ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

మోరిస్ గ్యారేజెస్ (MG) ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు మా ఉత్పత్తులు విభిన్నంగా ఉంటాయని ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే తొలి మోడల్ హెక్టార్ ఎస్‌యూవీలో ఇంటర్నెట్ పరిచయం చేసి, భారతదేశపు తొలి ఇంటర్నెట్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఇప్పుడు, తమ రెండవ ఉత్పత్తిగా జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎంజీ మోటార్ పరిచయం చేసింది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ కారు. ఇటీవల ఆవిష్కరించిన ఈ మోడల్ జనవరి 2020 నుండి అమ్మకాల్లోకి రానుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ మోటార్ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చే ముందు ఇటీవల నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌కు డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని ఆహ్వానించింది. బయటి నుండి చూడటానికి ఇది అచ్చం పెట్రోల్/డీజల్ కార్‌ మాదిరిగానే ఉంటుంది. కానీ డ్రైవింగ్‌లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని ఫీచర్లు, డ్రైవింగ్ అనుభూతి, ప్రయోజనాలు మరియు అప్రయోజనాలతో పాటు అసలు ఇది ఇండియన్ రోడ్ల మీద పనికొస్తుందో.. లేదో వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూద్దాం రండి...

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

డిజైన్ మరియు స్టైల్

పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ కంటే ముందు ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం.. అనవసరపు డిజైన్స్ ఏవీ లేకుండా ఎస్‌యూవీ మొత్తాన్ని పర్ఫెక్ట్ & సింపుల్‌గా డిజైన్ చేశారు. చూడటానికి కాస్త హెక్టార్ మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్స్ మరియు బ్రిటిష్ కంపెనీ కావడంతో లండన్ దేశాన్ని సూచించే ఎన్నో ఎక్ట్సీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ ఇందులో వచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ముందుభాగంలోని రెండు హెడ్‌ల్యాంప్స్‌కు మధ్యలో చుట్టూ క్రోమ్ పట్టీ జోడింపు గల బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ వచ్చింది, గ్రిల్‌కు మధ్యలో ఎంజీ బ్రాండ్ లోగో అమర్చారు. లోగోను పైకి జరిపితే ఛార్జింగ్ పోర్ట్‌ ఉంటుంది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఛార్జ్ చేసేందుకు ఈ పోర్ట్ ఉపయోగపడుతుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

విశాలమైన ఫ్రంట్ గ్రిల్ అంచుల చుట్టూ మందమైన క్రోమ్ పట్టీ కారుకు ప్రీమియం లుక్ తీసుకొచ్చింది. బ్యాటరీలకు గాలిని అందించే ఫ్రంట్ బంపర్ మీద ఉన్న ఎయిర్ ఇంటేకర్ మీద గల క్రోమ్ ఎలిమెంట్స్ మరియు స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సైడ్ డిజైన్ పరిశీలిస్తే లగ్జరీ కారును తలపిస్తుంది. ధృడమైన షోల్డర్ లైన్స్ ఫ్రంట్ హెడ్్ ల్యాంప్ నుండి రియర్ టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ సైడ్ డిజైన్ మీదగా వెళ్లే షోల్డర్ లైన్సు ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్ పెద్ద ఎస్‌యూవీని తలపించే లుక్ తీసుకొచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 17-ఇంచుల పరిమాణంలో ఉన్న మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డచ్ దేశంలో ప్రసిద్దిగాంచిన క్లాసిక్ మిల్స్ ప్రేరణంతో ఈ అల్లాయ్ వీల్స్‌ను డిజైన్ చేశారు. మరే ఇతర ఎస్‌‌యూవీల్లో ఇలాంటి డిజైన్ గల అల్లాయ్ రాలేదు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రియర్ డిజైన్ చాలా సింపుల్‌గా వచ్చింది. ఉర్సా పాలపుంతలో ఉన్న 7 నక్షత్రాల ప్రేరణతో ఎల్ఈడీ టెయిల్ లైట్లను డిజైన్ చేశారు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ప్రకాశవంతమైన టెయిల్ లైట్లతో పాటు రియర్ డిక్కీ డోర్ మీద పై భాగంలో చిన్న స్పాయిలర్, రియర్ బంపర్‍‌కు ఇరువైపులా రిఫ్లక్టర్ లైట్లు మరియు స్కఫ్ ప్లేట్లు వచ్చాయి. రియర్ డిక్కీ డోర్ మీద మధ్యలో ఎంజీ బ్రాండ్ లోగో మరియు ‘Internet Inside' & ‘ZS EV' అక్షరాలతో కూడిన బ్యాడ్జింగ్స్ వచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఇంటీరియర్

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీ లోపలకి వెళ్లగానే, సింపుల్ అండ్ స్టైలిష్ ఇంటీరియర్ స్వాగతం పలుకుతుంది. బ్లాక్ కలర్ థీమ్, సిల్వర్ హైలైట్స్ మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఎక్కువ విజిబిలిటీ ఉండేందుకు డ్యాష్‌బోర్డును తక్కువ ఎత్తులో మరియు విండో అద్దాలు పెద్దగా ఉండేలా జాగ్రత్త పడ్డారు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

డాష్‌బోర్డుకు ఇరువైపులా ఉన్న చివరల్లో గుండ్రటి ఆకారంలో ఉన్న గ్లాస్ బ్లాక్ ఏసీ వెంట్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి, అయితే డాష్‌బోర్డ్ మధ్యలో చతుర్బుజాకారంలో ఉన్న ఏసీ వెంట్స్ ఫ్రంట్ సీట్లకు మధ్యలో ఉన్న సెంటర్ కన్సోల్‌తో చక్కగా కలిసిపోయింది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

స్టీరింగ్ వీల్‌కు వెనుక వైపున డాష్‌బోర్డు మీద ఉన్న మల్టీ ఇన్ఫర్మేషన్ కన్సోల్‌‌ బోర్డులో కారుకు సంభందించిన పూర్తి సమాచారాన్ని డ్రైవర్ పొందవచ్చు. స్పీడో మీటర్, ఎలక్ట్రిక్ కారు కావడంతో ఫ్యూయల్ ఇండికేటర్‌కు బదులు మిగిలిన ఛార్జింగ్ చూపించే ఇండికేటర్ వంటి రీడింగ్స్ ఉన్నాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

సెంటర్ కన్సోల్ మీద ఉన్న కంట్రోల్స్ సులభంగా వాడుకునేందుకు సెంటర్ కన్సోల్‌ను కొద్దిగా డ్రైవర్‌ వైపుకు వాలుగా ఉండేలా డిజైన్ చేశారు. లెథర్ ఫినిషింగ్ గల ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ డ్రైవింగ్‌లో మంచి స్పోర్టివ్ ఫీల్‌నిస్తుంది. త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఆడియోతో పాటు పలు రకాల కంట్రోల్స్ కలిగి ఉంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

డ్యాష్‌బోర్డుకు కాస్త కింద వచ్చిన సెంటర్ కన్సోల్ మీద అతి పెద్ద 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఆపిల్‌కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో ఎంజీ వారి ఐ-స్మార్ట్ 2.0 అనే ప్రత్యేకమైన స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ వచ్చింది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్‌కు కిందివైపునే పలు రకాల బటన్స్ మరియు గుండ్రటి డయల్స్ వచ్చాయి. ఇక్కడ ఉన్న రోటరీ నాబ్ రకరకాల డ్రైవింగ్ మోడ్స్ మార్చడానికి సహాయపడుతుంది. ఫ్రంట్ సీట్లకు మధ్యలో వచ్చిన ఈ పార్ట్‌ ఇంటీరియర్‌కు లగ్జరీ ఫీలింగ్ తీసుకొచ్చింది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని సీటింగ్ విషయానికి వస్తే, ఎంజీ మోటార్ డిజైన్ ఇంజనీర్లు అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. లెథర్ ఫినిషింగ్‌తో వచ్చిన సీట్లు ప్రయాణంలో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. డ్రైవింగ్ పొజిషన్ కూడా ఎంతో చక్కగా ఉంది. డ్రైవర్ సీటును ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ల కోసం ఆర్మ్ రెస్ట్ మరియు పలు రకాల స్టోరేజ్ స్పేస్‌ సౌలభ్యం కూడా ఉంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని వెనక వరుస సీట్లు కూడా ఎంతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఫ్లోర్ సమాతరంగా ఉండటంతో కాళ్ల దగ్గర కాస్త ఎక్కువ ఖాళీ ప్రదేశం సాధ్యమైంది. ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో విశాలమైన పానరొమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. క్యాబిన్‌లో స్వచ్ఛమైన గాలి కావాలనుకున్నపుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లకు పైనే ఉండటంతో సన్‌రూఫ్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ రియర్ సీట్ ప్యాసింజర్లు దీనిని పెద్దగా అనుభవించలేరు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ముందు మరియు వెనుక వరుస సీట్లలో ఎలాంటి చికాకు లేకుండా ఫ్రీగా కూర్చోవచ్చు. క్యాబిన్ స్పేస్‌తో పాటు అత్యుత్తమ డిక్కీ స్పేస్ కూడా దీని సొంతం. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 448లీటర్ల డిక్కీ స్పేస్ ఉంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొలతలు:

పొడవు (మిమీ)

4314
వెడల్పు (మిమీ)

1809
ఎత్తు (మిమీ)

1644
వీల్‌బేస్ (మిమీ)

2585
గ్రౌండ్ క్లియరెన్స్ (మిమీ)

161
లగేజ్ స్పేస్ ( లీటర్లలో)

448
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

వేరియంట్లు, ఫీచర్లు మరియు సేఫ్టీ:

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (Excite) మరియు ఎక్స్‌క్లూజివ్ (Exclusive). రెండు వేరియంట్లలో అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు
 • 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • ఐ-స్మార్ట్ 2.0 స్మార్ట్ కనెక్ట్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిట్ ఆటో అప్లికేషన్ల సపోర్ట్
 • 5జీ M2M ఎంబెడ్ సిమ్ (ఇంటర్నెట్ కనెక్షన్ కోసం)
 • పుష్ బటన్ స్టార్ట్-స్టాప్
 • PM 2.0 ఎయిర్ ఫిల్టర్
 • డ్యూయల్-ప్యాన్ పానరొమిక్ సన్‌రూఫ్
 • రెయిన్ సెన్సింగ్ ఫ్రంట్ వైపర్
 • 3-లెవల్ కైనటిక్ ఎనర్జీ రికవరీ సిస్టమ్
 • టిల్ట్ స్టీరింగ్
 • ఇకో, నార్మల్ & స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్
 • ఫోలో-మి-హోమ్ ఫంక్షన్ గల ఆటో హెడ్‌ల్యాంప్స్
 • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్లు
 • 6-స్పీకర్లు
 • బ్లూటూత్ & యూఎస్‌బీ కనెక్షన్ పోర్ట్స్
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని సేఫ్టీ ఫీచర్లు

 • ఆరు ఎయిర్ బ్యాగులు
 • యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
 • హిల్ స్టార్ట్ అసిస్ట్
 • హిల్ డిసెంట్ కంట్రోల్
 • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
 • ఫ్రంట్ & రియర్ సీట్ బెల్ట్ రిమైండర్
 • డైనమిక్ గైడ్‌లైన్స్ గల రియర్ పార్కింగ్ కెమెరా
 • నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు
 • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
 • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్
 • ఐఎస్ఒ చైల్డ్ సీట్ మౌంట్స్
 • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్

డ్రైవింగ్, పర్ఫామెన్స్ మరియు మైలేజ్ (రేంజ్)

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మిగతా డీజల్ మరియు పెట్రోల్ పోల్చుకుంటే చాలా ప్రత్యేకం. జడ్ఎస్ ఎలక్ట్రిక్‌లో ఇంజన్‌కు బదులుగా 3-ఫేస్ పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రోనష్ మోటార్ ఉంది. 44.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ అందుతుంది. ఈ ఎలక్ట్రిక్ యూనిట్ గరిష్టంగా 141బిహెచ్‌పి పవర్ మరియు 353ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ మోటార్ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 8.3 సెకండ్లలోనే 0 నుండి 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం ఇది సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 340కిలోమీటర్లు నడుస్తుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డ్రైవింగ్ విషయానికి వస్తే, దీని పర్ఫామెన్స్ డీజల్/పెట్రోల్ కార్లకు ఏ మాత్రం తీసిపోదు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ ప్రతి మలుపులో కూడా కావాల్సినంత టార్క్ ఇచ్చింది. హైవే డ్రైవ్‌లో కావాల్సినంత పవర్ సాధ్యమైంది. మన డ్రైవింగ్ తీరును బట్టి కారును ఇకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఎంచుకోవచ్చు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎలక్ట్రిక్‌ మోటార్‌కు పవర్ సరఫరా చేసే బ్యాటరీలను సీట్ల కిందే ఇచ్చారు. దీంతో కారు బరువు మొత్తం మధ్యలోకి ఉంటుంది. కానీ మలుపుల్లో బాడీ రోలింగ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ దీనిని ధీటుగా ఎదుర్కునేందుకు అందుకు తగినంత టార్క్ వస్తుంది. స్టీరింగ్ చాలా తేలికగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా స్టీరింగ్ హ్యాండిల్ చేయగలం.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఇండియన్ రోడ్ డ్రైవింగ్ పరిస్థితులకు సరిపోయే అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ అందించారు. స్పీడ్ బ్రేకర్లు మరియు చిన్నచిన్న గుంతలు వచ్చినప్పుడు ఎదురయ్యే కుదుపులు మన వరకు చేరవు. బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా కాస్త మెరుగవ్వాల్సి ఉంది. కారును పూర్తిగా ఆపాలంటే పెడల్‌‌ను గట్టిగా తొక్కి పట్టాల్సిందే.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ NVH లెవల్స్ పర్వాలేదనిపించాయి. NVH అంటే.. నాయిస్ (శబ్దం), వైబ్రేషన్స్ (కుదుపులు) మరియు హార్స్‌నెస్(గరుకుతనం). హైస్పీడులో ఎలక్ట్రిక్ మోటార్ సౌండ్ కొద్దిగా క్యాబిన్‌లోకి వస్తుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

స్పెసిఫికేషన్స్

Electric Motor

3-Phase Permanent Magnet
Battery 44.5kWh Lithium-ion
Power (bhp)

141 @ 3500rpm
Torque (Nm)

353 @ 5000rpm
Transmission Automatic
Range (km)

340
0-100km/h

8.3 seconds (Claimed)
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ధర, కలర్ ఆప్షన్స్ మరియు లభ్యత

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధరలు ఇంకా వెల్లడికాలేదు. విడుదల సమయంలో వేరియంట్ల వారీగా ధరలు వెల్లడిస్తారు. జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంజీ ఎస్‌యూవీ జనవరి 2020 నుండి అమ్మకాల్లోకి వస్తుంది. ప్రస్తుతానికి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాల్లో మాత్రమే దీనిని బుక్ చేసుకోవచ్చు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

పైన పేర్కొన్న ఐదు నగరాల్లో షోరూమ్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. 50,000 రూపాయలు చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. దీనిని ఫెర్రిస్ వైట్, కూపెంగెన్ బ్లూ మరియు కరంట్ రెడ్ రంగుల్లో ఎంచుకోవచ్చు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

వారంటీ మరియు ఛార్జింగ్ సౌకర్యం

ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు "eShield" అనే వారంటీ ప్యాకేజీని కూడా లాంచ్ చేసింది. వ్యక్తిగత అవసరాలకు జడ్ఎస్ ఎలక్ట్రిక్‌ను వ్యక్తిగత అవసరాల కోసం ఎంచుకునే కస్టమర్లకు ఐదేళ్ల వారంటీ లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. దీంతో పాటు ఐదేళ్ల వరకు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్, లేబర్-ఫ్రీ సర్వీస్ మరియు ఛార్జింగ్ సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నారు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఎంజీ జడ్ఎస్ ఎస్‌యూవీని సేల్స్‌కు సిద్దం చేసిన నగరాల్లో ఇప్పటికే పలు సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎంజీ షోరూముల్లో 50kW సామర్థ్యం గల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వారానికి 24 గంటల్లో ఎప్పుడైనా కస్టమర్లు ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కస్టమర్లు తమ ఆఫీసుల్లో లేదా ఇంట్లో ఏసీ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

దేశవ్యాప్తంగా ఛార్జింగ్ సౌకర్యం ఉన్న ఎంజీ షోరూముల వివరాలు

హైదరాబాద్

 • ఎంజీ హైదరాబాద్ బంజారా హిల్స్ (Road No. 2 Showroom, Road No. 12, Opposite Traffic Police Station, Banjara Hills, Hyderabad, Telangana)

ఢిల్లీ

 • ఎంజీ గుర్గావ్ ఫ్లాగ్‌‌షిప్ (32 Milestone, Experion Center, Sector 15, NH-8, Gurugram)
 • ఎంజీ లజ్‌పత్ నగర్ (EC,A-14, Ring Road, Lajpat Nagar- IV, New Delhi)
 • ఎంజీ ఢిల్లీ వెస్ట్ శివాజీ మార్గ్ (Plot No. 31, Shivaji Marg)
 • ఎంజీ నోయిడా (D-2, Sector 8, Noida)

బెంగళూరు

 • ఎంజీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ (195/6/2, Ward No. 192, Bharatena Agrahara, Lava Kusha Nagar, Hosur Road, Bengaluru)
 • MG బెంగళూరు ORR (Shree Bhuvaneswari Vokkaligara Sangha, Survey No. 102-1, B Narayanapura, ORR, Bengaluru)

ముంబాయ్

 • ఎంజీ ముంబాయ్ వెస్ట్ (JVLR, Jogeshwari Caves Road, Gupha Tekdi, Jogeshwari East, Mumbai)
 • ఎంజీ థానే (Shop No. 16A, Dosti Imperia, Ghodbunder Road, Thane West, Thane)

అహ్మదాబాద్

 • ఎంజీ అహ్మదాబాద్ ఎస్‌జీ హైవే (Plot No. 2, Ground Floor, Ahmedabad SG Highway, Makarba, Ahmedabad, Gujarat)
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

పోటీ

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయితే విపణిలో ఉన్న హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికల్‌కు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతానికి హ్యుందాయ్ కోనా మాత్రమే ఏకైక పోటీ, అయితే టాటా మోటార్స్ త్వరలో నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

ఫ్యాక్ట్ షీట్.. ఏది బెస్ట్ మోడల్?

మోడల్/స్పెసిఫికేషన్లు

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్

Electric Motor 3-Phase Permanent Magnet Permanent Magnet Synchronous Motor
Battery 44.5kWh Li-ion 39.2kWh Li-ion
Power (bhp) 141 134
Torque (Nm) 353 395
Price NA* Rs 23.71 Lakh
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: దీని గురించి తెలిస్తే కచ్చితంగా కొంటారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంజీ జడ్ఎస్ ఇవి బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. సింపుల్, క్లీన్ మరియు చక్కటి డ్రైవింగ్ అనుభూతినిచ్చింది. చూడటానికి పెట్రోల్/డీజల్ ఎస్‌యూవీ తరహాలో ఉన్న జడ్ఎస్ ఇవి పర్ఫామెన్స్ పరంగా కూడా ఇంధనంతో నడిచే ఎస్‌యూవీలకు గట్టి జవాబిచ్చింది. టెస్ట్ డ్రైవ్‌ చేస్తున్నపుడు మా ప్రతి ప్రయాణంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది.

మైలేజ్, పర్ఫామెన్స్, ఫీచర్లు, సేఫ్టీ వంటి అన్ని అంశాలలో ఎలాంటి రాజీలేకుండా డైవలప్ చేశారు. ఇండియన్ రోడ్ల తీరుకు తగ్గట్లుగా అత్యుత్తమ సస్పెన్షన్ అందించారు. ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ రికార్డులు సృష్టించడం ఖాయం. పోటీ మరియు కస్టమర్ల ఆర్థిక స్థితిగదులను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయిస్తే ఎంజీ మోటార్ ఇండియా ఖాతాలో మరో సక్సెస్ ఖాయం.

మాకు బాగా నచ్చిన అంశాలు

 • ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్
 • మెరుగైన యాక్సిలరేషన్ మరియు స్టీరింగ్ రెస్పాన్స్
 • పానరమిక్ సన్‌రూఫ్

నచ్చని అంశాలు

 • బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా కాస్త మెరుగవ్వాల్సి ఉంది
 • క్యాబిన్ అడుగు భాగంలో ఉన్న హార్డ్ ప్లాస్టిక్
Most Read Articles

English summary
MG ZS EV First Drive Review: The First Pure-Electric Internet SUV In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more