మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz), ఆటోమోటివ్ ప్రపంచంలో లగ్జరీ మరియు టెక్నాలజీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ బ్రాండ్ ఇటీవలే పూర్తిగా భారతదేశంలో అసెంబుల్ చేయబడిన ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 (Mercedes EQS 580) విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ 'మేడ్ ఇన్ జర్మనీ' మరియు 'అసెంబుల్డ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ కారును మా డ్రైవ్‌స్పార్క్ బృందం పూనే రోడ్లపై పరీక్షించింది. మరి ఈ ఆల్-ఎలక్ట్రిక్ లగ్జరీ కారు భారతీయ రోడ్లు అందించే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలదా..? తెలుసుకుందాం రండి..!

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ బెంజ్ మొదటిసారిగా తమ ఈక్యూఎస్ లగ్జరీ కారుని ఏప్రిల్ 2021లో భారతదేశంలో ఆవిష్కరించింది. ఆ సమయంలో ఆల్-ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్‌తో భారత ఈవీ సెగ్మెంట్‌ను పునర్నిర్వచించబోతున్నామని కంపెనీ పేర్కొంది. కంపెనీ చెప్పినట్లుగానే, ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్, లగ్జరీ ఇంటీరియర్స్, సౌకర్యంతమైన డ్రైవ్, కళ్లు మిరుమిట్లు గొలిపే డిజైన్ మరియు సాటిలేని డ్రైవింగ్ రేంజ్‌తో కొత్త 2022 మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 మన ముందుకు వచ్చింది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారును ఈవీ సూట్‌లో ఎస్-క్లాస్‌ సెడాన్‌గా అభివర్ణించవచ్చు. సాధారణంగా, మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పెట్రోల్/డీజిల్ ఆధారిత సెడాన్ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైనది మరియు విలాసవంతమైనది ఎస్-క్లాస్ (S-Class). ఇది ఏ ఇతర మెర్సిడెస్ కార్లలో లోని ఫీచర్లు మరియు విలాసాలతో, ఈ సెగ్మెంట్లో కెల్లా రారాజుగా నిలుస్తుంది. అంటే, కొత్త ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్ కూడా ఎస్-క్లాస్ మాదిరిగానే డ్రైవింగ్ డైనమిక్స్ మరియు లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 - ఎక్స్టీరియర్ డిజైన్

మెర్సిడెస్ బెంజ్ ఇంజనీర్లు సృష్టించిన ఏ డిజైన్‌ కైనా సరే మనం ప్రత్యేకంగా పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్ విషయంలోనూ అంతే. మెర్సిడెస్ ఈక్యూఎస్ కోసం కంపెనీ సాధారణ త్రీ-బాక్స్ డిజైన్‌ స్టైల్‌ను వదిలివేసి, దానికి బదులుగా గాలి వాటాన్ని సజావుగా తగ్గించడానికి రూపొందించిన లిఫ్ట్‌బ్యాక్-స్టైల్ డిజైన్‌ను ఎంచుకుంది. ఈక్యూఎస్ పరిమాణంలో చాలా పెద్దదిగా కనిపించినప్పటికీ, దాని కనిష్ట ఓవర్‌హాంగ్‌లు మరియు మృదువైన శరీరం కేవలం 0.20 Cd వద్ద అత్యల్ప డ్రాగ్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో, యాంగ్యులర్‌గా ఉండే షార్ప్ హెడ్‌లైట్‌లు, చిన్న లైట్ బార్ ఉంటాయి మరియు ట్రెడిషన్ గ్రిల్ స్థానాన్ని పియానో బ్లాక్ ప్యానెల్‌తో రీప్లేస్ చేయబడి ఉంటుంది. ఈ ప్యానెల్ పై మధ్యలో ఒక పెద్ద మెర్సిడెస్ బెంజ్ త్రీ-పాయింటెడ్ స్టార్‌ లోగో ప్రధానంగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదొక ఇల్యుమినేటెడ్ లోగో. అంటే, రాత్రివేళల్లో ముందు వైపు ఉండే ఈ పెద్ద మెర్సిడెస్ బెంజ్ లోగో ప్రకాశిస్తూ, కారుకి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈక్యూఎస్‌లోని పవర్‌ట్రెయిన్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడేందు ముందు బంపర్ దిగువ విభాగం మధ్యలో ఓ పెద్ద ఎయిర్ వెంట్ ఉంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ యొక్క బానెట్ ఒక క్లామ్‌షెల్ యూనిట్, ఇది అందరికీ ఓపెన్ కాదు. మెర్సిడెస్ బెంజ్ యొక్క సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్లు) మాత్రమే దీనిని తెరవగలరు. ఈ బానెట్‌తో పాటు భారీగా ర్యాక్ చేయబడిన విండ్‌స్క్రీన్ మరియు ఏటవాలుగా ఉండే రూఫ్‌లైన్ కారుకి మంచి ఏరోడైనమిక్స్‌ను జోడిస్తాయి మరియు డ్రాగ్‌ను తగ్గించడంలో సహకరిస్తాయి.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఫ్రంట్ బానెట్ ఓపెన్ కాదు కదా, మరి విండ్‌షీల్డ్ వాషర్స్ కోసం ఫ్లూయిడ్ నింపాలంటే ఎలా అనే సందేహం మీకు రావచ్చు. ఇందులో క్లోజ్డ్-ఆఫ్ బానెట్ కారణంగా, విండ్‌స్క్రీన్ వాషర్ ఫ్లూయిడ్‌ను టాప్ అప్ చేయడంలో సహాయపడటానికి మెర్సిడెస్ ఈక్యూఎస్ యొక్క ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్‌పై కంపెనీ ఇంజనీర్లు ఓ ఫ్లాప్‌ను అమర్చారు. ఈ ఫ్లాప్ ను ఓపెన్ చేయడం ద్వారా వాహన యజమానులు తమ విండ్‌షీల్డ్ ఫ్లూయిడ్‌ని టాప్-అప్ చేసుకోవచ్చు. ఇక ఈ కారు సైడ్ డిజైన్ లో కనిపించే హైలైట్‌లలో పిరెల్లీ టైర్లతో కూడిన ఏరోడైనమిక్ 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో కూడిన ఫ్రేమ్‌లెస్ డోర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ వెనుక భాగంలో పెద్ద లైట్‌బార్ స్టైల్ టైల్‌లైట్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తాయి మరియు ఇవి ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌కు ప్రత్యేక రూపాన్ని జోడించడంలో సహకరిస్తాయి. బూట్ పై ఉండే చిన్న స్పాయిలర్ ఎలిమెంట్ మరియు వెనుకవైపు ఉన్న పెద్ద మెర్సిడెస్ బ్యాడ్జ్‌లు కూడా ఇక్కడ హైలైట్‌గా నిలుస్తాయి. వెనుక వైపు బూట్ డోరును ఓపెన్ చేయడానికి ఎలాంటి డోర్ హ్యాండిల్ కనిపించదు. దానికి బదులుగా, మెర్సిడెస్ బెంజ్ బ్యాడ్జ్‌ను నొక్కడం ద్వారా బూట్‌ని ఓపెన్ చేయవచ్చు. ఇది 610 లీటర్ల భారీ బూట్‌ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 - ఎక్స్టీరియర్ డిజైన్ మరియు ఫీచర్లు

ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను ఓపెన్ చేసి మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారులోకి ప్రవేశించగానే, ఫ్యూచరిస్టిక్ కాక్‌పిట్ స్టైల్ క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇది మీకు ఓ స్టార్‌షిప్‌ లోకి ప్రవేశించిన అనుభూతిని అందిస్తుంది. హాలీవుడ్ చిత్రాలలో చూసినట్లుగా, ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్లు చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. మొత్తం డ్యాష్‌బోర్డును కవర్ చేస్తున్నట్లుగా అనిపించే భారీ 56 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈ స్క్రీన్ సెటప్‌ను 'హైపర్‌స్క్రీన్'గా పిలుస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

నిజానికి, ఈ హైపర్‌స్క్రీన్ ఒకే గాజు పేన్ కింద ఉండే మూడు విభిన్న డిస్‌ప్లే యూనిట్లను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్‌లలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరి కోసం రెండు 12.3 ఇంచ్ డిస్‌ప్లేలు యూనిట్లు మరియు మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు HVAC కంట్రోల్ కోసం పెద్ద 17.7 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్‌లు ఉంటాయి. మెర్సిడెస్ బెంజ్ హైపర్‌స్క్రీన్ హై-రెజల్యూషన్ గ్రాఫిక్స్‌ని అందించడానికి మరియు వేగంగా ప్రతిస్పందించడానికి ఇందులో 8-కోర్ ప్రాసెసర్ మరియు 24GB RAM కూడా ఉంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈ మూడు డిస్‌ప్లేలు కూడా మెర్సిడెస్ MBUX సెటప్ ద్వారా పనిచేస్తాయి. పూర్తిగా సెన్సార్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఈ కారు మనం హాలీవుడ్ చిత్రాలలో చూసే సైన్-ఫిక్షన్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్లను కంట్రోల్ చేస్తూ డ్రైవర్ పరధ్యానానికి గురికాకుండా ఉండేందుకు, ఇందులో ఏఐ ఆధారిత టెక్నాలజీలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్ ముందున్న రహదారిపై దృష్టి సారిస్తుందని నిర్ధారిస్తాయి.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

వీటిలో ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే చాలా పెద్దది (17.7 ఇంచ్) మరియు దీనిని నావిగేట్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. ఈ కారులో మీరు నావిగేషన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకు ముందు ఉన్న రహదారి యొక్క నిజ-సమయ వీక్షణ (రియల్ టైమ్ వ్యూయింగ్)ను అందించడానికి ఈ కారులోని కెమెరాల నుండి వీడియోను ఫిల్టర్ చేయవచ్చు. కారు యజమానులు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి, ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో ఇన్ఫోటైన్‌మెంట్‌కి రిమోట్‌గా లింక్ చేయవచ్చు.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఇన్ఫోటైన్‌మెంట్ లోని అనేక ఫీచర్లను సులువుగా కంట్రోల్ చేయడం కోసం స్టీరింగ్ వీల్‌పై బహుళ కంట్రోల్ బటన్స్ ఉంటాయి. అసలు, ఇవన్నీ వాడకుండా కేవలం డ్రైవర్ గొంతుతో ఇచ్చే కొన్ని వాయిస్ కమాండ్స్ సాయంతో ఎలాంటి కష్టం లేకుండా అనేక ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. హే సిరి, అలెక్సా, ఓకే గూగుల్ వంటి వాయిస్ కమాండ్స్ మాదిరిగానే ఈ కారులో 'హే మెర్సిడెస్' అనే క్యాచ్‌ఫ్రేజ్‌తో కూడిన వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్‌ని అందించారు.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారులోని ముందు సీట్లు చాలా ఖరీదైనవి మరియు అంతే సౌకర్యవంతమైనవి. కొత్త ఈఎక్యూస్ కారులోని ముందు సీట్ల కన్నా వెనుక సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి, ఓ ఎగ్జిక్యూటివ్ కారులో లేదా బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతారో, ఈ కారులోని వెనుక సీట్లలో కూడా అలాంటి అనుభూతి పొందుతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెనుక వైపు ముగ్గురి కోసం స్థలం ఉన్నప్పటికీ, ఇందులో ఇద్దరు మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించగలరు. చాలా మంది వెనుక వైపు మధ్యలో ఉండే సీటులో కూర్చోవడానికి బదులుగా, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌ను క్రిందకు దించి, దానిపై అమర్చిన ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్‌ను ఉపయోగించడానికే ఎక్కువగా ఇష్టపడుతారనేది మా అభిప్రాయం.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ వెనుక వైపు వాలుగా ఉన్న రూఫ్‌లైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, వెనుక సీట్లలోని ప్రయాణీకులకు కంపెనీ ఎక్కడా అసౌకర్యాన్ని కలిగించలేదు. ప్రయాణీకులకు తగినంత లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌ని అందించేలా క్యాబిన్ లేఅవుట్ డిజైన్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులో భారీ పానోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది, ఇది చూడటానికి ఓ కన్వర్టిబల్ కారును నడుపుతున్న అనుభూతినిని అందిస్తుంది. ఈ సన్‌రూఫ్ ఇంటీరియర్స్ లోపలికి అనుమతించే కాంతితో మరింత పెద్దదిగా అనిపించేలా చేస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు అనేక ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) లతో కూడిన ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో ఉన్న మరొక అద్భుతమైన సేఫ్టీ ఫీచర్ ఏమిటంటే, దాని రాక గురించి పాదచారులను హెచ్చరించడానికి గంటకు 30 కిమీ కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అది ఉత్పత్తి చేసే కృత్రిమ హమ్మింగ్ శబ్దం. ఇది చదివి తెలుసుకోవడం కన్నా నేరుగా విని తెలుసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 - స్పెసిఫికేన్లు, కొలతలు

ఇక అసలు విషయాలైన పవర్, పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్ వంటి విషయాలకు వస్తే, మెర్సిడెస్ ఈఎక్యూఎస్ 580 ఒక ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (ఫ్రంట్ యాక్సిల్‌పై ఒకటి మరియు రియర్ యాక్సిల్‌పై ఒకటి) ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 516 బిహెచ్‌పి శక్తిని మరియు 855 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో ఒకే-స్పీడ్‌తో కూడిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది, ఇది ఈవీ పవర్‌ట్రైన్ నుండి వచ్చే శక్తిని ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మరి, ఈ రెండు యాక్సిల్స్‌పై ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేయాలంటే బోలెడంత శక్తి ఉన్న బ్యాటరీ ప్యాక్ అవసరం కదా. అందుకే, ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారులో భారీ 107.8kWh (ఉపయోగించదగిన) బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు భారతదేశంలో లభిస్తున్న ఏ ఎలక్ట్రిక్ కారులోనూ ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించలేదు. ఇది పూర్తి చార్జ్ పై ARAI యొక్క MIDC టెస్టింగ్ సైకిల్ ప్రకారం 857 కిమీల (WLTP ప్రకారం 676 కిమీ) రేంజ్‌ను అందిస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

రియల్ వరల్డ్‌లో మెర్సిడెస్ ఈఎక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించినా, ప్రస్తుతం అది పెద్ద రికార్డే అని చెప్పాలి. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఈ భారీ బ్యాటరీ ప్యాక్ 200kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ, మీరు మనదేశంలో ఇలాంటి సూపర్ ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌లెట్‌ను కనుగొంటే, మీ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 31 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు రీఛార్జ్ చేసుకోవ్చచు. ఈ సూపర్ ఫాస్ట్ చార్జ్ కాకుండా, ఇది వేగవంతమైన 22kW త్రీ-ఫేజ్ AC ఛార్జర్‌తో కూడా లభిస్తుంది. ఈ చార్జర్ సాయంతో కేవలం కొన్ని గంటలలోనే దీనిని 10 నుండి 100 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారును ఈ జర్మన్ కార్ బ్రాండ్ యొక్క అల్యూమినియం-ఇంటెన్సివ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్ (EVA) ఆధారంగా రూపొందించారు. ఈ కారు తయారీలో అత్యధికంగా తేలికపాటి అల్యూమినియం మెటీరియల్‌ను ఉపయోగించినప్పటికీ, దీని బరువును మాత్రం అదుపులో ఉంచలేకపోయారు. ఇది సుమారు 2.5 టన్నులకు పైగా బరువు ఉంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 పొడవు 5126 మిమీ, వెడల్పు 1926 మిమీ, ఎత్తు 1512 మిమీ, వీల్‌బేస్ 3210 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 134 మిమీ మరియు మొత్తం బరువు 2585 కేజీలుగా ఉంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈక్యూఎస్ 580 అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది, ఇది డ్రైవర్ ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్ (ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ లేదా ఇండివిడ్యువల్) ను బట్టి దాని సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో నాలుగు-లింక్ సెటప్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో మల్టీ-లింక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై 255/45 R20 ప్రొఫైల్ పిరెల్లి టైర్లు అమర్చబడి ఉంటాయి.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 - డ్రైవింగ్ ఇంప్రెషన్స్

ఈక్యూఎస్ 580 డ్రైవింగ్ డైనమిక్స్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, మెరుపు వేగం అని చెప్పొచ్చు. కన్ను మూసి తెరచే లోపు ఈ ఎలక్ట్రిక్ కారు మన కంటి చూపుకు అందనంత దూరం పరుగులు తీయగలదు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా, దీనిని అనుభూతి చెందాలంటే తప్పకుండా మీరు కూడా ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేసి చూడాల్సిందే. మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారులోని 516 బిహెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్‌ని బయటకు నెట్టివేసే ట్విన్ మోటార్ సెటప్, ఈ ఎలక్ట్రిక్ లగ్జరీ కారును సులభంగా రోడ్లపై పరుగులు తీయించగలదు.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

డ్రైవర్ ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌పై ఆధారపడి, దాని థ్రోటల్ రెస్పాన్స్, స్టీరింగ్ మరియు సస్పెన్షన్ కోసం విభిన్న సెట్టింగ్‌లను అందిస్తుంది. ఎకో మరియు కంఫర్ట్ డ్రైవింగ్ మోడ్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు పనితీరు సాధారణంగా అనిపిస్తుంది. అయితే, ఇందులోని స్పోర్ట్ ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉత్పత్తి చేసే గరిష్ట శక్తిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది మరియు స్పోర్టీ పనితీరును అందిస్తుంది. ఈ మోడ్‌లో ఎలక్ట్రిక్ కారు చాలా వేగవంతంగా అనిపిస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈక్యూఎస్ 580 కారులోని అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ సెటప్ ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంది మరియు రోడ్డుపై ఉండే బంప్‌లు మరియు గుంతలను సులభంగా దాటుకుంటూ పోతుంది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్ కారు మీరు ప్రయాణించే మీ రూట్‌లను కూడా అలవాటు చేసుకుంటుంది. ఒకవేళ, డ్రైవర్ తిరిగి అదే రూటుపై ప్రయాణిస్తున్నట్లు గుర్తిస్తే, ఆ రోడ్డుకు తగినట్లుగా అది నేర్చుకున్న రహదారిపై కఠినమైన ప్యాచ్ లను ఎదుర్కోవడానికి కారు యొక్క సస్పెన్షన్‌ సెటప్‌ను ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తుంది. ఈ అడాప్టివ్ సస్పెన్షన్ సెటప్ మలుపుల వద్ద తిరిగేటప్పుడు బాడీ రోల్ కనిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

ఈ కారులో ఏదైనా మైనస్ ఉందంటే, అది దాని గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పాలి. కేవలం 134 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఇది బస్తీ రోడ్లపై తిరగడానికి కాస్తంత కుస్తీ పట్టాల్సి రావ్చచు. అయితే, ఇందులో ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే, ఇందులోని భారీ అండర్‌ఫ్లోర్ బ్యాటరీ ప్యాక్ కారణంగా గ్రౌండ్ క్లియరెన్స్ అంతకు మించి పెంచడం సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ కారును కార్నర్స్ వద్ద వేగంగా నడుపుతున్నప్పుడు, మీరు దాని అస్పష్టమైన స్టీరింగ్ సెటప్ కారణంగా డిస్‌కనెక్ట్ అయినట్లు భావిస్తారు. అయితే, వెనుక చక్రాల స్టీరింగ్ మాత్రం బిగుతుగా ఉన్న ప్రదేశాల నుండి బయటికి రావడాన్ని సులభతరం చేస్తుంది.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారు యొక్క రీజెన్ సిస్టమ్‌తో కలిపి ఉపయోగించినప్పుడు ఇందులో బ్రేక్‌లు చాలా బాగున్నాయని అనిపించింది. ప్రారంభ ల్యాగ్ లేకపోయినప్పటికీ, దాని లాంగ్ ట్రావెల్ బ్రేక్ పెడల్ కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే, బ్రేక్ పెడల్‌ను మరింత క్రిందికి నెట్టడం వలన మరింత సమర్థవంతమైన బ్రేకింగ్ అనుభూతిని పొందవచ్చు. వాస్తవానికి, మీరు రీజెన్ సెట్టింగ్‌లను గరిష్టంగా క్రాంక్ చేసినట్లయితే, ఈ ఎలక్ట్రిక్ కారును కూడా కేవలం థ్రోటల్ పెడల్‌తోనే (సింగిల్ పెడల్) డ్రైవ్ చేయవచ్చు.

మెర్సిడెస్ ఈక్యూఎస్ 580 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేయొచ్చంటారా..?

చివరిగా ఏం చెబుతారు..?

భారత లగ్జరీ ఈవీ మార్కెట్లో ఇతర బ్రాండ్ల కంటే ముందుగా మెర్సిడెస్ తన స్థానాన్ని బలోపేతం చేసుకొని, నెంబర్ వన్ మార్కెట్ లీడర్‌గా ఉండాలని చూస్తోంది. అందుకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారును నేరుగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు ధర షాక్ కొట్టేలా ఉన్నప్పటికీ, ఇందులో లభించే లగ్జరీ ఫీచర్లు మరియు అది అందించే సుధీర్ఘమైన రేంజ్ మాత్రం డ్రైవర్లకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు. మీకు కూడా ఓ స్టార్‌షిప్ లాంటి కారును నేలపై నడపాలనే కోరిక ఉంటే, ఈఎక్యూఎస్ 580తో అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Mercedes eqs 580 test drive review design features specs and first drive impressions
Story first published: Friday, October 7, 2022, 11:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X