మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ తమ ఎస్‌ మోడల్‌కు ఫస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఇచ్చింది. నేటి కథనంలో మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ వివరాలు మరియు ఫోటోలు....

By Anil

మినీ కూపర్ ఎస్ కారును సింపుల్‌గా పాకెట్ రాకెట్ అని చెప్పవచ్చు! తక్కువ పొడువుతో, వోల్కానిక్ ఆరేంజ్ ఎక్ట్సీరియర్ కలర్‌ ఆప్షన్‌లో, 16-అంగుళాల చక్రాల మీద శక్తివంతమైన ఇంజన్‌తో కూర్చున్న దీనిని పాకెట్ రాకెట్‌ అభివర్ణించవచ్చు. బ్రిటన్‌కు చెందిన మినీ రూ. 34 లక్షల విలువైన మినీ కూపర్ ఎస్ కారుకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించే అవకాశాన్ని డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు బృందానికి కల్పించింది.

జాన్ కూపర్ వర్క్ ఎడిషన్ మినీ కూపర్ ఎస్ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్ మరియు ఫోటోలను క్రింది స్లైడర్లలో ద్వారా గమనించగలరు...

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ ఎస్ యొక్క జాన్ కూపర్ వర్క్ ఎడిషన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. రెగ్యులర్ మినీ కూపర్ ఎస్ మోడల్‌తో పోల్చితే ఎక్ట్సీరియర్ మీద అనేక డిజైన్ సొబగులు మరియు శక్తివంతమైన ఇంజన్ అప్‌గ్రేడ్‌తో జాన్ కూపర్ వర్క్ ఎడిషన్‌‌ను మళ్లీ ప్రవేశపెట్టడం జరిగింది.

డిజైన్

డిజైన్

మినీ తమ అన్ని హ్యాచ్‌బ్యాక్‌లకు దాదాపు ఒకే విధమైన డిజైన్‌ను అందిస్తూ వస్తోంది. ఇప్పటి నుండే కాదు మినీ ప్రారంభమైన కాలం నుండే ఇదే ప్రాథమిక డిజైన్ లక్షణాలతో విడుదలవుతూ వచ్చింది. అయితే ఈ జాన్ కూపర్ వర్క్స్ ఎడిషన్‌లో ముందు వైపున హెక్సా గోనల్ రేడియేటర్ గ్రిల్ "ఎస్" బ్యాడ్జింగ్‌తో కలదు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ముందు వైపు డిజైన్‌లో బానెట్ మీద నిలువుగా పెయింట్ చేసినటువంటి ఆకర్షణీయమైన బ్లాక్ స్ట్రిప్స్ గుర్తించవచ్చు. ఈ బ్లాక్ స్ట్రిప్స్ మినీ కూపర్ ఎస్‌ను మరింత స్పోర్టివ్‌గా మార్చేశాయి. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఇందులో మరింత ప్రత్యేకం. క్రోమ్ సొబగులకు మధ్యలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో హెడ్ ల్యాంప్ క్లస్టర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

పక్కవైపు డిజైన్ విషయానికి వస్తే, ముందు వైపు ఫ్రంట్ గ్రిల్ మీద ఉన్న ఎస్ బ్యాడ్జిని సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మీద గుర్తించవచ్చు. ఇక వెనుక వైపు డిజైన్‌లో క్రోమ్ సరౌండింగ్స్ మధ్యలో ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ అమరిక అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

లగ్జరీ మరియు స్పోర్టివ్ హ్యాచ్‌కబ్యాక్‌కు పేరుగాంచిన మినీ కూపర్ ఎస్ మీద ముందు నుండి వెనుక వరకు ప్రతి చోటా క్రోమ్ సొబగులకు అధిక ప్రాధ్యానతనిచ్చారు. క్రోమ్ పరికరాలకు జతగా వొల్కానిక్ ఆరేంజ్ మరియు బ్లాక్ డ్యూయల్ కలర్ పెయింట్ జాబ్ అద్బుతమని చెప్పాలి.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

అధిక వేగంలో కారును స్థిరంగా ఉంచేందుకు ఈ మినీ కూపర్ ఎస్ హ్యాచ్‌బ్యాక్‌లో జాన్ కూపర్ వర్క్స్ (JCW) కిట్ ప్రేరిత 16-అంగుళాల అల్లాయ్ చక్రాలను అందివ్వడం జరిగింది. మరియు జాన్ కూపర్ వర్క్ ఎడిషన్‌గా చెప్పుకునేందుకు బూట్(డిక్కీ) డోర్ మరియు టెయిల్(సైలెన్సర్) పైపు మీద JCW బ్యాడ్జ్ కలదు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రియర్ డిజైన్‌ను పరంగా పూర్తి న్యాయం చేశారు. అయితే ఇందులో రియర్ పార్కింగ్ కెమెరాలు మిస్సయ్యాయి, కానీ పార్కింగ్ సెన్సార్లను అందించారు. దీంతో ఎంతటి ఇరుకైన ప్రదేశాలలో అయినా ఖచ్చితంగా పార్కింగ్ చేయవచ్చు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కొలతల పరంగా రెగ్యులర్ వెర్షన్ మినీ కూపర్ ఎస్ కన్నా ఈ జాన్ కూపర్ వర్క్స్ ఎడిషన్ కారు పొడువు 98ఎమ్ఎమ్, వెడల్పు 44ఎమ్ఎమ్, ఎత్తు 7ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 28 ఎమ్ఎమ్ వరకు పెరిగింది. మునుపటి మోడల్‌తో పోల్చితే పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ కలదు.

ఇంటీరియర్

ఇంటీరియర్

మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ ఇంటీరియర్‌లోనికి వెళితే తొలుత స్పోర్టివ్ సీట్లను గమనించవచ్చు. సీట్లు మరియు కార్ టాప్ పైబాగాన్ని బ్లాక్ లెథర్‌తో రూపొందించారు. అయితే ఈ సీట్లను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం లేదు. కేవలం మ్యాన్యువల్‌గానే అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

సౌకర్యవంతమైన సీటింగ్ వ్యవస్థను అందివ్వడం జరిగింది. అయితే దూర ప్రాంత ప్రయాణాలకు ఇది అంత అనువుగా ఉండదని మా అభిప్రాయం. ప్రతి తరచూ బ్రేక్స్ అప్లె చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక డ్రైవర్ నుండి మరో డ్రైవర్ డ్రైవింగ్ నైపుణ్యంగా చూస్తే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ వర్క్స్ ఎడిషన్‌లో రెండు డోర్లను మాత్రమే అందివ్వడం ద్వారా వెనుక వరుసలో ఉన్న సీట్లలోకి వెళ్లడం కాస్త సవాలుతో కూడుకున్న విషయం. వెనుక సీట్లలోకి వెళ్లడానికి ముందు సీట్లను పూర్తిగా మలిపే విధంగా రూపొందించారు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

బాగా ఎత్తున్న వ్యక్తులను వెనుక వైపు రెండు సీట్లలోకి పంపి ముందు రెండు సీట్లను వెనక్కి జరిపితే వారు చాలా ఇబ్బందికరంగా ప్రయాణించాల్సి ఉంటుంది. కనీసం కాళ్లను ఉంచుకోవడానికి వీలైనంత స్పేస్ కల్పించడంలో మినీ కాస్త విఫలం చెందింది. అయితే రెండు సీట్లకు కూడా చైల్డ్ సీట్లను అమర్చేందుకు ఐఎస్ఒ ఫిక్స్ మౌంట్‌లను అందివ్వడం జరిగింది.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ కార్ల ఇంటీరియర్‌లలో ప్రధానమైన ఫీచర్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్. న్యావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, టెలిఫోన్, మరియు వెహికల్ ఇతర ఫంక్షన్స్ కోసం మినీ కంట్రోల్ ఆధారిత 8.8-అంగుళాల పరిమాణం ఉన్న టిఎఫ్‌టి డిస్ల్పే కలదు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్యాష్ బోర్డులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగంలో విభిన్న నియంత్రికలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కలదు. ఆటోమేటిక్ లైట్ కంట్రోల్, పానరోమిక్ సన్ రూఫ్, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ హీట్ వంటి ఫీచర్లున్నాయి.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కారులోని డ్రైవర్‌కు ముందువైపున డ్యాష్ బోర్డు మీద చిన్న పరిమాణంలో హెడ్స్ అప్ డిస్ల్పే ఉంటుంది. సెంటర్ కన్సోల్ మీద స్టార్/స్టాప్ బటన్‌కు ప్రక్కవైపున స్విచ్‌ను ప్రెస్ చేయడం ద్వారా పడుకుని ఉన్న హెడ్స్ అప్ డిస్ల్పే ఓపెన్ అవుతుంది. మరియు 9-స్పీకర్లు ఉన్న హార్మాన్/కార్డన్ మ్యూజిస్ సిస్టమ్ కూడా కలదు.

ఇంజన్

ఇంజన్

ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం డ్రైవ్‌స్పార్క్ బృందం నడిపిన మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ వర్క్స్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ట్విన్ టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 212బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఇది మరింత శక్తివంతమైనది. అభివృద్ది పరచబడిన ఇసియు, ఎయిర్ ఫిల్టర్ మరియు బటర్ ప్లై వాల్వ్ గల ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా పవర్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. బటర్ ఫ్లై వాల్వ్ అనగా, ఇంజన్ నుండి వెలువడే మండిన వాయువులను ఒక గొట్టం లేదా రెండు గొట్టాల ద్వారా బయటకు పంపించేందుకు అందివ్వడం జరిగింది. డ్రైవర్ వద్ద ఉన్న బటన్ ద్వారా దీనిని సెలక్ట్ చేసుకోవచ్చు.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంజన్ ఉత్పత్తి చేసే గరిష్ట పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు సరఫరా అవుతుంది. మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ ఎడిషన్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ లగ్జరీ మరియు స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ కారులో మూడు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, గ్రీన్, ఎమ్‌ఐడి మరియు స్పోర్ట్. గ్రీన్ మోడ్‌లో డ్రైవ్ చేస్తే అధిక మైలేజ్ పొందవచ్చ, స్పోర్ట్ మోడ్‌లో డ్రైవ్ చేస్తే ఇంజన్ గరిష్ట పవర్‌ను చక్రాలకు సరఫరా చేస్తుంది.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ హ్యాచ్‌బ్యాక్ గంటకు 235 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చే గ్రిప్ డ్రైవింగ్ సమయంలో తెలుస్తుంది. భద్రత కోసం ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం మరియు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

మినీ కూపర్ ఎస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ ధర రూ. 34,10,000 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. రెగ్యులర్ వెర్షన్ అయిన కూపర్ ఎస్ కన్నా మరో రెండు లక్షలు ఎక్కువగా భరిస్తే ఈ శక్తివంతమైన మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ ఎడిషన్ కారును సొంతం చేసుకోవచ్చు.

తీర్పు!

తీర్పు!

మరి ఈ మినీ కూపర్ ఎస్ జెసిడబ్ల్యూ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు యోగ్యమైనదేనా అంటే...? డబ్బుకు ప్రాధ్యాన్యతనిచ్చే వారు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. అయితే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన ఇంజన్, స్టైల్, లగ్జరీ ఫీచర్స్, హుందాతనాన్ని కోరుకునే వారు దీనిని లక్షణంగా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu MINI Cooper S JCW First Drive Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X