భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: మెర్సిడెస్ బెంజ్ EQC 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రోజు రోజుకి రోడ్లపై వాహనాల సంఖ్య ఎక్కువైపోతుండటంతో సహజవనరులు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఈ సహజ వనరులతో నడిచే వాహనాల వల్ల కాలుష్యం కూడా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. ఇది భవిష్యత్ తరాలకు ఏ మాత్రం మంచిది కాదు. వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి వాహన తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉత్పత్తిచేస్తున్నస్తారు. ఇందులో నుంచి పుట్టుకొచ్చినదే ఎలక్ట్రిక్.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

గత కొన్ని సంవత్సరాలుగా, ఎక్కువ మంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. చాలా మంది వాహనతయారీదారులు ఇప్పటికే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ విభాగం ఇటీవలి కాలంలో మరింత వేగంగా పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా పుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రవేశపెట్టింది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మెర్సిడెస్ బెంజ్ తమ ఎలక్ట్రిక్ ఆఫర్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన సరికొత్త కార్ల తయారీ సంస్థ. జర్మనీ బ్రాండ్ ఇక్యూసి 400 అని పిలువబడే పుల్ ఎలక్ట్రిక్ మోడల్‌ను ప్రవేశపెట్టిన దేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ కార్ల తయారీదారు ఇది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కంపెనీ ఈ నెల మొదట్లో రూ. 99.3 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో ఇక్యూసి 400 ను విడుదల చేసింది. మేము ఒక రోజు ఈ ఎస్‌యూవీ ను డ్రైవ్ చేసాము. ఇది మాకు నిజంగా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఈ కొత్త ఇక్యూసి 400 యొక్క ఫస్ట్ డ్రైవ్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఎక్స్టీరియర్ మరియు డిజైన్ :

మొదటి చూపులో ఇక్యూసి యొక్క రూపకల్పన భారతదేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మరొక ఎస్‌యూవీతో బాగా తెలిసినట్లు మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఇక్యూసి ప్రాథమికంగా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్‌లలో చేసిన మార్పులు ప్రామాణిక జిఎల్‌సి మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇక్యూసి ముందు భాగంలో కనిపించే ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్లు కొన్ని బ్లూ ఆక్సెంట్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కారు యొక్క ఇవి స్వభావాన్ని సూచిస్తుంది. కార్నరింగ్ లైట్‌తో సహా అన్ని కూడా ప్రొజెక్టర్ సెటప్‌ను కలిగి ఉంటాయి. మీరు వాహనం యొక్క గ్రిల్ చుట్టూ క్రోమ్ యొక్క సరసమైన మొత్తాన్ని కూడా పొందుతారు. క్రోమ్ ఆక్సెంట్స్ తో పాటు, ఈ కారు పియానో ​​బ్లాక్ ట్రిమ్‌లను కూడా పొందుతుంది, ఇది ఎస్‌యూవీ యొక్క మొత్తం రూపాన్ని పూర్తి చేస్తుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బంపర్ యొక్క దిగువ భాగంలో కారు యొక్క సైడ్స్ ద్వారా గాలిని ప్రసారం చేసే కొన్ని వెంట్స్ ఉంటాయి. అలాగే రెండు హెడ్‌లైట్‌లను కలిపే గ్రిల్ పైన, వాహనం యొక్క డిఆర్ఎల్ తో కూడిన లైట్ స్ట్రిప్ ఉంది. వాహనం యొక్క లో బీమ్ ఆన్ చేయబడినప్పుడు ఆ లైట్ స్ట్రిప్ ఆన్ అవుతుంది, మిగిలిన సమయంలో అది ఆపివేయబడుతుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కార్ యొక్క సైడ్స్ కి వెళ్లేకొద్దీ 20 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. ఇవి మొత్తం ఎస్‌యూవీ పరిమాణంతో ఎక్కువగా ఉంటాయి. ఇది 10 స్పోక్స్, 5 హెడ్‌లైట్లలో ఉన్న అదే బ్లూ ఆక్సెంట్స్ తో బ్లాక్ కలర్ లో పూర్తయ్యాయి. 360 డిగ్రీల పార్కింగ్ ఫీచర్ కోసం ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ మరియు దానిపై కెమెరాను కలిగి ఉన్న ORVM లను బ్లాక్ కలర్ లో పూర్తి చేయబడి ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇప్పుడు ఇక్యూసి మరియు 1886 అని చెప్పే ఫ్రంట్ ఫెండర్‌కు ఇరువైపులా బ్యాడ్జ్ ఉంటుంది. ఆ 1886 దేనిని సూచిస్తుందంటే, కార్ల్ బెంజ్ జనవరి 1886 లో మొట్టమొదటి కారును తయారు చేశాడు. బెంజ్ పేటెంట్ మోటర్‌వ్యాగన్, ఇది మొదటి ఆటోమొబైల్‌గా విస్తృతంగా అప్పట్లో పరిగణించబడింది. ఇప్పుడు ఇక్యూసి సంస్థ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ కనుక, ఈ బ్యాడ్జ్ కారుపై ఉంచబడింది. ఇది బయట మాత్రమే కాదు, 1886 బ్యాడ్జ్ ముందు సీట్లలో మరియు ఫ్లోటింగ్ డాష్‌పై కూడా ఉంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ ఇక్యూసి ఎస్‌యూవీ సైడ్స్ లో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ చాలా మినిమాలిక్ బాడీ లైన్‌లను పొందుతుంది. ఇది జిఎల్‌సికి చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. మీరు డోర్ హ్యాండిల్స్‌పై మరియు విండోస్ చుట్టూ కొన్ని క్రోమ్ ఆక్సెంట్స్ కూడా పొందుతారు మరియు ఇది సైడ్ స్టెప్ బోర్డ్‌ను కూడా పొందుతుంది, ఇది వాహనం లోపలికి మరియు బయటికి రావడం సులభం చేస్తుంది. వాహనం పైకప్పు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది బ్లాక్ కలర్ లో పూర్తవుతుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కారు యొక్క వెనుక భాగం గమనించినట్లయితే వెనుక వైపు నుండి కూడా ఎస్‌యూవీ జిఎల్‌సి మోడల్‌తో సమానంగా కనిపిస్తుంది. మీరు బూట్ అంతటా నడుస్తున్న లైట్ స్ట్రిప్‌తో కలిసిన సొగసైన ఎల్ఇడి టైల్లైట్‌లను పొందుతారు. మళ్ళీ, ‘EQC 400' మరియు ‘4MATIC 'బ్యాడ్జ్‌ల రూపంలో కొంచెం క్రోమ్ ఇక్కడ చూడవచ్చు. బంపర్ యొక్క దిగువ భాగం దూరం నుండి ఎగ్జాస్ట్ కటౌట్‌ల వలె కనిపించే క్రోమ్ లైన్స్ కూడా పొందుతుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్ & ఫీచర్స్ :

ఇక్యూసి ఎస్‌యూవీ యొక్క లోపలికి అడుగు పెట్టగానే ఇది జిఎల్‌సిని మరోసారి మీకు గుర్తు చేస్తుంది. క్యాబిన్ విశాలమైనది మరియు భారీ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది కావున ఎక్కువ గాలిని లోపలి అందిస్తుంది. డాష్‌బోర్డ్ ఒకే టోన్ బ్లాక్‌ కలర్ లో పూర్తయింది, కాని ఎసి వెంట్స్ ఇప్పుడు గుండ్రని ఆకారంలో లేవు. మధ్యలో ఉన్నవి క్షితిజ సమాంతరంగా ఉంటాయి మరియు దాని ప్రక్కన ఉన్నవి నిలువుగా ఉంటాయి. వెంట్స్ కూడా కాపర్ షేడ్ లో పూర్తయ్యాయి.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డాష్ యొక్క మధ్యలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు కొనసాగడంతో ఒకే ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది కానీ ఇది రెండుగా విభజించబడింది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగుంది, అంతే కాకుండా వాహనం గురించి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది. మరోవైపు ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మెర్సిడెస్ ఎమ్‌బియుఎక్స్ టెక్నాలజీ స్టాండర్డ్ గా లభిస్తుంది. ఇక్యూసి బర్మెస్టర్ నుండి సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది డ్రైవింగ్ సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి ఉంటుంది. ఇది జిఎల్‌సి నుండి తీసుకోబడింది. ఈ స్టీరింగ్ వీల్ మంచి పట్టును అందిస్తుంది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను నిర్వహించే మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వంపు మరియు టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ రెండింటికీ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సీట్లు డార్క్ బ్లూ మరియు బ్లాక్ కలర్ తో కూడిన డ్యూయల్-టోన్ షేడ్ లో పూర్తయ్యాయి మరియు చాలా సౌకర్యంగా ఉంటాయి. 1886 బ్యాడ్జ్ కారు హెడ్‌రెస్ట్ దగ్గర స్టిచ్చింగ్ చేయబడి ఉంటుంది. డ్రైవర్ మరియు ప్యాసింజర్లు ఇద్దరూ మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ చేయగల సీట్లను అందుకుంటారు. రెండు సీట్లు మసాజ్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి కాని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ద్వారా యాక్టివేట్ చేయాలి.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మధ్య వరుస సీట్లు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్యూసి త్రి-జోన్ క్లైమేట్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. ఇది క్యాబిన్‌ను వేగంగా చల్లబరుస్తుంది. సెంటర్ ట్రాన్స్మిషన్ టన్నెల్ కొంచెం ఎక్కువగా ఉంది మరియు మధ్య ప్రయాణీకుడు కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు. రెండవ వరుస సీట్లు ఇద్దరు ప్రయాణీకులకు బాగా సరిపోతుంది. ముందు సీట్ల వెనుక భాగంలో ఛార్జింగ్ సాకెట్లు మరియు కోట్ హ్యాంగర్ ఉన్నాయి.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇక్యూసి 400 సుమారు 500 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. లగేజ్ కోసం ఎక్కువ స్థలం అవసరమైతే మధ్య వరుసను మడవవచ్చు. ఇందులో ఉన్న బూట్ క్యాప్ ఎలక్ట్రానిక్.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవింగ్ ఇంప్రెషన్స్ మరియు హ్యాండ్లింగ్ :

ఇక్యూసి 400 యొక్క అక్సెల్ కి ఇరువైపులా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కారు కింద ఉంచబడుతుంది. ఇక్యూసి లోని మొత్తం ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ 405 బిహెచ్‌పి శక్తిని మరియు 765 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒకే ఛార్జీపై 470 కిలోమీటర్ల పరిధిని అందించగలదని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది. కానీ ఇది వాస్తవానికి టెస్టింగ్ సమయంలో మనం 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలము.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కారు భారీగా ఉన్నందున ఇక్యూసి 5.1 సెకన్లలో 0 - 100 కి.మీ / గం నుండి కాటాపుల్ట్ చేయగలదు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 200 కి.మీ / గం టాప్ స్పీడ్‌ను కూడా అందిస్తుందని చెబుతున్నారు. గేర్లు మార్చడానికి పాడిల్ షిఫ్టర్లు ఉపయోగించబడవు, ఎందుకంటే అవి ఏవీ లేవు, కానీ అవి రీజనరేటివ్ లెవెల్స్ నిర్ణయిస్తాయి. ఇందులో లో, మీడియం మరియు హై మరియు రీజనరేటివ్ సెట్టింగ్‌ను స్విచ్-ఆఫ్ చేయడానికి కూడా ఒక ఎంపిక ఉంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మన్నిక విషయానికొస్తే, ఎస్‌యూవీ రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని అందిస్తుంది. తక్షణమే లభించే టార్క్ మొత్తం పవర్ట్రెయిన్ నష్టాలు లేనందున ఇది తక్షణమే లభిస్తుంది మరియు మోటార్లు నేరుగా చక్రాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఇందులో ఎకో, కంఫర్ట్, డైనమిక్ మరియు ఇండ్యూజువల్ అనే డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో డ్రైవ్ మోడ్ లో మీరు మంచి పరిధిని పొందుతారు కాని థొరెటల్ రెస్పాన్స్ మరియు స్టీరింగ్ వీల్ చాలా తేలికగా ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మరోవైపు డైనమిక్ మోడ్‌లో, థొరెటల్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది. అంతే కాకుండా స్టీరింగ్ వీల్ కూడా కొంచెం కఠినంగా మారుతుంది. ఇందులో ఉత్తమమైనది కంఫర్ట్ మోడ్, ఇది మిగతా రెండు మోడ్‌ల మధ్య సమతుల్యతను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇక్యూసిలో సస్పెన్షన్ సెటప్ రెండు విషయాలను కలిగి ఉంటుంది, ముందు భాగంలో రెగ్యులర్ కాయిల్-ఓవర్లు మరియు వెనుక భాగంలో ఎయిర్ సస్పెన్షన్. అంటే రెండవ వరుసలోని కంఫర్ట్ లెవెల్ ముందు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కారుపై చాలా తక్కువ బాడీ రోల్ ఉంది మరియు మీరు దానిని కొన్ని మూలల ద్వారా తీసుకుంటే, ఎస్‌యూవీ వాటిని ఎంత చక్కగా నిర్వహిస్తుందో మీరు ఆశ్చర్యపోతారు. ఎస్‌యూవీకి 142 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇక్యూసిలో స్టీరింగ్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది మరియు ఇందులోని టైర్ ప్రొఫైల్ 255/45 / ఆర్20, ఇవి చాలా వెడల్పుగా ఉంటాయి మరియు అద్భుతమైన పట్టును అందిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, మీరు కదలికలో ఉన్నప్పుడు రోడ్ మరియు టైర్ శబ్దం తప్ప ఇతర శబ్దం ఉండదు. ఇక్యూసి యొక్క ఇన్సులేషన్ & NVH లెవెల్స్ అద్భుతమైనవి కాబట్టి ఇది కూడా ఎక్కువగా వినబడదు. కాబట్టి క్యాబిన్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇప్పుడు ఇక్యూసి 400 లో మల్టిపుల్ ఛార్జింగ్ అప్సన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది బేసిక్ వాల్ సాకెట్ ఛార్జర్, ఇది బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 20 గంటలు పడుతుంది. తరువాతది ఎసి ఛార్జర్. దీని ద్వారా ఈ ఎస్‌యూవీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటలు పడుతుం. చివరిది ఫాస్ట్ ఛార్జర్, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 90 నిమిషాలు లేదా 1 గంట 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపిక కోసం, మీరు ప్రత్యేక అనుమతి మరియు హెవీ డ్యూటీ లైన్లను పొందాలి.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 జిఎల్‌సి వేరియంట్‌పై ఆధారపడినప్పటికీ కంటికి ఆకర్షణీయమైన వైఖరిని కలిగిస్తుంది. అలాగే ఇక్యూసి 400 భారత మార్కెట్లో బ్రాండ్ నుండి వచ్చిన మొట్టమొదటి పుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ సమయంలో దీనికి ప్రత్యర్థులు లేరు, అయితే ఇది త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీకి ప్రత్యర్థిగా అనే అవకాశం ఉంటుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ : మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బెంజ్ ఇక్యూసి అనేక ఫీచర్స్ అందిస్తుంది మరియు మంచి హ్యాండ్లర్ కూడా. పూర్తి స్థాయి 4 ఎక్స్ 4 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావడం వల్ల ఈ వెహికల్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ పొందగలదని మేము ఆశిస్తున్నాము. కాబట్టి, మీరు ఒక ఫ్యాన్సీ కారు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లైతే, అంతే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలనుకుంటే మీకు ఖచ్చితంగా మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Mercedes-Benz EQC 400 4MATIC First Drive Review. Read in Telugu.
Story first published: Wednesday, October 28, 2020, 19:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X