చరిత్ర పేజీలలోనేనా...? నిజజీవితంలో కూడా ఉందా....? అయితే ఆ వివరాలు నేటి రివ్యూలో తెలుసుకుందాం రండి...

డిజైన్

డిజైన్

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ ఎక్ట్సీరియర్ డిజైన్‌ను చూడగానే పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు, కానీ ఈ సెగ్మెంట్లో ఇదొక అద్బుతమైన రూపం. రోడ్డు ప్రక్కన పార్క్ చేసినా... లేదంటే రోడ్డు మీద పరుగులు పెట్టిస్తున్నా... మిగతా అన్నింటిలో కన్నా ఇది విభిన్నంగా ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో మేము ఎదుర్కొన్న సంఘటనల్లో ఇదీ ఒకటి. ఎక్కడ పార్క్ చేసినా కారు చుట్టూ గుంపులు గుంపులుగా గుమిగూడేవారు...

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

ఎక్ట్సీరియర్ డిజైన్‌లలో అత్యధికంగా ఆకర్షించే అంశాలు, ఫ్రంట్ గ్రిల్ మీద ఉన్న మాసేరటి క్రోమ్ లోగో, 20-అంగుళాల పరిమాణం ఉన్న ఫోర్జ్డ్ జిటిఎస్ సిల్వర్ వీల్స్; క్రోమ్-ప్లేటెడ్ స్టెయిన్ లెస్ స్టీల్ పూత పూయబడిన ట్విన్, డ్యూయల్ పైప్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు బ్రేక్ కాలిపర్లను ఎరుపు రంగుల్లో అందివ్వడం జరిగింది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

లగ్జరీకి మరో పేరు దీని ఇంటీరియర్ అని చెప్పవచ్చు. ఇందులో డ్యాష్ బోర్డుకు మధ్యలో కోడిగుడ్డు ఆకారంలో ఉన్న గడియారం, ప్రీమియమ్ ఫీల్ కల్పించే లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లు ఉన్నాయి. ఇంజన్ స్టార్ట్ బటన్, స్పోర్ట్ స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్ వంటివి ఉన్నాయి.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

ఇంటీరియర్‌లోని స్టాండ్ అవుట్ ఫీచర్ల విషయానికి వస్తే, డ్యాష్ బోర్డ్ మీద హై-గ్లాస్ కార్బన్ ఫినిష్ ట్రిమ్మింగ్ కలదు, ఇంటీరియర్ స్పేస్‌తో జర్మనీ కార్లయిన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌లతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఉంటుంది.

పనితీరు

పనితీరు

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ కేవలం 4.7 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఫెరారి తయారు చేసిన 3.8-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం 8-స్పీడ్ ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 523బిహెచ్‌పి పవర్ మరియు 710ఎన్ఎమ్ గరిష్ట టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

ఇంజన్ ఉత్పత్తి చేసే త్వరిత పవర్ మరియు టార్క్ డ్రైవర్లను భయబ్రాంతులకు గురిచేస్తుంది. కొన్ని సెకండ్ల కాలంలోనే భారీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ ధర రూ. 2.2 కోట్లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. దీనికి చెల్లించే ధరకు సమానమైన ఫీచర్లు, డిజైన్ లతో పాటు ఇంజన్ కూడా అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

డ్రైవింగ్ అనుభవం, క్వాట్రోపోర్ట్ జిటిఎస్ ఒక నిజమైన స్పోర్ట్ ఫోర్ సీటర్ సెడాన్ కారు, మరి రోజు వారి అవసరాలకు దీనిని చక్కగా ఉపయోగించవచ్చు. భారీ పరిమాణంలో, ఎక్కువ బరువున్న దీనికి స్పోర్టివ్ తరహా పవర్ మరియు అంతే సౌకర్యవంతమైన జర్నీ గురించి మొదట్లో ఆలోచించాల్సి వచ్చింది. అయితే శక్తివంతమైన వి8 ఇంజన్ మరియు స్కై హుక్ సస్పెన్షన్ సిస్టమ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

రోడ్డు మీద ఉన్న ఎగుడుదిగుడు అసమానతలను గ్రహించి సరైన క్రమంలో డ్యాంపింగ్ కల్పించడంలో స్కై హుక్ సస్పెన్షన్ సిస్టమ్ కీలక పాత్ర వహిస్తుంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

అత్యుత్తమ సౌకర్యవంతమైన జర్నీ కోసం ఇందులో యాక్సిలరేషన్ సెన్సార్లను అందివ్వడం జరిగింది. ఇవి ప్రతి చక్రం యొక్క కదిలకలు మరియు కారు బాడీ ప్రయాణాన్ని పసిగడుతుంటాయి.

డ్రైవింగ్ పరిస్థితులు, కారు వేగం, రోడ్డు ఉపరితలం యొక్క అసమానతలు వంటి వాటిని సెన్సార్లు స్కై హుక్ కంట్రోల్ యూనిట్‌కు చేరవేస్తాయి. ఈ వ్యవస్థ మొత్తం సమాచారాన్ని అంచనా వేసి, తదుపరి సురక్షితమైన జర్నీ కోసం అనుగుణంగా షాక్ అబ్జార్వర్లను అడ్జెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ నిరంతరం క్షణాల్లో జరిగిపోతుంటుంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లో ఐదు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి; ఆటో నార్మల్, ఆటో స్పోర్ట్, మ్యాన్యువల్ నార్మల్, మ్యాన్యువల్ స్పోర్ట్ మరియు ఐ.సి.ఇ(ఇంప్రూవ్డ్ కంట్రోల్ మరియు ఎఫీషియన్సీ). స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా స్పోర్టివ్ డ్రైవింగ్ మోడ్ సెలక్ట్ చేసుకోవచ్చు.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

మృదువైన సస్పెన్షన్ మరియు అత్యుత్తమ సౌకర్యవంతమైన జర్నీ కోసం నార్మల్ మోడ్ ఎంచుకోవచ్చు, దీనిని రొటీన్ డ్రైవింగ్ పరిస్థితుల్లో సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక రేసింగ్ ప్రియులకు, ఎక్కువ పవర్‌లో డ్రైవింగ్ చేయాలనుకునే వారు స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసి స్పోర్టివ్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

మొత్తం ఐదు డ్రైవింగ్ మోడ్‌లలో ఐ.సి.ఇ మరొక ఎత్తు, ఎకో డ్రైవ్‌ను ఆఫర్ చేసే దీనిని ఐ.సి.ఇ అంటారు. స్టీరింగ్ వినియోగం మరియు యాక్సిలరేటర్ వినియోగం మీద ఈ ఐ.సి.ఇ మోడ్ ఆధారపడి ఉంటుంది. ఈ మోడ్‌లో తక్కువ ఉద్గారాలు మరియు ఎక్కువ మైలేజ్ సాధ్యం అవుతుంది. జారుడు స్వభావం ఉన్న రోడ్ల మీద టైర్లు అనవసరంగా తిరగకుండా ఐ.సి.ఇ మోడ్ వీల్ స్పిన్‌ను అరికడుతుంది.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్

క్వాట్రోపోర్ట్ జిటిఎస్‌లో ఉన్న టైర్లు అత్యుత్తమ హ్యాండ్లింగ్ గొప్ప న్యాయం చేస్తాయి. ముందు వైపు ఉన్న 245/40 ఆర్20 మరియు వెనుక వైపున 285/40 ఆర్20 టైర్లు మంచి రోడ్ గ్రిప్ కల్పిస్తూ, స్కిడ్ మరియు స్లిప్ అవ్వకుండా ఖచ్చితమైన స్టీరింగ్ ఫలితాన్ని ఇస్తాయి.

బ్రేకింగ్ మరియు యాక్సిలరేటింగ్ సమయంలో కారు అసమైన బరువుకు గురికాకుండా బెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనే ఫీచర్ కల్పించింది. అత్యుత్త సస్పెన్షన్ సిస్టమ్ మరియు 50:50 నిష్పత్తిలో ఉన్న వెయిట్ డిస్ట్రిహబ్యూషన్ ఫీచర్ కలదు. క్వాట్రోపోర్ట్ మొత్తం బరువు 1900కిలోలు మరియు 5.26 మీటర్ల పొడవు కలదు.

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

 • ఇంజన్: టైప్ వి8, ట్విన్-టుర్బో
 • సామర్థ్యం: 3,799సీసీ
 • పవర్: 523బిహెచ్‌పి @ 6,800ఆర్‌పిఎమ్
 • టార్క్: 650ఎన్ఎమ్ @ 2,000-4,000ఆర్‌పిఎమ్
 • గేర్‌బాక్స్: 8-స్పీడ్ ఆటోమేటిక్
 • 0 నుండి 100 కిమీల వేగం: 4.7-సెకండ్లలోనే
 • గరిష్ట వేగం: గంటకు 310కిలోమీటర్లు
 • తీర్పు

  తీర్పు

  మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ లగ్జరీ సెడాన్‌లో పానమెరా ఫీచర్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ తరహా సంపూర్ణమైన డిజైన్ లేదు. ఒక వేళ మీరు నాలుగు డోర్లతో, రేసింగ్ లక్షణాలున్న ఇంజన్ ఫీచర్ గల లగ్జరీ స్పోర్టివ్ సెడాన్ కారును ఇష్టపడే వారైతే - మీకు మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ విభిన్నమైన లగ్జరీ సెడాన్ ఉత్పమ ఎంపిక!

  డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

  డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

  తరం మారే కొద్దీ డ్రైవర్లు మాసేరటి బ్రాండ్ ఉత్పత్తుల ప్రేమలో పడిపోయారనేది జగమెరిగిన సత్యం. ఇందుకు సరైన ఉదాహరణ మేము డ్రైవ్ చేసిన క్వాట్రోపోర్ట్ జిటిఎస్. ఇటాలియన్ డిజైన్ స్టైల్, పనితీరు, ఖచ్చితత్వం మరియు అద్బుతమైన సౌండ్ ఇంజనీరింగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్ఫెక్ట్ ఇటాలియన్ జాబ్.

Most Read Articles

English summary
Read In Telugu Maserati Quattroporte GTS First Drive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X